Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

Anantapuramu District Education Overview

విద్య

జిల్లాలో మొత్తం 133 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్‌ కాలేజీలు 61. మరో 12 గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. మొత్తం 139 కాలేజీల్లో 72 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో మడకశిర, అనంతపురంలో రెండు వృత్తివిద్య కళాశాలలున్నాయి. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధనలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపిస్తున్నారు. ప్రైవేట్‌లోనే కాదు... ప్రభుత్వ కళాశాలల్లోనూ ఎంసెట్‌ కోచింగ్‌ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఎంసెట్‌ కోచింగ్‌ కేంద్రాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. ఎంసెట్‌తో పాటు ఐఐటీ, ఏ ఐ ట్రిపుల్ ఈ  తదితర అఖిల భారత స్థాయి పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చూపుతున్నారు.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

అనంతపురం జిల్లా కేంద్రానికి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 10 కిలోమీటర్ల దూరంలో అనంతపురం- చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉంది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 1976లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ సెంటర్‌గా ఉండి 1981లో యూనివర్సిటీగా ఏర్పాటు అయింది. రాయలసీమ ప్రాంతవాసుల చిరకాల స్వప్నంగా వర్సిటీ ఏర్పాటైంది. ఇషా ఉపనిషత్తు నుంచి 'విద్యయా అమృత మశ్నుతే' అనే పదాన్ని జోడించి వర్సిటీ చిహ్నం రూపొందించారు. మొత్తం 500 ఎకరాల్లో క్యాంపస్‌ విస్తరించింది. వర్సిటీ కళాశాలలో 28 విభాగాల్లో 37 పీజీ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నారు. 156 అనుబంధ డిగ్రీ కళాశాలలు, 25 పీజీ కళాశాలల్లో ప్రత్యేకంగా పీజీ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నారు. 59 బీఈడీ కళాశాలలు వర్సిటీ పరిధిలో ఉన్నాయి. రెండు లా కళాశాలలు ఉన్నాయి.

ఇంజినీరింగ్‌ కళాశాల

ఎస్కేయూ క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌ కళాశాలను 2006లో ఏర్పాటు చేశారు. సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, బయోటెక్నాలజీ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నారు. ఒక్కో బ్రాంచిలో 60 సీట్లు ఉన్నాయి.

దూరవిద్య

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ దూరవిద్యకేంద్రం 2000లో ఏర్పాటు అయింది. యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులున్నాయి. యూజీలో 19 బ్రాంచిలు, పీజీలో 16 బ్రాంచిలు, రెండు డిప్లొమా కోర్సులు ఆఫర్‌ చేస్తున్నారు. ఎస్కేయూ దూరవిద్య ఫోన్‌ నంబరు 08554-255725

ఇతరాలు

ఎస్కేయూలో బీఈడీ కోర్సు ఆఫర్‌ చేస్తున్నారు. ఎంఫార్మసీ కోర్సు ఉంది. ఫుల్‌టైం పీహెచ్‌డీ, పార్ట్‌టైం పీహెచ్‌డీ చేయడానికి అవకాశం ఉంది. సెంట్రల్‌ లైబ్రరీ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9 వసతి గృహాలు ఉన్నాయి. క్యాంపస్‌లో 4238 వేల మంది విద్యార్థులు ఉన్నారు.ఇందులో విద్యార్దినిలు 1208 మంది వరకు ఉన్నారు. వర్సిటీ పరిధిలోని యూజీ, పీజీ, బీఈడీ అన్ని కోర్సుల్లో లక్ష మంది విద్యార్థులు ఉన్నారు.

బోధన, బోధనేతర సిబ్బంది

వర్సిటీలో మొత్తం 289 మంది బోధనా సిబ్బంది ఉండాలి. తాజాగా 157మంది బోధనా సిబ్బంది ఉన్నారు. వీరిలో 31మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 19 మంది అసోషియేట్‌ ప్రొఫెసర్లు, 107 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. 258 మంది బోధనేతర సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన ఉన్నారు. 80 మంది టైంస్కేలు ఉద్యోగులు, 200 వరకు ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు.

