లివర్
కాలేయమునకు సంబంధించిన వ్యాధుల మూలంగా మెదడు క్షీణించే స్థితి (హెపాటిక్ ఎన్సిఫేలోపథీ)
హెపాటిక్ ఎన్సిఫేలోపథీ(పోర్టల్-సిస్టమేటిక్ ఎన్సిఫేలోపథీ, లివర్ ఎన్సిఫేలోపథీ, హెపాటిక్ కోమా) వ్యాధిలో మెదడు యొక్క పనితీరు క్షీణిస్తూ పోతుంది. దీనికి కారణం సాధారణంగా కాలేయం ద్వారా నిర్మూలించబడే విష పదార్థాలు కాలేయంలో పేరుకొనిపోయి రక్తప్రసరణద్వారా మెదడుకు చేరి, మెదడు క్షీణించడానికి కారణమవుతాయి.
- మధుపానం, మందు లేదా దీర్ఘకాలికంగా కాలేయ జబ్బుతో బాధ పడుతున్నవారిలో మానసిక శారీరక ఒత్తిడి వంటి ప్రేరేపిత కారణాల మూలంగా మెదడు క్షీణించే పరిస్థితి ఏర్పడవచ్చు.
- స్వభావం, ప్రవర్తన మరియు మానసిక స్థితిలో మార్పులతో రోగులు అయోమయంగా మరియు మత్తుగా ఉంటారు
- శారీరక పరీక్ష, ఎలక్ట్రోఎన్సిఫేలోగ్రఫీ మరియు రక్త పరీక్షల ఫలితాలతో వైద్యులు ఈ స్థితిని నిర్ధారిస్తారు.
- ప్రేరేపిత కారణాలను తొలగించడం మరియు ఆహారంలోమాంసకృత్తులను తగ్గించడం ద్వారా ఈ లక్షణాలను రాకుండా కాపాడుకొనవచ్చును.
ప్రేగుల నుండి రక్తప్రసరణలోకి పీల్చబడ్డ పదార్థాలు కాలేయం గుండా వెళతాయి. కాలేయంలో సాధారణంగా వీటిలోని విష పదార్థాలు తీసివేయబడతాయి. చాలావరకు ఈ విష పదార్థాలు మాంస కృత్తుల జీర్ణప్రక్రియలో అవి విచ్ఛిన్నమయినపుడు సాధారణంగా ఏర్పడినవే. హెపాటిక్ ఎన్సిఫేలోపథీలో విష పదార్థాలు నిర్మూలించబడవు. దీనికి కారణం కాలేయం పని తీరు బలహీనపడి ఉండడమే. కాలేయం వ్యాధి కారణంగా, కాలేయానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రవేశ సిరల వ్యవస్థ మరియు సాధారణ లేదా దైహిక వ్యవస్థకు మధ్య ఏర్పడ్డ సిరల ద్వారా ఈ విష పదార్థాలు కాలేయమును చేరకుండానే రక్తప్రసరణలోనికి చేరిపోతాయి. కారణం ఏదైనా, పర్యవసానం ఒకటే. విష పదార్థాలు మెదడు కు చేరి దాని పనితీరును ప్రభావితం చేస్తాయి. మెదడుకు ఏ పదార్థాలు విషపూరితములో ఖచ్ఛితంగా తెలియదు. అమ్మోనియా వంటి రక్తంలోని మాంసకృతుల విచ్ఛిన్న పదార్థాలు, ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.
దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్న వారిలో, మెదడు క్షీణించే స్థితి సాధారణం. తీవ్రమైన ఇన్ఫెక్షన్ మరియు ఆల్కహాల్ కాలేయానికి అధికంగా హాని కలిగిస్తాయి. లేదా అధికంగా మాంసకృత్తులు ఆహారములో తీసుకొనడం మూలంగా రక్తంలో వీటి అంత్య ఉత్పత్తులు అధికమయి మెదడు క్షీణస్థితికి కారణమవుతాయి. అన్నవాహికలో ఉబ్బిన, మెలిపడిన సిరల నుండి రక్తస్రావం జరగడం వంటి జీర్ణవ్యవస్థలో రక్తస్రావం మూలంగా కూడా రక్త ప్రవాహంలో మాంసకృత్తుల అంత్య ఉత్పత్తులు అధిక మయి మెదడుపై నేరుగా ప్రభావం చూపే అవకాశం వుంటుంది. నిర్జలీకరణ, రక్తంలో లవణాల అసమతుల్యత, కొన్ని మందులు ఉదాహరణకి ఉపశమన మందులు, మత్తు కలిగించే మందులు, మూత్రవిసర్జన అధికం చేసేవి కూడా మెదడు క్షీణస్థితిని ప్రేరేపించవచ్చు. కాబట్టి, ప్రేరేపిత కారణాన్ని నిర్మూలిస్తే మెదడు క్షీణదశను నివారించవచ్చును. రోగి తీసుకునే ఆహారంలో మాంసకృతులను తగ్గించడం వలన మెదడు క్షీణించే లక్షణాలను తగ్గించడానికి దోహదపడి, నిర్మూలించవచ్చును.
లక్షణములు మరియు నిర్ధారణ
లక్షణాలలో ముఖ్యంగా తగ్గిన అప్రమత్తత, అయోమయ స్థితి మరియు క్షీణించిన మెదడు పనితీరు ఉంటాయి. ప్రారంభ దశలలో, యుక్తిగా ఆలొచించలేకపోవడం, స్వభావం మరియు ప్రవర్తనలో మార్పులు కనబడతాయి. రోగి యొక్క మానసిక స్థితి మారవచ్చు మరియు వివేకం క్షీణించవచ్చు. సాధారణ నిద్రతీరు దెబ్బతినడం జరుగవచ్చు. మెదడు క్షీణస్థితి ఏదశలో ఉన్నా, రోగి యొక్క శ్వాసలో ఒక విధమైన తీపి వాసన వస్తూ ఉంటుంది. జబ్బు ముదురుతూ ఉండగా, రోగి చేతులు చాచినప్పుడు అవి స్థిరంగా ఉండక టపటపా (ఏస్టెరిక్సిస్) కొట్టుకుంటాయి. అంతేకాకుండా, రోగి నిద్రమత్తుగా మరియు అయోమయంగా ఉంటూ, కదలికలు, మాటలు మందకొడిగా ఉంటాయి. స్థితి నిర్ధారణ రాహిత్యము సాధారణంగా కనబడుతుంది. అసాధారణంగా మెదడు క్షీణ స్థితిలో ఉన్న రోగి కలవరపడినట్టుగా, ఉద్రేకపడుతున్నట్టుగా చేస్తారు. మూర్ఛలు కూడా అసాధారణము. క్రమక్రమంగా రోగి స్మారక స్థితి నుంచి అపస్మారకస్థితికి జారిపోతాడు.
ప్రారంభ దశలో మెదడు క్షీణస్థితిని నిర్ధారించడానికి ఒక ఎలెక్ట్రో ఎన్సెఫేలోగ్రామ్ (ఇ ఇ జి) (మెదడు, వెన్నుపాము మరియు నరాల జబ్బుల నిర్ధారణ: ఎలెక్ట్రో ఎన్సెఫేలోగ్రఫీ) దోహద పడవచ్చు. తీవ్రత తక్కువ ఉన్న కేసులలో, ఒక ఇ ఇ జి మెదడు తరంగాలు అసాధారణంగా తగ్గినట్టు, రక్త పరీక్షలు మామూలుగా అమ్మోనియా శాతం అసాధారణంగా ఎక్కువ స్థాయిల్ని చూపిస్తాయి. కాని, ఎన్సిఫేలోపథీని నిర్ధారించడానికి, ఎప్పుడూ స్థాయిలను కొలవడం విశ్వసనీయమైన మార్గం కాదు.
