యుక్త వయస్సు లో స్త్రీ ఆరోగ్యం
ఎదిగే వయసులో ఆడపిల్ల
ఎ. పని
ఒక ఆడపిల్ల శారీరక, మానసిక ఎదుగుదల చుట్టూ వున్న సాంఘిక, ఆర్థిక వాతావరణం, ఆరోగ్య, విద్యావకాశాలు, సంఘంలో ఎటువంటి నైతిక విలువలు, భావజాలం ఆ అమ్మాయి మీద పని చేస్తోంది అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆడపిల్ల కుటుంబంలో, సమాజంలో బాధ్యతల విషయంలో తన పాత్ర ఏమిటని అర్థం చేసుకోవటం కూడా ఈ పై విషయాలమీదే ఆధారపడి వుంటుంది. ఎటూకాని వయసు. అటు పసిపిల్లలు కాదు. ఇటు పెద్దలూ కాదు. అన్ని బాధ్యతలూ తనమీదే. కుటుంబానికీ, తల్లికీ వండటం, వంట ఇల్లు శుభ్రం చేయటం, గిన్నెలు తో నీళ్ళు తీసుకురావటం, బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చే బాధ్యత, మగపిల్లల పనులు, భోజనాలు పెట్టడం, బట్టలు కుట్టడం, చిన్న పిల్లలను చూసే బాధ్యత, ఎవరికి బాగా లేకపోయినా వాళ్ళ సంరక్షణ బాధ్యత అన్నీ ఉంటాయి అదీ కాకుండా మనలో చాలా మందిమి బయట పనులు, ఇళ్ళలో పని మనుషులుగా తల్లులకు చేసే సహాయం, టైలరింగ్ షాపులలో చేసేవాళ్ళు, బిల్డింగ్లు కట్టే తట్టలు మోసే వాళ్ళు, బీడీలు చేసే వాళ్ళు, రాళ్ళు మోసేవాళ్ళు, పాత వస్తువులు ఏరుకునే వాళ్ళు మనలో ఆడపిల్లలు ఉన్నారు. మనం చేసే పనులన్నీ మనలో సమర్థతను పెంచుతాయి. మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం లేకపోతే ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబానికి మన పని, మన సంపాదన అవసరమైతే, చదువుకు అంతరాయం ఏర్పడడం, అఁదరిలాగా బాల్యం మనకు లేకపోవడం జరుగుతుంది. తల్లిదండ్రులదీ అసహాయపరిస్థితే. వాళ్ళని నిందించటానికి వీల్లేదు. అందరి పిల్లల్లాగా మనకీ చదువు కోవాలని, అందంగా ఉండాలనిపిస్తుంది. టి.వీ. లో అమ్మాయిల్లాగా ఉంటే ఎంత బావుండనిపిస్తుంది. అబ్బాయిల్లాగా స్వేచ్ఛగా ఉండే అవకాశం మనకెందుకు లేదు. వాళ్ళిష్ట మున్న బట్టలు వేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడే బైటికెళ్ళొచ్చు. ఆటలాడవచ్చు. చీకటి పడ్డదాకా ఇంటికి రాకపోయినా అడిగే వాళ్ళుండరు. మనకట్టాకాదు. అమ్మానాన్నా తిడ్తారు. ఒక వేళ వాళ్ళుతిట్టేవాళ్ళు కాకపోయినా మనకే భయంగా ఉంటుంది. రోడ్డువైపు వెళ్ళాలంటే ఎవరుంటారో, దోవలో ఏం జరుగుతుందో అని జంకు, ఆ చౌరస్తా దగ్గర అబ్బాయిలు వెకిలి చూపులు చూస్తారు. వాళ్ళ వెకిలి మాటలూ, నవ్వులూ భరించాల్సి వస్తుంది. వాటన్నింటికంటే ఇంట్లోనే ఉంటే నయం అనిపిస్తుంది. అట్లా అని మనలో కొంతమందికి బైటికెళ్ళకుండా కుదరదు. అమ్మ అవీ ఇవీ తెచ్చిపెట్టమని దుకాణానికో, దేనికో పంపుతూనే వుంటుంది. తెచ్చిపెట్టకపోతే తను మాత్రం ఒక్కతే ఏం చేస్తుంది. అన్నయ్య, నాన్న ఎవరూ అమ్మకు సహాయం చేయరు. ఇంత చేసినా కుటుంబం దృష్టి అంతా మగపిల్లలమీదే ఎందుకు ఉంటుంది. మనకు అర్థంకాదు. మగపిల్లల చదువు, వాళ్ళ తెలివితేటలు మెచ్చుకోవటమే కాని, మన తెలివితేటల్ని మెచ్చుకోవటం తక్కువ. మనలో తక్కువైందేమిటి అనే సందేహం రాక మానదు. మనం సగం బాధ్యత తీసుకొని నిర్వహించకపోతే ఈ ఇల్లు గడుస్తుందా.
1985లో చేసిన పరిశీలన ప్రకారం ఆడపిల్లలు యుక్త వయసుకు వచ్చే సరికి కుటుంబ ఆర్థిక అవసరాలకు ఆసరాగా వాళ్ళు అందించే ఆదాయం దాదాపు రూ. 39,600/- ఉంటుంది.
బి. అందం అంటే ఏమిటి?
అందం అంటే ఆరోగ్యంగా ఉండటమే సాధారణంగా ఆడపిల్లల్లో ఎప్పుడూ ఇంకొకరితో పోల్చుకుంటూ బాధపడే గుణం వుంటుంది. మనలో లేని వాటి గురించి తపన. ఇది మగపిల్లల్లో కూడా ఉండచ్చు. కాని ఈ విషయం మనల్ని బాధ పెట్టినట్లు వాళ్ళని బాధించదు. టి.వి. లో, సినిమాల్లో హీరోయిన్ లను చూసి అలాగే ఉండాలనుకుంటాం. జుట్టు పొట్టిగా వుంటే పొడుగ్గా లేదని, సాపుగా వుంటే రింగులుగా లేదని, రొమ్ములు మరీ చిన్నవిగానో మరీ పెద్దవిగానో వుంటే అసహ్యంగా ఉన్నాయనీ, మరీ సన్నగా ఉన్నామని, మరీ లావుగా ఉన్నామనీ ఎల్లకాలం అనుమానం బాధిస్తుంది. కొంతమందికి తెల్లగా లేమని బాధ వుంటుంది. అట్లా అని పెద్ద కళ్ళు ఉన్నాయనో, జుట్టు బాగుందనో నలుగురు పొగిడితే గర్వపడమని కాదు. రెండురకాల భావాలతో ఘర్షణ మనలో నిరంతరం రగులుతూ ఉంటుంది. టి.వీ. వ్యాపారప్రకటనలలో అందంగా ఆడపిల్లలు కన్పిస్తున్నారు. సాధారణంగా వాళ్ళు గొప్పింటిపిల్లలలాగా ఉంటారు. అవి మనలాంటి వాళ్ళ గురించి కాదు. దీనికి తోడు వ్యాపార ప్రకటనలు ఇంకా అందంగా ఉండాలంటే ఏం కొనాలో చెప్తూనే ఉంటాయి. అవన్నీ కొనకుండా అసలు అందంగా ఉండటమే అసాద్యం అనుకునే దారుణ పరిస్థితి ఏర్పడుతుంది. కాని అవన్నీ కొనాలంటే ఎందరికి సాధ్యం. ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి. అట్లాగే ఈ రోజుల్లో ప్రతి వీధికి బ్యూటీ పార్లర్లు వచ్చేశాయి. పక్కింటి సుధ, ఎదురింట్లో అమీనా అక్కడికి వెళ్తుంటారు. నేను వెళ్దామంటే ఎట్లా. అసలే బియ్యం కొనడానికి డబ్బుల్లేక అస్తమానం అమ్మ విసుక్కొంటుంటే తనని బ్యూటీపార్లర్ కి డబ్బులు ఇవ్వమని ఎట్లా అడగటం. అని మనసులోనే కోర్కెలు దాచుకునే అమ్మాయిలు చాలామంది. బలం ఇచ్చే భోజనం తినటం, రోజూ వ్యాయామం చేయటం శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుకోవడం – ఇవన్నీమనని అందంగా తయారు చేస్తాయి. అందానికి ఒకే నమూనా వుండాల్సిన పని లేదు. ఎన్నో తీర్లు వున్న వ్యక్తులు అన్ని రకాలుగాను అందంగా కన్పించవచ్చు. ఆ విషయం గుర్తించిన రోజు మనంత సంతోషంగా వుండే వ్యక్తులు వేరే వుండరు.
మంచి భోజనం, వ్యాయామాలతో ఆరోగ్యంగా వుండడం అందానికి, ఆకర్షణీయంగా కల్పించడానికి అత్యవసరం అని మనం గుర్తించాలి.
సి. చదువు
ఆడపిల్లల చదువుకు వచ్చే ఆటంకా లు
- ఇంటి చాకిరీ, పసి పిల్లల్ని చూసుకొనే బాధ్యత
- ఇంట్లో మంచం పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకునే బాధ్యత
- కుటుంబానికి ఆసరాగా సంపాదించాల్సిన బాధ్యత. ఇంట్లోనే ఆర్థికంగా ఉపయోగపడే పనులు చేయడం. ఉదా. బీడీల పని, సిగరెట్ పీకలను ఒలవడం, అప్పడాల తయారీ, బట్టలు కుట్టడం, తల్లి పనిమనిషిగా పనిచేస్తే తోడుగా వెళ్ళడం, తల్లికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆమె స్థానంలో పనికి వెళ్ళడం, జరీ ఎంబ్రాయిడరీ పని.
- బడులు దూరంగా వుండి వెళ్లాల్సి వస్తే, ఆడపిల్లలకు రోడ్లమీద ఎదురయ్యే సమస్యలు, పిల్లల్ని వేధించే మగవాళ్ళు, శారీరకంగా వాళ్ళ మీద జరిగే దౌర్జన్యాలు, బలాత్కారానికి ప్రయత్నాలు. ఆడపిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మటం వంటి దౌర్జన్యాలు.
- ఆడపిల్లల చదువుతో సమాజానికేం ఉపయోగం అని ప్రశ్నించే సాంఘిక ధోరణులు.
- చదువుకున్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావని, కట్నాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తల్లిదండ్రుల భయం.
- స్కూలుకు వెళ్ళినా సరిగా పాఠాలు చెప్పని పంతుళ్ళు, వాళ్ళ దెబ్బలకు భయపడి పోయిన పిల్లలు
- కాలకృత్యాలకి అనువైన వాతావరణం లేకపోవడం.
స్కూలుకు వెళ్ళని ఆడపిల్లల సంఖ్య ఎక్కువ అనుకున్నా, కొంతకాలం వెళ్ళి పైనచెప్పిన కారణాల మూలంగా మానేసిన పిల్లల సంఖ్య అబ్బాయిలకంటే అమ్మాయిలది రెట్టింపు.
డి. ఆరోగ్యం
వైద్య వ్యవస్థకు ఈ వయసులో ఉన్న ఆడపిల్లలు వైద్య పరమైన అనాధలు. వాళ్ళు అటు పీడియాట్రిషన్లు (పిల్లల డాక్టర్లు) పట్టించుకునే పసిపిల్లలూ కాదు. అలా అని గైనకాలజిస్టులు (స్త్రీల సమస్యల వైద్యులు) పట్టించుకునే స్త్రీలూ కారు. చనిపోయే ఆడపిల్లల సంఖ్య మగపిల్లల కంటే ఎక్కవ వుండటం అందరికి తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో కొంత వరకు ఈ సంఖ్య తగ్గినా మగపిల్లలు ఆడపిల్లల నిష్పత్తి చూస్తే ఇప్పటికీ ఆడపిల్లల సంఖ్య ప్రతి వెయ్యి మంది మగపిల్లల కంటే తక్కువే వుంది. సరైన పోషకాహారం లేని కారణంగా బలహీనంగా ఉండి జబ్బులపాలైన ఆడపిల్లల సంఖ్య మగపిల్లల కంటే రెండు, మూడు వంతులు ఎక్కువ. ప్రభుత్వ ఆస్పత్రులు (ఉచిత వైద్యం దొరికే స్థలాలు) సాధారణంగా అందరికీ అందుబాటులో ఉఁటాయనుకుంటాం. కాని ఇక్కడ కూడా వైద్యానికి వచ్చిన వాళ్ళలో కూడా అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కవ సంఖ్యలో కనపడడం విచిత్రం. దీన్ని బట్టి కనీసం బీద కుటుంబాలకు చెందిన వాళ్ళలో తల్లిదండ్రులు ఆడపిల్లలకంటే ఎక్కువ మగపిల్లల మీద శ్రద్ద కనపరుస్తారని అర్థమవుతుంది. బహుశా రవాణా ఖర్చుకు తగిన డబ్బులేకపోవడం లేదా ఆడపిల్లల్ని ఆస్పత్రిలో చేరిస్తే ఇంట్లో ఇబ్బందులు కలగటమో కారణం కావచ్చు. సరైన పోషకాహారం అందకపోతే శరీరానికి ఏర్పడే అనారోగ్యాలలో ప్రధానమైనది రక్తహీనత (ఎనీమియా) ఆడపిల్లల్లో 98% అని గుజరాత్ లో చేసిన ఒక పరిశోధ తేల్చింది. వీటికి కారణాలు ఎన్నో రకాలు. అయితే అందులో ప్రధానం పోషకాహారం లేకపోవడమే. ఆంధ్రలో చనిపోయిన స్త్రీల సంఖ్యలో 1.2% ప్రసవ సమయంలో చనిపోయే వాళ్ళుంటారు. గర్భిణీ స్త్రీలలో నూటికి డైబ్బైమంది రక్తహీనతతో బాధపడేవాళ్ళే. అందులో వాళ్ళు తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం వల్ల కడుపులో బిడ్డకి, తల్లి ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. పట్టణాలలోని స్త్రీలలో 37% మందికి కడుపులో వున్నప్పుడు పోషకాహార లోపం వలన అనారోగ్యాలు సంభవిస్తాయి. మూడు వంతుల్లో ఒక వంతు పిల్లలు, పుట్టినప్పుడు ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉంటారు. దీనివల్ల వాళ్ళు ఎన్నో రకాల జబ్బులకు గురవుతారు.
ముట్టు లేదా బైటుండటం
సాధారణంగా పన్నెండు, పదమూడు సంవత్సరాల వయసులో ముట్లు రావడం మొదలవుతుంది. కొంతమందికి తొందరగా అంటే పది పదకొండు సంవత్సరాలకే వస్తే మరికొందరికి ఆలస్యంగా రావచ్చు. పధ్నాలుగు, పదిహేను సంవత్సరాల వరకు రాకపోవచ్చు. సాధారణంగా మనం తినేతిండిమీద, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న పిల్లల్లో తొందరగానూ, అనారోగ్యంగా ఉండి బలహినంగా ఉండే పిల్లల్లో ఆలస్యంగానూ వచ్చే అవకాశం ఉంది. ఈ వయస్సు వచ్చే వరకు ఆడపిల్లల శరీరంలో మార్పులు రావటం మొదలవుతుంది. రొమ్ములు పెద్దవవుతాయి. మర్మావయవముల దగ్గర, చంకలలో వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. భుజాలు వెడల్పవటం నడుం భాగం సన్నపడటం, నడుము కింద భాగం వెడల్పు కావటం మొదలవుతుంది. శరీరం పొడుగవుతుంది. ఇవి బయట కన్పించే మార్పులు. అట్లాగే శరీరం లోపల కూడా కొన్ని మార్పులు రావటం జరుగుతుంది.
స్త్రీలలో ప్రత్యేకంగా ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోను అండాశయాలలో తయారుకావటం ప్రారంభమవుతుంది.
శరీరంలో ఒక రకమైన అలజడి మొదలవుతుంది. ఈ సందర్భంలోనే మగపిల్లల పట్ల ఆసక్తి, ఆకర్షణ కూడా పెరుగుతాయి. మగపిల్లలలో కూడా ఈ వయసులోనే మార్పులొస్తాయి. వాళ్ళ గొంతు బొంగురుగా అవుతుంది. సాధారణంగా శరీరం పొడుగు కావటం, వెడల్పుకావటం, కాళ్ళమధ్య, పురుషాంగం మొదట్లోనూ, చంకలలో, ఛాతీ మీద వెంట్రుకలు రావటం జరుగుతంది. మూతిమీద, గడ్డంమీద కూడా జుట్టు ఒస్తుంది. పురుషాంగం పరిమాణం పెరుగుతుంది.
టెస్టోస్ట్రోన్ అనే హార్మోన్ మగపిల్లల శరీరంలో తయారవుతుంది.
పిల్లలు కలగటానికి అవసరమైన వీర్యం, వీర్యకణాల (మగకణాలు) తయారీ మొదలవుతుంది. ఈ వయసులోనే ఆడపిల్లలకి, మగపిల్లలకి ఒకరిపట్ల ఒకరికి ఆసక్తి, ఆకర్షణ పెరుగుతాయి.
బహిష్టు అంటే శరీరంలో నిజానికి ఏం జరుగుతుంది? చిన్న పిల్లలకు తెలియకూడదని రహస్యంగా దీన్ని పెద్దవాళ్ళు కప్పిపెట్టే ప్రయత్నం చేయడం మామూలుగా జరిగే విషయం. కాని మనం ఎన్నోసార్లు అమ్మావాళ్ళు ఇబ్బందిగా కూచున్న చోటనుంచి లేచి వెళ్ళడం, తను కూర్చున్నచోట రక్తం మరక ఉండడం, లేదా తన చీరకు వెనక రక్తం మరకలుండటం గమనించి ఉంటాం. అడిగితే నీకెందుకివన్నీ, అన్నీ పెద్ద మాటలు అని అమ్మ విసుక్కోవటం మనం చూసే ఉంటాం. తెల్సుకోవాలని కుతూహలం ఒకపక్కా, రక్తం చూసి ఒకరకమైన అసహ్యం ఇంకొక పక్కా మనని వేధిస్తాయి. ముట్టు రక్తం అంటే మురికి రక్తం, చెడురక్తం అనే ఆలోచన మనలో బలంగా ఉంటుంది, దానికి తోడు ముట్టు అయిన స్త్రీలు గుడికి వెళ్ళకూడదనీ, నమాజు చేయకూడదని, ఖురాన్ చదవకూడదనీ, తలలో పూలు పెట్టుకోకూడదనీ, ఊరగాయలు ముట్టుకుంటే బూజు పడుతుందనీ, చెట్లను ముట్టుకుంటే వాడిపోతాయని, కొత్త బట్టలు కట్టుకోకూడదనీ, రకరకాల నిబంధనలు మనపైన విధిస్తారు. కాని మళ్ళీ సరైన వయసులో ముట్టుకావటం మొదలుకాకపోతే ఆందోళన మొదలవుతుంది. బహిష్టు కాకుండా ఆడపిల్లలకి సంతానం కలగదు.
అయితే నిజానికి బహిష్టు అంటే ఏమిటి? ఆడపి ల్లకు పుట్టినప్పటినుంచి అండాశయాలలో పూర్తిగా ఎదగని గుడ్లతో ఉన్న కణాల ఉండలు దాదాపు మూడు నాలుగు లక్షలుంటాయి. వీటిని ఫాలికల్స్ అంటారు. (మొత్తంగా గర్భధారణ దశలో ఇందులో మూడు నుండి ఐదు వందలు మాత్రమే పక్వం చెందుతాయి. మిగతావన్నీ పక్వదశకు ముందే నశిస్తాయి). పిల్లల్ని కనగలిగేదశలో (పన్నెండు, పదమూడు సంవత్సరాల నుంచి నలభై, యాభై సంవత్సరాల వరకు) శరీరంలో తయారయ్యే ఈస్ట్రోజన్ హార్మోనుల మూలంగా నెలకొక్క గుడ్డు చొప్పున పక్వం చెందుతుంది. అండం అండాశయం నుంచి బయటికి రావటాన్ని ఓవ్యులేషన్ అంటారు. అయితే అండం విడుదల అయిన ఒక్కరోజులో మగకణంతో కలిసి ఫలదీకరణ జరిగినట్లయితే గర్భం వస్తుంది. అది జరగకపోతే అండం గొట్టాల (అండవాహికల) లోనే నశించి అప్పటికే గర్భాశయం గోడలనంటుకుని ఇన్ని రోజులుగా పెరిగిన పొర (కార్పస్లూటియం)తో, యోని ద్రవాలతో కలిసి రక్తం రూపం లో బయటికి వచ్చేస్తుంది. దీన్నే మనం ముట్టు లేదా నెల అంటాం. ఒక వేళ మగకణంతో కలిస్తే అదే అండం గర్భాశయం గోడకంటుకుని పొర సహాయంతో పిండంగా (పాపగా) ఎదగడం మొదలవుతుంది. పొరనే తర్యాత మాయ అని పిలుస్తాం. ఈ పొర ఎదగడానికి కూడా ఆడపిల్లల్లో ఉండే ఈస్ట్రోజన్ అవసరం. ఫలదీకరణ జరిగితే పొర బలపడటానికి, రక్తం సరఫరా కావటానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అవసరం అవుతుంది. ఈ రెండు రకార హార్మోనులను ఫాలికిల్, పొరలు దాదాపు 12 రోజుల పాటు తయారు చేస్తాయి. గర్భం రాకపోతే 12 రోజుల తర్యాత వాటి తయారీ క్రమంగా తగ్గుతుంది. అదే సమయంలో గర్భాశయంలో రక్తనాళాలు వాటంతటవే మూసుకుంటాయి. ఇప్పటి వరకు పొరకు అందిన రక్తం పొర, అండంతో పాటు బయటికి యోని ద్వారా వచ్చేస్తుంది. (వెనక పేజీలో బొమ్మ చూడండి).