అనంత జే ఎన్ టీ విశ్వవిద్యాలయం

అనంతపురం జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలాజికల్‌ కళాశాల 1946 లో ఏర్పాటు అయింది. హైదరాబాద్‌ జేఎన్‌టీయూకి అనుబంధంగా ఉన్న కళాశాల ఆగస్టు 18, 2008లో అనంతపురం జేఎన్‌టీయూ వర్సిటీగా ఏర్పాటు అయింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించింది. వర్సిటీ కళాశాలలు అనంతపురం జేఎన్‌టీయూ, పులివెందుల జేఎన్‌టీయూ, అనంతపురం తైల సాంకేతిక అభివృద్ది కేంద్రం ఉంది. ఐదు జిల్లాల పరిధిలో 114 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 35 ఫార్మసీ కళాశాలలు, 21 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, 5 ఇంటిగ్రేటెడ్‌ కళాశాలలు ఉన్నాయి. యూజీలో బీటెక్‌, బీఫార్మసీ, ఫార్మాడీ ఉన్నాయి. పీజీలో ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ ఫార్మాడీ (పి.బి.)కోర్సులు ఉన్నాయి. ఎంఎస్‌, పీహెచ్‌డీలో పరిశోధన చేయడానికి అవకాశం ఉంది.

ఇతరాలు

వర్సిటీ కళాశాలలో ఐదు వసతి గృహాలు ఉన్నాయి. వర్సిటీ పరిధిలో మొత్తం లక్షా 50వేల మంది విద్యార్థులు ఉన్నారు. అనంత జేఎన్‌టీయూ కళాశాలలో వర్సిటీ పరిధిలో 14 బీటెక్‌ కోర్సులు, 28 ఎంటెక్‌ స్పెషలైజేషన్లు ఆఫర్‌ చేస్తున్నారు. వర్సిటీ కళాశాలలో ఆరు ఇంజినీరింగ్‌ విభాగాలు ( సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్సు, కెమికల్‌ బ్రాంచిలు ఉన్నాయి.) ఐదు సైన్సు ( మ్యాథమాటిక్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, హ్యూమానిటీస్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) విభాగాలు ఉన్నాయి. లైబ్రరీ సౌకర్యం ఉంది. ప్లేస్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెల్‌ ఏర్పాటు చేసారు .

వృత్తివిద్య కోర్సులు: ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఎ అండ్‌ టి, ఎంఎల్‌టీ, ఈఎన్‌ఎస్‌ఈఎ, సీటీ, డబ్ల్యూ ఎస్‌ఎస్‌ఈ, ఆర్‌ అండ్‌ టి, ఏఓ, డెయిరీ టెక్నాలజీ, ఆర్‌ఈటీ, ఫిజియోథెరఫి, ఎమ్పీహెచ్‌డబ్ల్యూఎ, ఎంఅండ్‌ఎస్‌, ఈఈటీ, కమ్యూనికేషన్‌ సైన్సు.

గురుకుల విద్యాలయాలు: అనంతపురం సమీపంలోని కురుకుంటలో అంబేద్కర్‌ జూనియర్‌ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం. తిమ్మాపురం, మలుగూరు, టేకులోడు, గుత్తి, హిందూపురం, కణేకల్లు, బి.పప్పూరు, బ్రహ్మసముద్రం, అమరాపురం, ఉరవకొండ, పెన్న అహోబిళం, కొడినగహల్లి, సేవామందిర్‌లలో గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. లేపాక్షిలో నవోదయ విద్యాలయం ఉంది.

