Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

రక్త దానం

ప్రాణాధారం..రక్తం

రక్తహీనత ఉన్నప్పుడు మొత్తం జీవక్షికియలన్నీ నెమ్మదిస్తాయి. 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల్లో 11.0, టీనేజీ పిల్లల్లో 12.0, మహిళల్లో 11.0, పురుషుల్లో 13.0 గ్రాములు ఉండాలి. అంతకంటే తక్కువ హిమోగ్లోబిన్ నమోదైన వారు అనీమియాతో బాధ పడుతున్నట్టే.

అనసూయమ్మ ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తున్నారు. కనీసం అరగంట వాకింగ్ చెయ్యడం కూడా చాలా కష్టంగా ఉంటోంది.

రాఘవరావుకు విపరీతమైన నీరసం, సాయంత్రం అయ్యేసరికి ఎంత మాత్రం ఓపిక ఉండ

నిఖితకు దేని మీద శ్రద్ధ లేకుండా పోతోంది, ఈ మధ్య మార్కులు బాగా తగ్గిపోయాయి.

బుజ్జిగాడు ఇంతకు ముందులా చురుకుగా ఆడుకోవడమే లేదు. ఎప్పుడూ డల్‌గా అనిపిస్తున్నాడు.

* * *

వీరందరికి డాక్టర్ చెప్పిందొకటే... ఒంట్లో తగినంత రక్తం లేదు అని. రక్తం తగ్గితే మొత్తం శరీర వ్యవస్థే అస్తవ్యస్థం అవుతుంది.

* * *

శరీరంలోని కణ కణానికి కావలసిన ప్రాణవాయువునే కాకుండా ప్రొటీన్లు, హార్మోన్లు ఎన్నింటినో సరఫరా చేసే రక్తం అత్యంత కీలకమైనది. దీనిలో ఎర్రరక్త కణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌పూట్లు అని మూడు రకాల కణాలు ఉంటాయి. వీటిలో ఎర్రరక్తకణాలలో హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను గ్రహించి శరీరంలోని ఇతర భాగాలకు అందిస్తుంది.

హిమోగ్లోబిన్.. కీలకం

ఏ కారణం చేతనైనా ఎర్రరక్త కణాలు తగ్గిపోతే హిమోగ్లోబిన్ మోతాదు తగ్గిపోయి శరీర భాగాలకు అందాల్సినంత ఆక్సిజన్ అందదు. ఈ స్థితినే రక్తహీనత లేదా అనీమియా అంటారు. సాధారణంగా అనీమియా పౌష్టికాహార లోపం వల్ల ఏర్పడుతుంది. ఆహారంలో ఐరన్ శాతం, విటమిన్ బి12 తగ్గడం వల్ల అనీమియా వస్తుంది. కొన్ని సార్లు నొప్పి తగ్గించే మందులు ఎక్కువగా వాడడం వల్ల కడుపులో అల్సర్లు రావచ్చు. వీటి నుంచి రోజూ కొదికొద్దిగా రక్తవూసావం జరిగి శరీరంలో రక్తం తగ్గిపోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల్లో రక్త వృద్ధికి ఉపకరించే ఎరివూతోపయోటిన్ అనే హార్మోన్ తక్కువవడం, డయాలిసిస్‌లో కొంత రక్తం పోవడం వల్ల కూడా అనీమియా రావచ్చు. థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవడం వల్ల థైరాక్సిన్ హార్మోన్ స్థాయిలో హెచ్చుతగ్గులు కూడా అనీమియాకు దారి తీస్తాయి. మొలల వ్యాధి ఉన్న వారిలో కూడా రక్త స్రావం వల్ల రక్తనష్టం జరుగుతుంది. ఇది కూడా అనీమియాకు కారణం అవుతుంది. మహిళల్లో నెలసరి సమయంలో రక్తవూసావం ఎక్కువగా ఉండడం, ప్రమాదాలు జరిగినపుడు రక్త స్రావం జరగడం వల్ల కూడా రక్తహీనతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అనీమియా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలలో ఎర్రరక్తకణాల సంఖ్య, హిమోగ్ల్లోబిన్ స్థాయి వంటివి తెలుసుకుంటారు.

