అసహాయ స్ధితిలో ఉన్నవారు
అనాధ మరియు వీధి పిల్లలు
వీధి పిల్లలు
నగరంలో వీధులలో జీవించే పిల్లలని “వీధి పిల్లలు” అంటారు. వీరు కుటుంబ ఆదరణ మరియు సంరక్షణ లేనివారు. వీధులలో ఉండే చాలా మంది పిల్లల వయస్సు 5 నుండి 17 సంవత్సరాలు మధ్య ఉంటుంది, వారి జనాభా వేర్వేరు నగరాలలో వేర్వేరుగా ఉంటుంది. వదిలివేయబడ్డ భవనాలు, అట్ట పెట్టెలు, పార్కులు లేదా వీధులలోనే ఈ వీధి పిల్లలు జీవిస్తారు. వీధి పిల్లల నిర్వచనం చాలా బాగా వ్రాయబడింది కాని వారికి ప్రాథమికంగా సరైన వర్గాలు లేకపోవడం ఇబ్బంది గా ఉంది. వీళ్ళలో, వీధులలో కొంత సమయం ఉండే పిల్లల నుండి, పూర్తిగా వీధులలో జీవించే పిల్లల వర కు ఉన్నారు. మరియు పెద్దవారి ఆదరణ లేదా పర్యవేక్షణ వారికి లేదు.
యూనిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమెర్జన్సీ ఫండ్ ) చే విస్తారంగా ఆమోదించిన వీధి పిల్లల నిర్వచనాన్ని రెండు ముఖ్యవర్గాలుగా విభజించారు.
- అడుక్కోవడం నుండి అమ్మడం వంటి ఆదాయం కలిగించే పనుల వరకు చేసే పిల్లలు. పని తరువాత చాలా మంది ఇంటికి వెళ్ళి సంపాదనని వారి కుటుంబానికి ఇస్తారు. వారు పాఠశాలకి వెళుతూ ఉండవచ్చు మరియు కుటుంబానికి సంబంధించిన వారుగా ఉండవచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో, ఈ పిల్లలు చివరగా వీధులలో స్థిర పడడాన్ని ఎంచుకుంటారు.
- పిల్లలు వాస్తవంగా వీధులలో జీవిస్తారు (లేదా మామూలు కుటుంబ వాతావరణం బయట). కుటుంబ సంబంధాలు ఉండవచ్చు గాని అవి అస్థిరంగా ఉండి మామూలుగా లేదా అప్పుడప్పుడూ ఉంటాయి.
ఇండియాలో అనాధ/వీధి పిల్లలు స్థితిగతులు
- ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాప్రభుత్వం అయిన ఇండియా యొక్క ఒక బిలియన్ జనా భా లో 400 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు.
- వివిధ రకాల జాతులు, భాషలు మరియు మతాలు కలదిగా భారతదేశం అందరికీ తెలుసు. ఇండియాలో 15 వ్యా వహారిక భాషలు, 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
- సుమారు 673 మిలియన్లమంది హిందువులు, 95 మిలియన్ల మంది ముస్లింలు, 19 మిలియన్లమంది క్రైస్తవులు, 16 మిలియన్లమంది సిక్కులు, 6 మిలియన్ల మంది భౌధ్ధు లు మరియు 3 మిలియన్లమంది జైనులు భారతదేశం లో ఉన్నారు.
- భారత జనాభాలో సుమారు 26% దారిద్ర్యరేఖ క్రిందనున్న వారు మరియు 72% గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్నారు.
- భారత జనాభాలో 0.9 % మాత్రమే హెచ్ ఐ వి / ఎయి డ్స్ వ్యాధిగ్రస్తులైనప్పటికీ, ప్రపంచంలో హెచ్ ఐ వి / ఎయి డ్స్ ఎక్కువగా ఉన్న రెండవ దేశం అయింది. దక్షిణ ఆఫ్రికా ఇందులో మొదటి స్థానంలో ఉంది.
