విద్య , క్యారియర్ (2)
భారతదేశంలో విద్య
భారతదేశం లో విద్య వేల సంవత్సరాల పూర్వంనుండి తన వైభవాన్ని కలిగి ఉన్నది. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే, భారత్ లో విద్య, విజ్ఞానము సర్వసాధారణమని గోచరిస్తుంది.
సాంకేతిక విద్య అవసరం
ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం, కంప్యూటర్ విద్య ఉన్న పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరుతున్నారు.
విద్య- సామాజిక మార్పు
విద్య మానవ హక్కు, విద్య ప్రాథమిక హక్కు. విద్య సామాజిక మార్పుకు ఒక సాధనం. ప్రజలందరూ విద్యావంతులు కాకుండా సమాజ ప్రగతి సాధ్యం కాదు. సృజనాత్మకత, చొరవ, అన్వేషణ, విమర్శనా శక్తులను విద్య వెలికితేసే విధంగా ఉండాలి.
విద్య అనేది వ్యక్తి ప్రగతికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి , పురోగతికి కూడా ప్రాథమిక విద్య పునాది వంటిది. ప్రాథమిక విద్యను నేర్చుకునే పిల్లలను మరింతమందిని చేర్చుకోవడంలో, వారు మధ్యలో మానకుండా కొనసాగేలా చూడడంలో, హాజరు శాతాన్ని మెరుగుపరచడంలో, దేశ జనాభాలో దాదాపుగా మూడింట రెండువంతులమందికి అక్షరాస్యతను విస్తరించడంలో ఇటీవలి సంవత్సరాలలో ఇండియా ఎంతో ప్రగతి సాధించింది. ఇండియా ఆర్ధిక ప్రగతికి ఒక ప్రధాన సాధనంగా మనదేశంలో విద్యా వ్యవస్థ మెరుగుదలను తరచు ప్రస్తావించడం కూడా జరుగుతున్నది. అయితే, అదే సమయంలో, మనదేశంలో ప్రాథమిక విద్య నాణ్యత పరంగా అందించడంలో ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నది.
ఇండియాలో, 14 ఏళ్ళ వయస్సు వరకు బాలలందరికి ఉచిత నిర్బంధ విద్య కల్పిస్తామన్నది రాజ్యాంగ పరమైన హామీ. 6-14 ఏళ్ళ వయసు పిల్లలందరికి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ భారత పార్లమెంటు విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించింది కూడా. అన్ని పల్లెలు, వాడలలో విద్యా వసతులు కల్పించడం, ప్రాథమిక విద్య నేర్చుకునే వయసున్న బాలబాలికలను నూటికి నూరు శాతం పాఠశాలలలో చేర్చుకోవడం, అందరూ కొనసాగేలా చూడడం అనే సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యం (అందరికి ప్రాథమిక విద్య….యు ఇ ఇంకా ఊరిస్తూనే వున్నది. ఈ అంతరాన్ని పూరించడంకోసమే , ప్రభుత్వం 2001 లో సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రపంచంలోనే మిక్కిలి విస్తృతమైన కార్యక్రమాలలో ఇది ఒకటి.
ఈ సమాచార సాంకేతిక యుగంలో , విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో, వున్నవారికి-లేనివారికి మధ్య గల అంతరాన్ని తొలగించడానికి, ఐ సి టి ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తున్నది. ఇండియా డెవలప్‌మెంట్ గేట్‌వే అందిస్తున్న విద్యా సమగ్ర సమాచార దర్శిని (వెర్టికల్), ఇండియాలో సార్వత్రిక ప్రాథమిక విద్య అనే లక్ష్యాన్ని సాధించడంలో, ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని సాధన సంపత్తులను సమకూర్చి, సాధికారత కల్పించే ఒక ప్రయత్నం.