అండం విడుదల కావటం (ఓవ్యులేషన్) ప్రతినెలా జరుగుతుంది. దాదాపు 45 సంవత్సరాల వరకు కొనసాగి ఆ తర్వాత ఆగిపోతుంది. ఆగిపోవటాన్ని ముట్లుడిగి పోవటం (మెనోపాజ్) అంటారు. స్త్రీ గర్భంతో వున్న సమయంలో అండం విడుదల తాత్కాలికంగా ఆగుతుంది.
కొన్ని సార్లు రక్తం గడ్డలుగా ఉండి అది గర్భాశయ ద్వారం నుంచీ బయటికి రావటానికి వీలుకాక పొత్తి కడుపులో నొప్పి రావచ్చు. సరైన పోషకాహారం లేక, కండరాలు బలంగా లేకపోవటం ఒక కారణం కావచ్చు. వ్యాయామం లేకపోవటం ఒక కారణం. ఏదేమైనా సాధ్యమైనంతవరకు మందుగోలీలు మింగకుండా ఉండటం మంచిది. పెరుగు, అరటిపండు కలిపి తింటే నొప్పి తగ్గుతుందని కొందరి నమ్మకం. హోమియోపతి, ఆయుర్వేదం వంటి పద్ధతులు వెతకటం మంచిది. కొన్ని రకాల యోగాసనాలు నొప్పిని తగ్గిస్తాయంటారు. వేన్నీళ్ళతో స్నానం చేయగలిగితే హాయిగా ఉంటుంది. అట్లాగే వేడినీళ్ళతో కాపడం కూడా కొంతబాధని తగ్గిస్తుంది. కొంతమందికి ఏదైనా పనిలో లీనం అయితే బాధ మర్చిపోగలుగుతారు. కొంతమందికి కడుపులో విపరీతంగా తిప్పటం, వాంతులు కావటం జరుగుతుంది. బహిష్టు ప్రారంభం అయిన కొద్దికాలంలో ఇవన్నీ వాటంతటవే సర్దుకునే అవకాశం ఉంది.
రక్త స్రావం గురించి ఏం చేయాలి ? మనని మనం ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి ? గుడ్డలు వాడటం ఇది చెడు రక్తం అనే ఆలోచన మనలో ఉండటం కారణంగా చాలామంది ఈ గుడ్డల్ని ఎక్కడో పూడ్చి పెట్టడం ఫలితంగా సూక్ష్మజీవులు ఏర్పడ్తాయి. మళ్ళీ అవే గుడ్డల్ని వాడినప్పుడు దురద, మంటలతో ఇన్ ఫెక్షన్లు రావటం మొదలవుతుంది. దీనికి వాడే గుడ్డల్ని శుభ్రంగా సబ్బుతో ఉతికి ఎండలో ఆరవేయాలి. ఎవరూ చూడకూడదని నీడలో, చాటుగా ఆరేస్తాం. అది అసలే మంచిది కాదు.
ఎండలో ఆరేయటం మూలంగా సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి. ఆ తర్వాత శుభ్రమైన చోట ఒక కాగితం సంచిలో పెట్టి దాచి పెట్టవచ్చు.
దీనికి నూలు బట్టలు పాతవి మెత్తటివి వాడితేనే మంచిది. నైలాన్, పాలియెస్టర్ వంటివి వాడితే రక్తం పీల్చకోక కాళ్ళ వెంబడి కారి, తొడలు పదునుగా అయి పుండుపడి దుర్భరంగా తయారవుతుంది. అందుకే ప్రత్యేకం గా పాత బట్టలు నూలువి కొన్ని ఉతికి మడతలు వేసుకుని తయారుగా ఉంచుకోవాలి. సాధ్యమైనన్ని నీళ్ళు పెట్టి యోని ప్రాంతాన్ని కడిగి పొడిగా తుడిచి శుభ్రంగా ఉంచుకోవాలి. చాలాసార్లు వాడిన బట్టలు కూడా గట్టిగా అట్టల్లాగా తయారై బాధ కలిగిస్తాయి. డిటర్జెంట్ సబ్బులకంటే పసుపుపచ్చ, నల్లరంగు సబ్బులు వాడ్తే మరకలు, మురికి త్వరగా పోతాయి. అవకాశం ఉంటే కొద్దిసార్లు వాడిన బట్టలను కాల్చేసి వేరేవి వాడటం మంచిది.
దూది / సానిటరీ నాప్ కిన్స్ డబ్బు చేతిలో ఉంటే దూదికానీ, ప్యాడ్స్ కానీ కొనుక్కోవచ్చు. కాని ఇవి సాధారణంగా మరీ బిగుతుగా కానీ, వదులుగా కానీ లేకుండా మనకి సరిపోయే సైజు లాగులు (పాంటీలు) వేసుకునే అవసరం ఉంటుంది. ఆస్పత్రుల్లో వాడే శుభ్రమైన (స్టెరిలైజ్డ్) దూది 50 గ్రాముల నుంచి 400 గ్రాముల దాకా ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంది. ఎక్కువ రక్త స్రావం లేని వారికి 400 గ్రాముల ప్యాకెట్ దాదాపు 25 రూపాయలు వుండి రెండు, మూడు నెలల వరకు వస్తుంది. దూది ముక్కలుగా చేసి ఉపయోగించాలి. కదలకుండా ఉంచటానికి వేరే గుడ్డ ముక్క గాని, అతికి నట్టుగా వుండేలాగులు గానీ ఉపయోగించాలి. దూది మడతలు మారుస్తూ వాడవచ్చు. తర్వాత పాత కాగితంలో చుట్టి చెత్త కుండీలో పారేయాలి. పారేసే స్థలం లేకపోతే దూదిని కాల్చేయటం సులభం. కేర్ ఫ్రీ, స్టే ఫ్రీ, విస్ పర్, ఫ్రీడమ్ పేర్ల మీద తయారవుతున్న ప్యాడ్స్ ఇవి. ఇవాళ రేపు టి.వీ. వ్యాపార ప్రకటనల్లో కూడా వీటిని చూపిస్తున్నారు. కాని అవి ఎట్లా వాడాలో చూపించరు. ఈ ప్యాడ్ తడిని పీల్చుకునే గుణం కల నారతో తయారు చేస్తారు. గాయాలకు కట్లు కట్టే గాజు గుడ్డతో ప్యాడ్ కప్పబడి వుంటాయి. కొన్ని రకాల ప్యాడ్లలో ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుంది. కొన్ని రకాలలో బెల్ట్ ఉంటుంది. మరికొన్ని లాగులలో (పాంటీలు) పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. చాలా సేపు మార్చకుండా ఉంచుకుంటే పూర్తిగా తడిసిపోయి ఉండలుగా అయిపోయే అవకాశం ఉంది.
వాడిన తర్వాత పాత కాగితంలో చుట్టి చెత్త కుండీల్లో పారవేయాలి. లెట్రిన్ లలో ఎంత మాత్రం వేయకూడదు.
లెట్రిన్స్లో వేస్తే డ్రైనేజికి అడ్డుపడి పెద్ద సమస్య అవుతుంది. దూది, గాజు గుడ్డ కొనుక్కుని ప్యాడ్స్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఖర్చు కూడా తగ్గుతుంది.
బహిష్టు – ఋతుక్రమం
ఆడపిల్ల పెద్దమనిషి అయిందని అంటారు. అంటే ఏమిటి?
అమ్మాయిలో 8-10 సం!!ల నుండే మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలయ్యే యఫ్.యస్.హెచ్. మరియు ఎల్.హెచ్. అనే రెండు హార్మోనులు అండాశయాలను ఉత్తేజపరిచి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టరోను అనే రెండు రకాల హార్మోనులను ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా అమ్మాయిలలో 10-12 సం!!ల మధ్య కాలంలో ఋతుస్రావం మొదలవుతుంది. మొదటిసారి ఋతుస్రావం జరగటాన్ని పెద్దమనిషి కావటం అని అంటారు.
ఋతుచక్రం అంటే ఏమిటి ?
స్త్రీలలో బహిష్టు దాదాపు 28+7 (ఏడురోజులు అటు ఇటు) రోజులకొకసారి ప్రతి నెల జరుగుతుంది. దీనిని ఋతుచక్రం అని అంటారు. ప్రతి స్త్రీకి ఇలా దాదాపు 450 ఋతుచక్రాలు తమ జీవిత కాలంలో జరుగుతాయి. దాదాపు 45-50 సం!!ల వయస్సు వచ్చేవరకు ఇది ప్రతినెలా జరుగుతుంటుంది. ఋతుచక్రం మధ్య కాలంలో స్త్రీల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి.
బహిష్టు అసలు ఎందుకు జరుగుతుంది ?
ప్రతినెలా స్త్రీ శరీరంలో విడుదలయ్యే అండం గర్భసంచిలో నాటుకోవడానికి అనుగుణంగా గర్భసంచిలోని లోపలి పొర మందంగా, మెత్తని స్పాంజిలాగా ఎక్కువ రక్తనాళాలలో ఉబ్బుతుంది. గర్భధారణ జరగకపోతే గర్భసంచిలోని ఈ మెత్తటి పొర (ఎండో మెట్రియమ్) ఊడిపోయి, రక్తనాళాలు చిట్లి రక్తస్రావం యోని ద్వారా బయటకు వస్తుంది. దీనినే బహిష్టు లేక ముట్టు అంటారు. గర్భధారణ జరిగితే ముట్టు రాదు.
కొంత మంది అమ్మాయిలు బహిష్టు సమయంలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఎందువల్ల? అలాంటి వారికి ఏం చేయాలి?
గర్భసంచి లోపలిపొర అయిన ఎండోమెట్రియమ్ మరియు రక్తము బయటికి రావాలంటే గర్భసంచి గోడలు గట్టిగా ముడుచుకు పోవాలి. ఇలా ముడుచుకొని రక్తాన్ని బయటికి నెట్టే ప్రయత్నంలో గర్భసంచి కండరాలు గట్టిగా అవుతాయి. దీనివలనే అమ్మాయికి బహిష్టు సమయంలో కడుపునొప్పి, నడుము నొప్పి కూడా ఉంటాయి. కొంతమందిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి నివారణకు వేడినీటి సంచితో పొత్తి కడుపుపైన నడుముపైన కాపడం పెట్టవచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్నవారు పారాసిటమాల్ గాని, బెరాల్గాన్ మాత్రలు గాని వాడి ఉపశమనం పొందవచ్చు. ఈత, తేలికపాటి వ్యాయామాల వలన కూడా సాంత్వన కలుగుతుంది.
బహిష్టు సమయంలో స్నానం చేయకూడదని, వస్తువులు అంటుకోకూడదని అంటారు. నిజమేనా?
ఇది నిజం కాదు. బహిష్టు సమయంలో స్త్రీలు మరింత పరిశుభ్రంగా ఉండటానికి రోజూ రెండు పూటలు స్నానం చేస్తుండాలి. రక్తం పీల్చడానికి వాడే బట్టలను తరచుగా మార్చాలి. శుభ్రమైన శానిటరీ నాప్ కిన్స్ ను వాడటం వలన స్త్రీలకు ఈ సమయంలో వచ్చే సాధారణ జననావయవ అంటువ్యాధులు రాకుండా రక్షణ పొందవచ్చు. ఇంట్లో సాధారణంగా చేసుకొనే పనులు అన్నీ చేసుకోవచ్చు. అన్ని వస్తువులను అంటుకోవచ్చు. అంటుకొన్నందు వలన ఏమీకాదు.
నెలనెలా బహిష్టు క్రమంగా రాని స్త్రీలలో ఈ చెడు రక్తమంతా శరీరంలోనే ఉండి గడ్డ కడుతుందని అంటారు. ఇది నిజమేనా?
ఇది నిజం కాదు. బహిష్టు సమయంలో వచ్చే రక్తం చెడు రక్తం కాదు. ఆ నెల గర్భధారణ జరుగుతుందేమోనని మందంగా తయారైన గర్భసంచి లోపలి పొర ఎంతో విలువైనది. గర్భధారణ జరిగితే అందులో నుండే కదా శిశువు వృద్ధి చెందేది... కాని ఆ నెల గర్భధారణ జరగకపోతే దీని అవసరం లేదు. అందుకే ఆ పొర ఊడిపోయి, దానితోపాటే కొన్ని రక్తనాళాలు పగిలి కొద్దికొద్దిగా రక్తం బయటకు వస్తుంది. క్రమంగా ప్రతినెల బహిష్టు కాకపోవటం అంటే కేవలం హార్మోన్ల సమతుల్యత లేకపోవటం అని అర్థం. అంతేగాని ఈ రక్తమంతా శరీరంలో నిల్వ ఉండి గడ్డలుగా కట్టుకోవటమనేది జరగదు.
శానిటరీ నాప్ కిన్ ఏమిటి?
రక్తం ఎక్కువ పీల్చుకొనే శక్తి కలిగిన శానిటరీ నాప్ కిన్ మెత్తటి దూది లేదా నూలుతో చేయబడింది. ఇంట్లోనే మెత్తటి నూలు బట్టతో, దూదిని ఉపయోగించి తయారుచేసుకోవచ్చు కూడా. రక్తస్రావం ఎక్కువ అయితే రోజుకి 3 నుండి 4 పాడ్ లు వాడవలసిన అవసరం ఉంటుంది. జాగ్రత్తగా వాడినచో, ఇబ్బందులు ఉండవు.
ఋతుస్రావం 10 రోజుల వరకు అయితే ప్రమాదమా?
ఎక్కువ రోజులు లేదా తక్కువ రోజులు ఋతుస్రావం జరగటాన్ని డిస్ ఫంక్షనల్ యుటిరైస్ బ్లీడింగ్ అంటారు. 50% ఆడవాళ్ళు 25-40 సంవత్సరాలు మధ్యలో దీని వలన బాధపడుతుంటారు. దీనికి ముఖ్య కారణాలు అండం విడుదల కాకుండానే బ్లీడింగ్ కావటం, కార్పస్ లుటియమ్ అనే హార్మోను సరిగ్గా పని చేయకపోవటం, గర్భాశయంలో పొరలు ఏర్పడటంలో లోపాలు, గర్భాశయంలో కణుతులు ఉండటం వలన కూడా అధిక రక్తస్రావం జరగవచ్చును. ఇంతేగాక గర్భాశయం పొరలలో అంటు సోకడం, కాపర్-టి వలన, గర్భాశయం క్యాన్సర్, రక్తంలో లోపాలు, స్థూలకాయం, ఎండోక్రైన్ గ్రంథులకు సంబంధిచిన రోగాలు లేదా బ్లడ్ క్యాన్సర్ కూడా అధిక రక్తస్రావానికి దారి తీస్తాయి.
ఋతుస్రావం ఎక్కువగా జరగటం వలన అపెండిసైటిస్ వస్తుందా?
ఋతుస్రావానికి, అపెండిసైటిస్ రావడానికి ఎటువంటి సంబంధము లేదు. ఋతుస్రావం స్త్రీ శరీరంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. కాని అపెండిసైటిస్ ఆడ-మగ ఎవరికైనా రావచ్చును.
శరీరం నుండి దుర్వాసన వస్తుంటే ఏం చేయాలి?
చంకల నుండి, గజ్జల నుండి శరీర ఇతర భాగముల నుండి చెమట వల్ల దుర్వాసన రావచ్చును. ఇది మన శరీరంలోని గ్రంథుల ప్రభావం. నైలాన్ సింథటిక్ తో తయారుచేసిన వస్త్రాల వాడకం వలన, గాలి తగిలే అవకాశం లేక కూడా చర్మం వాసనకు గురవుతుంది. శరీర దుర్వాసనకు ఇతర కారణాలు. శరీరంపై ఏర్పడ్డ గాయాలు అపరిశుభ్రత. బహిష్టు కాలంలో రక్తస్రావం దుర్వాసన కాకుండా ఉండాలంటే రోజూ స్నానం చేయాలి. కాటన్ దుస్తులు వాడాలి. ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు వాడాలి. డియోడరెంట్లు స్ప్రేలు కూడా వాడవచ్చు.
మెనోపాజ్ అంటే ఏమిటి?
స్త్రీలలో బహిష్టు క్రమంగా రావడానికి కారణమైన స్త్రీ హార్మోనులు (ఈస్ట్రోజన్, ప్రొజె, టరోన్) వయస్సుతో పాటే క్రమంగా తగ్గిపోవటం జరుగుతుంది. అండాశయంలోని అండములు తగ్గిపోతాయి. 45-50 సంవత్సరాల వయస్సులో బహిస్టు రావటం క్రమంగా ఆగిపోతుంది. దీనినే మెనోపాజ్ అంటారు. దీనిని ముట్లు ఉడిగిపోవటం అని కూడా అంటారు. ఈ మెనోపాజ్ వయస్సు అందరి లో ఒకేలాగా ఉండదు. కొందరికి 46వ సవత్సరంలో మొదలై 49వ సంవత్సరంలో పూర్తిగా ఆగిపోవచ్చు. కొందరికి 50వ సంవత్సరంలోనే మొదలుకావచ్చు.
మెనోపాజ్ లో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు ఏమిటి?
ఈ దశలో స్త్రీలకు ముఖంలోను, మెడభాగంలోనూ శరీరంలో నుండి వేడిగాల్పులు, వీచినట్లు అన్పిస్తుంది. వీటినే హాట్ ఫ్లషస్ అంటారు. కొందరికి రాత్రిపూట నిద్రపట్టక మానసిక కృంగుబాటుకి లోనవుతారు. సెక్సుపట్ల ఆసక్తి తగ్గుతుంది. యోనిస్రావాలు తగ్గి సెక్సు సమయంలో ఇబ్బంది అనిపిస్తుంది. కొందరిలో గుండెదడ, చెవులలో హోరుమనే శబ్దాలు వస్తాయి. ఎక్కువ విసుక్కొంటారు. నడుమునొప్పి, కీళ్ళనొప్పులు మొదలవుతాయి. ఎముకలలో కాల్షియం సాంద్రత తగ్గి చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరుగుతుంటాయి. కొంతమందికి చర్మం పొడిబారిపోవడం, వెంట్రుకలు పల్చబడటం జరుగుతుంది. హార్మోన్లు లోపాల వల్ల అవాంఛిత రోమాలు పెరుగుతాయి. పై లక్షణాలు అందరికీ ఉండకపోవచ్చు, ఈ లక్షణాలు కనబడకుండా కొందరు స్త్రీలు సంప్రదించి హోర్మోను చికిత్స పొందుతారు.
ఋతుస్రావం – సంరక్షణ చర్యలు
యవ్వనదశలో ప్రవేశించక ముందే ఆడపిల్లలకు ఋతుస్రావం, సంరక్షణ చర్యల గురించి వివరించాలి. బట్టలను శుభ్రంగా ఉతికి ఆరబెట్టి జాగ్రత్తగా దాచుకోవాలి. శుభ్రమైన బట్టను గాజుగుడ్డలో చుట్టి ప్యాడ్ మాదిరి తయారచేసుకోవాలి.