- ఈ మధ్యన, చాలా అభివృద్ధి నమోదు అయినప్పటికీ, ఆడ, మగా అనే అసమానత (లింగ విభేదం) , పేదరికం, నిరక్షరాస్యత మరియు ముఖ్యమైన సంస్థాపన సౌకర్యాలు లేకపోవడం అనే సమస్యలు ఇండియాలో హెచ్ ఐ వి / ఎయిడ్స్ ని అరికట్టడాన్ని మరియు చికిత్స కార్యక్రమాల్ని ఆటంక పరచడంలో ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. ఎయి డ్స్ యొక్క ప్రమాద ప్రభావము ఇండియా లో పూర్తిగా ప్రారంభంకాలేదు మరియు ఎయి డ్స్ కు సంబంధించిన అనాధల డాక్యుమెంట్ కాలేదు.
- అయినప్పటికి, ఇండియా మిగతా దేశాలకన్నా ఎక్కువ ఎయిడ్స్ అనాధల్ని కలిగి ఉన్నట్లు అంచనా వేశారు. మరియు ఈ సంఖ్య 5 సంవత్సరాలలో రెండు రెట్లు అవుతుందని అనుకుంటున్నారు.
- ఇండియాలో ఎయిడ్స్ ఉన్నట్లు గుర్తించిన 55,764 మందిలో 2,112 మంది పిల్లలు.
- 4.2 మిలియన్ల హెచ్ ఐ వి / ఎయిడ్స్ కేసులలో 14% ( పధ్నాలుగు శాతం) , పధ్నాలుగు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉన్నట్లు అంచనా వేసారు.
- అంతర్జాతీయ కార్మికసంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, ఎయిడ్స్ సోకిన తల్లిదండ్రు ల యొక్క పిల్లల్ని విపరీతంగా వేరుచేస్తున్నారు. కనీస అవసరాల్ని 35% వరకు నిరాకరిస్తు న్నారు. మరియు 17% వరకు వారి ఆదాయము పెంచుకోడానికి, చిన్న చిన్న ఉద్యోగాల్ని చేసేలా బలవంతం చేస్తున్నారు.
- బాలశ్రామికులు ఇండియాలో క్లిష్టమైన సమస్య , ఇది పేదరికంతో పాతుకుపోయి ఉంది.
- ఇండియాలో 11.28 మిలియన్ల మంది పనిచేసే పిల్లలు ఉన్నారని 1991 జనాభా లెక్కల డేటా తెలుపుతోంది .
- 85% కన్నా ఎక్కువ బాల కార్మికులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు, మరి ఈ సంఖ్య గత దశాబ్ధంగా పెరుగుతోం ది.
- సుమారు 3,00,000 మంది పిల్లలు పడుపువృత్తిలో ఉన్నట్లు అంచనాలు చెపుతున్నాయి. చిన్నపిల్లల వేశ్యావృత్తిని , దేవదాసి అభ్యాసం ద్వారా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల లో సామాజికంగా అనుమతిస్తున్నారు. సామాజికంగా వెనుకబడిన కమ్యూనిటీలలో యువత ను దేవతలకు ఇచ్చి, వారిని మత సంబంధమైన వేశ్యలుగా మార్చుతున్నారు. ప్రోహిబిషన్ ఆఫ్ డెడికేషన్ ఏక్ట్ 1982 ద్వారా దేవదాసిపధ్ధతి ని రద్దు చేసారు. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహరాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ మరియు అస్సాంలో ఉంది.
- 50% కన్నా ఎక్కువ దేవదాసిలు వేశ్యలుగా మారుతున్నారు. అందులో 40% వేశ్యలు పట్టణంలో బ్రోతల్ దగ్గర పడుపువృత్తిలో చేరుతున్నారు. మిగిలివవారు వారి గ్రామాలలో వేశ్యావృత్తిలో ఉంటున్నారు. జాతీయ మహిళల కమిషన్ ప్రకారం, మహరాష్ట్ర - కర్ణాటక సరి హద్దులో 2,50,000 స్త్రీలు దేవదాసిలుగా ఉంటున్నారని అంచనావేశా రు. కర్ణాటకలో బెల్గామ్ జిల్లాలో 9% దేవదాసీలకి హెచ్ ఐ వి సోకిందని 1993లో జరిపిన అధ్యయనంలో నమోదు చేయబడింది.