ప్రభుత్వ కాలేజీలు: అనంతపురం కొత్తూరు, పాతూరు, కేఎస్‌ఆర్‌ బాలికల కళాశాల, ఆత్మకూరు, కదిరి బాలికలు, కదిరి బాలురు, హిందూపురం బాలికలు, నల్లమాడ, లేపాక్షి, చిలమత్తూరు, గుత్తి బాలికలు, తనకల్లు, నార్పల, తాడిపత్రి, ఉరవకొండ బాలికలు, ఉరవకొండ, రాయదుర్గం, ధర్మవరం బాలురు, ధర్మవరం బాలికలు, తాడిమర్రి, , గుంతకల్లు రైల్వే, రొద్దం, కణేకల్లు, కొత్తచెరువు, కళ్యాణదుర్గం, మడకశిర, గుడిబండ, అమరాపురం, పామిడి, తలుపుల, ముదిగుబ్బ, పెద్దపప్పూరు, రామిగిరి, కంబదూరు, కుందుర్పి, అమడగూరు, బొమ్మనహాల్‌, శింగనమల.

ఎయిడెడ్‌ కాలేజీలు: అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌, అనంతపురం త్రిబుల్‌ ఎస్‌, ఎస్‌డీజీఎస్‌ హిందూపురం, ఎఎంఎల్‌ హిందూపురం, ఎంఎస్‌ గుత్తి, ఎస్‌ఎస్‌జీఎస్‌ గుంతకల్లు, సాప్‌ గోరంట్ల.

నర్సింగ్‌ కళాశాలలు

·         యూత్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, అనంతపురం 9440285776

·         దివ్య స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ , అనంతపురం, 9490696017

·         విమల స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ , అనంతపురం, 9440288669

·         ఆమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ , అనంతపురం, 9440288669

·         మాస్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ , అనంతపురం, 9493572181

·         జీవనజ్యోతి హాస్పిటల్‌స్కూలు, అనంతపురం, 9440136726

·         నిర్మల స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ , అనంతపురం, 9246940029

ఎమ్పీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) పాఠశాలలు

·         నిర్మల పాఠశాల, అనంతపురం, 9246940029

·         కస్తూరీ పాఠశాల, అనంతపురం, 9440285776

·         సెయింట్‌ మేరీ పాఠశాల, అనంతపురం, 9440874258

·         మమత పాఠశాల, అనంతపురం, 9959659978

·         మాస్‌ పాఠశాల, అనంతపురం, 9493572181

·         ప్రగతి పాఠశాల, అనంతపురం, 9441587079

·         ప్రభుత్వ నర్శింగ్‌ పాఠశాల, అనంతపురం, 08554 249592

ఆధారము: ఈనాడు

పాఠశాలలు

జిల్లాలో 4844 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3161, ప్రాథమికోన్నత పాఠశాలలు 957, ఉన్నతపాఠశాలలు 676, సెకండరీ గ్రేడ్‌ పాఠశాలలు 50. కేజీబీవీలు 28, ప్రత్యేకపాఠశాలలు తొమ్మిది అదనం.

ఉపాధ్యాయులు: ప్రాథమిక పాఠశాలల టీచర్లు 8718 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లు 5684 మంది ఉన్నారు.

ఎమ్మార్సీలు 63. వీటికి 360 పాఠశాలల సముదాయ భవనాలు ఉన్నాయి.

గురుకుల విద్యాలయాలు: జిల్లాలో గురుకుల విద్యాలయాల వివరాలు.. మలుగూరు, కాళసముద్రం, బి.పప్పూరు, కురుకుంటలో రెండు, బ్రహ్మ సముద్రం, హిందూపురం, లేపాక్షి, టేకులోడు, లేపాక్షి నవోదయ, గుత్తి, ఉరవకొండ, పెన్న అహోబిళం, అనంతపురం రూరల్‌, తిమ్మాపురం, కణేకల్లు, కొడిగనహళ్లి, పేరూరు, సేవా మందిర్‌.

ఆధారము: ఈనాడు

కళాశాలలు

జిల్లాలో మొత్తం 139 జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇందులో 48 ప్రభుత్వ, ఏడు ఎయిడెడ్‌, ఆరు ఇన్‌సెంటివ్‌ కాలేజీలు, 11 రెసిడెన్షియల్‌ కాలేజీలు, మిగతావన్నీ కార్పొరేట్‌, ప్రైవేట్‌ కాలేజీలు.