పిల్లలు సున్నం తింటున్నారా..?

రక్తహీనత వల్ల కలిగే బాధ పెద్ద సమస్యగా కనిపించకపోయినా రోజువారీ పనులకు విపరీతమైన ఆటంకంగా ఉంటాయి. నీరసంగా అనిపించడం, చాలా త్వరగా అలసి పోవడం, ఏమాత్రం కష్టపడినా ఆయాసంగా ఉండడం, చర్మం, కళ్లు, గోళ్లు పాలిపోయినట్టు ఉండడం లాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో పికా అనే ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. ఇలాంటివాళ్లు మట్టి, సున్నం, పేపర్, వెంట్రుకలు వంటివి తినాలనిపిస్తుంది. ఆకలి మందగించడం, చదువుకునే వయసులో ఉన్న వారిలో చదువులో వెనకబడటం, చురుకుదనం తగ్గడం, శ్రద్ధ తగ్గడం కూడా గమనించవచ్చు.

రక్తవృద్ధికి ఎరిత్రోపాయిటిన్

అనీమియాకు చికిత్స చెయ్యాలంటే ముందుగా అది రావడానికి కారణం కనుగొనాలి. ఆ కారణానికి ముందుగా చికిత్స చేయకుండా అనిమియా తగ్గించడానికి ప్రయత్నించడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల రక్తహీనత వస్తే వారికి కచ్చితంగా ఎరివూతోపాయిటిన్ తక్కువగా ఉంటుంది. ఈ హర్మోన్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి వారికి తప్పకుండా ఎరవూతోపాయిటిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రోగి పరిస్థితిని బట్టి వారానికి ఒకటి రెండు సార్లు, కొంత మందిలో రోజూ తీసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. ఎరివూతోపాయిటిన్ కంటే సమర్థవంతంగా పనిచేసే డెర్బొపాయిటిన్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఇది రోగి పరిస్థితిని బట్టి వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.

అల్సర్లు ఉన్నవాళ్లు ముందుగా అల్సర్లకు చికిత్స తీసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా కోలుకోవచ్చు. అదేవిధంగా రుతుసంబంధ సమస్యలు, పైల్స్ లాంటి సమస్యలను తగ్గించుకోవడం ద్వారా రక్తహీనత తలెత్తకుండా చూసుకోవచ్చు. పౌష్టికాహార లోపం వల్ల వచ్చే అనీమియాను తగ్గించడం చాలా సులభం. దీనికి కేవలం ఐరన్ సప్లిమెంట్స్, విటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకోవాలి. వీటితోపాటు ఆకుపచ్చని ఆహారపదార్థాలు అంటే చిక్కుళ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అనీమియాను తగ్గించవచ్చు. ప్రమాదాలు జరిగి ఎక్కువ రక్తవూసావం జరిగి ప్రాణాపాయ పరిస్థితి ఉంటే తప్ప రక్తం ఎక్కించడం అంత మంచిది కాదు. దీని వల్ల కొత్త సమస్యలు కూడా రావచ్చు.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తము అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయ పడుతుంది. ప్రమాదానికి గురైనవారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్త్రచికిత్స రక్తం కావలసిన రోగులకు, మీ రక్తాన్ని పరీక్ష చేసిన తరువాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకి, రక్తహీనతతో బాధపడే రోగులకి మరియు ఇతర శస్త్రచికిత్స ఎర్ర రక్త కణాలు మాత్రమే కావలసి వస్తాయి. ఈ ఎర్ర రక్త కణాలు మీ రక్తం నుండి వేరుచేయబడతాయి.

రక్త దానం చేయడంలో చిట్కాలు

రక్తాన్ని దానం చసే కనీసం 3 గంటల ముందు మంచి భోజనాన్ని తీసుకోండి.