- వీధులే వారి కుటుంబం కన్నా ఎక్కువ అని భావించే వీధి పిల్లలకి, వీధే వారికి ఇల్లులా ఉంటుంది. ఆ పరిస్థితులలో భాధ్యతగల పెద్దవారి నుండి రక్షణ, పర్యవేక్షణ లేదా మార్గదర్శ కత్వం ఉండదు. ఇండియాలో, సుమారు 18 మిలియన్ల మంది పిల్లలు వీధులలో పనిచేయడం లేదా జీవిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ అంచనా వేసింది. ఈ పిల్లలలో చాలా మంది నేరాలు, వేశ్యవృత్తి, ముఠా గొడవలు మరియు మత్తుమందులు అమ్మేపనుల్లోచేరుతున్నారు.
వైకల్యం గలవారు
జనాభా లెక్కలు
2001 జనాభా లెక్కల ప్రకారం, ఇండియాలో 2.19 కోట్ల మంది వికలాంగులు ఉన్నారు. వారు మొత్తం జనాభాలో 2.13% ఉన్నారు. వీరిలో కంటికి, వినికిడికి, మాట, లోకోమోటారు మరియు మానసిక సంబంధమైన వైకల్యా ల్ని కలిగి ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో 75% మంది వికలాంగులు ఉన్నారు, వికలాంగులలో 49 % అక్షరాస్యులు ఉన్నారు మరియు 34% మాత్రమే పనిచేస్తున్నారు. ఇంతకుముందు వైద్య పునరావాసానికి ప్రాముఖ్యత నిచ్చేవారు, మరి ఇప్పుడు సామాజిక పునరావాసానికి ప్రాముఖ్యతనిస్తున్నారు.
జనాభా లెక్కలు, ఇండియా 2001 ప్రకారం, వికలాంగుల డేటా
కదలిక 28%
చూపు 49%
వినికిడి 6%
మాట 7%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: 2001 జనాభా లెక్కలు, ఇండియా
జాతీయ మోతాదు సర్వే సంస్థ (ఎన్ ఎస్ ఎస్ ఒ) 2002 ప్రకారం వికలాంగుల డేటా
కదలిక 51%
చూపు 14%
వినికిడి 15%
మాట 10%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: జాతీయ మోతాదు సర్వే సంస్థ, 2002
సామా జిక న్యాయం మరియు సా ధికార మంత్రిత్వశాఖలో ఉన్న డిజెబిలిటీ డివిజన్ విక లాంగులకు అధికారమిచ్చేఅవకాశం కల్పిస్తుంది. ఈ విక లాంగులు 2001 జనాభా లెక్కల ప్రకారం, 219 కోట్ల మంది మరియు మొత్తం జనాభాలో 2.13 శాతము ఉన్నారు. వీరిలో కనుచూపు లేనివారు, వినికిడిలేని వారు, మాటలేనివారు, కదలిక లేనివారు మరియు మానసికంగా వెనుకబడిన వారు ఉన్నారు.