బిడ్డను కనటం అంటే ఏమిటి
మనం ఎట్లా పుట్టాం? తల్లి కడుపులో నుంచి వచ్చామని మనకు తెలుసు. కాని అది ఎలా జరిగింది. అనే వింత ప్రశ్న మనకు ఊహ తెలిసినప్పటి నుంచీ మనసులో మెదులుతూ ఉంటుంది. మనం అడిగితే ఇదిగో ఈ అమ్మ పొట్టనుంచి నువ్వు వచ్చావని దేవుడు నిన్నిక్కడ పెట్టాడని నవ్వులాట కంటుంటారు. మనం కూడా నిజమనుకుంటాం. మనకి పదకొండు పన్నెండు సంవత్సరాల వయసొచ్చే వరకు ఏవో చిన్నచిన్న విషయాలు అక్కడా ఇక్కడా వినుండటం, చూడటం జరిగింది. కాని వాటన్నింటి మధ్య లింకు దొరకదు. స్పష్టంగా ఇదీ సంగతి అని అర్థం కాదు. ఇప్పుడు ఆ లింకులేమిటో చూద్దాం. మన మనసులోని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో ఇక్కడ చూద్దాం. మన శరీర భాగాలు, లోపలి అంగాలు, మన శరీరాలు ఇలా ఎందుకిలా ఉన్నాయి? అబ్బాయిలు, అమ్మాయిలు వేరుగా ఎందుకుంటారు? వయసు వచ్చిన ఒక ఆడపిల్ల, మగపిల్లవాడు శారీరకంగా కలిస్తే ఒక కొత్త ప్రాణి ఎట్లా జీవం పోసుకుంటుంది వంటి వివరాలన్నీ ఎక్కడ కనిపిస్తాయి? జన్మించిన ప్రతిజీవి ఒక స్త్రీ, ఒక పురుషుడు కలవటం మూలంగానే. ప్రతి జీవి ఒక కణంగా ప్రారంభమై క్రమంగా ప్రాణం పోసుకుంటుంది. ఇంతకుముందు మనం ముట్టు గురించి మాట్లాడాం. అఁదులో అండాశయం నుంచి అండం విడుదలై గొట్టాలలో ప్రయాణిస్తుంది. విడుదలయిన ఒక్క రోజులో అది మగకణంతో కలిస్తే గుడ్డు తయారవుతుంది. దీన్నే ఫలదీకరణ లేదా ఫెర్టిలైజేషన్ అంటారు. అయితే ఈ మగ, ఆడ కణాలు ఎట్లా కలుస్తాయి? ఒక స్త్రీ, పురుషుడికి మధ్య శారీరకంగా సంబంధం ఏర్పడితేనే ఇది సాధ్యం. ఒక వేళ అండం విడుదలయిన ఇరవై నాలుగు గంటలలోపల మగకణంతో కలవకపోతే స్త్రీ శరీరంలో అండం కూడా రక్తంతో పాటు బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఆ నెలకి గర్భం రానట్టే అర్థం. గర్భం వస్తే తొమ్మిది నెలల పది రోజుల పాటు గర్భాశయంలో పెరుగుతుంది.
గర్భం రావటం గర్భం ఎలా వస్తుంది అన్న విషయం తెలుసుకున్నాం. గర్భం వచ్చి పాపను కనాలని నిర్ణయించుకున్న తర్వాత వెంటనే దాయీని లేదా ఆరోగ్య కార్యకర్తను కలవాలి. డాక్టరు దగ్గర కు వెళ్ళగలిగితే మరీ మంచిది. పూర్తి పరీక్షలు అన్నీ చేయించుకోవాలి. ముందుకంటే ఇపుడు శరీరానికి విశ్రాంతి అవసరం. అయితే మాములుగా చేసుకునే పనులు మానేయాలని కాదు. మరీ బరువైన పనులు చేయకుండా ఉంటే మంచిది. బండెడు బట్టలు ఉతకడం, బిందెల కొద్దీ నీళ్ళు మోయటం వంటి శ్రమతో కూడిన పనులు శక్తికి మించి చేయకూడదు. ప్రత్యేకమైన సమస్యలు ఉండి డాక్టర్ల సలహా ఇస్తే తప్ప పక్కమీద పడుకుని ఉండాలని రూల్ లేదు.
గర్భవతులైనప్పుడు శారీరకంగా, మానసికంగా ఎన్నోరకాల మార్పులొస్తాయి. పాప పుట్టడంతో మొత్తం జీవితమే మారిపోతుంది. పాప పూర్తి బాధ్యత మన పైనే పడుతుంది. ఈ బాధ్యతంతా నిర్వర్తించటానికి రాత్రీ, పగలనే భేదం ఉండదు. ఈ మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన విషయాల్ని తెల్చుకోవటం అవసరం. తల్లి కావాలనే ఒత్తిడి, సమాజపరమైన నిబంధనలు కొన్ని మనకు తెలియకుండానే మనపైన పనిచేస్తుంటాయి. గర్భం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందనుకునే అభిప్రాయం మామూలుగానే అందరికి ఉంటుంది. చాలా సార్లు మన కుటుంబాల్లో వాళ్ళు డాక్టర్ల దగ్గరకు వెళ్ళటం అనవసరం అని కొట్టి పారేస్తారు. కాని పరిస్థితి ఏదైనా విషమిస్తే అత్యవసరంగా గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తీసుకొని వెళ్తారు. ఇది అటు గ్రామాల్లో ఇటుపట్టాణాలలో కూడా జరుగుతుంది. ఈ పరిస్థితిలో మన దగ్గరివాళ్ళు – తోబుట్టువులు, స్నేహితులు – మన భయాల్ని, సందేహాల్ని పంచుకో గల్గే అవకాశం ఉండదు. పెళ్ళిళ్ళు కాగానే ఉన్న ఊరికి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య చాలా ఒంటరితనంతో బాధపడ్తాం. చాలామందికి భర్త సహకారం ఉండదు. మన భయాల్ని, సందేహాల్ని దాయీల్తో, ఆరోగ్య కార్యకర్తలతో, డాక్టర్లతో, నర్సులతో చెప్పినా, మన భావాల్ని అర్థం చేసుకోకపోవటం మూలంగానో, పనుల ఒత్తిడి మూలంగానో మనకు కావలసిన సమాచారం అందదు. మనకీ అడిగే ధైర్యం లేకపోవచ్చు. అందుకే దగ్గరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆహారం నిద్ర ఆరోగ్య విషయాల పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ఈ సమయంలో పుట్టింటివాళ్ళ ఆండ చాలా అవసరం. కొన్ని సార్లు తల్లిగారింటివాళ్ళు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వాళ్ళయితే మనకు కావాల్సిన విశ్రాంతీ, శ్రద్ధా దొరికే అవకాశం ఉంటాయి.
కావాల్సిన ఆహారం ఈ సమయంలో మన శక్తికోసం, కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మంచి ఆహారం అవసరం ఉంటుంది. అట్లాగే రోజూ కొంత వ్యాయామం కోసం నడిస్తే మంచిది. కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ తింటే పాప పెద్దగా అయి ప్రసవం కష్టమవుతుందని కొంతమంది భయపడుతుంటారు. అట్లా అని మరీ తక్కువ తిని పాప బరువు ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటే ఎన్నో రకాల అనారోగ్యాలకు గురి కావాల్సి ఉంటుంది. పుట్టిన పాప బరువు దాదాపు మూడు కిలోలు ఉంటే మంచిది. మన దేశంలో సాధారణంగా 2.7 కిలోల కంటే తక్కువ ఉంటారు. అందుకే మామూలుగా అవసరమైనవి తినే ప్రయత్నం చేయాలి. మనం రోజూ తినే భోజనంలో అన్నం లేదా గోధుమ రొట్టెలతో పాటు కొద్దిగా నూనె, నెయ్యి ఉండాలి. ప్రోటీన్లు కోసం, పెట్టగల్గితే గుడ్డు, పాలు, చేపలు, మాంసము లేదంటే పప్పు పెట్టాలి. ప్రోటీన్లే పాప ఎదగడానికి మాయ బలంగా ఉండడానికి, గర్భ సంచి గట్టిగా ఉండటానికి అవసరం. ఇంట్లో వాళ్ళు తినలేకపోయినా అనవసరమైన భయాలు ఉఁడకుండా ప్రత్యేకంగా కడుపుతో ఉన్నవారికి పెట్టడం అవసరం. ఆకుకూరలు కానీ, కాయకూరలుకానీ, ఏమైనా తినాలి. గర్భం మొదటిసారైనా, రెండోసారైనా ఆహారంలో మార్పు వుండాల్సిన పని లేదు. కూరగాయలు, పులుపు పండ్లు, పాలు పప్పుల లాంటి పదార్థాలలో శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బి, సి, డి లతో ఫోలిక్ యాసిడ్ అందుతాయి. ఇవి టానిక్ల రూపంలో కంటే ఆహార రూపంలో దొరకటం అవసరం. ఇప్పుడు శరీరానికి ఇనుము చాలా అవసరం. రక్తహీనత రాకూడదనుకుంటే ఇనుము అవసరం. పాప పుట్టిన తర్వాత తల్లి పాలు దొరికే వరకు సరిపోయేంత ఇనుమును తన కాలేయంలో దాచుకుంటుంది. దాని కోసం మన శరీరం నుంచి ఇనుమును తీసుకుంటుంది. గర్భసంచికి, మాయకు, రక్తానికి అన్నిటికి ఇనుము అవసరం. మనలో చాలామందికి గర్భం రాకముందే శరీరంలో రక్తం, ఇనుము తక్కువగా ఉంటాయి. పాప శరీరానికి సప్లై చేయటంతో అది మరింత తక్కువ అయిపోతుంది. అందుకే కడుపులో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఐరన్ గోలీలు వేసుకోమని డాక్టర్లు చెప్తారు.
గర్బంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన మందులు
- ఐరన్ ఫోలిక్ ఆసిడ్ తో కలిపిన మాత్రలు, టానిక్ (ఎనిమియా చూడండి) ఐదు నెలల నుంచి ప్రసవం అయ్యేవరకు తీసుకోవాలి.
- మల్టీ విటమిన్ మాత్రలు – రోజుకి ఒకటి చొప్పున ఐదు నెలల నుంచి ప్రసవం వరకు.
- కాల్షియం మాత్రలు (అవసరమైతేనే) – రోజుకి మూడు చొప్పున ఆరు నెలల నుంచి ప్రసవం వరకు తీసుకోవాలి.
- టెటనస్ టాక్సాయిడ్ సూదులు మొదటిది గర్భవతి అని తెలియగానే, రెండవది ఒక నెల తరువాత.
రక్తహీనత మరీ ఎక్కువైతే ప్రసవం చాలా ప్రాణాపాయం క్రింద మారవచ్చు. ముఖ్యంగా కాలేయం (లివర్), మాంసం, ఆకుకూరలు తినగల్గితే మంచిది. మొదటి మూడు నెలలు చాలా మందికి వికారం, వాంతులు ఉండడం మూలంగా భోజనం చేయాలన్పించక బరువు తగ్గడం జరుగుతుంది. దాని తర్వాత కాస్త జాగ్రత్తగా అవసరమైనవి తినటం మంచిది. మూడవ నెల దాటిన తర్వాత ఐరన్ గోలీలు వేసుకోవాలి.
కాల్షియం ఇది తక్కువైతే నిద్ర లేకపోవటం, చికాకు, నరాల బాధ, కాళ్ళ నొప్పులు, గర్భసంచి నొప్పిగా ఉండడం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి బాధ కల్గటానికి కారణం శరీరంలో కాల్షియం సమృద్ధిగా లేకపోవటమే. ఆ లోటు తగ్గాలంటే పాలు, పప్పులు, పోపు గింజలు, మసాలా దినుసులు, ఆకు కూరలు, తైదలు (రాగులు) వంటి పదార్థాలు భోజనంలో ఎక్కువ ఉండాలి. కాల్షియం మాత్రలకంటే పాలు త్రాగటం మంచిది. కాల్షియం, ఇనుము గోలీలు ఒక్కసారే వేసుకోకూడదు. పొద్దున ఒక్కటి, సాయంత్రం ఒక్కటి వేసుకుంటే మంచిది.
గర్భంతో ఉన్నామని ఎలా తెలుస్తుంది?
నెల తప్పుతుంది. కడుపులో తిప్పటం మొదలు కావచ్చు. కొంతమందికి కొద్ది నెలల పాటు రక్త స్రావం అవుతూ నెల తప్పినట్టు తెలియదు. కొంతమందికి రొమ్ములు సున్నితం కావడం, వాంతులు అవటం, వికారం, కొన్ని రకాల వాసనలు పడక పోవటం ఉంటాయి. కొంతమందికి ఆవలింతలు నిద్ర ఎక్కువ అవుతాయి.
పరీక్షలు డాక్టర్ల దగ్గరకి వెళ్తే జననేంద్రియ పరీక్ష చేస్తారు. బరువు, పొడుగు, రక్తపోటు, మూత్రంలో అల్బూమిన్, పొత్తి కడుపు, గుండె, ఊపిరి తిత్తులు, రక్త పరీక్ష చేస్తారు. తర్వాత వెళ్ళిన ప్రతీసారీ బరువు, రక్తపోటు, పొత్తి కడుపు పరీక్ష, మూత్రంలో అల్బూమిన్ చూస్తారు.
పిండం ఎదుగుదల మొదట కొద్ది వారాలు పిండానికి మనిషి రూపం ఉండదు. కంటి రెప్పల కంటే చిన్న సైజులో ఉంటుంది. మూడో వారానికి గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఐదారు వారాలలో కళ్ళు, ముక్కు, నోరు, వెన్నెముక, పక్క ఎముకలు, కండరాలు రూపుదిద్దుకోవటం మొదలవుతుంది. ప్రతి క్షణం లక్షలాది కణాలు ఒకచోట చేరుతూ మెదడు రూపం తీసుకోవడం మొదలవుతుంది. ఎనిమిదో వారానికి గుడ్డు పిండంగా మారుతుంది. పన్నెండో వారానికి బొడ్డు తాడు గర్భసంచినుంచి పిండానికి రక్తం సరఫరా చేయటం మొదలువుతుంది. భోజనం చేయాలన్పించక బరువు తగ్గడంజరుగుతుంది . దాని తర్వాత కాస్త జాగ్రత్తగా అవసరమైనవి తినటం మంచిది. మూడవ నెల దాటిన తర్వాత ఐరన్ గోలీలు వేసుకోవాలి. ఐదో నెల వచ్చేటప్పటికి పాప కదిలిన ఫీలింగ్ తెలుస్తుంది. ఇపుడు దాని పొడువు కూడా ఇరవై రెండు సెంటీమీటర్లు ఉంటుంది. ఏడో నెల వచ్చేటప్పటికి పాప బరువు కిలో కంటే ఎక్కువే ఉంటుంది. ఇపుడే మంచి ఆహారం తినటం అవసరం. ఎనిమిదో నెల వచ్చేటప్పటికి పాప ఒకటిన్నర కిలోల బరువై దాదాపు నలభై సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ కదలటానికి స్థలం లేక ఒకే భంగిమలో సర్దుకుని ఉంటుంది. ప్రసవానికి కొద్ది రోజుల ముందు తల క్రింది వైపుకు తిరిగి తొంటిలోకి జారుతుంది.
పిండం సెక్స్ నిర్ధారణ తల్లితండ్రుల క్రోమోజోముల మీద ఆధారపడి జరుగుతుంది. స్త్రీ అండంలో XX క్రోమోజోములు, మగకణాలలో XY క్రోమోజోములు ఉంటాయి. XX కలయిక ఆడపిల్ల, XY కలయిక మగపిల్లవాడు కలుగుతారు
కుటుంబ నియంత్రణ పద్ధతులు
సెక్స్ గురించి గర్భ నిరోధక పద్ధతుల గురించి ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు చెప్పకూడదని దీనివల్ల వాళ్ళల్లో విశృంఖలత పెరుగుతుందని కొంతమంది అభిప్రాయం. కాని, ఇది సరైన ఆలోచ కాదు. సెక్స్ విజ్ఞానం ఉంటేనే అనుకోకుండా గర్భం వచ్చే ప్రమాదం తక్కువవుతుందనీ, దానితో పాటు వచ్చే ఇతర సమస్యలూ నివారించవచ్చనీ, గర్భస్రావాల అవసరం తగ్గుతుందనీ మనం గుర్తించాలి. సెక్స్ గురించి ఆలోచనల్ని కూడా రానివ్వకూడదనే సంస్కృతి ప్రభావం మనమీద చాలా బలంగా పనిచేస్తుంది. అందుకే కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి ఎవరినైనా అడగాలన్నా, మనలోని లైంగిక భావాలను గుర్తించినట్లవుతుంది. కనుక అడిగితే అవతలవాళ్ళు ఏమనుకుంటారోనని సందేహిస్తాం. మనవాళ్ళతో ఈ విషయాల గురించి మాట్లాడటానికి సిగ్గుపడతాం. ఈ ఒక్కసారికి గర్భంరాదులే అనుకుంటాం. ఎవర్ని అడగాలో, ఏం అడగాలో మనకు తెలియదు. మనం ఒకవేళ ఏదైనా పద్ధతి అనుసరిస్తున్నా అఁదులో ఏదైనా సమస్య ఉంటే ఉపయోగించటం మానేస్తాం కానీ, ఇంకొక పద్ధతి ఏదైనా ఉందా అని కనుక్కోవటం తక్కువ. కాని ఈ సమాచారం గురించి తెలుసుకోవటం, దానిపట్ల ఆసక్తి కనపరచటం అవసరం. తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే. అయిష్టంగా కలయికకు ఒప్పుకున్నా అనుకోకుండా గర్భం వస్తే, తీసేసుకోవటానికి మార్గం (అబార్షన్) ఉందనుకున్నా అసలు రాకుండా చూసుకోవటం మన శరీర ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇంతవరకు సెక్స్ కలయికతో మగ, ఆడ కణాలు కలిసి గుడ్డులా తయారై క్రమేణా కడుపులో పాప ఎలా పెరుగుతుందో చూశాం. ఇప్పుడు ఈ క్రమానికి అడ్డుపడటం ఎట్లాగో చూద్దాం.
దీనికి సంబంధించిన సమాచారం మన దేశంలో చాలామందికి కుటుంబనియంత్రణ అంటే పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ అని మాత్రమే తెలుసు. అందుకే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని ఆపరేషన్ చేయించుకుంటారు. కొద్దిమందికి మాత్రం మాత్రల గురించి తెలుసు. ఒకవేళ ఎన్నోరకాల పద్ధతుల గురించి తెలిసినా వాటివల్ల ఉండే సాధకబాధకాలు చాలామందికి తెలియదు. పత్రికలో, టివీలో నిరోధ్ గురించి ప్రకటనలు చేసే వాళ్ళుంటారు. కానీ, ఎలా వాడాలో ఎవరు చెప్తారు? మిగతా అన్ని సాధనాలు కూడా ఇలాగే ఏమీ అర్థం కాని విషయాలుగా ఉంటాయి. ఒకవైపు టివి, రేడియోలు, వ్యాపార ప్రకటనలు అన్నీ కుటుంబ నియంత్రణ గురించి తెలియచేస్తున్నాయి.
పద్ధతులు ఇందులో మూడు రకాలున్నాయి.
- మాత్రలు
- గర్భాశయంలో అమర్చే లూప్ (ఐ.యు.డి. లేదా కాపర్ టి)
- వీర్యకణాలకు అడ్డుపడే సాధనాలు (నిరేధ్)
మాత్రలు (పిల్స్) మాత్రలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. అన్ని నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ప్రసూతి కేంద్రాలలోను ఉచితంగా ఈ మాత్రల్ని పంచి పెట్టడం జరుగుతోంది. టి. వీ. లో మాలా. డి. ప్రకటల్ని అందరూ చూసే ఉంటారు. అయితే అసలు ఈ మాత్రలు ఏమిటి ఎలా పని చేస్తాయి వాటితో వచ్చే ఇబ్బందులు, ఫలితాలు ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం. ఇవి వాడాలని నిర్ణయించుకున్నవాళ్ళు అనుభవం ఉన్న డాక్టరు దగ్గర మొత్తం సమాచారం తీసుకోవాలి.
మాత్రల వలన కొన్ని సాధారణ ఫలితాలు మాత్రలు కొన్ని రకాలు ఇబ్బంది, బాధ కలిగించేవి ఉంటాయి. కొంతమందికి కడుపులో తిప్పటం తప్ప వేరే సమస్యలుండవు. మాత్రలు మానేయగానే ఇబ్బందులు పోతాయి. కొన్నిసార్లు బ్రాండ్ మారిస్తే (డాక్టరు సలహాతో మాత్రమే) సమస్యలు తగ్గొచ్చు. తలనొప్పి, వికారం, తల తిరగడం, రొమ్ముల్లో నొప్పి, కాళ్ళనొప్పులు, వంటి లక్షణాలలో కొన్ని కనిపించవచ్చు. అందరికి ఒకే రకంగా ఉంటుందని చెప్పలేం. కొన్ని సార్లు చికాకు, నిస్పృహ కలిగించే గుణం మాత్రలకుంది. మాత్రలు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత డాక్టరుతో పూర్తి పరీక్ష చేయించుకోవటం అవసరం. డాక్టరు ప్రిస్ర్కిప్షన్ తోటి మందులు కొనాలే గాని, మన ఇష్ట ప్రకారం కొనకూడదు.
రక్తపోటు, డయాబెటిస్, రక్తం గడ్డ కట్టే సమస్యలున్న వాళ్ళు ఏ మాత్రం మాత్రలు వేసుకోకూడదు.
