Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

ప్రకృతి వైద్యం 237

తేనె సహజ ఔషధం

తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్‌‌ట, మోల్‌‌ట్స వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గా యాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది.గొంతులో గరగరలను తగ్గిస్తుంది. తేనేలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్‌‌స , విటమిన్‌‌స వుం టాయి. కాల్షియమ్‌, మాంగనీస్‌, పోటాషియమ్‌,ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి.

తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.కీళ్ళనోప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనే, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చిన చెక్క పోడి తీసుకొండి. ఆమిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధిం చే భాగం మీద మర్ధన చేస్తే మర్ధన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది.రెండు స్పూన్ల తేనేలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలిగి, జీర్ణం సులభం చేస్తుంది.తేనే ,దాల్చిన చెక్క పొడిని బ్రెడ్‌ మీద పరుచుకుని తింటే కొలెస్టరాల్‌ తగ్గుతుంది. దిన్నేరోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్‌ రానివ్వదు. వేడినీటిలో ఒక స్పూన్‌ తేనే, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయవుతుంది.

రోగాసుర మర్దనం

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పుట్టిన బిడ్డ ఎముకలు గట్టిపడటానికి మొదలుకొని ఎన్నో కీలక సమస్యలలో మర్దనను ఒక చికిత్సా ప్రక్రియలా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలలో అనేక తైలాలతో మర్దన చేయడం ఆయుర్వేద విధానంలో ఒక మార్గం. అయితే ఇది కేవలం ఒక ఆయుర్వేదానికే పరిమితం కాదు. ఆధునిక వైద్య చికిత్సతో పాటు మరెన్నో చికిత్సా ప్రక్రియల్లోనూ అవసరాన్ని బట్టి మర్దనను ఉపయోగించడం పరిపాటి. ఈ మర్దననే బాడీ మసాజ్‌గా అభివర్ణించవచ్చు. అనేక రుగ్మతల సమయంలో ప్రకృతిచికిత్సలో మసాజ్ థెరపీకి ఉన్న ప్రాధాన్యతను తెలిపేదే ఈ ‘ముందుజాగ్రత్త’.

బిడ్డ పుట్టి ఎదిగే క్రమంలో స్నానం చేయించే ముందర కాసేపు మాలిష్ చేసినట్లుగా మర్దన చేయడం అనుభవం ఉన్న మాతృమూర్తులు చేసే పనే. తొలిచూలు మహిళలకు, బాలెంతలకూ ఈ విషయం ప్రాధాన్యాన్ని ఇంట్లోని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని బోధపరుస్తారు. ఇదీ మర్దన ప్రాధాన్యం. అంటే బిడ్డ ఆరోగ్యమైన ఎదుగుదలకు ప్రతిబంధకాలు ఎదురుకాకుండా చూసే ‘ముందుజాగ్రత్త’ విధానంగా భావించవచ్చు.

ప్రకృతిచికిత్స – మర్దనం: స్పర్శ ఉపయోగం మనకు తెలిసిందే. దుఃఖం కలిగే సమయంలో ఊరడింపునకు, అనునయానికి స్పర్శ ఉపయోగపడుతుంది. ఈ స్పర్శతో కలిగే ప్రయోజనాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ద్వారా మర్దన చికిత్సను నిపుణులు వైజ్ఞానికంగా అభివృద్ధి చేశారు. దాంతో మర్దన చికిత్స (మసాజ్ థెరపీ) అన్నది ఒక శాస్త్రంగా రూపొందింది. మర్దనప్రక్రియ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను ప్రత్యేకంగా అధ్యయనం చేసిన ఆయుర్వేదం, ప్రకృతి వైద్య విధానం దీన్ని ఒక వైజ్ఞానిక చికిత్స పద్ధతిగా ఇంకాస్త అభివృద్ధి చేశాయి. కేవలం చిన్నతనంలోనే కాదు… పెద్దయ్యాక అనేక శరీరక శ్రమలతో శరీరంలోని కండరాలు అలసటకు గురైనప్పుడు, ఆ కండరాలను సేదదీర్చడానికి మర్దన చాలామట్టుకు ఉపయోగపడుతుంది. దీన్నే ‘బాడీ మసాజ్’ థెరపీగా పేర్కొనవచ్చు.