మొత్తం 72 వేల మంది చదువుతున్నారు. 37వేల మంది ప్రథమ సంవత్సరం, 35 వేల మంది వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఉన్నారు. 213 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు, 246 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పని చేస్తున్నారు. ఇంటర్మీడియట్ స్థాయిలో మూడు వృత్తి విద్యా కాలేజీలున్నాయి. అనంతపురంలో బాలురు, కేఎస్‌ఆర్‌లో ఒక్కొక్కటి, మడకశిరలో ఒకటి చొప్పున ఉంది. 3210 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటన్నింటిలోనూ కాంట్రాక్టు అధ్యాపకులే పనిచేస్తున్నారు.

జిల్లాలోని కళాశాలల వివరాలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

·         ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, అనంతపురం, ఫోన్‌: 08554-240825

·         కె.ఎస్‌.ఎన్‌.మహిళాకళాశాల, అనంతపురం, ఫోన్‌: 08554- 221637

·         ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బుక్కపట్నం, ఫోన్‌: 08555-282218

·         కె.హెచ్‌. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ధర్మవరం,ఫోన్‌: 08559-2230745.

·         ఎస్కేపీ డిగ్రీ కళాశాల, గుంతకల్లు, ఫోన్‌: 08552-226836

·         ఎన్‌ఎస్‌పీఆర్‌ మహిళా కళాశాల, హిందూపురం, ఫోన్‌: 08556-220407.

·         ఎస్‌వైటీఆర్‌ కళాశాల, మడకశిర, ఫోన్‌: 08493- 288023

·         ఎస్‌వైజీఎం కళాశాల, కళ్యాణదుర్గం, ఫోన్‌: 08497- 22007

·         పరిటాల శ్రీరాములు కళాశాల, పెనుకొండ, ఫోన్‌: 08555-220281

·         కేటీఎస్‌ కళాశాల, రాయదుర్గం, ఫోన్‌: 08495- 252398

·         ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తాడిపత్రి, ఫోన్‌: 08558- 222325

·         ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉరవకొండ, ఫోన్‌: 08496-2567074

ప్రవేటు ఎయిడెడ్‌ కళాశాలలు

·         ఎస్‌ఎస్‌జీఎస్‌, గుంతకల్లు, ఫోన్‌: 08552- 260125

·         ఎస్‌డీజీఎస్‌, హిందూపురం, ఫోన్‌: 08556- 220316

ప్రవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు

·         సీవీఎల్‌ఎన్‌ఆర్‌, అనంతపురం, ఫోన్‌: 08554- 222514

·         ఎస్‌.వి. కళాశాల, అనంతపురం, ఫోన్‌: 9908946782

·         లిటిల్‌ఫ్లవర్‌, అనంతపురం, ఫోన్‌: 08554- 655123

·         శ్రీ సాయి కళాశాల, అనంతపురం, ఫోన్‌: 08554- 240312

·         సీఎంఐ కళాశాల, అనంతపురం, ఫోన్‌: 08554- 240312

·         శ్రీ సాయి మహిళా కళాశాల, అనంతపురం, ఫోన్‌: 08554-228153

·         పీవీకెకె. అనంతపురం, ఫోన్‌: 08554- 232268

·         సాయి మహేశ్వర, అనంతపురం, ఫోన్‌: 08554-273123

·         నలంద, అనంతపురం, ఫోన్‌: 08554-322466

·         శ్రీవాణి, అనంతపురం, ఫోన్‌: 08554- 224619

·         వీఆర్‌జీ, అగళి, ఫోన్‌: 08493- 284666

·         శ్రీనివాస, ధర్మవరం, ఫోన్‌: 08559-221498

·         శ్రీ వివేకానంద, ధర్మవరం, ఫోన్‌: 9491832148

·         ఎస్‌ఎస్‌బీబీ మహిళా కళాశాల, గుంతకల్లు, ఫోన్‌: 08553223766

·         శ్రీసాయి కళాశాల, గుత్తి, ఫోన్‌: 08552-250044

·         ఎంఎస్‌ కళాశాల, గుత్తి, ఫోన్‌: 9848596649

·         ఎస్‌పీవీఎమ్‌, గోరంట్ల, ఫోన్‌: 9441144717

·         సప్తగిరి,హిందూ పురం  ఫోన్‌: 08556-220716

·         బాలయేసు, హిందూపురం, ఫోన్‌: 9440243760

·         శ్రీబాలాజీ విద్యావిహార్‌, హిందూపురం, ఫోన్‌: 08556- 225099

·         శ్రీవాణి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, హిందూపురం, ఫోన్‌: 9703384473