  • దానం చేసిన తరువాత మీకిచ్చిన ఉపాహారములను తీసుకోండి, మీరు వాటిని తీసుకోవడం ముఖ్యం. తరువాత మంచి భోజనాన్ని తీసుకోవడం మంచిది
  • దానం చేసే రోజు ముందు పొగ త్రాగడం మానండి. దానం చేసిన 3 గంటల తరువాత మీరు పొగ త్రాగవచ్చు
  • దానం చేసే 48 గంటల ముందు మీరు ఆల్కహాలు సేవించి ఉంటే, మీరు దానం చేయడానికి అర్హులు కారు.

రక్తదానం గురించి అపోహలు

  • "దానము చేసిన తరువాత నానుంచి ఏదో పోయినట్టు మరియు నేను అలసి పోయినట్టు ఉంటుంది" – ద్రవ్యాలను మరియు మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే, మీ నుండి ఏదో పోయినట్టుగాని లేదా మీరు అలసి పోయినట్టుగాని ఉండరు
  • "నేను సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనలేను" –మిమ్మల్ని పాల్గొనవద్దని మీకు చెప్పినప్పటికీ, మీ అన్ని సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనవచ్చు
  • "నాకు రక్తం తక్కువ అవుతుంది" – మీరు డాక్టరు చేత దానం చేయడానికి, సరే అని అనిపించు కున్న తరువాత, దానం చేసిన తరువాత కూడా మీకు సరిపడా రక్తం ఉంటుంది
  • "నేను మద్యం సేవించలేను..." – తరువాత రోజు నుండి మీరు సేవించవచ్చు
  • "దానం చేసే సమయంలో నొప్పిగా ఉటుంది" - కాదు, మీకు ఎటువంటి నొప్పి కలుగదు
  • "నాకు తలతిరిగి సొమ్మసిల్లి పోవచ్చు" – రక్తం దానం చేసిన తరువాత,కొంతసేపు విశ్రాంతి తరువాత, మీరు సొమ్మసిల్లిపోరు లేదా అసౌకర్యం కలుగదు.
  • "నాకు ఎయిడ్స్ కలుగవచ్చు!" - లేదు! ఒకసారి ఉపయోగించి పారవేసే సిరంజ్ లను ఉపయోగించేలా మరియు క్రిములబారి నుండి దూరంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
  • "నా రక్తం సామాన్యమైనది. దానికి గిరాకి ఉంటుందని నేననుకోవడం లేదు" – అందుకే అరుదైన వాటి కన్నా మీ గ్రూపు రక్తానికే ఎక్కువ గిరాకీ ఉంటుంది.

ఆధారము: భారత్ బ్లడ్ బ్యాంకు

రక్తం గురించి నిజాలు

  • రక్తం అనేది శరీర హృదయం, ధమనులు, సిరలు మరియు కేశనాళికల ద్వారా ప్రసరించి మీ ప్రాణాలను నిలబెట్టే ద్రవ్యము
  • రక్తం శరీర పోషణకి, విద్యుద్వాహక లవణాలు (electrolytes), హార్మోన్లని, విటమిన్లని, ప్రతిరక్షకణాలు (antibodies), వేడిని మరియు ఆమ్లజని ని తీసుకువెళతాయి
  • శరీరము నుండి వ్యర్థ పదార్థాలని మరియు కార్బన్డయాక్సైడ్ని రక్తం తీసుకువెళుతుంది
  • రక్తం, వ్యాధులను ఎదుర్కొని మరియు గాయాలకు ఉపశమనం కలిగించడానికి దోహదపడి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • మీ శరీర బరువులో, రక్తం సుమారు 7% వరకు ఉంటుంది
  • అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో సుమారు ఒక కప్పు రక్తం ఉంటుంది
  • వ్యాధులను ఎదుర్కొనడంలో, తెల్ల రక్త కణాలు శరీరము యొక్క ప్రాధమిక సురక్ష.
  • ఒక రకమైన తెల్ల రక్త కణాలైన గ్రేన్యులొకైట్స్, సూక్ష్మక్రిములు (bacteria) వెదకి నాశనం చేయడానికి రక్త కణాల గోడల చుట్టూ తిరుగుతాయి
  • శరీర అవయవాలకి మరియు కణజాలానికి (tissues), ఎర్ర రక్త కణాలు ఆమ్లజనిని తీసుకు వెళతాయి
  • రెండు నుండి మూడు రక్త బిందువులలో, సుమారు ఒక బిలియన్ ఎర్ర రక్త కణాలు ఉంటాయి
  • ప్రసరణ వ్యవస్థలో, ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవించి ఉంటాయి
  • రక్తపట్టికలు (platelets) రక్తం గడ్డకట్టడానికి దోహదపడతాయి మరియు లుకేమియా, ఇతర కేన్సర్ ఉన్నవారికి, జీవించడానికి అవకాశం కలిగిస్తాయి