మన దేశ సంప్రదాయంలో శరీర దారుఢ్యాన్ని పెంపొందించడానికి దండీలు, కుస్తీల వంటి సంప్రదాయ వ్యాయామాలతో పాటు మర్దనాన్ని కూడా ఎన్నో ప్రామాణిక వైద్యగ్రంథాల్లో ఉటంకించారు.

మర్దనలో జాగ్రత్తలు

మర్దనచికిత్సను చేసే నిపుణులు శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు శరీర నిర్మాణాన్ని తెలుసుకోకుండా చేసే మర్దనతో నొప్పి మరింత పెరగవచ్చు. కాబట్టి శరీర నిర్మాణ తత్వాన్ని అనుసరించి మర్దన చేయడం ఈ చికిత్స ప్రక్రియలో అవసరం.

ఏయే ఆరోగ్య సమస్యల్లో…

కొన్ని రకాల పెరాలసిస్‌లు: కొన్ని రకాలపైన పక్షవాతాల్లో చచ్చుబడిన శరీర భాగాలను మళ్లీ పునరుజ్జీవింపజేయడానికి మర్దన చికిత్స చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద చికిత్స ప్రక్రియల్లో స్నేహస్వేద ప్రక్రియల్లో ధన్వంతరి తైలం, క్షీరబలాతైలాలతో మర్దన చేయాల్సి ఉంటుంది.

నరాల నొప్పులకు: నరాలు నొక్కుకుపోవడం వల్ల పాకినట్లుగా వచ్చే సయాటికా వంటి కొన్ని నొప్పులలో నరాన్ని, నరం వెళ్లే మార్గాన్ని ఉత్తేజితం చేసినట్లుగా మర్దన చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన మహానారాయణ తైలం వంటి తైలాలను రుద్ది, ప్రకృతిచికిత్స నిపుణులు ఈ మర్దన చేస్తారు.

మాడు నొప్పి, తలనొప్పి: తలకు సంబంధించి తరచూ వచ్చే చాలా నొప్పులకు స్వచ్ఛమైన కొబ్బరినూనెతో తలపై మృదువుగా మర్దన చేయాలి. ఇలాంటి నొప్పులలో పడుకోబోయే ముందర మర్దన అవసరమవుతుంది. ప్రకృతి చికిత్సకులు, ఆయుర్వేద నిపుణుల సహాయం తో శరీరానికంతటికీ మసాజ్, ధారాచికిత్స అవసరమవుతుంది.

ఉబ్బసం, ఆయాసం: అలర్జీ వల్ల వచ్చే కొన్ని రకాల ఆయాసాలకు ఆయుర్వేద చికిత్సా విధానంలో కర్పూరతైలం, సైంధవలవణం కలిపిన నువ్వుల నూనెను ఛాతీపెనా, వీపు మీద మర్దన చేసినట్లుగా రుద్ది ఆ తర్వాత వేడినీళ్లతో కాపడం పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

కాలి మడమల నొప్పులకు: కాలిమడమల వద్ద గుచ్చినట్లుగా వచ్చే నొప్పులకు ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా మేరకు పిండతైలం, మహానారాయణ తైలాలను సమాన భాగాల్లో కలిపిన తైలంతో నొప్పి వచ్చే భాగంలో దాదాపు అరగంట పాటు మర్దన చేసి, ఆ తర్వాత కాపడం పెట్టుకోవాలి.

కండరాల్లో నొప్పులు: బాగా అలసట వల్ల వచ్చిన కొన్ని రకాల కండరాల నొప్పులు ఉపశమించేందుకు మర్దన చికిత్స ఉపయోగపడుతుంది.

కీళ్ల వాతం: కీళ్లు బిగుసుకుపోయినట్లుగా అయినందున వచ్చే సమస్యలు… ముఖ్యంగా చికన్‌గున్యా వంటి వ్యాధుల్లో కీళ్ల వాపు, నొప్పి, బిగుసుకుపోవడం వంటి సమస్యలకు మర్దన చికిత్సతో ఉపశమనం ఉంటుంది.

నిద్రలేమి: ఇటీవల పెరిగిన నిద్రలేమికి మర్దన చికిత్స సమర్థంగా ఉపయోగపడుతుంది. స్లీపింగ్ పిల్స్ వంటివి వాడకుండానే ఆరోగ్యకరమైన ప్రకృతి చికిత్సామార్గంలో క్రమం తప్పకుండా నిద్రపట్టేలా చేయడం, ‘స్లీప్ సైకిల్’ను క్రమబద్దీకరించేందుకు మసాజ్ థెరపీ ఉపయోగపడుతుంది.