మాత్రలలో ఎన్నోరకాలున్నాయి. డాక్టర్ని అడిగి మన శరీరానికి సరిపడే పద్ధతిని ఎన్నుకోవటం మంచిది. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రలు మానేసి రెండు మూడు నెలలు గర్భం రాకుండా నిరోధ్ వంటి పద్ధతులు వాడి తరువాత గర్భం వచ్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే పిండం మీద మాత్రల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
పాలిచ్చే తల్లులు ఈ మాత్రల్ని వాడకూడదు. పాలతో మందు పిల్లల శరీరాలకు వెళ్తుంది.
ఇక్కడ సాధారణంగా దొరికే మాత్రలు కొన్ని ప్యాకెట్లలో 21 ఉంటాయి. రోజుకి ఒకటి చొప్పున 21 రోజులు వాడి చివరి 7 రోజులూ మానేయాలి. ఈ 7 రోజుల తరువాత బహిష్టు వస్తుంది. 28 మాత్రలున్నా 21 రోజులు వాడి చివరి 7 రోజుల మాత్రలు వేరే రంగులో ఉంటాయి. అవి ఐరన్ గోలీలుంటాయి. బహిష్టు వచ్చిన అయిదవ రోజు నుంచీ మాత్రలు మొదలు పెట్టమని చెప్తారు. చాలా రకాలు ప్రతి రోజూ ఒకే టైముకి వేసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు వేసుకుంటే గుర్తుగా ఉంటుంది. ఒక రోజు మాత్ర మర్చిపోతే తరువాత రోజు రెండు మాత్రలు వాడాలి. కాని మూడు రోజులు మర్చిపోయారనుకోండి మూడు మాత్రలు వేసుకోవద్దు. పూర్తిగా మానేసి ఒక వారమైన తర్వాత కొత్త ప్యాకెట్ మొదలు పెట్టడం మంచిది. ఆ వారం రోజులు నిరోధ్ వంటివి వాడాలి.
కాపర్ టీ ఇది అతి సన్నని రాగి తీగతో చేసిన (T) ఆకారంలో ఉండే సాధనం. శిక్షణ పొందిన నర్సుకానీ, డాక్టరుకానీ దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. దీనికి రెండు దారాల వంటివి ఉంటాయి. అవి యోనిలోకి వేళ్ళాడతాయి. మనం వేలితో తడిమి చూసి సరైన స్థానంలో ఉందా లేదా అని చూడొచ్చు. సాధారణంగా దీన్ని లూప్ అని పిలుస్తారు.
దీనివల్ల కలిగే ఫలితాలు ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాశయపు గోడలకు అంటుకోకుండా చేస్తుంది. ఇది ఉన్నంతకాలం సంతానం కలుగదు. మీరు ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నప్పుడు, సాధనాన్ని తేలికగా తీసివేయించుకోవచ్చు. ఇది 3 నుండి 5 సం.ల వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.
దీనితో వచ్చే ఇబ్బందులు చాలామందికి దీనితో సమస్యలుండకపోవచ్చు. కొందరికి పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి రక్తస్రావం ఎక్కువ కావచ్చు. వేసిన కొత్తలో రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు నొప్పి వస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళాలి. నూటికి ఎనబైమందికి ఏ బాధా ఉండదని డాక్టర్లు చెప్తారు. కొంతమందికి బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువ రావచ్చు. ఈ లక్షణాలన్ని మొదటినెలల్లో ఉండి తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం డాక్టరుతో పరీక్ష చేయించుకొని లూప్ సరైన స్థానంలో ఉందా లేదా తెలుసుకోవాలి. నూటికి పదిమందిలో ఇది వదులై గర్భాశయం నుంచి బయటకు వచ్చే ప్రమాదముంది. అందుకే స్నానం సమయంలో దారాల్ని తడిపి చూడాలి. బహిష్టయినప్పడు కూడా పరీక్షచేయాలి. ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఇది మార్పించుకుంటే మంచిది. యోనిలో, గర్భాశయంలో ఇన్ ఫెక్షన్ ఉంటే ఇది వాడకూడదు. పొత్తికడుపులో నొప్పి, కడుపు తిప్పడం, నీరసంగా అనిపించడం, కలయిక జరిగినప్పుడల్లా నొప్పిరావటం జరిగితే డాక్టర్ని సంప్రదించాలి.
ఇది ఎక్కడ దొరుకుతుంది నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో కాపర్ టీ ఉచితంగా దొరుకుతుంది. బయట కొనుక్కోవాలంటే డబ్బు ఖర్చవుతుంది. డాక్టరుకి కూడా ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అత్యంత నమ్మకమైన గర్భనిరోధక సాధనాలలో ఒకటి అని పరిశోధనలు చెప్తున్నాయి.
నిరోధ్ /కండోమ్ ఇది లేటెక్స్ రబ్బరుతో చేసిన తొడుగు. పురుషాంగం స్తంభించి నిటారుగా అయినప్పుడు మాత్రమే ఇది తొడగటానికి వీలవుతుంది. కలయికలో పురుషాంగం నుంచి వచ్చే వీర్యం యోనిలో పడకుండా ఇది ఆపి ఉంచుతుంది. సెక్స్ కలయిక సమయంలో అంగం నిటారుగా అయిన వెంటనే నిరోధ్ ను తొడగాలి. తొడుగు చివర కొద్ది భాగం వదులుగా వదిలేయాలి. వీర్యం అందులో పడ్డప్పుడు స్థలం లేకపోతే అది పగిలిపోయే ప్రమాదముంది. అంగాన్ని బయటకి తేసేటప్పుడు, నిరోధ్ ని చేత్తో పట్టుకోవాలి. లేకపోతే తొడుగు జారిపోయి వీర్యం యోనిలో పడే ప్రమాదముంది.
కండోం ఉపయోగాలు అన్ని సాధనాల కంటే ఇది చవక. సులభంగా దొరుకుతుంది. వాడటం తేలిక. మనమే అన్ని బాధలూ పడాల్సిన అవసరం ఉండదు. ఈ పద్ధతిలో బాధ్యత మగవాళ్ళదే. కాకపోతే మనం వాళ్ళమీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మన కంట్రోలులో ఉండే సాధనం కాదు. దీనివల్ల ఇన్ ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఎయిడ్స్ రాకుండా కూడా కాపాతుంది.
అందుబాటు ఏ మందుల దుకాణంలోనైనా, జనరల్ స్టోర్స్ లోనైనా కొన్ని పాన్ షాపులలో కూడా దొరుకుతుంది. సూపర్ బజారులో దొరకవచ్చు. కుటుంబ సంక్షేమ కేంద్రాలలో, నగర ఆరోగ్య కేంద్రాలలో ఇది ఉచితంగా ఇస్తారు.
సమర్ధత నూటికి 97 శాతం ఇది పనిచేస్తుంది. చాలాసార్లు ఎలా వాడాలో తెలియక పొరపాటు చేస్తే అది 80-85 శాతం వరకుతగ్గవఛు . పొరపాట్లు జరగకుండా చూసుకుంటే నూటికి నూరు శాతం ఫలితం ఉండే సాధనం ఇది.
శాశ్వత పద్ధతులు ఈ పద్ధతులే కాకుండా పిల్లలు పుట్టకుండా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చేసే ఆపరేషన్లు ఉన్నాయి. ఆడవాళ్ళకి చేస్తే ట్యూబెక్టమీ, మగవాళ్ళకి చేస్తే వేసెక్టమీ అంటారు. నో స్కాల్ పెల్ వాసక్టమీ (కత్తిగాటులేని), డబుల్ పంక్చర్ లేప్రొస్కోపి. ఈ ఆపరేషన్లు సాధారణంగా ప్రసవం కాగానే ఆడవాళ్ళకు చేయడం జరుగుతుంది. మగవాళ్ళెప్పుడైనా చేయించుకోవచ్చు. ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి చేయటం సులభం.
అనుకోని పరిస్థితులలో అక్కరలేని గర్భం వస్తే తీసేయించుకోవటం ఎలా ? (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ)
చాలాసార్లు విషయం తెలీక, లేదా జరిగిపోయిన దాన్ని కప్పి పెట్టే ప్రయత్నంలో, లేక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దండనను ఎదుర్కొనే ధైర్యం లేక అన్నింటికీ మించి చేతిలో చాలినంత డబ్బు లేక చాలా మంది నాటు వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుని ప్రాణానికి ముప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. గర్భం రాకుండా చూసుకునే పద్ధతుల గురించి తెలియక పోవటం దీనికి సగం కారణం. అందుకే గర్భస్రావాన్ని చాలామంది ఒక కుటుంబ నియంత్రణగా వాడటం ఇప్పటికి జరుగుతోంది. మన దేశంలో గర్భం తీసేయించుకోవటం చట్ట విరుద్దం కాదు. అయినావైద్య సదుపాయాలతో సక్రమంగా జరిగే అబార్షన్లకన్నా అటువంటి పరిస్థితులు లేని అక్రమ పద్ధతుల్లో జరిగే అబార్షన్ల సంఖ్య అతి ఎక్కువ. ఏటా అరవై లక్షల మంది స్త్రీలు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో, ఇళ్ళల్లో, అనుభవంలేని వాళ్ళ సహాయంతో గర్భం తీసేయించుకుంటారు. ధనిక, కుటుంబాలలో స్త్రీలకు మంచి సౌకర్యాలను కొనుక్కోగలిగే తాహతు ఉంటుంది. అది లేని వాళ్ళ పరిస్థితి కులం, జాతి, వర్గం అన్ని విధాలుగా తక్కువ పరిస్థితిలో ఉన్న వాళ్ళ సంగతి మరీ అన్యాయం. గర్భం తీసేయించుకోవటానికి ఒక చట్టం అనేది ఉన్నా చాలామంది అవమానాల పాలవుతామన్న భయం కొద్దీ, అక్రమ గర్భం అని ఎగతాళి చేస్తారన్నభయం కొద్దీ, నాటు వైద్యుల దగ్గరకు పోతారు.
ఈ చట్టం ఏమిటో తెల్సుకుందాం
ఆరోగ్యానికి సమస్యలుండిగర్భం వస్తే, డాక్టర్లు తీసేయమని సలహా ఇవ్వచ్చు. ఇప్పుడొచ్చే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పుట్టబోయే బిడ్డకు లోపాలుండే అవకాశం ఉందని తెలిస్తే బలాత్కారానికి గురైన అమ్మాయికి గర్భం వస్తే, పెరుగుతున్న గర్భం తల్లి మానసిక క్షోభకు గురి అయ్యైలా చేస్తే సాంఘిక పరిస్థితులు, పెరుగుతున్న గర్భానికి అనుకూలించక పోతే కుటుంబ నియంత్రణ పద్ధతి పనిచేయక గర్భం వస్తే, 18 సం. రాకముందే గర్భం వస్తే కూడా తీసేయించుకోవచ్చు.
ఈ పరిస్థితులలో ఉన్న వారెవరైనా గర్భం తీసేయించుకునే హక్కు ఉంది. గర్భం వచ్చిన మొదటి దశలో ఉంటే నాలుగున్నర వారాల నుంచి 12 వారాల వరకు చేయించుకోవటం సులభం. అతి చిన్న వయస్సులో శరీరం సరిగ్గా ఎదగని పరిస్థితిలో గర్భం వస్తే పిల్లల్ని కనటం కంటే గర్భం తీసేయించుకోవటం మంచిది. చాలా మంది గర్భం తీసేయించుకుంటే మళ్ళీ రాదని ఇతరులు భయ పెట్టడం జరుగుతుంది. అర్హత గల వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుంటే ప్రమాదాలు ఎదురుకావు. గర్భస్రావం చేయించుకోగానే పిల్లల్ని కనకుండా మన శరీరానికనువుగా ఉండే సాధనం వాడాలి.
అసలు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి సౌకర్యాలు సరిగ్గా అందుబాటులో లేవని అనుకొని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళి బోలేడు ఖర్చు చేసుకుంటారు. నిర్దేశించిన నగర వైద్యశాలలో ఈ సౌకర్యం ఉచితంగా లభిస్తుందని ఇప్పటికి చాలా మందికి తెలియదు.
ఏం చెయ్యాలో ఎప్పుడు నిర్ణయించాలి ? మనకు నెల తప్పిందని అనుమానం రాగానే ముందు తేదీలు లెక్కలు కట్టాలి. డాక్టర్లు ఆఖరి ముట్టు ఎప్పుడు మొదలైందని ఆ రోజు నుంచి లెక్కలు కడతారు. చివరిసారి అయి నెల మీద రెండు వారాలయిందనుకుంటే డాక్టర్ల లెక్కలో ఆరువారాలైనట్లు లెక్క. గర్భం తేసేయాలనుకుంటే తొందరగా నిర్ణయించుకోవాలి. తొందరగా చేయించుకొనటం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ కాలం గడిచే కొద్ది సమస్యలు ఎక్కువవుతాయి, మనసుకు బాధ కూడా.
అట్లా అని ఆరువారాలలోపు తొందరపడి చేయించుకుంటే లోపల పిండం తగినంత సైజుకు పెరగక శుభ్రం చేసినప్పుడు పూర్తిగా బయటికి రాకపోయే అవకాశం ఉంది. మిగిలిపోయిన ముక్కలు, కుళ్ళి, ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.
అందుబాటులో ఉన్న గర్భ స్రావ పద్ధతులు ఇంతకు ముందే గర్భం రావటం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఫలదీకరణ జరిగిన అండం గర్భం లోపల పొరకు అంటుకుని పెరగటం మొదలవుతుంది. చివరి బహిష్టు అయిన ఆరు వారాలకు దాని సైజు ఒక బఠాణీ గింజ అంత ఉంటుంది. దీనితో పాటు మాయ కూడా పెరుగుతుంది.
ఆధునిక పద్ధతులలో గర్భ స్రావం పదినిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మనం కంగారు పడకుండా రిలాక్సవటం పనిని సులభం చేస్తుంది. అరగంటసేపు పడుకొని ఉంటే మంచిది. డాక్టరు మన రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలి. మనకి భయం కలిగేంత రక్తం పోవటమో, జ్వరం రావటమో జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గర్భస్రావం అయి ఇంటికి రాగానే లైంగిక చర్యలో పాల్గొంటే ఇన్ ఫెక్షన్ రావచ్చు. నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఇది జరగకుండా చూసుకోవటం మంచిది. రక్తం దుర్వాసనతో ఉంటే అబార్షన్ సరిగ్గా జరగలేదేమో పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్లు జ్వరం రాకుండా మందులు సాధారణంగా భోజనం తినే ముందు వేసుకోవాలో, ఎప్పుడేసుకోవాలో సరిగా అడిగి తెలుసుకోవాలి.
కౌమార బాలల పోషకాహార అవసరాలు
జీవితంలోని అన్ని దశలలో కంటే కౌమారదశలో ఎక్కువ పౌషకాహారం అవసరమవుతుంది. దీనికి కారణం –
- ఈ దశలో శరీరం వేగంగా పెరుగుతుంది. పెద్దయ్యాక ఉండే బరువులో 50%, ఎత్తులో 20% ఇప్పుడే పెరుగుతారు.
- ఎప్పుడూ గంతులేస్తూ పరుగులు తీస్తూ ఆడుతూ ఉంటారు.
- చురుగ్గా పనులు చేస్తారు
కౌమార బాలికలకు మరింత ఎక్కువ పోషకాహారం అవసరం - కారణాలు
- బాలికలు రుతుస్రావంలో ప్రతి నెల రక్తాన్ని కోల్పోతారు.
- చిన్న వయసులో వివాహాలు జరిగే సమాజాలలో కౌమార బాలికలలు గర్భం, బాలింత దశలలో ఎక్కువ పోషకాహారం అవసరమవుతాయి.
కౌమార దశలలో పౌష్టికాహార లోపం వల్ల కలిగే అనర్థాలు
- శారీరక పెరుగుదల, మేథో సామర్థ్యం తగ్గుతాయి.
- లైంగిక పరిణతి ఆలస్యమవుతుంది.
కౌమార బాలల ఆహారానికి అవసరమైన లక్షణాలు
- బాలల భౌతిక, బౌద్ధిక అవసరాలను తీర్చగలిగే పోషక విలువల్ని కలిగి ఉండాలి.
- వ్యాధులు వచ్చినప్పుడు లేక గర్భం వచ్చినప్పుడు అవసరపడే పోషకాల్ని అదనంగా సమకూర్చగలగాలి.
- పెద్దయ్యాక వచ్చే అధిక రక్తపోటు, ఎముకలు డొల్లగా అవడంలాంటి పోషకాహారంతో సంబంధం ఉన్న వ్యాధుల్ని నివారించగలగాలి.
- ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లకు తగినట్లు ఉండాలి.
కౌమార బాలల – క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు
కౌమార బాలల ఆహారపుటలవాట్ల మీద, క్రమబద్ధంగా తినడం మీద వారి శరీరంలోని, ప్రధానంగా మెదడులోని చక్కెర స్థాయి ఆధారపడుతుంది. శరీరం, మెదడు, సక్రమంగా పని చెయ్యాలంటే ఈ చక్కెరస్థాయి స్థిరంగా ఉండాలి. ఫ్యాషన్ కోసమో, జబ్బు కారణంగానో తక్కువ తినడం లేక ఉపవాసం ఉండడం వల్ల శరీరపు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మరీ తరచుగా లేక ఎక్కుగా తినడం అజీర్తికి, స్థూలకాయానికి దారితీస్తుంది. శరీరంలో అవసరానికి మించి చక్కెర ఉండడంవల్ల మెదడు సరిగ్గా పనిచేయదు. పోషక విలువలు లేని జంక్ ఫుడ్స్ తినడం వల్ల బలహీనంగా అవుతారు. వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుంది.
క్రమం లేకుండా తినడం, చాలా గంటలపాటు తినకుండా తరువాత ఒక్కసారే తినడం వల్ల శరీరంలోనూ, మెదడులోనూ అకస్మాత్తుగా చక్కెర లోడ్ ఎక్కువవుతుంది. ఒక్కసారి వేగంగా మెదడులోకి, శరీరంలోకి వచ్చిన చక్కెర వలన ఆ వ్యక్తికి నీరసంగా, అలసటగా, మత్తుగా అనిపిస్తుంది. దానితో కౌమార బాలలు చురుగ్గా పనిచేయలేరు. చదువు మీద శ్రద్ధ నిలపలేరు.
కౌమార బాలలు నిర్దిష్ట కాలవ్యవధిలో సమగ్రాహారాన్ని సరిపడా తినాలి.
కౌమార దశలలోని గర్భవతులను పోషకాహారం
గర్భం కౌమార బాలిక శరీరం మీద చాలా భారాన్ని మోపుతుంది. ఆమెకు గర్భం, ప్రసవం తాలూకు సమస్యల్ని తట్టుకొని ఆరోగ్యంగా జీవించడానికి, గర్భస్థంగా ఉన్న శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి సరిపడా సమతుల్య ఆహారం అదనంగా లభించాలి.
శిశువు ఎదుగుదల
- అండం వీర్యకణంతో కలిసి ఫలదీకరణ జరిగిన క్షణంలోనే స్త్రీ ఒక కొత్త జీవిని సృష్టిస్తుంది.
- పిండం తొలిదశలో 10 వారం వరకు తన చుట్టూ ఉన్న కణాల మీదే తన ఆహారం కోసం ఆధారపడుతుంది. అప్పటికి సుమారుగా 2 అంగుళాలు పొడవు ఉన్న శిశువు బరువు 15 గ్రాములు ఉంటుంది. అది క్రమేపీ పెరుగుతూ 40 వారాలకు సమారుగా 3000 గ్రాముల బరువు ఉంటుంది. వేగంగా జరిగే ఈ పెరుగుదలకు, ఎముకలు పెరగడానికి పోషకాలు అవసరం. ఈ పోషకాలు పాల ద్వారా తల్లి నుండి బిడ్డకు చేరతాయి. అందువల్ల బిడ్డ గర్భంలో ఉన్న కాలమంతా తల్లి మంచి పోషకాహారాన్ని తినడం మీద శిశువు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
తల్లిలో మార్పులు
- తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డ అవసరాలకు సరిపడా తినడమే కాక తన అవసరాలకు సరిపడా కూడా ఆహారాన్ని తీసుకోవాలి.
- బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి శరీరంలో కూడా ముఖ్యమైన మార్పులు జరుగుతాయి.
- ఆమె శరీరం సైజు, బరువు పెరుగుతాయి.
- బిడ్డ పెరుగుదలకు అనుగుణంగా తల్లి గర్భాశయం సైజు పెరుగుతుంది.
- రొమ్ములు పెరుగుతాయి.
- రక్తం పరిమాణం పెరుగుతుంది. ఈ రక్తం కొత్త కణజాలం పెరుగుదలకు అవసరమైన పోషకాల్ని అందిస్తుంది.
- గర్భం తొలి నెలల్లో వాంతులు, వికారం వలన సరిపడా పోషకాహారం తినకపోవడం, వాంతుల్లో కొన్ని ముఖ్యమైన పోషకాలు బయటకు పోవడం జరిగి పోషకాహారం లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది.
