Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

వరకట్న నిషేధం

సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. సమాజంలోగల అన్నివర్గాల స్త్రీల జీవితాలపై, అంటే వారు పేదవారుగాని, మధ్యతరగతివారు గాని, సంపన్న స్త్రీలుగాని ఇది దుష్ప్రభావాన్ని చూపుతోంది.అయినప్పటికినీ అవగాహన రాహిత్యం, చదువు లేక పోవడంవల్ల వరకట్నమనేది ఎక్కువగా బీద కుటుంబాలలోగల స్త్రీలను బలిగొంటోంది.

వరకట్నవ్యవస్థ వలన కొడుకులకు, కూతుళ్ళ కన్నా ఎక్కువ విలువ ఇవ్వడం జరుగుతోంది. కూతుళ్ళంటే భారంగానూ, వారిని తమ చెప్పుచేతలలో ఆధీనంలో ఉంచుకోవడంగానూ , మరియు చదువు చెప్పించడంలోనూ ఇతర సదుపాయాలు అందించేటప్పుడూ రెండవ స్థానంగా చూడడం సమాజంలో , చాల సార్లు చూస్తుంటాము.
నేడు మన ప్రభుత్వం చాలా శాసనాలు , సంస్కరణలను ప్రవేశపెట్టడమే కాకుండా , వరకట్న వ్యవస్థ నిర్మూలనయే గాక, ఆడపిల్ల స్థాయిని పెంచేదిశలో అనేక పథకాలను తీసుకువచ్చింది.

సమాజంలోచాలావరకు పరిస్థితిని అవగాహన చేసుకోవడం జరిగింది. వరకట్నాన్ని ఇవ్వడం, తీసుకోవడాన్ని ఆపడంలో మనందరమూ కూడ ఆవశ్యకమార్పు కొరకు చురుకైన ప్రయత్నాలు చేయాలి. మనకందరికి తెలిసిన విషయమేమిటంటే మొదటగా మన కూతురి విషయంలో ఆమెకు మనం విలువ ఇస్తే ఇతరులు కూడ వారు పెద్దయినప్పుడు ఆ విలువను గ్రహిస్తారు.

ప్రాధమికమైన కొన్ని ఆచరణలను పాటించడం వలన వరకట్నానికి ముగింపు పలకవచ్చుః

  • మీ ఆడపిల్లలను చదివించండి.
  • వారు స్వప్రయోజకులుగా అయ్యేటట్లు ప్రోత్సహించండి.
  • స్వతంత్రంగాను, బాధ్యతతోటి ప్రవర్తించేటట్లు బోధించండి.
  • వారిపై (మీ ఆడపిల్లను) వివక్ష చూపకండి.
  • కట్నంతీసుకోవడం, పుచ్చుకోవడాన్ని ప్రోత్సహించకండి.

పైన చెప్పిన ఆచరణలకు వైఖరులలోమార్పు రావడం కూడ అవసరమౌతుంది. అవి ఏమిటంటే

  • ఆడపిల్లలకు పెళ్ళయిన తర్వాత వారి భర్తల మద్దతు ఉంటుందని భావించడం వల్ల ఆడపిల్లల చదువుకొరకు వారి తల్లిదండ్రులు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం జరుగుతోం ది.
  • సమాజంలోని పేదవర్గాలప్రజలు వారి ఆడపిల్లలను వారి పెళ్ళికట్నాలకు డబ్బును ఆదా చేయడం కోసం సంపాదనకై పనికి పంపిస్తారు.
  • మధ్య తగతి , ఉన్నత తరగతి కుటుంబాల వారు వారి ఆడపిల్లలను చదివిస్తున్నారు .కానీ జీవన గమ్యం కోసం ఉద్యోగం చేయడానికి ప్రాధాన్యతనివ్వరు.
  • బాగా సంపన్నులైన తలిదండ్రులు , వారి ఆడపిల్లలకు పెళ్లయ్యే వరకు పూర్తిగా సహకరిస్తారు. ఎక్కువకట్నంతో వివాహాన్నిచేస్తారు.

కాబట్టి చదువు, స్వతంత్రత(స్వేచ్చ) అనేది మీరు మీ ఆడ పిల్లలకు ఇచ్చే ఒకానొక శక్తివంతమైన విలువగల బహుమానం. ఆర్ధికంగా ఆమె నిలదొక్కుకోవడానికి, కుటుంబంలో తాను కూడా ఒక సభ్యురాలుగా చేదోడుగా ఉండగలదు. మీ ఇంటి ఆడపిల్లకు కుటుంబంలో సరైన హోదాను , గౌరవాన్ని ఇవ్వండి.
అందుకోసం చక్కటి చదువును అందించడంతో బాటు, ఆమె ఎంచుకున్న ఉద్యోగానికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వడమే ఆమెకు మీరెప్పటికైనా యిచ్చే మంచి కట్నం.

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free