అధిక బరువు నియంత్రణ: ఇటీవల శారీరకమైన శ్రమ చేయడం తగ్గిపోవడం అన్నది మారుతున్న జీవనశైలిలో మనకు అలవడ్డ దురలవాటు. దీనివల్ల బరువు పెరగడం, పొట్ట పెరగడం ఒకసమస్య. అయితే ఇది బయటకు కనిపించే సమస్య కాగా… అజీర్ణం, పొట్టపెరగడం, గ్యాస్, పుల్లటి తేన్పులు, అసిడిటీ, మలబద్దకం వంటిని అంతర్గతంగా వచ్చే అనుబంధ సమస్యలు. కొన్ని రకాల మర్దన ప్రక్రియలతో ఈ సమస్యలకూ మర్దన చికిత్స ఉపయోగపడుతుంది.

లైంగిక సమస్యలు: దైనందిన ఒత్తిడులతో లైంగిక సుఖానికి దూరమయ్యేవారికి మర్దన ఉపయోగపడుతుంది.

మానసిక ఒత్తిడులతో కలిగే అనేక అనుబంధ సమస్యలను మర్దన చికిత్స నివారిస్తుంది. మర్దనతో మానసికంగా కలిగే ఒత్తిడిని నివారించడం సాధ్యమైనందువల్ల ఒత్తిడి కారణంగా శరీరంలోకి విడుదల అయ్యే అనేక రకాల దుష్పరిణామాలను, హానికర రసాయనాలను నిరోధించవచ్చు. ఫలితంగా మానసిక ఒత్తిడులను మర్దన పరోక్షంగా నివారిస్తుందని చెప్పవచ్చు.

మర్దనతో ప్రయోజనాలు
  • శారీరకంగా, మానసికంగా రిలాక్సేషన్ లభిస్తుంది.
  • చర్మం కాంతివంతం అవుతుంది. ముఖ్యంగా మసాజ్ చేసిన చోట చర్మరంధ్రాలు బాగా తెరుచుకుని చెమటను బయటకు పంపడం వల్ల శరీరంలో మాలిన్యాలు బయటకు వెళ్తాయి.
  • రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
  • శరీర కండరాలు సేదదీరుతాయి.
  • రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది.
  • వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే సమస్యలైన కీళ్లనొప్పులు, నడుము, వెన్నెముక, మెడ నొప్పులకు మర్దన చికిత్సతో మంచి ఉపయోగం ఉంటుంది.
చేయకూడని సందర్భాలు…
  • మానసిక సంతులన లేనివారికి, గర్భణీ స్త్రీలకు పొట్ట మీద మసాజ్ చేయకూడదు.

జబ్బుల్ని నయం చేసే నీరు!

విరేచనాల వల్ల మన శరీరం ఎక్కువ నీరు కోల్పోయినప్పుడు ధారాళంగా నీటిని తాగాలి. జ్వరంతో ఉన్న జబ్బులు ఆశించినప్పుడు ఎక్కువ ద్రవాన్ని తాగడం వల్ల త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. విపరీతమైన జ్వరం లేదా వడదెబ్బతగిలినప్పుడు శరీరాన్ని చల్లటినీటితో స్నానం చెయ్యడం లేదా తడిగుడ్డతో ఒళ్ళంతా శుభ్రపరచడం మంచిది. ఉప్పు వేసిన నీటిని రోజంతా ఎక్కువసార్లు తాగాలి.

స్త్రీలలో తరచుగా కనిపించే మూత్ర సంబంధమైన అంటురోగాలకు ఎక్కువ గా ద్రవాలను తాగడం ద్వారా నయం అవుతాయి. అంటురోగాల తీవ్రతను బట్టి వైద్యనిపుణుల సలహాలు చికిత్స అవసర పడతాయి. దగ్గు, ఉబ్బసం, రొమ్ము పడిశం, న్యూమోనియా, కోరింతదగ్గు వచ్చినట్లయితే ఎక్కువనీటిని తాగడం, కఫం తగ్గడానికి వేడినీటి ఆవిరిపట్టడం చాలా మంచిది. పగుళ్ళు, పుళ్ళు, చర్మ సంబంధమైన వ్యాధులు, మొటిమలు వచ్చినపుడు సబ్బుతో బాగారుద్ది గోరువెచ్చటి నీటితో శుభ్రపరచడం మంచిది.