భారత రాజ్యాంగం ప్రతివారికీ సమానత్వాన్ని, స్వేచ్ఛని, న్యాయాన్ని మరియు మర్యాదని కల్పిస్తుంది. విక లాంగులందరూ సమాజంలో భాగమని పరిపూర్ణముగా అజ్ఞాపిస్తుంది. రాజ్యాంగం, సబ్జెక్ట్ షెడ్యూల్ లో, విక లాంగులకి అధికారమివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా భాధ్యతల్నిచ్చింది. అందుచేత, విక లాంగులకు సాధికారతనిచ్చే ప్రాధమిక భాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. భారతరాజ్యాంగం, ఆర్టికిల్ 253 క్రింద యూనియన్ లిస్ట్ యొక్క అయిటమ్ 13వ నంబరు, వికలాంగులకు సమాన అవకాశాలు మరియు జాతీయ నిర్మాణంలో వారికి పూర్తి పాత్రను కల్పించే ప్రయత్నంగా ఈ చట్టం, జమ్ము & కాశ్మీరు రాష్ట్రానికి తప్ప మిగతా భారతదేశమంతా వర్తిస్తుంది. జమ్ము & కాశ్మీరు ప్రభుత్వం, విక లాంగుల (సమాన అవకాశాలు, హక్కుల సంరక్షణ మరియు పూర్తి పాత్ర) చట్టం, 1998 ని అమలు చేసింది. వికలాంగులకు ( సమాన అవకాశాలు, హక్కులు సంరక్షణ మరియు పూర్తి పాత్ర ) చట్టం, 1975 ని భారత ప్రభుత్వం శాసనాన్ని అమలు చేసింది.
తగినన్ని ప్రభుత్వాలు, అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలు మంత్రత్వశాఖలు, కేంద్ర / రాష్ట్ర అనుబంధ సంస్థలు, స్థానిక అధికారులు మరియు ఇతర అధికారులు మొదలైనవారి సహకారం తో ఈ చట్టంలోని నియమాలని అమలు చేస్తున్నారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో, వికలాంగులలో పూర్తి పాత్ర మరియు సమానత్వాన్ని వెల్లడి చేస్తానని ఇండియా సంతకం చేసింది. అడ్డంకులు లేని మరియు హక్కుల ఆధారితమైన సమాజము పై చర్య తీసుకునే బివాకో మిలియనిమ్ ఫ్రేమ్ వర్క్ మీద కూడ ఇండియా సంతకం చేసింది. 2007 సంవత్సరం, మార్చి 30వ తేదిన, యునైటెడ్ నేషన్స్ కన్ వెక్షన్ ఆన్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ద రైట్స్ మరియు డిగ్నిటీ ఆఫ్ పెర్సన్స్ విత్ డిజబిలిటీస్ మీద ఇండియా సంతకం చేసింది. 2008 సంవత్సరము, అక్టోబరు ఒకటవ తేదిన , యునైటెడ్ నేషన్స్ కన్ వెక్షన్ ను ఇండియా అమోదించింది.
ప్రభుత్వ పథకాలు
కొనుగోలు / ఫిట్టింగులలో సహాయోపక రణాలు మరియు ఉపకరణాలను వికలాంగులకు కల్పించ డానికి సహాయం ( ఎ డి ఐ పి పథకం ) వైకలాంగిక ప్రభావాన్ని తగ్గించి మరియు ఆర్థిక స్తోమతని పెంచి వారి భౌతిక, సామాజిక మరియు శాస్త్రీయంగా తయారు చేసిన, నూతనమైన ప్రమాణాలు గల సహాయోపకరణాలు మరియు ఉపకరణాలు, అవసరమైన వికలాంగులకు కొనుగోలు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ పథకం క్రింద, సరఫరా చేసిన సహాయోపకరణాలు మరియు ఉపకరణాలపై ఐ ఎస్ ఐ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టేండర్డ్) మార్క్ ఉండాలి.
ఎ డి ఐ పి పథకం క్రింద, మొత్తం సహాయం మరియు ఆదాయ పరిమితి ఈ క్రింద ఇవ్వబడింది.
