ఆరోగ్యం, వైద్యం (40)
ఆహారంలో మార్పులతో సంపూర్ణ ఆరోగ్యం
మన ఆకలిని సంతృప్తిపరచడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనానికి ప్రాథమిక పోషకాలు ఆహారంలో తీసుకోవడం తప్పనిసరి. ఆరోగ్యంగా జీవించేందుకు పౌష్టికాహారం గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
భారతీయ వైద్య విధానం
ప్రజలకు పూర్వ భారతీయ వైద్య విధానం యొక్క వినియోగ సమాచారం మరియు వాటి ఉపయోగాలు తెలుసుకొనే అవసరం చాలా ఉంది. దానిలో భాగంగా ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి (AYUSH) సంబంధించిన సమాచారం, వనరులను తెలియజేయటానికి ఈ పోర్టల్ ప్రయత్నం చేస్తుంది.
మానసిక ఆరోగ్యం
మానసిక ఆరోగ్యం అనేది జ్ఞానం లేదా భావావేశముల ఆరోగ్యకరమైన స్థాయి లేదా మానసిక వైకల్యం లేకపోవడంగా నిర్వచింపబడుతుంది. సకారాత్మక మనోవిజ్ఞానశాస్త్రం లేదా సంపూర్ణత్వంల దృష్టికోణంలో మానసిక ఆరోగ్యం, జీవితాన్ని అనుభవించడానికి మరియు జీవన కార్యకలాపాలు మరియు మానసిక ఉత్తేజాన్ని సాధించే ప్రయత్నాల మధ్య సమతూకాన్ని సాధించే వ్యక్తి యొక్క సామర్ధ్యాన్ని కలిగి ఉండవచ్చు
స్త్రీల అనారోగ్యం మరియు శిశు మరణాల భారాన్ని తగ్గించడానికి దేశంలో ఎన్నో సంవత్సరాలనుండి అభివృద్ధి ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఎంతో కాలంగా చాలా ప్రజాఆరోగ్య పధకాలు మరియు అభివృద్ధి సేవలు (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ ICDS) ఈ దిశగా పనిచేస్తుంది. మాతా శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యత నివ్వడంలో భారత దేశం శతాబ్ధి అభివృద్ధి లక్ష్యాలను ( మిలీనియం డెవలప్ మెంట్ గోల్స్ ) సాధించడానికి అంకిత భావంతో కృషిచేస్తోంది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక రకాల ప్రజాఆరోగ్య పథకాల పై అవగాహన కలుగజేయడం, వాటి వినియోగం అనేది ముఖ్యమైన ప్రాధమిక అంశం.
గ్రామీణ భారతదేశ ప్రజలకు ఆరోగ్య భద్రత పైన ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యానికి గల ప్రాధాన్యత పై అవగాహన కల్పించడం, దానికి కావలసిన ముఖ్యమైన సమాచారాన్ని అందజేయడం ఈ బహు బాషా పోర్టల్ యొక్క లక్ష్యం. ఈ పోర్టల్ లో దీనికి సంబందించిన ఇతర ముఖ్యమైన అంశాలు పౌష్టికాహారం, పరిశుభ్రత, ప్రాథమిక చికిత్స మరియు వ్యాధులు.