- కౌమారదశలోని గర్భవతులకు ఆ దశలో వారి శరీరం ఎదుగుదలకు, గర్భం తాలూకు అవసరాలకు సరిపడా పోషకాహారం లభించాలి.
- పోషకాహార లోపం ఉన్న తల్లులకు పుట్టిన బిడ్డలపై దాని ప్రభావం
- బరువు పెరగకపోవడం – తక్కువ ఆహారాన్ని, తక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తినే తల్లులకు పుట్టిన పిల్లల సగటు బరువు సరిపడా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తగినంతగా తిన్న తల్లులకు పుట్టిన పిల్లల సగటు బరువు కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఆ శిశువుల అవయవాలు, కణజాలం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని సూచిస్తుంది.
- బిడ్డ ఎముకలు సక్రమంగా ఎదగవు. దృఢంగా ఉండవు.
- పోషకాహార లోపంలో బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు వ్యాధి నిరోధకశక్తి శక్తి తక్కువగా ఉంటుంది.
- వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు అనేక ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- వ్యాధుల బారిన పడినవారు సక్రమంగా ఎదగరు. తెలివితేటల అభివృదధి సక్రమంగా ఉండదు.
- ప్రాణాంతక వ్యాధులు సోకినవారు మరణించే ప్రమాదం ఎక్కువ ఉంటుంది
తల్లి ఆరోగ్యం మీద పోషకాహార లోపం ప్రభావం
- గర్భంలో పెరిగే శిశువు తల్లి మీద పరాన్నజీవిగా పెరుగుతుంది. తల్లి శరీరంలోని పోషకాల్ని పోషకాల్ని లాక్కుంటుంది. తల్లి సరిపడా పోషకాహారాన్ని తినకపోతే బిడ్డ తల్లి శరీరంలోని పోషక నిలవల్ని లాక్కోవడం వలన ఆమె శరీరం బలహీన పడుతుంది. బరువు తక్కువగా ఉంటుంది.
- బలహీనపడిన తల్లి గర్భం తాలూకు ఒత్తిడిని తట్టుకోలేదు. దీర్ఝకాలిక పోషకాహార లోపం రక్తహీనతకు దారితీస్తుంది. దీని ఫలితంగా వచ్చే సమస్యలు –
-
- గర్భస్రావాలు
- నెలలు నిండకముందే జననాలు
- బిడ్డ తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టడం
- బరువు తక్కువ పిల్లలు పుట్టడం
- పుట్టిన మొదటివారం లేక మొదటి నెల లేక మొదటి సంవత్సరంలోపు బిడ్డ చనిపోవడం.
- విటమిన్ – ఎ, ఇనుము, జింక్, ఫోలిడ్ యాసిడ్, కాల్షియం లోపం గర్భం సమయంలో రావడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
- తల్లి ఎముకలు సక్రమంగా పెరగక పొట్టిక ఉంటాయి. జనన మార్గం ఇరుకుగా ఉండి ప్రసవ సమయంలో సమస్యలు వస్తాయి.
- గర్భవతిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా బాలింతగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ సులభంగా సోకుతాయి.
- వ్యాధి నుండి కోలుకొనే శక్తి తగ్గుతుంది.
- పనిచేసే శక్తి తగ్గుతుంది.
- సంపాదనా శక్తి తగ్గుతుంది.
- కుటుంబాన్ని సంరక్షించుకొనే శక్తి తగ్గుతుంది.
- భారతదేశంలో సంతానోత్పత్తి దశలో గర్భం, ప్రసవం కారణంగా చనిపోయే స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం, రక్తహీనత. ఇలా మరణించే వారిలో ఎక్కువ శాతం కౌమార బాలికలే.
గర్భం సమయంలో తీసుకొవలసిన ఆహారం
- ధాన్యాలు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్, వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలసంబంధిత పదార్థాలు, గుడ్లు లేదా మాంసం లేక చేపను ఆహారంలో తీసుకోవాలి. గర్భవతికి అదనంగా సుమారు 500 కాలరీలు ఉన్న ఆహారం ప్రతిరోజూ లభించాలి.
- అదనంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్, బి12, కాల్షియం మాత్రలు వేసుకోవాలి.
ఆధారం: మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ – ఆంధ్రప్రదేశ్
బాలింతకు పోషకాహారం
గర్భం సమయంలో కంటే బిడ్డకు పాలిచ్చే సమయంలో ఎక్కువ పోషకాహారాన్ని తినాలి. ఎందుకంటే సంపూర్ణంగా అభివృద్ధి చెంది రోజురోజూకూ వేగంగా పెరిగే బిడ్డ ఆహార అవసరాలకు సరిపడా తల్లి తింటేనే అవి పాల ద్వారా బిడ్డకు చేరతాయి. తల్లి గర్భం సమయంలో పోషకాహారాన్ని సరిపడా తీసుకొని ఉండకపోతే ఆమె శరీరంలోని పోషకాల్ని కడుపులో పెరుగుతున్న బిడ్డ లాక్కోగా ఆమె పోషకాహార లోపానికి గురవుతుంది. పాలిచ్చేప్పుడు కూడా సరిపడా పోషకాహారాన్ని తినకపోతే బిడ్డ ఒక స్థాయి వరకు తల్లి శరీరంలోని పోషకాల్ని పాల ద్వారా లాక్కుంటుంది. ఆ స్థాయి దాటాక తల్లీ, బిడ్డ ఇద్దరూ పోషకాహార లోపానికి గురవుతారు. అందుచేత నాణ్యమైన పోషక విలువలు కలిగిన పాల ఉత్పత్తికి, తద్వారా బిడ్డ పోషకాహార లోపానికి గురవకుండా ఉండడానికి, తల్లి పోషకాహార లోపానికి లోనవకుండా ఉండడానికి, గర్భవతిగా ఉన్నప్పుటి కంటే అదనంగా పోషకాహారాన్ని తినాలి. ముఖ్యంగా శరీర నిర్మాణ పోషకాలు, రక్షక పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినాలి.
శక్తినిచ్చే ఆహారం | |||
పోషకాల | ప్రధాన వనరు | ధర్మాలు | లోపం/అధికం |
పిండి పదార్థాలు | ధాన్యాలు, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగి మొగలగునవి. దుంపలు: బంగాళదుంప, చిలగడదుంప, కర్ర పెండలం ఎండిన పళ్ళు, చక్కెర, బెల్లం, తేనె, నూనె. | శరీరం నిర్వహించే అన్ని విధులకు అవసరమైన శక్తిని అందిస్తాయి | లోపం: నీరసం. బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, అనారోగ్యానికి గురి కావడం. అధికం: గుండె జబ్బులు, చక్కెర వ్యాధి, లేక మధుమేహ వ్యాధి. |
క్రొవ్వు పదార్థాలు | నెయ్యి, వెన్న, మీగడ, మాంసంలో క్రొవ్వు |
శరీరాన్ని నిర్మించే ఆహారం | |||
పోషకాలు | ప్రధాన వనరు | ధర్మాలు | లోపం/అధికం |
ప్రొటీన్స్ లేక మాంసకృత్తులు | వృక్ష సంబంధమైనవి: పప్పులు, చిక్కుళ్ళు, బఠాణీ, నట్స్, సోయా జంతు సంబంధమైనవి: గుడ్లు, మాంసం, చేప, పాలు | శరీర కణాల నిర్మాణానికి. శిథిలమై రాలిన కణాల స్థానే కొత్త కణాల పునర్మిర్నాణానికి పిండి పదార్థాల లోపం వచ్చినప్పుడు శక్తిని అందించడానికి | లోపం: పెరుగుదల కుంటుపడడం రోగనిరోధక శక్తి నశించడం అనారోగ్యాలకు గురవడం |
రక్షణనిచ్చే ఆహారం | ||||||
విటమిన్లు విటమిన్ - ఎ | చేపనూనె, లివర్, గుడ్డు పచ్చసొన, వెన్న, మీగడ, ముదురాకుపచ్చ కూరలు, పసుపు పచ్చని పండ్లు | కంటి రెటీనా కాంతిని స్వీకరించడానికి అవయవాల లోపలి మ్యూకస్ పొర ఆరోగ్యంగా ఉండడానికి లైసోసోమ్ స్థిరంగా ఉండడానికి గ్లైకో ప్రొటీన్ ఉత్పత్తికి విటమిన్ –ఎ అవసరం. | లోపం: రేచీకటి చర్మం, పొడిగా, గరుగ్గా, ఉండటం, కంటిపొర పొడిగా అవడం, పుండు పడడం పిల్లలు అనారోగ్యం పాలవడం, చనిపోవడం పోషకాలు | ప్రధాన వనరు | ధర్మాలు | లోపం/అధికం |
బి. కాంప్లెక్స్ థైమిన్ | ధాన్యపు పొట్టు, లెగ్యూమ్స్, లివర్, నట్స్, మొలకెత్తిన పప్పులు, ఈస్ట్ | కణాలు గ్లూకోజ్ ని సక్రమంగా వినియోగించుకోవడానికి నరాలు సక్రమంగా పని చేయడానికి మెదడు సవ్యంగా పనిచేయడానికి | లోపం: గుండె కండరాలు దెబ్బతినడం చేతులు, కాళ్ళు తిమ్మెర్లు | |||
బయోటిన్ | లివర్, మూత్రపిండాలు, గుడ్డు, పచ్చసొన, ఈస్ట్, కాలీఫ్లవర్, నట్స్, లెగ్యూమ్స్ లేక కాయ ధ్యాన్యాలు | ఎమైనో ఏసిడ్స్ మరియు ఫాటీ ఏసిడ్స్ జీవ రసాయన ప్రక్రియకు అవసరం. | లోపం: చర్మ వ్యాధులు నాలుక పుండు పడడం | |||
ఫోలిక్ ఆసిడ్ | ఆకుకూరలు | ఎర్రరక్త కణాలు పరిణితి చెందడానికి శరీర కణాలు సవ్యంగా పని చేయడానికి కొన్ని రకాల ఎంజైమ్స్ ఉత్పత్తికి | రక్తహీనత గర్భస్థ శిశువుకు అంగవైకల్యం | |||
విటమిన్– బి12 | లివర్, అన్ని రకాల మాంసాలు, గుడ్లు, పాలు, పాల పదార్థాలు | ఎర్ర రక్త కణాలు పరిణతి చెందడానికి డి.ఎన్.ఎ. నిర్మాణానికి ఫోలేట్ సంబంధిత కో-ఎంజైమ్లు మిథయోనిన్ మరియు ఎసిటేట్ ఉత్పత్తికి | లోపం: పెర్నీషియన్ ఎనీమియ (రక్త హీనత) మానసిక వ్యాధులు నరాల బలహీనత పాదాల తిమ్మరలు | |||
విటమిన్-సి | సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మ, బత్తాయి, దబ్బ, కమలాఫలం మొదలుగవి) టొమాటో, కాబేజి | ఎముకలు దృఢత్వానికి రక్తనాళాలు తమ ధర్మాల్ని సక్రమంగా నిర్వర్తించడానికి కణ శ్వాసక్రియకు గాయాలు మానడానికి | లోపం: స్వర్వీ (రక్తస్రావం, పళ్ళు వదులవడం చిగుళ్ళువాచి రక్తం కారడం) | |||
విటమిన్-డి | సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు, చేపనూనె వెన్న, గుడ్లు పచ్చసొన, లివర్ | కాల్షియం, ఫాస్ఫరస్ రక్తంలో విలీనమవడానికి ఎముకలు పెరగడానికి, దృఢంగా అవడానికి | రికెట్స్- చిన్నపిల్లలు ఆస్టియో మలేషియా – పెద్దలు ఎముకలు వంకర్లు తిరగడం, వంగి పోవడం, విరిగిపోవడంఅధికం:ఆకలి లేకపోవడం మూత్రపిండాలు పనిచెయ్యకపోవడం | |||
విటమిన్-ఇ | వెజిటబుల్ ఆయిల్, మెలకెత్తిన గోధుమలు, గుడ్ల పచ్చసొన, కాయధాన్యాలు | కణాలలోని హానికర పదార్థాలను నిర్వీర్యం చెయ్యడం ప్రీ రాడికిల్స్ ని నిర్మూలించడం | లోపం: ఎర్రరక్త కణాలు విరిగిపోవడం, నరాలు దెబ్బతినడంఅధికం:ఎంజైములు సరిగ్గా పనిచేయకపోవడం | |||
విటమిన్-కె కె1&కె2 | ఆకుకూరలు, పంది మాంసం వెజిటబుల్ ఆయిల్స్, అన్నపు ప్రేవుల్లో సహజంగా ఉండే సూక్ష్మజీవులు | రక్తంలోని ప్రోధ్రాంబిన్ మరియు ఇతర రక్తాన్ని గడ్డు కట్టించే పదార్థాల ఉత్పతితకి, రక్తం, సహజంగా గడ్డ కట్టడానికి అవసరం. | లోపం: రక్తస్రావంఅధికం:పచ్చకామెర్లు | |||
ఖనిజ లవణములు ఇనుము | మాంసం, లివర్, గుడ్లు, ఆకుకూరలు, పప్పులు, బఠాణీలు, చిక్కుళ్ళు, కాయధాన్యాలు, బెల్లం | ఎర్రకణాల్లో హిమోగ్లోబిన్ నిర్మాణానికి కొన్ని ఎంజైములు నిర్మాణానికి కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ నిర్మాణానికి మరియు విచ్ఛిన్నానికి | లోపం: రక్తహీనత తెలివితేటలు మందగించడం చదువులో వెనుకబడిపోవడం | |||
కాల్షియం | పాలు, గుడ్లు, పాల పదార్థాలు మాంసం, చేప, గుడ్డు, చిక్కుళ్ళు పండ్లు, కాయగూరలు | ఎముకలు, పళ్ళ నిర్మాణానికి రక్తం గడ్డ కట్టడానికి నరాలు, కండరాలు సవ్యంగా పనిచేయడానికి గుండె కండరపు సంకోచ, వ్యాకోచాలు సక్రమంగా ఉంచడానికి | లోపం: కాళ్లు, చేతులు వంకరపోవడం కండరాలు ఎక్కువగా అదరడం ఎముకలు డొల్లగా అవడం పళ్ళు త్వరగా ఊడిపోవడం రక్తం గడ్డ కట్టకపోవడం | |||
జింక్ | పాలు, మాంసం, చేప, కాయ గూరలు, ఆకుకూరలు | కణవిభజనకు, కణాల పెరుగుదలకు, సెక్సువల్ పరిణతికి | లోపం: కణాల పెరుగుదల మందగించడం | |||
అయొడిన్ | సముద్ర ఆహారాలు : సముద్రపు చేప, సముద్రపు ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్) పాలు, మాంసం, కూరగాయిలు | థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి బాలల ఎదుగుదల, తెలివి తేటలు సవ్యంగా ఉంచడానికి | లోపం: గాయిటర్ హైపోథైరాయిడిజమ్ భౌతిక, మానసిక మందకోడితనం పని సామర్థ్యం తగ్గడం గర్భస్రావాలు మృత శిశుజననాలు |
చాలామంది పేద స్త్రీలు ప్రసవమయాక కొద్ది రోజులకే భారీ శ్రమతో కూడిక పనులకు బయటకు వెళ్ళవలసి ఉంటుంది. ఇంటి చాకిరి, బయటి శ్రమకు అవసరమయే శక్తినిచ్చే ఆహారాన్ని వారు తగినంతగా తినాలి.
ఆరోగ్యకరమైన ఆహారాలు, అనారోగ్యకరమైన ఆహారాలు
- ఆరోగ్యకరమైన, సాధారమైన, ప్రాచుర్యం, ఉన్న ఆహారాలు.
- ఇడ్లీ, దోసె, చపాతి, పొంగల్, ఉప్మా, పూరి, సెనగల కూర.
- ఆరోగ్యకరమైన, సాధారమైన ఆహారాలు.
- ఆమ్లెట్, చేపలకూర, మాంసం కూర, శనగపప్పు, రకరకాల పప్పు కూరలు.
- సర్వసాధారణమైన, ప్రాచుర్యం గల ఆహారాలు.
- సమోసాలు, వడలు, రసం అన్నం.
- ఆరోగ్యకరమైనవి. కాని ప్రాచుర్యం లేని ఆహారాలు .
- సోయా పదార్థాలు.
- ప్రాచుర్యం ఉన్నవి కాని ఆరోగ్యకరం కానివి.
- పెప్సీ, కోలా, భేల్ పురి, బజ్జీలు, ఐస్ క్రీములు, అప్పడాలు, కాఫీ, టీ, గోభీ, మంచూరియా, నూడిల్స్, పొటీటో చిప్స్ మొదలగునవి.
- సాధారణమైనవి, కాని ఆరోగ్యకరం కాని, ప్రాచుర్యం లేని ఆహారాలు.
-
- పులిహోర, పచ్చడి అన్నం, బ్రెడ్.
పులిహోరలో వేరుశెనగ గుళ్లు, మేగీనూడుల్స్ కి గుడ్డు, బ్రెడ్ కి ఆమ్లెట్ ని కలిపి తినడం ద్వారా పోషఖ విలువల్ని పెంచవచ్చు. ఇడ్లీని సాంబారుతో , పొంగల్ ని మాంసం కూరతో తినడం ద్వారా, పాలల్లో బోర్నవిటా కలిపి తాగడం ద్వారా ఆయా పదార్థాలపై ఇష్టాన్ని పెంచవచ్చు. పోషక విలువల్నిపెంచవచ్చు.
ఆహారంలో పోషక విలువల్ని కాపాడుకొనేందుకు కొన్ని సూత్రాలు
- కూరగాయల్ని కొయ్యక ముందే శుభ్రంగా కడిగి, పెద్దపెద్ద ముక్కలుగా కోసుకావాలి.
- బియ్యాన్ని మరీ పిసికి, పిసికి ఎక్కువ నీటితో కడిగితే పై పొట్టులో ఉండే బి, విటమిన్ నీళ్ళలో కలిసి వృధాగా పోతుంది. కనుక తక్కువ నీటితో ఎక్కువ పిసకకుండా కడగాలి.
ఆహారాన్ని వండేటప్పుడు
- పరిశుభ్రమైన నీటితో, పరిశుభ్రమైన పాత్రలలో వంట చెయ్యాలి.
- గంజి వార్చనవసరం లేకుండా సరిపడినన్ని నీళ్ళు పోసి అన్నం వండాలి.
- కూర ఉడికేటప్పుడు గిన్నెపై మూత పెట్టి ఉడికించాలి.
- ఆహారంలో మరీ ఎక్కువ సైపు ఉడికిస్తే పోషకాల నష్టం జరుగుతుంది.
- వంటసోడాను ఉపయోగించడం వల్ల అది విటమిన్లను నాశనం చేస్తుంది.
ఆహారాన్ని వండిన తరువాత
- ఆహారాలు కీటకాలు వాలి, దుమ్ము పడి కలుషితం కాకుండా మూత పెట్టి ఉంచాలి.
- ఆహారాన్ని తాజాగా ఉన్నప్పుడే తినాలి. నిలువ ఉన్న ఆహారంలో పోషకాల నష్టం జరుగుతుంది. కలుషితమవుతుంది.
ఆహారం గురించి కొన్ని తప్పు అభిప్రాయాలు
- బొప్పాయి -వేడి చేస్తుంది. గర్బాలు పోతాయి. బహిష్టులో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. గర్భణీ స్త్రీ తింటే గర్భస్రావాలవుతాయి.
- అరటిపండు –చలవ చేస్తుంది. కఫం పెరుగుతుంది
- మామిడిపండు –వేడి చేస్తుంది. సెగ్గడ్డలు వస్తాయి. నీళ్ళ విరేచనాలవుతాయి.
- నారింజ –జలుబు చేస్తుంది.
- బంగాళదుంపలు, కేబేజి –కడుపులో గేస్ చేరుతుంది.
- ములగకాడలు /ఆకులు –లైంగిక కోరికల్ని పెంచుతాయి.
- కొబ్బరినీళ్ళు –చలవ ఆహారం, జలుబు చేస్తుంది.
- బీట్ రూట్-ఎర్రగా ఉంటుంది కనుక రక్తవృద్ధి అవుతుంది.
- కాకరకాయ –కడుపులో పురుగుల్ని చంపుతుంది. చేదుగా ఉంటుంది. కనుక పురుగుల్ని డయాబెటిస్ రోగులకు మంచిది.
- ఉల్లి-వెల్లుల్లి-లైంగిక కోరికల్ని పెంచుతాయి. కనుక విధవలు, సన్యాసినులు, రుషులు, సాధువులు తినకూడదు.
- రాక్షస ఉసిరి –చలవ పదార్థం.
- కేరట్లు, బఠాణి-మంచి కూరగాయలు, ఇంగ్లీష్ కూరలు.
- బెల్ల-వేడి చేస్తుంది. స్త్రీకి రుతుస్రావం ఎక్కువ అవుతుంది. కడుపులో పురుగులు చేరుతాయి.