మొత్తం ఆదాయం మొత్తం సహాయం
మొత్తం ఆదాయం | మొత్తం సహాయం |
---|---|
(i) నెలకి 6500 రూపాయల వరకు | (i) సహాయోపకరణాల/ ఉపకరణాల మొత్తం ధర |
(ii) నెలకి 6501 రూపాయల నుండి 10000 రూపాయల వరకు | 50% సహాయోప కరణాల/ ఉపకరణాల మొత్తం ధర |
స్వ చ్ఛంద సేవా సంస్థలు (ఎన్ జీ ఓ) , ఈ మంత్రిత్వశాఖ క్రింద ఉన్న జాతీయ సంస్థలు, కృత్రిమ అవయవాలు తయారు చేసే సంస్థ (ఒక భారత ప్రభుత్వ సంస్థ)ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం:
వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం క్రింద, మెట్రిక్ తరువాత ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉండే ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ కోర్సులు చదువుకోడానికి ప్రతి సంవత్సరం 500 క్రొత్త ఫింఛనులు ఇస్తారు. అయినప్పటికి, మెదడుకు సంబంధించిన పక్షవాతము, మానసిక మాంద్యము, ఒక్కటి కన్నా ఎక్కువ వైకల్యాలు మరియు అధిక లేదా త్రీవ్రమైన చెవుడు ఉన్న విద్యార్థుల విషయంలో 9 వ తరగతి నుండి చదువుకోడానికి విద్యార్థి ఫింఛన్లు ఇస్తారు. ఫింఛన్ల కొరకు ధరఖాస్తుల్ని తీసుకోనే ప్రకటనల్ని ప్రముఖ జాతీయ/ ప్రాంతీయ వార్తా పత్రికలలో జూన్ నెలలో ఇస్తారు మరియు మంత్రిత్వ శాఖ వైబ్ సైట్ లో కూడా పెడతారు. ఈ పథకానికి విస్తారమైన పబ్లిసిటీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాల్ని / కేంద్రపాలిత ప్రాంతాల్ని కూడా అభ్యర్ధించడం జరిగింది.
40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉండి, వారి నెలసరి ఆదాయం 15000 రూపాయలకన్నా ఎక్కువ లేని విద్యార్థులకి ఈ ఫింఛను తీసుకోవడానికి అర్హత ఉంటుంది. గ్రేడ్యుయే ట్ మరియు పోస్టు గ్రేడ్యుయే ట్ లెవెల్ టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి నెలకి 700 రూపాయల ఫింఛను మరియు వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 1000 రూపాయల ఫింఛను ఇస్తారు. డిప్లోమో మరియు సర్టిఫికెట్ లెవెల్ ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి విద్యార్థి ఫింఛను లేదా నెలకి 400 రూపాయలు మరియు వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 700 రూపాయల ఫింఛను ఇస్తారు. ఈ ఫింఛను ఇవ్వడమే కాకుండా, సంవత్సరానికి 10,000 రూపాయల వరకూ కోర్సు ఫీజుని విద్యార్థులకు ఇస్తారు. ఈ పథకం క్రింద గ్రుడ్డి మరియు చెవిటి గ్రేడ్యుయే ట్ మరియు పోస్టు గ్రేడ్యుయే ట్ విద్యార్థులకి (ప్రొఫెషనల్ కోర్సు చదువు తున్న) ఎడిటింగు సాఫ్ట్ వేరుతో పాటు కంప్యూటర్ కొరకు మరియు మెదడుకి సంబంధించిన పక్ష వాతము ఉన్న విద్యార్థులకి సపోర్టు ఏక్సెస్ సాఫ్ట్ వేరు కొరకు ఆర్థిక సహాయం చేస్తారు.
జాతీయ సంస్థలు / అఖిలస్థాయి సంస్థలు
వికలాంగులకు సాధికారతని చ్చే పా లసీకి అనుగుణంగా మరియు వారి పలు పరిమాణాల సమస్యల్ని ప్రభావితం చేయడానికి ఈ క్రిందనిచ్చిన జాతీయ సంస్థలు/అఖిలస్థాయి సంస్థలు ప్రతి పెద్ద వైకల్యం ఉన్న ప్రాంతంలో పెట్టారు.