చికిత్స
సక్రమితం లేదా ఒక మందు వంటి ఎన్సిఫేలోపథీ కలుగచేసే ప్రేరేపిత కారణాలకోసం వైద్యుడు చూసి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాడు. మామూలుగా, వ్యక్తి తీసుకునే పథ్యాన్ని నియంత్రించడం ద్వారా ప్రేగుల నుండి వెలువడుతున్న విష పదార్థాలను నిర్మూలించడానికి కూడా వైద్యుడు ప్రయత్నం చేస్తాడు. ఆహారంలో మాంసకృత్తులను తగ్గించి తద్వారా రక్తప్రసరణలో మోతాదు నియత్రించడానికి ప్రయత్నం చేస్తారు. పథ్యంలో మాంసకృత్తులను తగ్గించడం లేదా నిర్మూలించడం మరియు పిండి పదార్థాలను నోటితో లేదా సిరల గుండా ఇవ్వడం వంటివి కేలరీల యొక్క ముఖ్యమైన మూల శక్తి. ఆ తరువాత, మెదడు క్షీణస్థితి మరింత దిగజారకుండా తగినంత మాంసకృతులను ఇవ్వడానికి, జంతువుల ద్వారావచ్చే మాంసకృతుల కన్నా కూరగాయల ద్వారా లభించే మాంసకృత్తుల మోతాదును పెంచి (ఉదా; సోయామాంసకృత్తులు), వైద్యుడు ఇవ్వవచ్చును. పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలు పథ్యం ఎక్కువ ఉంటే తీసుకోవడం మూలంగా ప్రేగుల ద్వారా ఆహారం త్వరగా ప్రసరించి, ప్రేగులలో ఆమ్లతత్వం మారి, తద్వారా అమ్మోనియా యొక్క చూషణం కూడా తగ్గిపోతుంది. ల్యాక్టులోజ్ అనే కృత్రిమ చక్కెర నోటి ద్వారా సేవించడం మూలంగా ఈ విధమైన లాభం పొందవచ్చును. ఇది ప్రేగులలోని ఆమ్లతను మార్చి విరేచనకారిగా పనిచేసి ఆహారం త్వరిత గతితో ప్రేగులలో ప్రసరించేలా చేస్తుంది. మలద్వారం ద్వారా విరేచనకారిని పంపి శుభ్రపరచవచ్చును. అప్పుడప్పుడు, ల్యాక్టులోజ్ అనే చక్కెర పదార్థం సహించని వ్యక్తికి, నోటి ద్వారా సూక్షక్రిమినాశక మందులు ఇవ్వవలసి ఉంటుంది .
చికిత్సతో, మెదడు క్షీణస్థితిని పూర్వ సాధారణ స్థితికి తరచుగా తీసుకుని రావచ్చును. నిజానికి, ముఖ్యంగా పూర్వ సాధారణ స్థితికి రాగల కారణం చేత మెదడు క్షీణస్థితి ప్రేరేపించబడినట్లైతే, పూర్తి స్వస్థత సాధ్యమే. అయినప్పటికినీ, దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నవారిలో మాత్రం భవిష్యత్తులో మళ్ళీ ఈ ఎన్సిఫేలోపథీ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది. తీవ్రంగా కాలేయం ఉబ్బడం వలన 80 శాతం వరకు రోగులలో, అపస్మారక స్థితిలోనికి వెళతారు. వీరికి విస్తృతమైన చికిత్స చేసినప్పటికీ ప్రాణపాయపరిస్థితి ఏర్పడుతుంది.
ఆధారము: యం.ఇ.ఆర్.సి.కె
న్యుమోనియాకు బ్రయోనియా
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు త్వరగా న్యుమోనియా బారిన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సరియైన సమయంలో చికిత్స అందించకపోతే న్యుమోనియా వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ సమస్యకు హామియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయంటున్నారు డాక్టర్ శ్రీకాంత్.
న్యుమోనియా అంటే ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్. బాక్టీరియా లేక వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఫంగస్, శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే కొన్ని రకాల ఇరిటెంట్స్ ద్వారా వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి అంతగా అభివృద్ధి చెందని చిన్న పిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే 65 సంవత్సరాలు పైబడిన వారు న్యూమోనియా బారినపడే అవకాశాలు ఎక్కువ.
వ్యాధి నిరోధక శక్తి తగ్గితే...
వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉండదు. దీనివల్ల త్వరగా వ్యాధి బారినపడతారు. సీఓపీడీ, హెచ్ఐవీ, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా న్యుమోనియా బారిన పడే అవకాశం ఉంది. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కీమోథెరపీ తీసుకున్న వారిలో న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దుమ్ము, కెమికల్స్, గాలి కాలుష్యం, హానికర పదార్థాలు ఎక్కువగా విడుదలయ్యే ప్రదేశాలలో పనిచేసే వారిలో ఈ ఇన్‌ఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది.
స్మోకింగ్, ఆల్కహాల్ :ఊపిరితిత్తుల్లో ఉండే సన్నని కేశాలు క్రిములను, బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడతాయి. పొగతాగడం వల్ల ఇవి డ్యామేజ్ అవుతాయి. తద్వారా బాక్టీరియా చేరిపోయి న్యుమోనియా బారినపడతారు. ఆల్కహాల్ తీసుకునే వారిలో ఆస్టిలేషన్ న్యుమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. శ్వాస పీల్చుకునేటప్పుడు కొన్ని రకాల పార్టికల్స్ ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల ఈ రకమైన న్యుమోనియా వస్తుంది. ముఖ్యంగా వాంతులు అయినపుడు చిన్న పార్టికల్స్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం ద్వారా న్యుమోనియా వస్తుంది.
హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యుమోనియా :ఇతర కారణాల వల్ల వచ్చే న్యుమోనియా కంటే ఇది తీవ్రంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి సహాయంగా వెంటిలేటర్స్ పెట్టినపుడు సమస్య తీవ్రతరం అవుతుంది. వెంటిలేటర్స్ వల్ల రోగి దగ్గలేకపోవడంతో క్రిములు ఊపిరితిత్తుల్లోకి చేరి ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తాయి. సర్జరీ, గాయం: గాయాల బారినపడినపుడు, సర్జరీ జరిగినపుడు ఎక్కువ సమయం పడుకోవలసి ఉంటుంది. దీనివల్ల మ్యూకస్ ఊపిరితిత్తుల్లోకి చేరి బాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది.
లక్షణాలు
- చలి ఎక్కువగా ఉండటం, దగ్గుతో పాటు కఫం, శ్వాసలో ఇబ్బంది. ్గ ఛాతీలో నొప్పి.
నిర్ధారణ - ఫిజికల్ ఎగ్జామినేషన్ ్గ ఛాతీ ఎక్స్‌రే ్గ రక్తపరీక్షలు
చికిత్స యాంటీ బయోటిక్స్ వాడటం ద్వారా న్యుమోనియా తగ్గించవచ్చు. దగ్గు చాలా రోజుల వరకు ఉన్నా, జ్వరం, నొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పడతాయి. వైద్యుని సలహా మేరకు మందులు వాడటం వల్ల త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
హోమియో మందులు బ్రయోనియా :న్యుమోనియాకు వాడదగిన మందు. రాత్రివేళ పొడిదగ్గు అధికం కావడం, భోజనం చేసిన తరువాత సమస్య ఎక్కువ కావడం, వాంతులు, ఛాతీలో నొప్పి, దగ్గుతో పాటు కఫం, దాహం ఎక్కువ, నాలుక పొడిగా ఉండటం, మలబద్దకం, చిరాకు, కుడి ఊపిరితిత్తిలో నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వాడదగిన ఔషధం.
ఫాస్పరస్ :గొంతులో నొప్పి, స్వరపేటికలో నొప్పితో సరిగ్గా మాట్లాడలేరు. చల్లగాలికి దగ్గు అధికం, ఛాతీలో నొప్పి, మంట, బరువుగా ఉండటం, ఎడమవైపు పడుకుంటే సమస్య ఎక్కువ కావడం, దగ్గుతో పాటు రక్తం, భయం, జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం, చల్లటి నీరుతాగాలనిపించడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు సూచించదగిన మందు.