·         శ్రీ మాతా జయలక్ష్మి, కదిరి, ఫోన్‌: 9396677830

·         ఎస్కేఎల్‌ఎన్‌ఎస్‌ మహిళా కళాశాల, కదిరి, ఫోన్‌: 9490273069

·         శ్రీ వివేకానంద, కదిరి, ఫోన్‌: 9441551301

·         శ్రీ వాణి, కదిరి, ఫోన్‌: 9440384767

·         స్వామి వివేకానంద, కళ్యాణదుర్గం, ఫోన్‌: 9849038371

·         శ్రీ శివసాయి, కళ్యాణదుర్గం, ఫోన్‌: 9963161177

·         శ్రీ దివ్య, కొత్తచెరువు, ఫోన్‌: 08555- 280566

·         శ్రీ సత్యసాయి, పెనుకొండ, ఫోన్‌: 08555- 202499

·         రాయల్‌, కళ్యాణదుర్గం, ఫోన్‌: 08495-253999

·         సరస్వతి, తాడిపత్రి, ఫోన్‌: 08558- 223737

·         సర్‌ సివి.రామన్‌ కళాశాల, తాడిపత్రి, ఫోన్‌: 9247837811

·         జేసీఎన్‌ఆర్‌ఎమ్‌, తాడిపత్రి, ఫోన్‌: 08558-224037

·         ఎస్‌డీఆర్‌ఆర్‌, ముదిగుబ్బ, ఫోన్‌: 08494-256900

·         మహాత్మ, ఉరవకొండ, ఫోన్‌: 9440006008

·         శ్రీవెంకటేశ్వర, యాడికి, ఫోన్‌: 08558-270241

·         సాయిబాబా (అటానమస్‌), అనంతపురం, ఫోన్‌: 08554-244585

బీఈడీ కళాశాలలు

·         శ్రీ సరస్వతి, అనంతపురం, ఫోన్‌: 9701275514

·         క్రీసెంట్‌, అనంతపురం, ఫోన్‌: 08554-278232

·         ఇంటెల్‌, అనంతపురం, ఫోన్‌: 9949262386

·         బాలాజీ, అనంతపురం, ఫోన్‌: 08554-232268

·         లిటిల్‌ఫ్లవర్‌, అనంతపురం, ఫోన్‌: 9440363776

·         సెయింట్‌జోసెఫ్‌, అనంతపురం, ఫోన్‌: 9490767008

·         ఎస్‌.వి.కాలేజ్‌, అనంతపురం, ఫోన్‌: 9490859090

·         సుశీల, అనంతపురం, ఫోన్‌: 9440431866

·         ఎస్‌ఎస్‌బీఎన్‌, అనంతపురం, ఫోన్‌: 9441669490

·         హైందవి, అనంతపురం, ఫోన్‌: 9440547376

·         ఎస్‌టీ, జోసెఫ్‌, అనంతపురం, ఫోన్‌: 9885588248

·         కె.సి.నారాయణ, గుంతకల్లు, ఫోన్‌: 9885324515

·         ఎ.ఎమ్‌.లింగన్న, సేవామందిర్‌, ఫోన్‌:9440204205

·         సెయింట్‌, హిందూపురం, ఫోన్‌: 9490737787

·         డాక్టర్‌ బి.వి.శ్యామల రత్నం, హిందూపురం, ఫోన్‌: 95029289

·         శ్రీ బాలాజీ, కొత్తచెరువు, ఫోన్‌: 08555-200456

·         జ్ఞానభారతి, కళ్యాణదుర్గం, ఫోన్‌: 9440215655

·         హైలీ, కళ్యాణదుర్గం, ఫోన్‌: 08492-203340

·         శ్రీదేవి, కళ్యాణదుర్గం, ఫోన్‌: 9491354883

·         స్వామి వివేకానంద, కళ్యాణదుర్గం, ఫోన్‌: 9441179551

·         వెంకటేశ్వర, కదిరి, ఫోన్‌: 08494-223803

·         సాయిరామ్‌ విద్యానికేతన్‌, రాంపురం, ఫోన్‌: 9441178781

·         శ్రీసాయి సిద్దార్థ, తాడిపత్రి, ఫోన్‌: 9000617099

