Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

రైతులకు వాతావరణం, కరువు గురించి సలహాలు

కరవు ఏర్పడుతుందనడానికి సంకేతాలు

అనుభవం ప్రాతిపదికగా, మన వ్యవసాయ చక్రంలోని వివిధ దశలలో కరువు ఏర్పడుతుందనడానికి కొన్ని ప్రమాద సూచనలను గుర్తించడం జరిగింది. అవి:

ఖరీఫ్ సీజన్ (విత్తనకాలం: జూన్ నుంచి ఆగస్టు వరకు)

  • నైరుతి రుతుపవనాలు ఏర్పడడంలో జాప్యం
  • నైరుతి రుతుపవనాల సమయంలో మొదట్లో వానలు పడినా, తర్వాత చాలా కాలం వానలు పడకపోవడం
  • జులై నెలలో తగినంత వర్షపాతం లేకపోవడం
  • పశువుల దాణా ధరలు పెరగడం
  • జలవనరుల నీటిమట్టంలో పెరుగుదల లేకపోవడం
  • గ్రామీణ మంచినీటి సరఫరా వనరులు ఎండిపోవడం
  • ''సాధారణ సాగు" సంవత్సరాలతో పోల్చి చూస్తే, ఆ ఏడాదిలో గడచిన కొన్ని వారాలుగా విత్తనాలు వేసే స్థాయి తగ్గుతుండడం

రబి సీజన్ ( విత్తనకాలం:నవంబర్ నుంచి జనవరి వరకు)

  • మొత్తం నైరుతి రుతుపవన కాలంలో (సెప్టెంబర్ 30 నాటికి) వర్ష పాతం తగ్గుదల
  • ''సాధారణ సంవత్సరాలతో" పోల్చిచూస్తే, భూగర్భ నీటిమట్టం బాగా పడిపోవడం
  • ''సాధారణ సంవత్సరాలలో" ఇదే సీజన్‌తో పోల్చిచూస్తే, జలవనరులలో నీటిమట్టం స్థాయి పడిపోవడం. నైరుతి రుతుపన వర్షాలవల్ల జలవనరులలోకి నీటి ప్రవాహాలు బాగా తగ్గిపోయాయనడానికి ఇది సూచన.
  • భూమిలో తేమ బాగా తగ్గిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుండడం
  • పశువుల దాణా ధరల పెరుగుదల
  • టాంకర్ల ద్వారా నీటి సరఫరా పెరగడం
  • (తమిళనాడుకు, పుదుచ్చేరికి అక్టోబర్-డిసెంబర్ మధ్య వచ్చే ఈశాన్య రుతుపవనాలు కీలకమైనవి)

ఇతర సీజన్లలో

  • గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర లోతట్టు కర్ణాటక ప్రాంతాలలో, మార్చి / ఏప్రిల్ సీజన్ కీలకమైనది. ఈ సమయంలో ఈ ప్రాంతాలలో నీటి కరవుతో , మంచినీటికి తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం వుంటుంది.
  • కొన్ని నిర్దిష్ట రాష్ట్రాలలో, కొన్ని పంటల విషయంలో, ఏడాదిలో కొన్ని నిర్దిష్టమైన సీజన్లలో వానలు ఎంతైనా అవసరమవుతాయి. ఉదాహరణకు కేరళలో అరటి సాగుకు ఫిబ్రవరినెలలో వానలు ఎంతైనా అవసరం.

ఆధారం: http://agricoop.nic.in

భారతదేశంలో కరవు-కొన్ని వాస్తవాలు

నైరుతీ రుతుపవనాల (జూన్-సెప్టెంబర్) వైఫల్యం వల్లనే భారతదేశంలో కరవు ఏర్పడుతుంది. దేశంలో 73 % వర్షపాతం నైరుతీరుతుపవనాల వల్లనే వుంటున్నందువల్ల, వానలు పడని ప్రాంతాలు వానలకోసం మళ్ళీ వచ్చే రుతుపవనాల వరకు నిరీక్షించక తప్పదు.

