చరిత్ర గురించి (5)
ఆంధ్ర ప్రదేశ్ పేరు వెనుక చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఇది తెలుగువారి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా. ఆంధ్ర ప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.
1953 అక్టోబర్ 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరియు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. దాదాపు 58 సంవత్సరాల తరువాత జూన్ 2, 2014 న పునర్విభజింపబడింది ఆంధ్ర ప్రదేశ్. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాష తెలుగు రెండవ అధికార భాష ఉర్దూ. హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల (2/6/2014 - 2/6/2024) వరకు కొనసాగుతుంది.
అనంతరం నవ్యాంధ్ర (ఆంధ్ర ప్రదేశ్) రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుంది దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది.
అమరావతి పేరు వెనుక చరిత్ర
భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ నందు ఉన్న ఒక పట్టణము, ఇది గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్నది. ఈ పట్టణము వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నది. ప్రాచీన శాసనాల ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది. ఈ పట్టణము జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలముగా క్రీ.శ. ఒకటవ శతాబ్దములో ధాన్యకటకము ప్రసిద్ధిచెందినది.చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణము లో వసించి అచటి వైభవము గురించి ప్రశంసించాడు.
రాయలసీమ పేరు వెనుక చరిత్ర
రాయలసీమ అనునది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ భాగం లో ఉండే నాలుగు జిల్లాలు( కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
రాయలసీమ విజయనగర సామ్రాజ్యం లో భాగాంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడినది. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగినది. బ్రిటీషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన హైదరాబాదుకి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి దత్త మండలం అని పేరు వచ్చినది. 1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారి మరియు కడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురాన్ని బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణరావు "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడినది.
ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా ఉన్నవి. బళ్ళారి కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. కోస్తా, రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని కర్ణాటక లో కలిపి వేశారు. కన్నడ, తెలుగు మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత మైసూరు లో చేర్చారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణాలో కలపటంతో అప్పటి నుండి ఇవి ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా ఉంటున్నవి.
తెలుగు మాట్లాడు ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ తెలుగు,తమిళం, కన్నడ మరియు ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం. కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడడంతో రాజధాని హైదరాబాదు కు మారింది
అనంతపురం పేరు వెనుక చరిత్ర
రాష్ట్రంలో వైశాల్యములో అతి పెద్ద జిల్లా, తెలుగు అక్షర క్రమములో మొదటిది. అనంతపురం దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన అతి పెద్ద జిల్లా మరియు ముఖ్య పట్టణము. అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి వేర్పాటు చేయబడినది. ఈ ప్రాంతము ప్రధానముగా వర్షాధారిత వ్యవసాయము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు
అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి బుక్క రాయలు శంకుస్థాపన చేసాడు. అతని భార్య అనంతాదేవి పేరు మీద అనంతపురి అని పేరు పెట్టాడు. అలాగే అతని పేరు మీద బుక్కరాయ సముద్రం చెరువు ఎర్పాటు చేశాడు.ఎక్కువ కాలం హన్దె హనుమప్ప నాయకరాజు పరిపాలిన్ఛాదు అతను బలిజ కులానికి చెందిన వాడు. అనంతర కాలంలో అనంతపురం అని వాడుకలోకి వచ్చింది
ఉరవకొండ పేరు వెనుక చరిత్ర
మొదట ఈ ఊరి పేరు ఉరగకొండ (ఉరగాద్రి) . ఉరగము అంటే పాము. ఈ ఊరిలో వున్న కొండ పాము పడగలా వుంటుంది. అందువలన ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. అనంతర కాలంలో ఉరవకొండ అని వాడుకలోకి వచ్చింది
Village names Wkipedia "Uravakonda, Vidapanakal, Vajrakarur, Beluguppa, Kudaru "
* ఎస్టీడీ కోడ్/ STD Code 08496
* పిన్ కోడ్ / Pin Code 515812
* ఎత్తు/ Elevation : 459 మీటర్ల (1,505 ft) సగటు ఎత్తు
* టైమ్ జోన్ / Time zone IST (UTC+5:30)
* పంచాయితీలు / panchayats 17
* గ్రామాలు / Villages 23
* భాషలు / Languages ఉర్దూ / Urdu, కన్నడ / Kannada , హిందీ / Hindi
* భాషలు అధికారిక / Languages Official తెలుగు / Telugu
* జనాభా (2011) / Population (2011) Total / మొత్తం : 35,565
* అక్షాంశరేఖాంశాలు / Coordinates 14.95°North 77.27°East
* అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య / Assembly Constituency number 268
* నియోజకవర్గం మండలాల / Constituency mandals 5
* జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం / District Assembly Constituency 14
* పోస్టల్ చిరునామా / Postal Address
ఉరవకొండ మండల & తాలూకా , అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం .... Uravakonda Mandal/Taluka, Anantapuramu District, AndhraPradesh State, India.