ఈవిధంగా ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రం చేస్తూండటం వల్ల వ్యాధులు త్వరితగతిన నయమవు తాయి. చీముపట్టిన గాయాలు, గడ్డలు, సగ్గెడ్డలు వచ్చినపుడు వేడినీటితో కాపడం పెట్టడం మంచిది. కీళ్ళు, కండరాలు నొప్పులు, బెణుకులు వంటివి వస్తే కూడా వేడినీటితో కాపడం బెట్టడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. దురద, మంట, రసికారే దద్దుర్లు ఉన్నప్పుడు చల్లటినీటితో కాపడం పెట్టడం మంచిది. తీవ్రంగా కాలిన గాయాలు అయినప్పుడు నీళ్ళతో శుభ్రం చేయకూడదు. అల్పమైన కాలిన గాయాలు అయిన సందర్భాలలో చల్లని నీటిలో ఉంచడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

గొంతునొప్పి, టాన్సిల్స్‌కు చీముపట్టడం వంటి సందర్భాలలో గోరువెచ్చటి ఉప్పునీటితో పుక్కిలించడం శ్రేయస్కరం. ఆమ్లము, దుమ్ములేక ఇతర మండే పదార్థాలు కళ్ళల్లో పడటం వంటి సందర్భాలలో వెంటనే చన్నీళ్ళతో కంటిని కడగటం మంచిది. ముక్కు దిబ్బడ చేసినప్పుడు ఉప్పునీటి ఆవిరి పీల్చడం వల్ల దిబ్బడ తొలుగు తుంది. మల బద్దకం, విరేచనం గట్టిగా అవుతున్న ప్పుడు నీటిని ధారాళంగా తాగాలి.

మొల్లలు, ఆసనం లేదా మలద్వారం వద్ద పుండ్లు ఏర్పడినప్పుడు ఒక తొట్టెలో గోరువెచ్చటి నీరు పోసి, అందులో చిటికెడు పొటాషియం పర మాంగనేట్‌ వేసి అందులో ఆసనం అనేలా కూర్చో వటం వల్ల ఉపశమనం లభిస్తుంది. వ్యాధులు త్వరితగతిన నయ మవుతాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాధి లక్షణాలనూ, వ్యాధి తీవ్రతనూ ఎప్పటి కప్పుడు వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు చేయించు కుంటూ వారి సలహా మేరకు చికిత్స పొందటం ఉత్తమం.

పండ్లు, కూరగాయలతో.. దీర్ఘాయుష్షు

దీర్ఘాయుష్షు సొంతం చేసుకోవాలనుకుంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం మొదలెట్టండి. వీటిల్లోని బీటా, అల్ఫా కెరటిన్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి పలు ప్రాణాంతక జబ్బుల మూలంగా సంభవించే మరణాల ముప్పునూ తగ్గిస్తాయని వెల్లడైంది.

కెరొటెనాయిడ్లుగా పిలుచుకునే ఇవి పండ్లు, కూరగాయలకు ఎరుపు, పసుపు, నారింజ రంగులను తెచ్చిపెడతాయి. లోనికి వెళ్లాక శరీరం ఈ బీటా కెరటిన్లను విటమిన్‌ ఎ గా మార్చుకుంటుంది. క్యారట్లు, చిలగడదుంప, గుమ్మడికాయ, మామిడితో పాటు బీన్స్‌, బఠానీ, పాలకూర వంటి వాటిల్లోనూ అల్ఫా, బీటా కెరటిన్లు దండిగా ఉంటాయి.

ఆహారంలో ఈ అల్ఫా, బీటా కెరటిన్ల ప్రభావాన్ని గుర్తించేందుకు అమెరికాలో 15,318 మందిపై సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. 1988, 1994ల్లో వీరి రక్త నమూనాలు సేకరించి, వైద్య పరీక్షలు చేశారు. 14 ఏళ్ల అనంతరం పరిశీలించగా.. రక్తంలో అల్ఫా కెరటిన్ల మోతాదు ఎక్కువగా ఉన్నవాళ్లు ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది.

