Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

వడదెబ్బ

వడదెబ్బ, దీనినే ఎండదెబ్బ అని కూడా అంటారు ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడం . చాలా వేడియైన వాతావరణం లేదా చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, శరీరం యొక్క ప్రాధమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. వేడికి సంబంధించిన సమస్యలలో వడదెబ్బ చాలా తీవ్రమైనది. ఇది తరచుగా, వ్యాయామం నుండి లేదా వేడి వాతావరణంలో, సరియైన మోతాదులో ద్రవపదార్థాలని తీసుకోకుండా బరువైన పనిని చేసినప్పుడు కలుగుతుంది

వడదెబ్బ ఎవరికి వస్తుంది?

ఈ వడదెబ్బ ఎవరికైనా వచ్చేది అయినప్పటికీ, కొంతమంది మాత్రమే దీనికి గురౌతారు. వారిలో పిల్లలు, క్రీడాకారులు, అతిమూత్ర వ్యాధి ఉన్న వ్యక్తులు, మద్యము సేవించువారు మరియు విపరీతమైన సూర్యరశ్మికి మరియు వేడిమి అలవాటు లేనివారు ఉన్నారు. కొన్ని మందులు కూడా మనిషిని వడదెబ్బకు గురయేలా చేస్తాయి.

వడదెబ్బ లక్షణాలు మరియు గుర్తులు ఏమిటి?

వడదెబ్బ లోకనబడే అతి ముఖ్య లక్షణం స్పష్టంగా అధికమయిన శరీర ఉష్ణోగ్రత(104 డిగ్రీల ఫారన్ హీట్ కంటే ఎక్కువ) దీనితో పాటు వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు కూడా కనబడుతాయి.ఇవి అయోమయం నుంచి అపస్మారక స్థితి వరకూ వుండవచ్చును . ఇతర గుర్తులు మరియు లక్షణాలలో ఈ క్రింది ఇచ్చినవి ఉంటాయి:

  • గుండె/ నాడి కొట్టుకోవడం
  • వేగంగా/తక్కువగాశ్వాస తీసుకోవడం
  • ఎక్కువ లేదా తక్కువ రక్తపోటు
  • చెమట పట్టక పోవడం
  • చిరాకు, కంగారు లేదా అపస్మారక స్థితి
  • తలతిరగడం లేదా తేలిపోవడం
  • తలపోటు
  • వికారం (వాంతులు)
  • పెద్దవారిలో స్పృహకోల్పోవడ0 ప్రధాన లక్షణం
వడదెబ్బ కొనసాగితే, ఈ క్రింద ఇచ్చిన త్రీవ్ర లక్షణాలు కలుగుతాయి :
  • మానసికమైన కలత
  • శ్వాస ప్రక్రియ వేగ0గా జరగడ0 ( hyper ventilation)
  • శరీర తిమ్మిరి
  • చేతులు మరియు కాళ్ళలో బాధాకరమైన ఈడ్పులు
  • అకస్మాత్తుగా వ్యాధి రావడం
  • అపస్మారకస్థితి

ప్రాధమిక చికిత్స

  • వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లబరచాలి.
  • వీలయితే రోగిని చల్లని నీటిలో ముంచాలి (టబ్ వంటివి లభిస్తే) చల్లటి, తడిబట్టలలో చుట్టాలి. చల్లని తడి బట్టతో ఒళ్ళంతా అద్దుతూ వుండాలి.
  • రోగి శరీర ఉష్ణ్రోగ్రత 101ºF కు పడిపోయినప్పుడు చల్లని నీటిలో నుంచి తీసేసి చల్లుట గదిలో సౌకర్యంగా పడుకోబెట్టాలి.
  • ఉష్ణ్రోగ్రత మళ్ళీ పెరుగుతున్నట్లయితే మళ్ళీ పై విధంగా సూచించినట్లు చేస్తూ పోవాలి.
  • రోగి త్రాగ గలిగితే చల్లని పానీయాలు ఇవ్వాలి
  • ఎటువంటి మందులూ ఇవ్వరాదు.
  • వెంటనే వైద్యులను సంప్రదించాలి.

వడదెబ్బ ఎలా ఆపాలి

వడదెబ్బ తగలకుండా ఉండడానికి, బయట పనులు చేసేటప్పుడు ఎక్కువగా పానీయాలు త్రాగి శరీర ఉష్ణోగ్రతని మాములుగా ఉంచుకోవాలి. కెఫీన్ మరియు మద్యానికి దూరంగా ఉండండి ఎందుకంటే అవి జల వియోజనాన్ని కలిగిస్తాయి. లేతరంగు మరియు వదులైన దుస్తులను ధరించాలి మరియు తరచు నీరుని త్రాగడానికి మరియు శరీర నీటి స్థాయిని తగిన స్థాయిలో ఉంచడానికి విరామం తీసుకోండి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free