- దృష్టి లోపముగల వారికి జాతీయ సంస్థ, డెహరాడూన్
- ఎముకల లోపముగల వారికి జాతీయ సంస్థ, కలకత్తా
- వినికిడి లోపముగల వారికి ఆలి యవర్ జంగ్ జాతీయ సంస్థ, ముంబాయి
- మాన సిక లోపముగల వారికి జాతీయ సంస్థ, సికింద్రాబాద్
- పు నరావాస అభ్యాసం మరియు రీసెర్చ్ జాతీయ సంస్థ, కటక్
- వికలాంగుల సంస్థ, క్రొత్త ఢిల్లీ
- ఒకటి కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి సాధికారత కొరకు జాతీయ సంస్థ ( ఎన్ ఐ ఇ పి ఎమ్ డి ), చెన్నై
ఉత్పాదక స్ధానం: http://www.disabilityindia.com/ మరియు సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ
పునర్జనని
పునర్జనని, మానసికంగా ఎదగని పిల్లల (ఎం.ఆర్) ల కోసం ఐ.సి.టి ఆధారిత సమగ్రమైన మదింపు చేయడానికి ఉపయోగపడే ఒక ఉపకరణం. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
వయో వృద్ధులు
వయో వృధ్ధులు : సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్య ప్రభావాలు
ఇండియాలో పెద్ద వయసులో ఉన్న మగవారిలో మూడింట రెండువంతులు మంది, మరియు పెద్ద వయసులో ఉన్న ఆడవారిలో 90 నుండి 95 శాతం మంది నిరక్షరాస్యులు, మరియు వారిలో ఎక్కువమంది, ప్రత్యేకంగా ఆడవారు ఒంటరిగా ఉంటున్నారు. అలా పెద్ద వయసులో ఉన్నవారు ఆర్థికంగా ఇతర కుటుంబసభ్యులపై ఆధారపడడం ఇండియాలో చాలా ఎక్కువ. 2001 సంవత్సరంలో, సుమారు 18 మిలియన్ల పెద్దవారైన మగవారికి మరియు 3.5 మిలియన్ల పెద్దవారైన ఆడవారికి ఉద్యోగములు అవసరమౌతాయని అంచనా వేసారు. ఈ అంకెలు ప్రస్తుతం పనిచేస్తున్నవారి సంఖ్య ఆధారంగా కట్టినవి. అంటే భవిష్యత్తులో వారికి ఉద్యోగములు సృష్టించడానికి పెద్ద మొత్తంలో వనరులు కావాలి, వారిలో చాలామంది బహుశా కుటుంబ సహాయం కొరకు తగినంత పొదుపు చేసిఉండరు. 2001 సంవత్సరములో, సుమారు 27 మిలియన్ల మంది పెద్దవారికి ఏ సమయంలోనైనాగాని వైద్య సదుపాయాలు అవసరముంటుందని కూడా అంచనా వేసారు. అటువంటి వైద్య సదుపాయాలు లేనప్పుడు వారి అవసరాల కోసం ఎక్కువ ఖర్చుని సంస్థాపన సౌకర్యాల నిమిత్తం చేయవలసి ఉంటుంది. వయస్సు మళ్ళే విధానంలో భౌతికంగా వైకల్యం కలగడం మరొక ముఖ్యమైన విషయం. 2001 సంవత్సరంలో సుమారు 17 మిలియన్ల అంగవైకల్యంగల పెద్దవారు ఇండియాలో ఉన్నారు, అందులో సగం మంది దృష్టి లోపం ఉన్నవారు ఉండవచ్చు. ఇందులో ఎక్కువ మంది పని చేయలేని స్థితిలో ఉండి ఆర్థికంగా ఇతరులపై ఆధారపడి ఉన్నా రు. కుటుంబ సహకారం లేక, వారు ప్రభుత్వ సహాయంకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వికలాంగులకు లేదా దిక్కులేని వారికి ఆర్థిక సహాయం చేయడానికి పథకాలు ప్రవేశ పెట్టినా గానీ, ఆ ఫింఛను మొత్తం నెలకి 30 రూపాయల నుండి 60 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. అంతే