- పాలు-శరీరాన్ని చల్లబరుస్తుంది.
- నువ్వులు-బహిష్టులో రుతుస్రావం ఎక్కువవుతుంది.
- బిస్కెట్లు, చాక్లెట్లు –అన్నం కంటే బలమైనవి.
- గుడ్లు-వేడి ఆహారం కనుక నీళ్ళ విరేచనాలవుతాయి. గర్భిణి స్త్రీలు తినకూడదు.
- స్వీట్లు-బహిష్టులో రుతుస్రావం ఎక్కువవుతుంది. వృద్ధాప్యం లో షుగర్ సమస్య వస్తుంది. కడుపులో పురుగులు చేరతాయి.
- మాంసాహారం-శాకాహారం కంటే బలవర్థకమైనది.
ఆహారాల గురించి కొన్ని వాస్తవాలు
- అన్నిఆహార పదార్థాలు శక్తినిస్తాయి. శక్తిని కేలరీలలో కొలుస్తారు. కొన్నింటిలో ఎక్కువ కాలరీలు, కొన్నింటిలో తక్కువ కాలరీలు ఉంటాయి. ఉదా.. ఒక కేజి బంగాళ దుంపలు అంతే తూకం గల బెండకాయల కంటే ఎక్కువ శక్తినిస్తాయి. ఎందుకంటే బంగాళదుంపల్లో శక్తినిచ్చే పిండి పదార్థం ఉంటుంది.
- గోధుమను పొట్టుతో సహా వాడతాము. బియ్యాన్ని పొట్టు తీసి వాడతాము. ఒక గ్లాసు బియ్యం కంటే ఒక గ్లాసు గోధుమలు తక్కువ కాలరీలను, తక్కువ షుగర్ ని అందిస్తాయి. అందుచేత డాక్టర్లు డయాబెటిస్ ఉంటే గోధుమను గోధుమతో చేసిన ఆహారాన్ని తినమని చెప్తారు.
- ఆహారాలు చలువ చేయడం, వేడి చేయడం ఉండవు. అన్ని ఆహార పదార్థాలు వేడిని లేక శక్తిని ఇస్తాయి.
- రెండు రకాల ధాన్యాలను లేక ధాన్యాలను, పప్పులను కలపడం వల్ల వివిధ రకాల ఎమైనో ఏపిడ్స్, షుగర్ లభిస్తాయి. ఉదా, ఇడ్లీలో బియ్యం, మినపప్పు రెండూ ఉంటాయి. కనుక, ఆవిరిలో ఉడకబెడతాయి కనుక ఎక్కువ పోషక విలువలు ఉంటాయి.
- కొంతమందికి కొన్ని పదార్థాలను ఎలర్జీ ఉండడం వల్ల దద్దుర్లు, జలుబు వస్తాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న చేపలు, పప్పు దినుసులు మొదలగు వాటి వలన పై విధంగా జరగవచ్చు.
- ఒక ప్రత్యేకమైన పదార్థం తిన్నాక విరేచనాలు, వాంతులు అవడానికి ప్రధాన కారణం ఆ పదార్థం కలుషితమవడం.
- బాక్టీరియా చేరడం వలన ఫుడ్ పాయిజనింగ్ అయి విరేచనాలు, వాంతులు పట్టుకొంటాయి. ముఖ్యంగా మాంసాహారం, పాల సంబంధమైన పదార్థాలు త్వరగా కలుషితమవుతాయి.
- బొద్దింకలు, బల్లులు పడిన ఆహారం అపరిశుభ్రమైనదే కాని విషప్రాయం కాదు. థాయ్ లాండ్, వియత్నాం, చైనా లాంటి దేశాలలో ప్రజలు బొద్దింకల్ని, బల్లుల్ని, పాముల్ని తింటారు.
- నారింజ, రాక్షస ఉసిరి వల్ల కొంతమందికి జలుబు చేయడానికి కారణం వాటికి ఎలర్జీ ఉండడం. నిజానికి వాచిలో జలుబును నివారించే విటమిన్-సి ఉంటుంది.
- ఏ కొత్త పదార్థానికైనా శరీరం అలవాటు పడడానికి ఆ ఆహార పదార్తాల్ని అనేకసార్లు తినాలి. ఉదా. బఠాణీలను మొదటి లారి తిన్నప్పుడు కొంచెం అజీర్తి చెయ్యవచ్చు.
- శాకాహారం కంటే మాంసాహారం ఎక్కువ కేలరీలనిస్తుంది. చక్కగా ప్లాన్ చేసుకున్న శాకాహారం కూడా మాంసాహారంతో సమానంగా కేలరీల నిస్తుంది.
ఎటువంటి ఆహారాన్ని తినాలి
- వివిధ రకాల ఆహార పదార్థాలను ( ధాన్యాలు, పప్పులు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, దుంపకూరలు, నూనె, చక్కెర) భోజనంలో చేర్చాలి.
- ప్రతిరోజూ ఆకుకూరల్ని తినాలి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు ఉండాలి.
- ఉప్పుడు బియ్యం మామూలు బియ్యం కంటే ఎక్కువ పోషక విలువలు కలిగినవి.
- ప్రతిరోజూ క్యారెట్, ఉల్లిపాయ, ముల్లంగి, టొమాటో, దోసకాయల వంటి పచ్చి కూరగాయల్ని తినాలి.
- రాగులు, గోధుమలు, జొన్నలు మొదలగు ధాన్యాలను కూడా ప్రతిరోజూ ఏదో ఒకపూట ఆహారంలో చేర్చాలి.
- మొలకెత్తిన పప్పుల్ని తినడం మంచిది.
- యవ్వనదశలో బాలికలు రుతుస్రావం ద్వారా రక్తాన్ని కోల్పోతారు. కనుక రక్తహీనత రాకుండా ఇనుము అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలి. బెల్లం, వేరుశనగ, అటుకులు, గుడ్డులో పసుపుసొన, ములగాకు, తోటకూర, బచ్చలి, మెంతి కరివేపాకు, చిక్కుళ్లు, పప్పులు, ఖర్జూరం మరియు మొలకెత్తిన పప్పుల్లో ఇనుము అధికగా ఉంటుంది.
- ధాన్యాలు, పప్పులు కలిపి చేసిన కిచిడీ, ఇడ్లీ, మిస్సీరోటీ వంటివి ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాలు.
- మలబద్ధకం రాకుండా పీచుపదార్థాలను తగినంతగా తినాలి.
- ప్రతిరోజూ తప్పనిసరిగా ఆహారంతోపాటు ఆయా కాలాలలో దొరుకు తాజా పండ్లను తినాలి. ఖరీదైన ఆపిల్ కంటే జామ పండులో పోషకాలు 3 రెట్లు అధికంగా ఉంటాయి.
- రోజుకు 3 లీటర్లు నటిని తాగాలి.
- గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి. బాలిక పూర్తిస్థాయిలో ఎదిగేందుకు, ప్రసవ సమయంలో సురక్షిత ప్రసవమయేందుకు వీలుగా పెల్విస్ వెడల్పుగా ఎరగడానికి, గర్భస్థ శిశువు ఎముకలు సక్రమంగా పెరిగేందుకు, తల్లి ఎముకలు, పళ్లు దృఢంగా ఉండడానికి కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాన్నితినాలి. పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, ముఖ్యంగా సోయా చిక్కుళ్ళు, ఎర్ర తోటకూర, వాముపువ్వు, కేరట్ ఆకులు, చిన్న చేపలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.
- విటమిన్ – ఎ ఉన్న ఆహారాన్ని సరిపడా తినాలి. మామిడి పండు, ఒప్పాయి, క్యాబేజి, టొమాటో, చిక్కుళ్లు, బఠాణీ మరియు అన్ని ఆకుకూరల్లోనూ విటమిన్ – ఎ సమృద్ధిగా ఉంటుంది.
- విటమిన్ –సి సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి. ఉసిరి, రేగు పండు, జామకాయ, నారింజ, నిమ్మ, బొప్పాయి. ముల్లంగి, క్యాబేజి, కొత్తిమీర, పాలకూర మొదలగు వాటిలో విటమిన్ –సి సమృద్ధిగా ఉంటుంది.
రక్తహీనతను గుర్తించడం ఎలా ?
లక్షణాలు
- మందకొడిగా ఉండడం
- పాలిపోయి ఉండడం
- త్వరగా నిస్త్రాణ రావడం, అలిసిపోవడం
- దేని మీదా శ్రద్ధ నిలపడం కష్టమవడం
- దేని మీదా ఆసక్తి లేకపోవడం
- కొద్ది శ్రమకే ఊపిరి అందనట్లవటం
- గుండె వేగంగా కొట్టుకోవటం
- చికాకుగా ఉండడం
- మానసిక అస్థిరత
- ఎప్పుడూ నిద్రపోవడం
- ఆకలి మందగించడం
- తలపోటు
- ఏ పనీ చెయ్యకపోవడం
- కళ్ళు, నోరు నాలుకపై ఉండే మ్యూకస్ పొర పాలిపోయి ఉండడం
- గోళ్ళ క్రింద పాలిపోవడం, గోళ్ళు సొట్టలు పడడం.
తీవ్ర రక్తహీనత
- ఆయాసం
- అలసట
- జుట్టు రాలిపోవడం
- కాళ్ళు, చేతులు, ముఖం వాపు.
నిర్ధారణ
- పై లక్షణాలతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని రక్తపరీక్ష ద్వారా తెలుసుకొని రక్తహీనత ఉన్నదీ, లేనిదీ నిర్ధారణ చేయవచ్చు.
- రక్తహీనతకు కారణాలు
- పొష్టికాహార లోపం
- కొంకి పురుగుల జీర్ణవ్యవస్థలో ఉండడం వల్ల రక్తాన్ని కోల్పోతారు.
- దీర్ఘకాలిక విరేచనాలు – ఆహారంలోని పౌష్టికాలు సరిగ్గా శరీరంలో చేరవు.
- తరచుగా మలేరియా రావడం వల్ల ఎర్రరక్త కణాలు విచ్ఛిన్నమవుతాయి.
- కౌమార బాలికలు నాజూకుగా, సన్నగా ఉండడం ఫ్యాషన్ గా భావిస్తూ లావయిపోతామేమోననే భయంతో సరిపడా తిన పోవడం.
- రుతుస్రావం ఎక్కువగా అవడం.
- తరచుగా వ్యవధి లేకుండా గర్భాలు, ప్సవాలు, గర్భస్రావాలు.
- ప్రసవంలో అధిక రక్తస్రావం.
రక్తహీనతను నివారించడం
- సమగ్రాహారాన్ని సరిపడా తినడం – కౌమార బాలలు, ముఖ్యంగా బాలికలు/స్త్రీలు హిమోగ్లోబిన్ తయారీకి అవసరమైన ఆహారాన్ని పుష్కలంగా తినాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మెంతి తోటకూర, బచ్చలి, కరివేపాకు, ములగాకు, ములగకాయలు, చిలకడదుంప, గుమ్మడి, బెల్లం, లివరు, మాంసం, గుడ్డు, ఖర్జూరం, బొప్పాయి, తృణ ధాన్యాలు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పప్పులు, మాంసం, గుడ్డు మొదలైనవాటిని తినాలి.
- పరిశుభ్రత-మలవిసర్జన తరువాత, ప్రతిసారీ ఆహారాన్ని తినే ముందు తబ్బుతోను, నీటితోనూ చేతుల్ని కడుక్కొంటే జీర్ణవ్యవస్థలో కొంకి పురుగులు చేరవు.
- బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ముఖ్యంగా ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం లేర బహిరంగ ప్రదేశంలో మలవిర్జన చేయవలసిన పరిస్థితి ఉన్నప్పుడు కొంకి పురుగులు పాదాలకు అంటుకొని జీర్ణవ్యవస్థలోకి చేరతాయి.
- ఎప్పటికప్పుడు గోళ్ళను కత్తిరించుకోవడం ద్వారా గోళ్ళ క్రింద మట్టి, కొంకి పురుగుల గ్రుడ్లు చేరి ఆహారంతో కలిసి కడుపు లోకి వెళ్ళడాన్ని నివారించవచ్చు.
- రుతుస్రావం అధికంగా ఉంటే డాక్టర్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
- తీవ్రమైన రక్తహీనత ఉన్నప్పుడు డాక్టర్ సలహా ప్రకారం ఆరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు లేక ఇంజక్షన్లను వాడాలి. మరీ తీవ్రమైన రక్తహీనత ఉన్నప్పుడు రక్తాన్ని ఎక్కించవలసి వస్తుంది.
శిశువులు, చంటిపిల్లలకు, ఇచ్చే ఆహారం జీవితాంతం మంచి ఆరోగ్యానికి పునాది వేయడమేగాక, చక్కటి కార్మికశక్తిని కూడా అందిస్తుంది. అందుకే ఈ విషయం చాలా ముఖ్యమైనది. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ( ఆహారం , పౌష్టికాహార సంస్థ) శిశువులు, చంటిపిల్లల ఆహారంపై జాతీయ మార్గదర్శకాలను రూపొందించింది.
శిశువులు, చంటిపిల్లల ఆహారంపై జాతీయ మార్గదర్శకాలను విస్తృతంగా ప్రచారం చేయడం కోసం మంత్రిత్వశాఖ కృషి చేసింది.
ఇందుకోసం కీలకమైన శిక్షకులను తయారుచేయడం ద్వారా రాష్ట్రాల సామర్థ్యాన్ని పటిష్టపరచేందుకు కృషి చేస్తున్నది.
దేశంలో శిశువులు, చంటిపిల్లలకు సరైన పద్ధతిలో మార్గదర్శకాలకు అనుగుణంగా ఆహారం అందేలా చూడాలన్నది పౌష్టికాహారం, ఆరోగ్య అభివృద్ది కార్యక్రమాలతో సంబంధమున్న వారందరి ప్రధానోద్దేశ్యం కావాలి.
ఆహారం కలుషితమయ్యే పద్ధతులు
ఆడపిల్లల వ్యక్తిత్వ నిర్మాణం
ఆడపిల్లల వ్యక్తిత్వ నిర్మాణం
- చదువుతోపాటు విజ్ఞానం పెంపొందించే పుస్తకాలు చదవాలి.
- ఏ రంగంలోనైనా రాణించగలనన్న ధైర్యం పెంపొందించుకోవాలి.
- అల్లరి పెట్టే వారిని ధైర్యం ఎదుర్కోవాలి.
ఆడపిల్లలలో ఆత్మస్థైర్యం
- చదువులో, సాంకేతిక విజ్ఞానంలో ముందు ఉండాలి.
- శారీరక సామర్థ్యం కలిగి ఉండాలి.
- మనసులోని విషయాలు నిర్భయంగా స్నేహితులతో పంచుకోవాలి.
- ఆటపాటల్లో పాల్గొనాలి.
సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం
- వయోజన విద్యావ్యాప్తికి సహకరించాలి.
- వీలున్నప్పుడు అంగన్ వాడి సెంటర్ / బడిలో పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేందుకు తోడ్పడాలి.
- పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి.
- స్త్రీల ఆరోగ్యం గురించి తాను నేర్చిన విషయములను పది మందిక చెప్పాలి
గర్భవతి జాగ్రత్తలు
- టి.టి. ఇంజెక్షన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
- రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వేసుకోవాలి.
- బి.పి. పరీక్ష చేయించుకోవాలి.
సుఖప్రసవం
- కాన్పు కష్టమయ్యేలా ఉంటే వెంటనే ఆస్పత్రికి పోవాలి.
- జీపు రవాణా సౌకర్యం ముందే ఏర్పాటు చేసుకోవడం మంచిది.
- అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రికి వెళ్ళాలి.
- సమయానికి వెళ్ళడం వల్ల తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారు
అప్పుడే పుట్టిన బిడ్డ సంరక్షణ
- పుట్టిన వెంటనే తల్లిపాలు తాగించాలి.
- బొడ్డుతాడు శుభ్రమైన బ్లేడుతే కత్తిరించాలి.
- బరువు చూడాలి.
- తేనె, నీళ్ళు, వేరే పాలు తాగించకూడదు.
బాలింత సంరక్షణ
- ప్రసవం తర్వాత వేడిపాలు తాగించాలి.
- సరైన పౌష్టికాహారం తీసుకోవాలి.
- ఎప్పటికప్పుడు శుభ్రమైన బట్టలు వేసుకోవాలి
పిల్లల పోషణ
- 6నెలల తర్వాత పాలతో పాటు మెత్తటి పదార్థాలు తినిపించాలి.
- ఏడాది వయస్సు వచ్చేసరికి పెద్దలు తినే అన్ని పదార్థాలు తినపించాలి.
- రెండేళ్ళ తర్వాత వాళ్ళే అన్ని పదార్థాలు సొంతంగా తినేలా నేర్పించాలి.
ప్రాణాంతక వ్యాధులు - టీకాలు
- పుట్టగానే ఇచ్చే బిసిజి టీకా క్ష నుండి కాపాడుతుంది.
- ఒకటిన్నర, రెండున్నర, మూడున్నర, నెలల్లో పోలియో చుక్కలు వేయించాలి.
- పోలియో చుక్కలతో పాటు మూడుసార్లు డిపిటి సూది వేయించాలి.
- తట్టు నుండి రక్షణకు 9 నెలలలో తట్టు సూది వేయించాలి.
కిశోర బాలికలు వ్యక్తిగత – పరిశుభ్రత
తను శుభ్రంగా ఉంటూ, తన చుట్టూ ఉండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడాన్నే పరిశుభ్రత అంటారు.
ప్రతిరోజు శుభ్రమైన నీటితో సబ్బు రుద్దుకొని స్నానం చెయ్యాలి. చంకలు, గజ్జలు, జననాంగాలు ప్రత్యేకంగా, శుభ్రం చేసుకోవాలి. మూత్రం లేక మలవిసర్జన చేశాక చేతులను సబ్బుతో, శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఉతికిన బట్టలనే వేసుకొంటూ వ్యక్తిగత పరిశుభ్రతను అలవచుకోవాలి.
జననేంద్రియాలు ఇన్పెక్షన్ రాకుండా నివారించేందుకు ఎప్పుడూ ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి. ఋతుస్రావ సమయంలో రక్తాన్ని పీల్చడానికివీలుగా మెత్తటి కాటన్ తో తయారుచేసిన శానిటరీ నాప్ కిన్స్ వాడాలి. వాడిన నాపి కిన్స్ కాల్చేయాలి లేక నేలలో పాతిపెట్టాలి. లేనిచో ఫంగస్ ఏర్పడి, గజ్జి ఇతర వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది
శారీరక ధారుడ్యం
ఆటల వలన పిల్లలు శారీరకంగా అభివద్ధి చెందుతారు మానసిక ఉల్లాసం లభిస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థ బాగుపడుతుంది. వ్యాధులకు దూరంగా ఉంటారు. ఆటల ద్వారా పిల్లలలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి.
వ్యాయామం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా తయారవుతారు. శారీరక ధారుఢ్యం వస్తుంది. చురుకుగా, ఉత్సాహవంతంగా తయారవుతారు.
పోషకాహారం
శరీరానికి కావలసిన పోషక పదార్థాలు అన్నీ సమపాళ్ళలో కలిగి ఉన్న ఆహారాన్ని పోషకాహారం అంటారు.
కౌమార దశలో ఉన్న బాలికలు వారి శారీరక, మానసిక వికాసానికి దోహదపడే సమతుల ఆహారాన్ని గురించి తెలుసుకోవాలి.
బ్రతకడానికి, మంచి ఆరోగ్యానికి, ఎదగడానికి, పనిచేయడానికి కావల్సిన శక్తిని ఆహారం అవసరం. మనం తీసుకొనే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు సరియైన పాళ్ళలో ఉండేలా చూసుకోవాలి. పసితనం, బాల్యం, కౌమార దశలలో సంతృప్తికరమైన ఎదుగుదలకు తగినంత పోషకాహారం కావాలి.
పోషకాహారం లో నాలుగు రకాలైన పదార్థాలు ఉంటాయి.
శక్తినిచ్చే ఆహారం లేదా పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు
అన్ని రకాల ధాన్యాలు, తృణధాన్యాలు, బంగాళదుంప, చిలకడదుంప, కర్ర పెండలం, అరటిపండు, పంచదార, బెల్లం, తేనె, ఎండిన పళ్ళు మొదలగునవి.
శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఆహారం లేదా మాంసకృత్తులు లేదా ప్రొటీన్లు
వృక్ష సంబంధమైనవి: రకాల పప్పులు, వేరుశనగ, చిక్కుళ్ళు, బఠాణీ, నట్స్, సోయా మొదలగునవి
జంతు సంబంధమైనవి: మాంసం, చేపలు, గ్రుడ్లు, పాలు మొదలగునవి.