వీరిలో ప్రాణాంతక జబ్బులు అంతగా లేవని గుర్తించారు. అల్ఫా కెరటిన్ల మోతాదు పెరుగుతున్న కొద్దీ జబ్బుల ముప్పు 23 నుంచి 39 శాతం వరకు తగ్గుతుండటం విశేషం. అందుకే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ దీర్ఘాయుష్షును సొంతం చేసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

దీర్ఘాయుష్షు సొంతం చేసుకోవాలనుకుంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం మొదలెట్టండి. వీటిల్లోని బీటా, అల్ఫా కెరటిన్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి పలు ప్రాణాంతక జబ్బుల మూలంగా సంభవించే మరణాల ముప్పునూ తగ్గిస్తాయని వెల్లడైంది. కెరొటెనాయిడ్లుగా పిలుచుకునే ఇవి పండ్లు, కూరగాయలకు ఎరుపు, పసుపు, నారింజ రంగులను తెచ్చిపెడతాయి. లోనికి వెళ్లాక శరీరం ఈ బీటా కెరటిన్లను విటమిన్‌ ఎ గా మార్చుకుంటుంది. క్యారట్లు, చిలగడదుంప, గుమ్మడికాయ, మామిడితో పాటు బీన్స్‌, బఠానీ, పాలకూర వంటి వాటిల్లోనూ అల్ఫా, బీటా కెరటిన్లు దండిగా ఉంటాయి.

ఆహారంలో ఈ అల్ఫా, బీటా కెరటిన్ల ప్రభావాన్ని గుర్తించేందుకు అమెరికాలో 15,318 మందిపై సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. 1988, 1994ల్లో వీరి రక్త నమూనాలు సేకరించి, వైద్య పరీక్షలు చేశారు. 14 ఏళ్ల అనంతరం పరిశీలించగా.. రక్తంలో అల్ఫా కెరటిన్ల మోతాదు ఎక్కువగా ఉన్నవాళ్లు ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. వీరిలో ప్రాణాంతక జబ్బులు అంతగా లేవని గుర్తించారు. అల్ఫా కెరటిన్ల మోతాదు పెరుగుతున్న కొద్దీ జబ్బుల ముప్పు 23 నుంచి 39 శాతం వరకు తగ్గుతుండటం విశేషం. అందుకే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ దీర్ఘాయుష్షును సొంతం చేసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

అద్భుతమైన ఆహార విలువలు గల మొక్కలు

పోషకవిలువలు గల ఆహారం తీసు కోవడం ద్వారా శరీరం శక్తివంతమవు తుంది. ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం మనం తినే ఆహారంలో ఏ పదార్థంలో ఏ పోషకవిలువలు ఉన్నాయి. అనేది తెలిసుకోవాలసిన ఆవశ్యకత ఉంది. ఏమైనే అమ్లాలు ఉన్నాయి. విటమినులు, ఖనిజాలు, క్రొవ్వులు ఇతర పోషj పదార్థాలు ఏ ఆహారపదార్థంలో ఉన్నాయి. ఎంత ప్రమాణంలో ఉన్నాయి. తెలుసు కుంటే దాని కనుగుణంగా జీవన శైలిలో మార్పుచేసుకోవచ్చు. అందువల్ల వివిధ పదార్థాలు పోషకవిలువలను పరిశీలిద్దాం.

  • జీడిమామిడి పప్పులో 8 ఎమైన్‌ ఆమ్లాలు 21 శాతం, మాంసకృత్తులు ఉన్నాయి.
  • నిమ్మ, నారింజ కన్నా జామలో 4 రెట్లు ఎక్కువ విటమిన్‌ ‘సి’ ఉంది.
  • పచ్చి చింతకాయ-టార్టారిక్‌, లాక్టిక్‌, ఎసిటక్‌ ఆమ్లాలు, ఇథనాల్‌ ఉన్నాయి.
  • మామిడి పండు-టార్టారిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ ఆమ్లాలు, కెరోటిన్‌
  • మామిడి పండులో 86 రకాల చక్కెరలు ఉన్నాయి
  • మామిడి జీడిలో ప్రోటీన్స్‌, క్రొవ్వులు లేవు, తాజాపుచ్చలో పోటాషియం ఎక్కువ
  • ఖర్జూరంతో ఫాస్పరస్‌ ఎక్కువ.
  • జామపండు తొక్కలో ఎ,బి,సి విటమిన్లు ఉన్నాయి. తొక్కలో సహా తినాలి. జామలో 7 రకాల ఆమ్లాలు, ఎంజైములు కలవు
  • జామ గింజలలో భాస్వరం, ఇనుము, కాల్షియం,
  • పనసపండునందు -13 రకాల ఎస్టర్‌లు, 9 ఆల్కాహాల్స్‌, 5 ఆల్డిహైడ్స్‌, 5 ఆమ్లాలతోపాటు పుర్‌లిన్‌ అనే ప్రత్యేక రసాయనం ఉంది.
  • చింతపండులో సిట్రిక్‌, మాలిన్‌, టేౖట్రిక్‌ ఆమ్లాలు
  • ఉసిరికాయ- గ్లూటామిన్‌, ప్రొలైన్‌, ఎలనైన్‌, లైసిన్‌, ఎస్పార్టిక్‌ ఎమైన్‌ ఆమ్లాలు.