ఆధారము: భారత్ బ్లడ్ బ్యాంకు

రక్తం ఎందుకు దానం చేయాలి?

అన్ని జీవులు, రక్తం అనే ద్రవం మీద ఆధారపడి జీవిస్తాయి. రక్తం 60% ద్రవ భాగం మరియు 40% ఘన భాగంతో చేయబడింది. 90% నీరు మరియు 10% పోషకాలు, హార్మోన్లు మొదలగువాటితో తయారుచేయబడే, ద్రవ భాగమైన ఈ ప్లాస్మా, ఆహారము మరియు మందులు మొదలగువాటితో సులభంగా తిరిగి నింపబడుతుంది. కాని, ఆర్ బి సి ( ఎర్ర రక్త కణాలు), డ బ్ల్యు సి ( తెల్ల రక్త కణాలు) మరియు ప్లేట్ లెట్స్ కలిగి ఉండే ఘన భాగం పోతే, యధాతదంగా రావడానికి సమయము తీసుకుంటుంది.

మీరు ఇక్కడే అవసర పడతారు. దానిని తిరిగి యధాతదంగా రోగులయొక్క శరీరం నింపడానికి తీసుకునే సమయం, అతని/ఆమె ప్రాణాన్ని తీయవచ్చు. కొన్ని సమయాలలో, శరీరం తిరిగి నింపడానికి వీలైన స్థితిని ఏ మాత్రం కలిగి ఉండకపోవచ్చు.

రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని దానిన ఉత్పత్తి చేయలేమని మీకు తెలుసు. అంటే, రక్తం అవసరమయ్యే జీవితాలని మీరు మాత్రమే రక్షించవచ్చు.

ప్రతి సంవత్సరము భారత దేశంలో, 250 సి.సి. రక్తం గల 40 మిలియన్ యూనిట్లు కావాలసి ఉంటే,. అందులో, 500,000 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది.

ఆధారము: భారత్ బ్లడ్ బ్యాంకు

రక్త దానం చేసే వారికి ఉపయోగపడే లింకులు

ఫ్రెండ్స్ టు సపోర్ట్

ఇండియన్ బ్లడ్ డోనర్స్

హైదరాబాద్ బ్లడ్ డోనర్స్

బ్లడ్ గివర్స్

జీవన్ బ్లడ్ బ్యాంకు అండ్ రీసెర్చ్ సెంటర్

బ్లడ్ డొనేషన్స్

అమెరికన్ అసోసియేషన్ అఫ్ బ్లడ్ బ్యాంక్స్

రెడ్ క్రాస్

బ్లడ్ ఆన్లైన్

భారత్ బ్లడ్ బ్యాంకు

సంకల్ప బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్

మరిన్ని ఉపయోగపడే లింకులు

http://www.psbc.org/home/index.htm

www.nybloodcenter.org

www.blood.co.uk

www.transfusionguidelines.org

www.sanbs.org.za

www.who.int/bloodsafety/

www.ifrc.org

www.bloodservices.ca

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free