క్రొవ్వు పదార్థాలు లేదా అధిక శక్తినిచ్చే ఆహారం
నూనె, నెయ్యి, వెన్న మీగడ, పనీర్, మాంసంలోని క్రొవ్వు మెదలగునవి.
రక్షణనిచ్చే ఆహారం లేదా విటమిన్లు, ఖనిజ లవణాలు
బొప్పాయి, మామిడి, అరటి, నారింజ, జామ, ఉసిరి మొదలగునవి. పండ్లు, మొలకెత్తిన గింజలు, కాయధాన్యాలు, ఖర్జూరం, ఆకుకూరలు, ఆకుపచ్చ కాయగూరలు, పాలు, అయొడిన్ ఉప్పు.
పైన చెప్పిన ఆహార పదార్థాలలో మన చుట్టుప్రక్కల దొరికే వాటిని తినాలి. ఏ ఋతువులో దొరికే ఆయా కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు మనం క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎటువంటి ఆహారాన్ని తినాలంటే
వివిధ రకాల ఆహారపదార్థాలు, ధాన్యాలు, పప్పులు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, గ్రుడ్లు, దుంపకూరలు, నూనె, చక్కెర భోజంనంలో ఉండేటట్లు చూడాలి.
- ప్రతిరోజూ ఆకుకూరలను తినాలి. వాటిలో విటమిన్లు, జనిజాలు, పీచు పదార్థాలు ఉంటాయి.
- ప్రతిరోజూ క్యారెట్, ఉల్లిపాయ, ముల్లంగి, టొమాటో, దోసకాయల వంటి పచ్చి కూరగాయలను తినాలి.
- రాగులు, గోధుమలు, జొన్నలు మొదలగు ధాన్యాలను కూడా ప్రతిరోజూ ఏదో ఒకపూట ఆహారంలో చేర్చాలి.
- మొలకెత్తిన ధాన్యాలను తినడం మంచిది.
- యవ్వనదశలో బాలికలు ఋతుస్రావం ద్వారా కొంత రక్తాన్ని కోల్పోతారు. కనుక రక్తహీనత రాకుండా ఇనుము అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలి. బెల్లం, వేరుశనగ, అటుకులు, గుడ్డులో పసుపు సొన, ములగాకు, తోటకూర, బచ్చలి, మెంతి, కరివేపాకు, చిక్కుళ్ళు, పప్పులు, ఖర్జూరం మరియు మొలకెత్తిన పప్పుల్లో ఇమును అధికంగా ఉంటుంది.
- ధాన్యాలు పప్పులు కలిసి చేసిన కిచిడి, ఇడ్లీ, మిస్సిరోటి వంటిని ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాలు.
- మలబద్ధకం రాకుండా పీచుపదార్థాలను తగినంతగా తినాలి.
- ప్రతిరోజూ తప్పనిసరిగా ఆహారంతోపాటు ఆయా కాలాలలో దొరికే తాజా పండ్లను తినాలి. ఖరీదైన యాపిల్ కంటే జామపండులో ఫోషకాలు మూడురెట్లు అధికంగా ఉంటాయి.
- రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగాలి.
కిశోర బాలబాలికలు ఉండాల్సిన బరువు మరియు ఎత్తు
వయసు సంలు | బాలురు | బాలికలు | ||
ఎత్తు (సెం.మీ) | బరువు (సెం.మీ) | ఎత్తు (సెం.మీ) | బరువు (సెం.మీ) | |
11+ |
140 |
32.2 |
142 |
33.7 |
12+ |
147 |
37.0 |
148 |
38.7 |
13+ |
153 |
40.9 |
155 |
44.0 |
14+ |
160 |
47.0 |
159 |
48.0 |
15+ |
166 |
52.6 |
161 |
51.4 |
16+ |
171 |
58.0 |
162 |
53.0 |
17+ |
175 |
62.7 |
163 |
54.0 |
18+ |
177 |
65.0 |
164 |
54.4 |
ప్రజ్ఞా నైపుణ్యాలు
ఏకాగ్రత
జ్ఞాపకశక్తిని కీలకం ఏకాగ్రత. నేర్చుకోవడం అనే ప్రక్రియలో ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. ఒకసారి. ఏకాగ్రత అలవడితే నేర్చుకేవడం చాలా సులభం అవుతుంది.
సమాచార సేకరణ
నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి సమాచార సేకరణ ఎంతో అవసరం. ఇందుకుగాను నిత్యం దినప్రతికలు, వార్తాపత్రికలు, విజ్ఞాన పుస్తకాలు, రేడియో, టి.వి. లు, కంప్యూటర్లు, వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు గాని, సంస్థల నుండి గాని మనకు కావల్సిన సమాచారాన్ని పొందడం లేక సేకరించడం.
ఆత్మస్థైర్యం
స్వతంత్రంగా ఏ పని అయినా చెయ్యగలను, కష్టతర పరిస్థితులను ఎదుర్కొని ముందుకు పోగలను, అని మన మీద మనకున్న నమ్మకాన్ని ఆత్మస్థైర్యం అంటారు. ఇందుకై
- మనం స్థిరమైన ఆలోచనలను, భావాలను కలిగి ఉండాలి.
- మనకున్న శక్తి సామర్థ్యాలను గుర్తించి, వాటిని సరియైన మార్గంలో వినియోగించుకోవాలి.
- విమర్శలకు కుంగిపోకుండా, సరిగ్గా అర్థం చేసుకొని మనవి మనం సరిదిద్దుకోవాలి.
- మంచి అనుకొన్న దానిని వెంటనే అమలు జరపటం ద్వారా ఆత్మస్థ్యైరాన్ని పెంపొందించుకోవచ్చు.
- చెడును ఎదుర్కోవడానికి, ఎదరించడానికి ధైర్యం కలిగి ఉండాలి.
ఆత్మస్థైర్యం పెరగాలంటే అమ్మాయిలు ఏం చేయాలి ?
- నేను శక్తి, యోగ్యత కలిగిదాన్నిఅన్న గట్టి నమ్మకం ప్రతి అమ్మాయికి ఉండాలి.
- జీవితంలో మనం ఇది సాధించాలి అనే ఒక లక్ష్యం ఎంచుకోవాలి. దానికోసం ప్రణాళిక ప్రకారం ప్రయత్నించాలి.
- ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పక వ్యాయామం చేయ్యాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి.
- అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
- ఆత్మరక్షణ
- ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఒంటరిగా ఉన్నప్పుడు ఆపదల నుంచి తమని తాము కాపాడుకోవడానికి కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం. చెడును ధైర్యంగా ఎదుర్కోవాలి.
యుక్తవయస్సు లక్షణాలు
కౌమారదశ అంటే ఏమిటి?
బాలబాలికలు బాల్యదశ నుండి పెద్దవాళ్ళుగా మారే ప్రక్రియను కౌమారదశ అంటారు.
కౌమారదశలో బాలికలలో కలిగే శారీరక మార్పులు
ఆడపిల్లల్లో 10సం”ల వయస్సు నుండి శారీరక మార్పులు మొదలవుతాయి. ఈ వయస్సు అమ్మాయి శరీరంలో ఈ క్రింది శారీరక, మానసిక మార్పులు కలుగుతాయి. శారీరక మార్పులు పొడవు పెరగటం, రొమ్ములు పెద్దగా అవ్వటం, పిరుదుల భాగం పెరగటం, చర్మం మృధువుగా, సున్నితంగా తయారవటం, బహిష్టు మొదలవటం కనిపిస్తుంది. అంతేకాక చంకలపైన, జననాంగాల పైన వెంట్రుకలు పెరుగుతాయి. జననవయవాల పెరుగుదల కూడా కనిపిస్తుంది. కొంతమందిలో మొటిమలు ఎక్కువగా ఉంటాయి
కౌమారదశలో బాలికలలో కలిగే మానసిక మార్పులు ఏవి ?
మానసిక మార్పులువీరి శరీరంలో మార్పుల వల్ల బాలికలలో సిగ్గు, బిడియం కలుగుతాయి. కాబట్టి వీరు అందరికీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మగపిల్లలకు దూరంగా ఉండి, ఆడపిల్లలతో స్నేహం చేస్తారు. వీరు గ్రూపులతో కలిసి ఎన్నో పనులు చేస్తారు. తల్లిదండ్రుల పట్ల వెలితిని ప్రదర్శిస్తారు.
భావోద్వేగ నైపుణ్యాలు
భావోద్వేగాలను ప్రకటించడం అంటే , సంతోషం, దు:ఖం లాంటివి వచ్చినప్పుడు వాటిని సందర్భానుసారంగా మన చుట్టుప్పక్కల ఉన్నవారికి ఇబ్బంది లేకుండా ప్రకటించడం ఒక మంచి లక్షణం.
ఆత్మ విశ్వాసం
విజయసాధనలో మొదటిమెట్టు ఆత్మ విశ్వాసం. ప్రతి బాలిక ఆత్మ విశ్వాసం తో ఉండాలంటే ముందుగా ఇతరులను అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే బాధపడకుండా , మీ పట్ల మీరు సరియైన అవగాహన, అంచనా రూపొందించుకొని ఆత్మాభిమానంతో ఉండటం అభివృద్ధిపరచుకోవాలి.
జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోగలమనే విశ్వాసం మనపై మనకు ఎంతో అవసరం. అదే మనం ఎన్నో పనులు చేయడానికి తోడ్పడుతుంద.
విమర్శలకు కుమిలిపోకుండా, సరిగ్గా అర్థం చేసుకొని, తప్పొప్పులు సరిదిద్దుకోవటం ద్వారా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి.
సరియైన నిరణయం తీసుకోవడం
విద్యార్థులు వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికిసరియైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే బాలికలందరూ ఆసమస్యల ను పరిష్కరించుకోలేరు. అందుకే సరియైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యాన్ని ప్రతి బాలిక కలిగి ఉండాలి. దేనిలోనైనా విజయం సాధించాలంటే తగిన ప్రణాళిక చాలా ముఖ్యం. ఉదాహరణకు ఏదైనా ఆటలపోటీలో ప్రథమ బహుమతి సాధించాలంటే మీరు ముందుగా ఏమేమి సాధించాలో ప్రణాళిక వేసుకోవాలి. అంటే అంచెలంచెలుగా సాధించడానికి సరియైన నిర్ణయం తీసుకోవాలి.
పెద్దలకు సూచన పిల్లలలో శక్తి సామర్థ్యాలను గుర్తించి వారి జవితంలో సాధించవలసిన వాటిని గుర్తించి ప్రోత్సహించాలి. వారిపైన వారికి నమ్మకం కలిగించేలా మాట్లాడాలి. వారు ఏమేమి సాధించ వచ్చునో తెలియజెప్పాలి. వివిధ సందర్భాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చో ఉదాహరణలు, కథలు వారికి చెప్పాలి.
స్వయం ఆలోచన
స్వంత ఆలోచన, సరియైన నిర్ణయం తీసుకోవడం, అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియపరచడం ద్వారా బాలికల్లో వివేకం, సామర్థ్యం పెరుగుతుంది.
సమస్యా సాధన
మనకు ఇంట్లో, బయట అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ముందుగా మనం సమస్యను గురించి విశ్లేషణ చేయాలి. తర్వాత మనలో ఏదైనా లోపం ఉందేమో గుర్తించాలి. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రకంగా జీవితంలో ఎదురైన ఏ సమస్యనైనా మనం తెలివిగా పరిష్కరించుకోవచ్చు
ఆత్మ నిగ్రహం
మనకు ఎవరైనా కోపం తెప్పిస్తే లేక ఎవరైనా బాధపెట్టేలా మాట్లాడినా ఉద్రేకపడకుండా ప్రశాంతంగా ఉండటాన్ని అలవర్చు కావాలి.
ప్రేమ - అనురాగం
పిల్లలు తమ చుట్టూ ఉండేవారి పట్ల అంటే తల్లిదండ్రులు, పెద్దలు, వికలాంగులు, జంతువులు, పక్షులు మరియు మొక్కల పట్ల-ప్రేమ అనురాగం కలిగి ఉండాలి. అప్పుడే వారు తమను తాము ప్రేమించుకోగలరు. అదే విశ్వశాంతికి దారి తీస్తుంది.
సృజనాత్మకత
బాలికలలో ఒక విషయాన్ని గురించి, పాత క్రొత్తల కలయికతో అనేక విధాలుగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మనం చేసే పనులలో సృజనాత్మకతను తెలిపే కృత్యాలు చేయాలి.
సామాజిక నైపుణ్యాలు
మన చుట్టూ వివిధ రకాలైన వ్యక్తలు ఉంటారు. మనం వారితే ఎలాంటి భేదాభిప్రాయాలు, సమస్యలు లేకుండా సామరస్యంగా జీవనం కొనసాగించడానికి ఉపయోగపడే నైపుణ్యాలను సామాజిక నైపుణ్యాలు అంటారు వ్యక్తిగా రాణించడానికి, మంచి పౌరులుగా సంఘజీవనం కొనసాగించడానికి సామాజిక నైపుణ్యాల అవసరం ఎంతో ఉంది.
యాజమాన్య నైపుణ్యాలు
ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సమయపాలన పాటించడం మరియు ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుకోవడానికి, స్వయంశక్తితో జీవించడానికి కావలసిన నైపుణ్యాలను పిల్లలు చిన్నవయస్సు నుండే నేర్చుకోవాలి. యవ్వన సమయం యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని తన లక్ష్యాన్ని చేరుకోవడం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం వ్యవహార దక్షత మొదలైనవి కలిగి ఉండాలి
సమయపాలన
బాలికలు సమయ పాలన యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఉన్న సమయంలో మనం చేయాల్సిన పనులన్నీ సరిగ్గా చేయగలుగుతామో అప్పుడు మనపై ఒత్తిడి కూడా ఉండదు. ముందుగా మనం మన పనుల ప్రాముఖ్యతను బట్టి సమయాన్ని విభజించుకోవాలి.
నిర్దేశిత లక్ష్యాలు
ప్రతి బాలిక తల జీవితానికి సంబంధించి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో కృషి చేయాలి.
ఆర్థిక నిర్వహణ – పొదుపు నైపుణ్యం
మన నిత్య జీవితంలో అవసరాలు, కోరికలు ఎన్నో ఉంటాయి. కాని మనం అన్నీ తీర్చుకోలేము. కనుక మనం ఉపయోగించే వస్తువులు, డబ్బులు మొదలైనవి రేపటి అవసరాలను, సమస్యలను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా దాచుకోవడం, పొదుపును, బాల్యం నుండే అందరు అలవాటు చేసుకోవాలి.
స్వయం ఉపాధిని పొందడం
స్వయం ఉపాధిని పాఠశాలలో గాని బయటగాని పొందుటకు అనేక కోర్సులను పాఠశాలల యందు, స్వచ్ఛంద సేవాసంస్థల ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్వహించబడుచున్నవి. అందులో ముఖ్యమైన స్వయం ఉపాధిని కల్పించు కోర్సులు.
బాలికలు పాఠశాలలోగాని, బయటగాని వృత్తి విద్యలను నేర్చుకొన్నట్లయితే వారికి కొన్ని వృత్తి నైపుణ్యాలు వస్తాయి. కుటుంబానికి సహాయపడవచ్చు. అంతేకాకుండా అవసరమైన సందర్భాలలో ఆర్థికంగా చేయూత నివ్వగలుగుతారు.
కె ఎస్ వై పథకం కిశోర బాలికలకు ఎంపిక చేయబడిన స్వల్పకాలిక వృత్తివిద్యా కోర్సులు
మరియు డి.ఆర్.డి.ఎ. 15% ఉమెన్ వెల్ఫేర్, బిసివెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇంటర్మీడియట్ బోర్డు, కమ్యూనిటీ పాలిటెక్నిక్ స్కీమ్ ల ద్వారా ఇచ్చే ఉచిత శిక్షణా కార్యక్రమాలు
వివిధ వృత్తి విద్యలు
- కుట్లు, ఎంబ్రాయిడరీ శిక్షణ పొందటం.
- సైకిల్ ను స్వయంగా బాగు చేసుకోవటం
- బుక్ బైండింగ్ నేర్చుకోవటం
- మార్కెటింగ్ విధానం ద్వారా డబ్బును సంపాదించే విధానం తెలుసుకోవటం.
- కంప్యూటర్, డి.టి.పి. వర్క్స్ నేర్చుకోవటం.
- ప్రింటింగ్ ప్రెస్ పని నేర్చుకోవటం.
- లెటర్ పాడ్స్ తయారుచేయటం
- గ్రీటింగ్ కార్ట్స్ తయారీ.
- ఫైల్ పాడ్స్ తయారుచేయటం
- క్యాండిల్స్ తయారుచేయటం
- పిండివంటలు.
- పూలమాలలు/పూలగుత్తుల తయారీ.
- సుద్ద ముక్కల తయారీ
- గ్యాస్ స్టవ్ రిపేరు.
- ఎలక్ట్రిక్ వస్తువుల రిపేరి.
- పెరటి తోటలు పెంపకం.
- పచ్చళ్లు, జాములు, పళ్ళరసాల తయారీ
- మహీళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తరపున 2007- 08 గాను పైన పేర్కొనబడిన వృత్తివిద్య / టెక్నికల్ / జీవనోపాధి కోర్సులను జిల్లా పరిధిలోనూ మండల / ప్రాజెక్టు పరిధిలోను కిశోర బాలికలకు అందించుటకు నిర్ణయించి ప్రారంభించుట జరిగినది. తద్వారా కిశోర బాలికలు భవిష్యత్తులో ఆర్థిక స్వావలంబన సాధించుటయేకాక ఇతర కిశోర బాలికలకు ఆదర్శపాత్రులగుటయే కాక వారి అభ్యున్నతికి కూడా సహకరించగలరు.
ఆధారము: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ – ఆంధ్రప్రదేశ్
జీవనశైలికి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతున్న 68% మంది భారతీయ ఉద్యోగినులు
మూడింట రెండువంతుల మంది ఉద్యోగినులైన మహిళలు జీవనశైలికి సంబంధించిన రోగాలతో బాధపడుతూ ఉంటే, వారిలో 53%మంది పనివత్తిడి వలన, నిర్ణీత సమయంలో అతి ఎక్కువ పనిని పూర్తి చేయాల్సి రావటం వలన, భోజనం చేసే సమయం లేక చిరుతిళ్ళు తింటున్నారని తెలిసింది.
అసోసియెటేడ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఎండ్ ఇండస్ట్రి (ASSOCHAM), నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 21 నుండి 50 సంవత్సరం మద్య వయస్సుగల ఉద్యోగినులలో 68% మంది స్థూలకాయం, మనోవ్యాధి, ధీర్ఘకాల వెన్నునెప్పి, మధుమేహం, అధిక రక్తపోటు వంటి, జీవనశైలికి సంబంధించిన వ్యాధులకు గురయినట్లుగా గుర్తించారు.
భారతదేశపు నగరాలలో 27% మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారి ఆరోగ్య సమస్యలు సమాజానికి, వ్యాపార రంగానికి ఒక పెద్ద సవాలుగా పరిణమిచిందని కూడా, ఆ నివేదిక ప్రకటించింది.
”ఆరోగ్య పరిరక్షణ మరియు కార్పొరేట్ రంగంలో మహిళా ఉద్యోగినులు”, అనే అంశం మీద చేపట్టిన, ఈ అధ్యయనం ప్రకారం ధీర్ఘకాలిక పని గంటలు, నిర్ణీతకాలంలో తప్పనిసరిగా పని పూర్తిచేయాల్సి రావటం, అనే రెండు కారణాల వలన, ఉద్యోగినులలో 75% మంది మానసిక వ్యాధులకు గురికావటం, ప్రతిదానికి ఆందోళనచెందటం జరుగుతున్నదని తెలియవచ్చింది. చేస్తున్నపనిలో మానసిక వత్తిడులు తక్కువగా ఉన్న వారికి ఈ రకపు అనారోగ్యం కూడా తక్కువగా ఉంటుంది.
ఎక్కువ పని ఒత్తిడి కలిగిన సమాచార మాధ్యమాల రంగం, విజ్ఞాన విషయానికి సంబంధించిన వ్యాపారాలు, పర్యటనలు ఆవశ్యకత గల ఉద్యోగాల రంగాలలో పనిచేసే మహిళలు, వారి ఆరోగ్యం బాగాలేనప్పటికీ సెలవు తీసికోలేని పరిస్థితులలో ఉన్నారు. ప్రత్యేకించి, ఆర్థిక వ్యవస్థ, అస్తవ్యస్థంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, ఉద్యోగాలలో ఉన్న అభద్రతా భావం వలన, ఎంతటి కఠిన పరిస్థితులలో కూడా వారు ఉద్యోగాలను అంటిపెట్టుకునే ఉంటున్నారు.