·         సర్‌ సి.వి.రామన్‌, తాడిపత్రి, ఫోన్‌: 9885120878

ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలు

·         జేఎన్‌టీయూ కళాశాల, అనంతపురం, ఫోన్‌: 08554273013

·         ఎస్కేయూ కళాశాల, ఎస్కేయూనివర్సిటీ, ఫోన్‌: 08554255880

·         అనంతలక్ష్మి, ఇటికలపల్లి,ఫోన్‌: 08554-255233

·         బాలాజీ, అనంతపురం, ఫోన్‌: 08554-232268

·         బిట్‌, హిందూపురం, ఫోన్‌:08556- 249677

·         చిరంజీవిరెడ్డి గ్రూప్స్‌, రాచానపల్లి, ఫోన్‌: 08556-249677

·         గేట్స్‌, గుత్తి, ఫోన్‌: 08552-200444

·         వెంకటేశ్వర, హంపాపురం, ఫోన్‌: 08554-645566

·         శ్రీనివాస రామానుజన్‌, రోటరీపురం, ఫోన్‌: 08554-270077

·         తాడిపత్రి ఇంజినీరింగ్‌, తాడిపత్రి, ఫోన్‌: 08558-200266

·         ఇంటెల్‌, అక్కంపల్లి, ఫోన్‌:08554- 270652

·         మౌళాలి, బ్రాహ్మణపల్లి, ఫోన్‌: 085546283393

·         పీవీకేకే, రుద్రంపేట, ఫోన్‌: 08554- 248096

·         రాఘవేంద్ర ఫార్మసీ, క్రిష్ణమరెడ్డిపల్లి, ఫోన్‌: 08554-255548

·         సంస్కృతి ఎంబీఏ కళాశాల, పుట్టపర్తి, ఫోన్‌:08554-288838

·         శ్రీ షిర్డిసాయి, వడియంపేట, ఫోన్‌: 08554- 201123

·         శ్రీ సాయి, పొడరాళ్ల, ఫోన్‌: 08554-260355

·         సర్‌ సి.వి.రామన్‌, తాడిపత్రి, 08558-277900

·         శ్రీకృష్ణదేవరాయ, గుత్తి, ఫోన్‌: 08552-200566

·         శ్రీసాయి కాలేజ్‌, లోలూరు, ఫోన్‌: 08551-286821

·         శ్రీ శ్రీనివాస, తాడిపత్రి, ఫోన్‌: 08558-200137

పాలిటెక్నిక్‌ కళాశాలలు

·         ప్రభుత్వ పాలిటెక్నిక్‌, అనంతపురం,
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ఉరవకొండ,

·         ప్రభుత్వ పాలిటెక్నిక్‌, తాడిపత్రి,

·         ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కళ్యాణదుర్గం

·         ప్రభుత్వ పాలిటెక్నిక్‌, హిందూపురం

·         గేట్స్‌ పాలిటెక్నిక్‌, హిందూపురం

·         ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ధర్మవరం

·         ప్రభుత్వ పాలిటెక్నిక్‌, మడకశిర

·         ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కదిరి

·         ఇంటెల్‌ పాలిటెక్నిక్‌, అక్కంపల్లి

వైద్య కళాశాల

జిల్లాలో ఒకే ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది. 2000 సెప్టెంబరులో ప్రారంభించారు. మొత్తం 500 వైద్య సీట్లు. దీనికి అనుబంధంగా బోధన ఆసుపత్రి (సర్వజన ఆస్పత్రి) ఉంది. ఇక్కడ కూడా 500 పడకలున్నాయి. అధికారికంగా జీవో వచ్చింది. కానీ బడ్జెట్‌ కేటాయించడం లేదు.