అత్యధిక పోషకభాగం గల కొన్ని పదార్థాలు-శాఖాహారం

  • రోస్ట్‌ చేసిన వేరు శెనగ కేక్‌ -మాంస కృత్తులు
  • క్రొవ్వులు – ఆల్‌మండ్‌, ఎండుకొబ్బరి, నువ్వులు, నెయ్యి, కుకింగ్‌ ఆయిల్స్‌
  • పిండిపదార్థాలు – రాగులు, బియ్యం, రాజ్మా, ఇంగువ, ఎండుఖర్జూరం, బెల్లం, తేనె.
  • కాల్షియం – రాగులు, కాలీఫ్లవర్‌, కరివేప, నువ్వుల, జీలకఱ్ఱ, వాము, జున్ను, బెల్లం
  • ఫాస్పరస్‌ – వాము, పసుపు, ఆలమండ్‌, నుపప్పులు, ప్రత్తిగింజలు, రజ్మా, గోధుమ
  • ఇనుము – ఇంగువ, పిప్పళ్ళు, పసుపు, వేచిన మినుములు, కాలీఫ్లవర్‌, కొబ్బరి, తెలగపిండి
  • మెగ్నీషియం- సోయాబీన్స్‌, తమలపాకులు ఆల్‌మండ్‌, కాషఉ్య, అల్లం, మామిడి పండు
  • పొటాషియం- పాలు, ఆవు పెరుగు, కొబ్బరి, తెలగపిండి, జీలకఱ్ఱ, ధనియాలు, ఎండుమిర్చి, కారెట్‌, బంగాళదుంపలు, రాగులు.

అందం,ఆరోగ్యానికి దివ్యౌషధం పెరుగు

ఆరోగ్యాభివృద్ధికి పెరుగు చక్కని దివ్యౌషధం. ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలలో మీగడ తీయకుండా తయారయిన పెరుగు చాలా మంచిది.

మీగడ తీసినందున పెరుగు త్వరగా పులిసిపోవడమే కాక విలువైన పోషకాలను కోల్పోతుంది. దక్షిణాది రాష్ట్రాలలో ఉదయాన కాఫీ, టీలకు బదులుగా మజ్జిగ, పెరుగులనే ఎక్కువగా త్రాగుతుంటారు.పెరుగు చిలికి వెన్నతీసిన పుల్లని మజ్జిగ ఎండాకాలంలో చక్కని పానీయంగా పేర్కొనవచ్చు. దప్పికను అరికడుతుంది. ఉష్ణతాపాన్ని తగ్గిస్తుంది. మెదడుకు చలువను కలుగచేస్తుంది.

ఆరోగ్యాన్ని పెంపొందించే శక్తి మాత్రమేకాక సౌందర్య పోషకముగా కూడా ఉప యోగపడుతుంది. పెరుగులో చర్మాన్ని శుభ్రపరచే గుణమున్నది. శరీరంలో కండరాలను, నరాలను దృఢంగా వుంచుతుంది. చర్మానికి మృదుత్వాన్ని కలుగజేస్తుంది. వేసవిలో కమిలిన చర్మానికి సహజకాంతిని కలుగజేస్తుంది. పెరుగులోని సూక్ష్మజీవులు శరీరంకాంతిని, మృదుత్వాన్ని, నునుపును కలుగచేస్తాయి. చర్మానికి పెరుగు మర్ధన చేయడం వలన శరీరం కాంతిని సంతరించుకుంటుంది.