పారిశ్రామిక కాలుష్య పరిస్థితులలో పనిచేయటం వలన, వాతావరణంలో ఉండే విషవాయువుల ప్రభావం, నిద్రలేమి, వ్యాయమం లేకపోవటం, ఎండలో ఎక్కువగా తిరగటం, పోషక పదార్థాల లోపం, అతిగా మద్యపానం చేయడం, మత్తుపదార్థాలు వాడటం, ఇవన్నీ కూడా మనోవ్యాధికి కారణభూతాలని కూడా ఆ నివేదిక వెల్లడిచేసింది.
ప్రత్యేకించి ఉద్యోగాలు చేసే మహిళలు సమాజంలో అతి ప్రధానమయిన మరియు బహుముఖపాత్రను నిర్వహిస్తున్నారని ఈ నివేదిక వాస్తవాన్ని తెలియచేసింది. ఇంటిలొను మరియు కార్యాలయాలోను తమ బాధ్యతల పట్ల మహిళలు సమతౌల్యాన్ని పాటించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ లేకపోవటం వలన, ఆమె కుటుంబం, పనిచేసే కార్యలయం, మరియు పరిచయస్తుల, పరిసర పరిస్థితుల మీద ఎంతో వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుందని ఆ నివేదిక తెలిపింది.
ప్రశ్నావళిపై స్పందించినవారిలో 77% మంది, తాము సాధారణ వైద్య పరీక్షలను చేయించుకోవట్లేదని చెప్పారు. ఇంట్లోను, కార్యాలయంలో ఉన్న అధికమైన పనివత్తిడి, వ్యక్తిగత సామాజిక అవసరాలకోసమే ఉన్న సమయమంతా వెచ్చించడం వలన, వారు ఆరోగ్య విషయాన్ని నిర్లక్ష్యం చేయాల్సివస్తుందని వెల్లడయింది.
ప్రశ్నార్థులలో 47% మంది సంవత్సరానికి కేవలం రూ. 500/- లేదా అంతకంటే తక్కువ మొత్తాన్ని ఆరోగ్యానికై వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 27% మంది స్థూలకాయం, మనోవ్యాధి, స్పాండిలైటిస్ వంటి జబ్బుల పైన రూ. 500/- నుంచి రూ. 5000/- వరకు ఖర్చు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.
ప్రశ్నార్థులలో 29% మందికి పైగా సంవత్సరానికి ఆరోగ్య పరిరక్షణకై రూ. 50,000 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే వీరిలో చాలా మంది అధిక లేక అల్ప రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, మూత్ర సంబంధిత వ్యాధులు మరియు ఎముకల వ్యాధులతో బాధ పడుతున్నట్లుగా ఈ నివేదిక వివరించింది.
ఆధారము: అస్సోచం
మహిళల్లో పిల్లలు కలగకపోవడానికి కారణాలు
గణాంకాల ప్రకారం ప్రతి ఏడు జంటలలో ఒక జంట సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. మీరు ఒక సంవత్సరం పాటు సాధారణ అసురక్షిత సెక్స్ లో పాల్గొన్న సంతానం కలగకపోతే మీకు సంతానోత్పత్తి సమస్య ఉన్నదని చెప్పవచ్చు. మీరు కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న సరే సంతాన ప్రాప్తి లేకపోవటం భాదకరముగా ఉంటుంది. వంధ్యత్వంను నిర్ధారించడం చాలా బాధాకరముగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి 7 జంటలలో ఒక జంటకు వంధ్యత్వం నిర్ధారణ అయింది. అందువలన ఇప్పుడు సంతానోత్పత్తి సమస్యల గురించి అవగాహన కల్పించటం ముఖ్యంగా మారింది. చాలా మంది జంటలకు వంధ్యత్వానికి అనేక సహజ చికిత్స మార్గాలు ఉన్నాయని తెలియదు. వంధ్యత్వంలో రెండు రకాల ఉన్నాయి. ప్రాథమిక మరియు సెకండరీ వంధ్యత్వం అని పిలుస్తారు. మహిళల్లో వంధ్యత్వానికి కారణాలు హార్మోన్ స్థాయిల నుండి ఇతర అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మహిళల్లో వంధ్యత్వానికి 10 అతి సాధారణ కారణాలు ఉన్నాయి. అండోత్సర్గంలో లోపాలు వంధ్యత్వం అనేది సాధారణంగా నెలవారీ గుడ్డు విడుదల మీద ఆదారపడి ఉంటుంది. కొంతమందికి అండోత్సర్గము సమస్యలు కారణం అయితే, ఆ స్త్రీ పూర్తిగా గుడ్డు విడుదలను నిలిపివేయాలి. కొంతమందికి గుడ్డు కొన్ని చక్రాల సమయంలోను విడుదల కాదు. అండోత్సర్గము సమస్యలకు క్రింది కారణాలు ఉండవచ్చు.
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోం:
ఈ వైద్య పరిస్థితిలో అండాశయాలు గుడ్డును ఉత్పత్తి చేయటం కష్టం. ప్రిమెచ్యూర్ అండాశయ వైఫల్యం: ఈ వైద్య పరిస్థితిలో ఆమె 40 సంవత్సరాల వయస్సుకు వచ్చినప్పుడు ఓవరీల పనితనం కోల్పోతుంది. థైరాయిడ్ సమస్యలు: ఈ వైద్య పరిస్థితిలో అసాధారణ క్రియారహితంగా లేదా అతి చురుకుగా థైరాయిడ్ గ్రంథి ఉండుట వలన గుడ్డు విడుదలను నిరోదిస్తుంది.
ధూమపానం:
ధూమపానం అనేది పురుషులు మరియు స్త్రీల ఇద్దరిలోను వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు వంధ్యత్వానికి చికిత్స చేయించుకోవాలని అనుకుంటే, ధూమపానం చికిత్స ప్రభావాలు తగ్గించాలి. స్త్రీ విజయవంతంగా గర్భం పొందినా, ఆమెకు గర్భస్రావ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- వయసు ఒక స్త్రీకి 32 సంవత్సరాలు వచ్చే సరికి, ఆమె సంతానోత్పత్తి స్థాయిల క్షీణత ప్రారంభం అవుతుంది. 20 సంవత్సరాల మహిళ కంటే 35 సంవత్సరాల మహిళలో సంతానోత్పత్తి స్థాయి తక్కువగా ఉంటుంది.
- ఆల్కహాల్ వినియోగం మద్యం అధికంగా తీసుకోవడం ద్వారా గర్భం మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మద్యపానం మిత స్థాయిలో ఉన్న వంధ్యత్వం స్థాయి తక్కువ చూపించదు. కానీ ఇప్పటికే సంతానోత్పత్తి తక్కువ స్థాయి కలిగిన మహిళలు మరింత మద్యం తాగితే వారి అవకాశాలు మరింత తగ్గుతాయి. అలాగే, ఒకవేళ స్త్రీ గర్భం పొందితే కనుక ఆమె లోపాలతో ఉన్న బిడ్డకు జన్మనిస్తారు.
- ఊబకాయం పారిశ్రామీకరణ చెందిన దేశాల్లో, ఒక నిశ్చల జీవనశైలి కలిగిన ఉండుట వలన అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న మహిళల్లో వంధ్యత్వం కనపడుతుంది. ఒక నిశ్చల జీవనశైలి కారణంగా అధిక బరువు మరియు వంధ్యత్వం అనేవి వస్తాయి.
- ఈటింగ్ డిజార్డర్స్: చాలా బరువు లేదా ఒక ఈటింగ్ డిజార్డర్ ఫలితంగా, మహిళలకు గర్భం అసమర్థత బాధ పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- శాకాహారి కావడం ఇది ఒక విస్తృతమైన చర్చకు లోబడి ఉండవచ్చు. సైన్స్ ప్రకారం, ఒక ఖచ్చితమైన శాకాహారి ఎవరైనా వారు మాంసాహార ఆహారాలలో ఉండే పోషకాలను కోల్పోవటం వలన వంధ్యత్వ ప్రమాదం ఉంటుంది. ఆ పోషకాలలో ఇనుము, జింక్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి 12 మొదలైనవి ఉంటాయి. శాకాహారులు వాటిని మందులు రూపంలో తీసుకోవటం మరియు వారి ఆహారంలో ఈ పోషకాలు ఉండేలా ప్రయత్నించాలి. అయితే మీరు మందులు తీసుకునే ముందు మీరు మీ డాక్టర్ ని సంప్రదించాలి.
- వ్యాయామం లేకపోవడం ఒక నిశ్చల జీవనశైలి కారణంగా పురుషులు మరియు మహిళల్లో వంధ్యత్వానికి కారణం అవుతుంది. అందువల్ల వ్యాయామంను రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.
- ఓవర్ గా చేయడం వ్యాయామం మరియు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండే ప్రయత్నంలో, మీ శరీరాన్ని ఓవర్ గా వినియోగిస్తారు. రోజుకు 7 గంటలు వ్యాయామం చేసే మహిళలలో అండోత్సర్గము సమస్యలు ఉండవచ్చు.
- ఒత్తిడి: స్త్రీ అండోత్సర్గము అనేది మానసిక ఒత్తిడి వల్ల ప్రభావితం కావచ్చు. కాబట్టి, వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించటానికి ప్రయత్నించండి.
ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం
వైజనల్ డిశ్చార్జ్ కు జీవనశైలిలోని కారణాలు
యోని స్రావం అనేది యోని నుండి స్రావం వలే వస్తుంది. ఇది యుక్తవయస్సు చేరుకున్నా తరువాత మహిళల్లో సాధారణంగా కనపడుతుంది. మహిళల అందరికి యోని స్రావం విడుదల అవుతుంది. యోనిని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సాదారణంగా డిచ్ఛార్జ్ అనేది స్పష్టంగా లేదా మేఘాల తెలుపు రంగులో ఉంటుంది. అయితే కొన్ని సార్లు చూడటానికి కొద్దిగా పొడిగా మరియు పసుపు రంగులో ఉంటుంది. యోని స్రావం అవటానికి అనేక కారణాలు ఉంటాయి. యోని స్రావం విడుదల అవటానికి మహిళ యొక్క జీవన శైలి ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ డిచ్ఛార్జ్ అనేది ప్రతి స్త్రీలో స్థిరత్వం, రంగు మరియు వాసనల మధ్య తేడాలు ఉండవచ్చు. ఒక వయోజన మహిళలో యోని అంటువ్యాధులు రావటం అనేది చాలా సాధారణం. అకస్మాత్తుగా విపరీతంగా డిచ్ఛార్జ్ అవటం, వివర్ణమైన, మందంగా, ఒక విచిత్ర వాసన కలిగిన యోని సంక్రమణ లక్షణాలు ఉంటాయి. జీవన విధానం అనేది యోని స్రావం యొక్క ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. ఇది ఊబకాయం, వాతావరణము, మద్యపానం మరియు యాంటీబయాటిక్స్ వంటి కొన్ని అంశాలు యోని స్రావంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని నమ్ముతారు. ఇక్కడ యోని స్రావం అసాధారణంగా అవటానికి కొన్ని జీవనశైలి కారణాలు ఉన్నాయి. జీవనశైలి అనేది ఒక మహిళ యొక్క యోని స్రావం మీద ఎలా ప్రభావితం అవుతుందో పరిశీలిద్దాం
సాధారణ ఆరోగ్యము:
పేలవమైన జీవనశైలి ఆటోమేటిక్ గా అసాధారణ యోని స్రావంనకు దారి తీస్తుంది. సరైన మరియు విచక్షణరహితమైన ఆహారం తినడం ముఖ్యం. అలాగే, తగినంత నిద్ర పోవటం కూడా ఈ సమస్యను నివారించడానికి తప్పనిసరి అని చెప్పవచ్చు
ఊబకాయం:
ఊబకాయం అనేది అసాధారణ యోని స్రావంనకు దారితీస్తుంది. మీరు ఊబకాయంతో ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోరని నిపుణులు చెప్పుతున్నారు. అందువల్ల మీరు తినే ఆహారాలు ఒక చెడు వాసన విడుదలచేస్తాయి.
గర్భధారణ సమయంలో:
శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా అసాధారణ యోని స్రావం జరుగుతుంది. జీవనశైలి యోని స్రావం మీద ఎలా ప్రభావితం చేస్తుందో మరొక కారణం కండరము లోపల గర్భ నిరోధక ద్వారా ఉంటుంది. అలాగే మీరు తీసుకొనే స్టెరాయిడ్స్ కూడా ఒక కారణం అవుతాయి.
మెనోపాజ్:
మెనోపాజ్ కూడా మహిళలలో అసాధారణ యోని స్రావం అభివృద్ధికి ముఖ్యపాత్రను పోషిస్తుంది.
వాతావరణం:
వేడి వాతావరణం, గాలి ప్రసరణ లేని దుస్తులు, ముఖ్యంగా లోదుస్తులు, జననేంద్రియాల తేమ, వెచ్చదనం మరియు డార్క్ నెస్ ను పెంచే ఎటువంటి పరిస్థితి అయిన అసాధారణ యోని స్రావంనకు కారణం అవుతుంది. కొన్ని రకాల మందులు:
మహిళలలో సాధారణ యోని స్రావంనకు దారితీసే కొన్ని ఔషధాలు ఉన్నాయి. ఇటువంటి డ్రగ్స్ లో శరీరం నుంచి దుర్వాసన రావటానికి కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. సాధారణంగా చాలా మందులు ఈ వర్గంలోకి వస్తాయి. అందువల్ల, మీరు ఈ సమస్యను నివారించడానికి ఎక్కువగా నీటిని త్రాగాలి.
లైంగిక సంబంధాలు:
అసాధారణ యోని స్రావంనకు కారణం సెక్స్ జీవితం అని కూడా చెప్పవచ్చు. బహుళ భాగస్వాములతో సెక్స్ జీవిత ఆనందాన్ని పంచుకుంటే మీకు జననేంద్రియ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది మహిళల్లో అసాధారణ యోని స్రావంనకు దారి తీస్తుంది.
శరీర ఇన్ఫెక్షన్లు:
మీకు జ్వరం వచ్చినప్పుడు లేదా వైరస్ దాడి జరిగినప్పుడు, ఇది మీ శరీరం పై ప్రతికూల ప్రభావం చూపటం వలన అసాధారణ యోని స్రావంనకు కారణం అవుతుంది. ఈ ప్రధాన జీవనశైలి కారణంగా ఈ డిచ్ఛార్జ్ విడుదల అవుతుంది.
మద్యం తీసుకోవడం:
మద్యం వినియోగం వలన మరుసటి రోజు ఒక చెడ్డ వాసన వస్తుంది. అలాగే మీ మూత్రం కూడా ఒక విచిత్రమైన వాసన కలిగి ఉండటం చూడవచ్చు. అందువలన, ఈ అసాధారణ యోని విడుదలకు ఇది ఒక జీవనశైలి కారణంగా ఉంటుంది.
మధుమేహం ఉండుట:
మధుమేహం ఉన్నవారి యోని స్రావం వెళ్లుల్లి వాసన కలిగి ఉంటుంది. కానీ మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా మందులు వాడాలి.
ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం
స్త్రీలలో ఒత్తిడికి కారణాలు, దాని ప్రభావాలు ఏమిటి?
మెయిల్ చేయండి డి అనేది అన్ని వయసులు, లింగాల వారికి ఒకేలా వుండే అనుభూతి కాదు. తమ ప్రాజెక్ట్ చేతికి వచ్చాక తమ బాసులను, సీనియర్లను సంతోష పరచడానికి ఈ మధ్య జనం చాలా ఒత్తిడికి గురౌతున్నారు. లక్ష్యాలు సాధించలేనప్పుడు ఒత్తిడికి గురౌతారు. నిస్పృహకు గురయ్యే వారు చాలా రకాలుగా అవుతారు, లక్షణాలు కూడా వేరుగా వుంటాయి. అలాగే స్త్రీలలో ఒత్తిడి ఒకలాగానూ, పురుషులలో ఒకలాగానూ ఒత్తిడి వుంటుంది. స్త్రీలలో విలక్షణమైన ఒత్తిడి లక్షణాలు ఉండడానికి చాలా అంశాలు కారణమౌతాయి. వాటిలో ప్రధానమైనది ప్రజనన హార్మోన్. స్త్రీల మీద ఉండే సామాజికపరమైన ఒత్తిడి కూడా స్త్రీలలో నిరాశకు దారి తీసేంత ఒత్తిడి కలిగిస్తుంది. ఈ ఒత్తిడుల గురించి మీరు సమాచారం సేకరించ గలిగితే పరిష్కారం సాధించడం కూడా సాధ్యమే.
స్త్రీలలో నిరాశకు కారణాలు:
జన్యువులు, మనస్తత్వం కూడా మగవారిలో కన్నా స్త్రీలలో భిన్నంగా వుంటాయి. ఒకటే కారణానికి అందరు స్త్రీలు నిరాశకు గురి కారు. ప్రతి స్త్రీని ఒత్తిడికి, నిరాశకు గురి చేసే చాలా అంశాలు వున్నాయి. వాటిలో కొన్ని ఇవి : వంధ్యత్వం, గర్భధారణ – వంధ్యత్వానికి గురైన ప్రతి స్త్రీలోను హార్మోన్ల వల్ల మార్పులు కలుగుతాయి. గర్భధారణ సమయంలో కూడా స్త్రీలలో హార్మోన్ల వల్ల చాలా మార్పులు కలుగుతాయి. గర్భధారణ లో సమయం గడిచే కొద్దీ కూడా స్త్రీలలో గర్భ విచ్చిత్తి అయ్యే ప్రమాదం కూడా ఎక్కువే వుంటుంది. ఇది స్త్రీలలో ఒత్తిడికి ప్రధానమైన కారణాలలో ఒకటి.
ఆరోగ్య సమస్యలు:
చాలా మంది స్త్రీలకు రకరకాల ఆరోగ్య సమస్యలుంటాయి. వాటిలో కొన్ని మానసిక అనారోగ్యాలు, డైటింగ్ వల్ల వచ్చే ప్రభావం, నిస్సత్తువ, ధూమపానం మానివేయడం లాంటివి. ఆవిడ శారీరిక ఆరోగ్యం బాగుండదు కనుక మానసిక అనారోగ్యం రావచ్చు, దాని వల్ల నిరాశకు గురి కావచ్చు.
రుతువిరతి:
రుతువిరతి లేదా మెనోపాజ్ కాలంలో ప్రతి స్త్రీ ఒక విలక్షణమైన మానసిక స్థితిని అనుభవిస్తుంది. స్త్రీలలో ఋతు చక్రం ఆగిపోయేది ఇప్పుడే. ఆమె సంతానోత్పత్తి సామర్ధ్యం ఆగిపోతుంది. జననాంగం కూడా రుతువిరతి కాలంలో చాలా మార్పులకు గురౌతుంది. స్త్రీలలో ఇంతకు పూర్వమే నిరాశ చరిత్ర వుంటే, అది ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం వుంది.
మహిళల శరీర పటిష్టతకు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు:
శరీరాకృతి సమస్య:
యుక్త వయసుకు వచ్చిన స్త్రీ లింగ భేదం గమనించి వత్తిడికి గురి కావచ్చు. యవ్వనంలోకి వచ్చేటప్పుడు లింగ భేదం కూడా ఒత్తిడికి దారితీయ వచ్చు. శరీరాకృతి గురించిన అసంతృప్తి కూడా ఒత్తిడి పెరగడానికి కారణం కావచ్చు. యుక్త వయసులో శరీరంలో వచ్చే మార్పుల వల్ల కూడా స్త్రీలలో ఒత్తిడి కలగవచ్చు. అధిక ఒత్తిడి : తన సామర్ధ్యాన్ని మించి పని చేసే వారుకూడా ఒత్తిడికి గురయ్యే అవకాశం వుంది. మగవారితో పోలిస్తే, కార్యాలయాలు లేదా ఇళ్ళలో కూడా స్త్రీలు త్వరగా ఒత్తిడికి లోనౌతారు, నిరాశకు గురి అవుతారు. పరిశోధకుల ప్రకారం, స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ఒత్తిడి హార్మోన్లు పురుషులలో కన్నా ఎక్కువ.
మహిళల బరువును అతి సాధారణంగా తగ్గించే ఆహారాలు:
ఏదో ఒక కారణం చేత వత్తిడికి గురయ్యే స్త్రీలు నెగటివ్ గా ఆలోచిస్తారు. పాసిటివ్ ఆలోచనలు వారి మనసును ఖాళీ చేసినట్లు అనిపిస్తుంది.ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం
ఆడుతూ పడుతూ ఆ ఐదు రోజులు
యుక్త వయసులో గల స్త్రీల కొరకు ఋతుస్రావ రోజులలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అపార్డ్ సంస్థ వారు ముఖ్యమైన సమాచారాన్ని చక్కటి బొమ్మల రూపంలో పుస్తకం రూపొందించారు. ఆ పుస్తకాన్ని ఈ క్రింద గల లింకులలో చూడవచ్చు.
1వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
2వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
3వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
4వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
5వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
6వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
7వ భాగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆధారము: అపార్డ్