స్పాంజియ :వాయుమార్గం పొడిగా ఉండటం, గొంతులో నొప్పి, మంట, పొడిదగ్గు, శ్వాస తీసుకునేటప్పుడు, రాత్రివేళ సమస్య అధికం కావడం, భోజనం తరువాత దగ్గు ఎక్కువ కావడం, ఆస్తమా, పిల్లికూతలు, బలహీనంగా ఉండటం, ఆందోళన వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన హోమియో ఔషధం.
సాంబుకస్ :ఛాతీలో నొప్పి, బరువు, దగ్గు తరచుగా రావడం, శ్వాసలో ఇబ్బంది, రాత్రివేళ సమస్య అధికం, జలుబు, ముక్కు పొడిబారడం, ముఖం నీలంరంగులోకి మారడం, చెమటలు ఎక్కువగా పట్టడం, భయపడే స్వభావం వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు సూచించదగిన మందు.
కాలికార్బ్ : ఛాతీలో నొప్పి, కుడివైపు పడుకున్నప్పుడు సమస్య అధికం, గొంతులో నొప్పి, పొడి దగ్గు, ఉదయం పూట దగ్గు అధికం, పిల్లికూతలు, చిరాకు, భయం, ఆందోళన, శబ్దాలను భరించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.
జస్టినియా :పొడిదగ్గు, ఛాతిలో నొప్పి, గొంతులో నొప్పి, దగ్గుతో పాటు తుమ్ములు, శ్వాసలో ఇబ్బంది, తలనొప్పి, ఆహారపదార్థాలు రుచిగా అనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడవచ్చు.
ఆర్స్ఆల్బ్ :ఆస్తమా, రాత్రివేళ సమస్య అధికం, ఛాతీలో నొప్పి, మంట, దగ్గు, కఫం, ఊపిరితిత్తులలో నొప్పి, ఎక్కువగా కుడివైపున నొప్పి, పిల్లికూతలు, పొడిదగ్గు, ఆందోళన, దాహం ఎక్కువ తదితర లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ ఔషధం ఉపకరిస్తుంది. డ్రాసిర : పొడిదగ్గు, గొంతులో నొప్పి, దగ్గుతో పాటు కఫము, గొంతులో ఏదో ఉన్నట్టుగా అనిపించడం, దురద, మాట్లాడినపుడు ఆయాసం, శ్వాసలో ఇబ్బంది, బరువు కోల్పోవటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.
డా. యం. శ్రీకాంత్
ఫోన్ : 9550001133, 9550001199.
సిర్రోసిస్ ఆఫ్ లివర్
నిర్వచనము
కాలేయానికి (లివర్ కు) దీర్ఝకాలిక వ్యాధులు సోకిన తరువాత కాలేయ కణాలు పనిచేయకపోవడం - తద్వారా కాలేయంలో కలుగు పరిణామాలను సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని అంటారు.
కారణాలు
- దీర్ఝకాలిక లివర్ వ్యాధులు
- దీర్ఝకాలిక మధ్యం వాడకం
- హిపటైటిస్ - బి - ఇన్ ఫెక్షన్
- కొన్ని రకాల మందులు వాడకం
- వ్యాధి నిరోధక శక్తి లోపించుట
- పైత్యరస ప్రసరణలో అడ్డంకులు - వ్యాధులు
లక్షణాలు
- కడుపులో నీరు చేరుట
- కాళ్లు చేతులు వాపు
- వాంతిలో రక్తం పడుట
- పచ్చ కామెర్లు
- రక్త నాళాలు ఉబ్బడం,వంకర్లు తిరిగి ఉండటం
- బరువు తగ్గడం
- వాంతి అవుతున్నట్లు ఉండటం
- ఆలోచనలలో తికమక
- అలసి పోవడం
- కొన్ని సందర్బాలలో మొలలు నుండి రక్తం కారుట
- సంభోగంలో ఉత్సుకత లేకపోవుడం
- పురుషత్వం కోల్పోవడం
- మూత్ర విసర్జన తగ్గిపోవడం
- మలము తెల్లగా రావడం
- చిగుళ్ళలో , ముక్కులో రక్తం కారుట
- సాధారణ జ్వరం
- పురుషులలో స్ధనములు పెద్దగా వుండడం
పైన ఇవ్వబడిన లక్షణాలు వ్యాధి తీవ్రతకు అనుగుణంగా వస్తుంటాయి.