డాక్టర్లు: మొత్తం 156 మంది వైద్యులు పనిచేస్తున్నారు.

విభాగాలు: మొత్తం 23 విభాగాలు. ఇందులో కీలకమైనవి... జనరల్‌ మెడిసిన్‌, జనరల్  సర్జన్‌, గైన కాలజీ, చిన్నపిల్లలు, ఆర్థో, ఛాతీ,క్షయ, ప్రసూతి, ఎస్పీఎం, మైక్రోబయాలజీ, బయోకెమిస్రీ  పెథాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, అనాటమీ.

పోస్టులు: మొత్తం 894 పోస్టులు. ఇందులో నర్సులు 245 మంది, మినిస్టీరియల్‌ సిబ్బంది 543 మంది, మిగతా వారు కాంట్రాక్టు ఉద్యోగులు.

ఆధారము: ఈనాడు

శిక్షణా కేంద్రాలు

జిల్లాలో పలు ట్రైనింగ్‌ సెంటర్లు ఉన్నాయి. అన్ని రకాల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే ప్రధాన కేంద్రం... నగర శివారు పంగల్‌ రోడ్డు సమీపంలో జిల్లా సాంకేతిక శిక్షణా సంస్థ(టీటీడీసీ) ఉంది. అనంతపురం రూరల్‌ మండలం ఆకుతోటపల్లిలో రూడ్‌సెట్‌ శిక్షణ సంస్థ, రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి సమీపంలోని తెలుగు మహిళాప్రాంగణం, స్కీయాడ్‌, ఏపీ స్టడీ సర్కిల్‌ తదితరాలు ఉన్నాయి

అనంతపురం శిక్షణ కేంద్రాలు

·         జనశిక్షణా సంస్థాన్‌, సాయినగర్‌,

·         టిక్ట్‌ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం, కమలానగర్‌

·         రూడ్‌సెట్‌ శిక్షణా కేంద్రం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సమీపం

·         విజయసాయి కంప్యూటర్‌ శిక్షణా కేంద్రం, సాయినగర్‌

·         శాస్త్రీయ నృత్యాలయం,కమలానగర్‌

·         కళాసాగర్‌,డ్యాన్స్‌ అకాడమి ఒకటోరోడ్డు

·         అరవింద నృత్యాలయం,అరవిందనగర్‌

ఐటీఐలు:

జిల్లాలో రెండు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి.

1.     ప్రభుత్వ ఐటీఐ(బాలురు)

2.    ప్రభుత్వ ఐటీఐ (బాలికలు).

ఐటీఐల్లో కోర్సులు

ఎలక్ట్రికల్  ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, టర్నర్‌, డ్రాప్ట్స్‌మెన్‌ సివిల్‌, డీజిల్‌ మెకానిక్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, కంప్యూటర్‌ సైన్సు, స్టెనోగ్రఫీ, ఆటోమొబైల్‌ తదితరాలు ఉన్నాయి.

ఆధారము: ఈనాడు

వృత్తివిద్య

మొత్తం ఐటీఐలు: జిల్లాలో మూడు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. అనంతపురంలో రెండు, హిందూపురంలో ఒక్కటి ఉంది. 17 ప్రైవేటు ఐటీసీలు ఉన్నాయి.

ప్రాంతాలు:హిందూపురం, అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, ఒ.డి. చెరువు, తాడిపత్రి ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఐటీసీలు.

విద్యార్థులు: మొత్తం 3289 మంది

కోర్సులు: 17 రకాల వృత్తివిద్యా కోర్సులు ఉన్నాయి. ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌, డీజిల్‌ మెకానిక్‌, ఎలెక్ట్రానిక్స్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌, టర్నర్‌, వెల్డర్‌, ఎంఎల్‌టీ, కంప్యూటర్‌ డీటీపీ.. తదితరాలు  కోర్సులు నిర్వహిస్తున్నారు.

ఆధారము: ఈనాడు

 

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free