కాకుండా, నిధుల కొరత వలన చాలా తక్కువ మంది అర్హత గలిగిన వారికి మాత్రమే ఫింఛను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇండియాలో పెద్దవారిని పోషించే విషయాలలో ముఖ్యమైనది ఏమిటంటే, కుటుంబ సభ్యులు పెద్ద వారితో కలసి ఉండాలనే తాపత్రయం ఒకటి. పెద్దవారిని చూసే విషయంలో భాధ్యతల్ని విస్మరించే వారి మీద సామాజిక ఒత్తిడి నిరంతరంగా ఉంటుంది. అలా, పెద్దవారిని జాగ్రత్తగా చూడడంలో ఉండే సమస్య ల్ని తీర్చడానికి నైతిక విలువలని మరియు కుటుంబ సామర్ధ్యాన్ని పటిష్టం చేయడం చాలా ముఖ్యం. పెద్దవారిని మానవ వనరులుగా పరిగణించి వారి విస్తృతమైన అనుభవాన్ని మరియు మిగిలిఉన్న సామర్ధ్యాన్ని జాతీయ అభివృధ్ధికి తగిన విధంగా ఉపయోగపడేలా చేసుకోవాలి. ఆరోగ్య వంతమైన మరియు ఫలవంతమైన జీవనాన్నిసాగించే వారి సామర్ధ్యం కొనసాగేలా ప్రభుత్వం చూడాలి.
జాతీయ సామాజిక సహాయ పథకం ( ఎన్ ఎస్ ఎ పి )
1995 ఆగస్టు 15వ తేదీనుండి అమలులోకి వచ్చిన జాతీయ సామాజిక సహాయ పథకం ( ఎన్ ఎస్ ఎ పి), రాజ్యాంగంలో ఆర్టికల్ 41 లో ఉన్న ఆదేశిక సూత్రాల నునెరవేర్చడంలో ఒక ముఖ్యమైన కార్యసాధనంగా తెలియచేస్తుంది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పేదవారికి, సంపాదించే వారు మరియు తల్లి మరణించిన వారికి సామాజిక సహాయం చేయడానికి జాతీయ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో మూడు విభాగాలు ఉన్నాయి. అవి
- జాతీయ వృద్ధాప్య ఫింఛను పథకం ( ఎన్ ఒ ఎ పి ఎస్ )
- జాతీయ కుటుంబ సహాయ పథకం ( ఎన్ ఎఫ్ బి ఎస్ )
- జాతీయ మాతృత్వ సహాయ పథకం ( ఎన్ ఎమ్ బి ఎస్ )
1998 సంవత్సరములో వివిధ మూలాల నుండి ఇచ్చిన సలహాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కూడా ఈ పథకాల్ని, పాక్షికంగా మార్చారు. ఈ పథకాల ముఖ్యమైన ఆకర్షణలు ప్రస్తుతము మార్చిన నమూనాలో ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఈ పథకం క్రింద, జాతీయ వృద్ధాప్య ఫింఛను పథకానికి, కేంద్ర సహాయం ఈ క్రింద ఇచ్చిన సూత్రము ప్రకారము లభిస్తుంది .
- ధరఖాస్తుదారుని వయస్సు(మగ లేదా ఆడ) 60 సంవత్సరములు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.
- ధరఖాస్తుదారుడు, అతని/ఆమె స్వంత ఆదాయం లేదా కుటుంబ సభ్యుల లేదా ఇతర వనరుల ఆర్థిక సహాయంతో జీవనము సాగక దిక్కులేనివాడై ఉండాలి.
- వృద్ధాప్య ఫింఛను అర్హత నెలకి 200 రూపాయలు(Rs.500 for above 80 Years).
ఆధారం: భారతదేశంలో వయస్సు మళ్ళి న వారు : సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్యం : హెచ్ బి ఛానన మరియు పి పి తల్వార్, ఇంప్లికేషన్ ఏసియా పసిఫిక్ పాప్యులేషన్ జొర్నల్, రెండవ సంపుటి 337వ నంబరు.