పరీక్షలు
- కడుపును చేతులతో పరీక్ష చేసినపుడు కాలేయము (లివర్) పెద్దదిగా గుర్తించడం
- కడుపులో నీరు నిండి ఉండి ఉబ్బరంగా వుండడం
- కడుపు పై రక్త నాళాలు స్పష్టంగా కనపడటం
- వృషణాలు చిన్నవిగా వుండడం
లాబ్ పరీక్షలు
- రక్త పరీక్ష - రక్త హీనతకొరకు, రక్తం గడ్డకట్టు కాలం కనుగొనుటకు
- లివర్ ఎంజైములు పనితీరు కనుగొనుట
- రక్తంలో బిలిరుబిన్ స్ధాయి కనుగొనుట
- ‘ఎక్స్’ రే పరీక్షలు
- ప్రత్యేకమైన సూది సహాయం తో లివర్ కణాలు తీసి పరీక్ష చేసిన వ్యాధి నిర్ధారించబడును
నివారణ - తీసుకోవలసిన జాగ్రత్తలు
- అధికంగా మద్యం సేవించరాదు
- రక్త నాళాల ద్వారా మందులు వాడకం తగ్గించాలి. హిపటైటిస్ బి మరియు హిపటైటిస్ సి నుండి రక్షణ పొందవచ్చు.
- వ్యాధి నిరోధక టీకా ద్వారా హిపటైటిస్ బి వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
అమిబిక్ లివర్ వ్యాధి
నిర్వచనం - కాలేయములో చీము ఉండడాన్ని లివర్ ఆప్సిస్ అని అంటారు.
కారణం- ఎంటమీబా హిస్టాలిటిక అనే క్రిముల వలన కడుపులో ఈ వ్యాధి వస్తుంది. ఈ క్రిముల వలన అమీబియాసిస్ అనే వ్యాధి వస్తుంది.
ఎలా సంక్రమిస్తుంది
- ఎంటమీబా హిస్టాలిటిక సూక్ష్మక్రిములతో కలుషితమైన ఆహారం, నీరు, తీసుకొనుట వలన సంక్రమిస్తుంది.
- వ్యాధిగ్రస్థుల నుండి ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది.
అధికంగా ఎవరికి వస్తుంది
- ఆహార లోపం వున్న వాళ్ళకు, వృద్ధులు గర్భవతులు
- స్టీరాయిడ్లు అధికంగా వాడువారు
- క్యాన్సరు వ్యాధితో ఉన్నవారు
- వ్యాధి నిరోధక శక్తి లోపించినవారు
- అధికంగా మద్యపానం సేవించువారు
వ్యాధి లక్షణాలు
1. జ్వరం
2. కడుపులో వికారంగా ఉండడం
3. శరీరం చల్లబడటం వణుకు
4. ఆకలి లేకపోవడం
5. బరువు తగ్గడం
6. విరోచనాలు
7. పచ్చకామెర్లు
8. కాళ్లు నొప్పులు
9. కడుపునొప్పి కుడి ప్రక్కపై భాగాన
పరీక్షలు
1. కడుపు స్కాన్ చేయడం
2.లివర్ కణాలను తీసి పరీక్ష చేయడం
3.రక్తం పరీక్షలో లివర్ చేయు విధులను పరీక్షించుట
4.రక్త పరీక్షలో తెల్లకణాల శాతం అధికంగా ఉండడం
5.మల పరీక్షలో ఎంటమీబా క్రిములను గుర్తించడం
నివారణ చర్యలు
- శుభ్రమైన నీరు త్రాగాలి.
- కూరగాయలు ఆకుకూరలు నీటితో శుభ్రపరచి తినాలి.
- బాగా వుడికిన ఆహార పదార్ధాలనే తినాలి.
- పండ్ల పై చర్మము తీసి శుభ్రంగా తినాలి.
- భోజనానికి ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడగాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం.
ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్