శిరోజాల సంరక్షణకు పెరుగు చక్కని ప్రయోజనకారి. షాంపువాడటం కంటే పెరుగు చక్కని ఫలితం కలుగచేస్తుంది. స్నానం చేయబోయే ముందు పెరుగును కుదుళ్లకు తగిలేటట్లు దట్టంగా పట్టించి పిమ్మట స్నానం చేస్తే శిరోజాలు గట్టిపడి, మృదుత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించు కుంటాయి. చుండ్రును నివారించటంలో పెరుగు అమోఘంగా పనిచేస్తుంది.

ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్‌ నారింజ లేక నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని మెడ వెనుక భాగంలో, ముఖానికి దట్టంగా రాసి, పది నిముషాల తర్వాత మెత్తని బట్టతో తుడిచి, నీటితో కడిగిన పిమ్మట టవల్‌తో మెల్లగా అద్దాలి. ఇలా చేసినట్లయితే ముఖం, మెడ వెనుక భాగం ప్రకాశవంతమవుతుంది. సాధారణంగా యుక్తవయస్సులో వున్న స్త్రీ పురుషులకు మొటిమలు తీవ్ర అసౌకర్యాన్ని, చికాకును, మనోవ్యధను కలుగచేస్తాయి. ఈ మొటిమల బారినుండి విముక్తి పొందాలంటే పెరుగులో శనగపిండిని కలిపి వాడటం ఉత్తమం.

శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పది నిముషాల తర్వాత, పరిశుభ్రమైన నీటితో కడగాలి. కొద్దిరోజులు ఇలా చేసినట్లయితే మొటిమలను దూరం చేసుకోవచ్చు. ముఖం మీద నల్లని మచ్చలు వున్నట్లయితే ముల్లంగి రసాన్ని తీసి తగినంత మజ్జిగను కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి. త్వరలో ఫలితం కనిపిస్తుంది.

నాలుగు చుక్కలు బాదంనూనె, పన్నీరు, ఒక స్పూన్‌ మజ్జిగ కలిపి స్నానానికి ముందు శరీరానికి, మెడకు, ముఖానికి రాసుకొని అరగంట తర్వాత టవల్‌తో తుడుచుకొని స్నానం చేస్తే చర్మసౌందర్యాన్ని పెంచుతుంది.ఎండవలన చర్మం కమిలినట్లయితే, రెండు స్పూనుల టమోటా రసంలో ఐదు స్పూన్ల మజ్జిగ కలిపి రాసుకొని కొద్దిసేపయ్యాక కడిగేయాలి. నాలుగు స్పూన్ల మజ్జిగలో కొద్దిగా వెనిగర్‌ కలిపి కాళ్ళకు పట్టిస్తే బిరుసుతనాన్ని పోగొడుతుంది.

ప్రతిరోజు పెరుగును తీసుకోవడం వలన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు, పొటాషియం, భాస్వరం, జింకు, పొలాసిస్‌ ‘బి’ విటమిన్‌లు వున్నాయి. పెరుగు సులభంగా జీర్ణమవుతుంది. విరేచనాలవు తున్నట్లయితే పెరుగు తీసుకుంటే క్రమంగా విరేచనాలు కట్టుకుంటాయి. పెరుగు కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. పెరుగులోని ఔషధగుణాలు గుండె జబ్బులకు, క్యాన్సర్‌ వ్యాధులకు కూడా అమోఘమైనది.

-వై.యస్‌.లక్ష్మి

కదలండి-ఆరోగ్యంగా ఉండండి

ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది.

* కష్టతరమైన పనులు చేసేవారు – వ్యవసాయ కార్మికులు, రిక్షా తొక్కేవాళ్లు, దూరం నుండి నీళ్లు తెచ్చుకునేవారు, హమాలీలు.. ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.

* ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది.

* రోజువారి పనులు నడక, సైకిల్‌ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది.

* ఏ వ్యాయామం అయినా క్రమం తప్పకుండా చేయాలి.

* మీకు ఆనందానిచ్చే వ్యాయామాన్ని ఎన్నుకోండి. వ్యాయామానికి వయస్సుతోనిమిత్తం లేదు.

* దీర్ఘకాలిక వ్యాధులు కలవారు, 40 ఏళ్లు దాటిన వారు కొత్తగా వ్యాయామం మొదలు పెట్టాలంటే డాక్టరు సలహా తీసుకోవాలి.

* ఏ వ్యాయామమైనా ఒక్కటే.

* శక్తికి మించి వ్యాయామం చేయకూడదు.

* ఎండలో వ్యాయామం చేయకుంటే మంచిది.