వర్షపాతానికి సంబంధించి అందుబాటులోవున్న సమాచారం ప్రకారం కరువు దృశ్యం ఇలా వుంటుంది:

  • దేశం మొత్తం విస్తీర్ణంలో 16 % కరువు పీడిత ప్రాంతం . దేశంలో ఏడాదికి దాదాపు 5 కోట్ల మంది ( 50 మిలియన్ల మంది ) ప్రజలు కరువు బారిన పడుతున్నారు.
  • విత్తనాలు వేసే మొత్తం విస్తీర్ణంలో 68 % వివిధ స్థాయిలలో కరువుకు గురవుతుంది.
  • 35 % విస్తీర్ణంలో 750-1125 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. అందువల్ల ఈ ప్రాంతం కరువుకు లోనవుతుంది.
  • భారతదేశ భూ విస్తీర్ణం మొత్తం 329 మిలియన్ హెక్టార్లు. ఇందులో 77.6 % ఉష్ణ మండలాలు (యారిడ్), అల్ప వర్షపాత ప్రాంతాలు(సెమి యారిడ్) , భూమిలో తేమ తగినంత లేని (సబ్ హ్యుమిడ్) ప్రాంతాలు వుంటాయి. కరవు పీడిత ప్రాంతాలు చాలావరకు ఈ 77.6 % విస్తీర్ణంలోనే వుంటాయి. ఉష్ణ మండలంలో 19.6%, అల్ప వర్షపాత ప్రాంతంలో 37 %, తగినంత తేమలేని ప్రాంతంలొ 21%.
  • దేశంలో ఏడాది సగటు వర్షపాతం 1160 మిల్లీ మీటర్లు. అయితే, ఇందులో 85 % వర్షం కేవలం 100-120 రోజులలోనే ( నైరుతీ రుతుపవనాలలో) కురుస్తుంది.
  • 750 మిల్లీ మీటర్లకంటె తక్కువ వర్షపాతం పొందుతూ, 33% భూభాగం తీవ్రమైన కరవును ఎదుర్కొంటుంటుంది.
  • 21 % భూభాగంలో 750 మిల్లీ మీటర్లకంటె తక్కువ వర్షం కురుస్తుంది. ( దక్షిణ భారతదేశం ... పెనిన్సులర్ ఇండియా, రాజస్థాన్‌తో కూడిన విస్తృత ప్రాంతం)
  • 10 ఏళ్లలో 4 ఏళ్ళు వర్షపాతం అనిశ్చితంగా వుంటుంది.
  • నీటిపారుదల సామర్ధ్యం 140 మిలియన్ హెక్టార్లు. (76 మిలియన్ హెక్టార్ల ఉపరితలం + 64 మిలియన్ హెక్టార్ల భూగర్భం)
  • భూగర్భ నీటిమట్టం పడిపోతుండడం, ఉపరితల జలాలు పరిమితమైపోతుండడం వల్ల విత్తనాలు వేసే నికర విస్తీర్ణాని కంతటికి నీటి వసతి వుండకపోవచ్చు.
  • జనాభా పెరగడం, పారిశ్రామీకరణ ఎక్కువకావడం, పట్టణాలు విస్తరిస్తుండడం, ఎక్కువ పంటలు పండిస్తుండడం, భూగర్భ జలాలు తరిగిపోతుండడం...వీటన్నిటివల్ల తలసరి నీటిలభ్యత క్రమేణా తగ్గుతున్నది. సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితి పొంచివుంది.
  • పర్యవసానం...దేశంలో ఏదో ఒక ప్రాంతంలో కరువు తప్పకపోవడం

ఆధారం: సంక్షోభ యాజమాన్య ప్రణాళిక (క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్)- కరవు(జాతీయ స్థాయి) ; వ్యవసాయ, సహకార శాఖ; వ్యవసాయ మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం

వాతావరణం, వాతావరణానుగుణమైన వ్యవసాయ నిర్వహణ ప్రణాళిక

రుతుపవనాల స్ధితిని తెలుసుకోండి

పంటలకు సంబంధించి రోజువారీ వాతావరణ నివేదిక

జిల్లాలవారీగా రైతు సలహా సంస్ధలు

ద్రాక్ష రైతులకు వాతావరణ సూచనల ఆధారిత సలహాలు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free