* నిత్య జీవితంలో రోజూ చేసే పనులు శారీరక శ్రమకు లింక్‌ చేయడం మంచిది. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగించాలి. టైము ముఖ్యం కానీ సమయాల్లో దగ్గర పనులకు నడిచి వెళ్లాలి.

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య
ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌

మొలకగింజలలో పోషకాలు!

మనం తీసుకునే ఆహారంలో గింజధాన్యాలే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మామూలు గింజలకంటే, మొలకలు వచ్చిన గింజలలోనే పోషకవిలువలు సమృద్దిగా లభిస్తాయి. ముడి ధాన్యాలకంటే, మామూలు గింజల కంటే మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి.

గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, పెసలు, శెనగలు, మినుములు, బఠాణీలు, వేరుశెనగ గింజలు, మొక్కజొన్న గింజలు లాంటివి ఎక్కువగా వాడడం వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుంది. వీటిని ఆహార పదార్థాల్లో చేర్చడం మంచిది. ఇవేకాక, బార్లీ, ధనియాలు, లాంటివి కూడా గింజధాన్యాలలోకే చేరతాయి.

మొలక గింజలను తాలింపువేసి, అందులోని సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లి, నిమ్మరసం కలిపితింటే ఎంతో రుచిగా ఉండటమే కాక, వాటిలోని పోషకవిలువలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా, ఆటలాడే పిల్లలకు మొలక గింజలను తినిపిస్తే వారి ఎదుగుదల బాగుంటుంది. వారానికి రెండు, మూడు సార్లు మొలక గింజలను తినడం ఆరోగ్యకరం.

ఉదయం అల్పాహారంగా మొలకెత్తిన గింజలను తినడం వల్ల, ఎంజైములు చైతన్యవంతమవుతాయి. అందువల్ల పోషక విలువలు వాటిలో అధికంగా లభిస్తాయి. మొలక గింజలలోని ఎంజైములు చర్య ప్రారంభించడం వల్ల గింజలలోని సంక్లిష్టపదార్థాలు తేలికగా మారి, జీర్ణక్రియకు చక్కగా తోడ్పడతాయి. మొలకెత్తిన గింజలను, డయాబెటిస్‌ వ్యాధితో బాధపడే రోగులు కూడా తినవచ్చు.

మొలకగింజలలో కార్బోహైడ్రేట్స్‌ శాతం తగ్గిపోయి, విటమినులు పెరుగుతాయి. మొలక గింజల్లో ఎ విటమిన్‌, రెబోఫ్లోవిన్‌, దయామిన్‌, నియాసిస్‌ లాంటి పోషక పదార్థాలు లభిస్తాయి. ఆహార పదార్థాల్లో ప్రధానమయిన గింజ ధాన్యాలను చేరుస్తూ, పోషకాహారలోపం కలుగకుండానూ, శరీరానికి శక్తిని సమకూరుస్తూ, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి.

ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి

ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.

రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్‌, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి.

ఉసిరితో ఎంతో మేలు
  • ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది.
  • ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.
  • లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.
  • హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది.
  • మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
  • విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.
  • కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత
  • ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

బలాన్ని ఇచ్చే బాదం

బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం.

ఎలా వాడితే మంచిది?

వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చే యడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.

బాదంపాలు

బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.

మంచి టానిక్‌

బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజూ పరిమితం గా బాదం తినడం వలన రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ రాత్రి 10-15 బా దం పప్పులు తినడం వలన సాఫీగా విరేచనం అవుతుంది.చర్మవ్యాధుల్లో బాదం నూనెను పైపూతగా వాడవచ్చు. వీర్యవృద్ధికి బాదం సాయపడుతుంది.

కొన్ని సూచనలు

ఇందులో కొవ్వు ఎక్కువ కనుక లావుగా ఉన్న వారు ఎక్కువగా తినకపోవడం మంచిది. తొక్క తీసి తింటే మంచిది. భోజనం చేయగానే తినకూడదు. పిల్లలకు పరిమితంగా బాదం పప్పు ఇచ్చినట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు.

డాక్టర్‌ గాయత్రీదేవి
ఆయుర్వేద వైద్యనిపుణులు
ఆరోగ్యపీఠం, మోతీనగర్‌
హైదరాబాద్‌
ఫోన్‌ నెం. 98488 30055

ఆధారము: వైద్యం.ఇన్ఫో

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free