Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

సామాజిక సంక్షేమం (14)

భారతదేశంలో మానవాభివృద్ధి ధోరణులు

మారుతున్న జనాభా ధోరణుల ప్రకారం 2020 నాటికి భారత పౌరుడి సగటు వయసు 29 ఏళ్లుగా ఉండనుంది. అప్పటికి మన శ్రమశక్తి గణనీయంగా పెరుగుతుందని నిపుణుల అంచనా. అభివృద్ధి చెందిన చైనా, అమెరికా, జపాన్, పశ్చిమ యూరప్ దేశాలతో పోలిస్తే ఇది మనకు సానుకూలాంశంగా చెప్పవచ్చు.

పేదరికం కొలమానాలు

కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిని పేదరికం అంటారు. భారత్ లాంటి వర్థమాన దేశాల్లో సమాజంలోని సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయడంలో శతాబ్ధాలుగా రాజకీయ, ఆర్థిక విధానాలు పూర్తి స్థాయిలో విజయవంతం కాకపోవడంతో స్వాతంత్ర్యం సిద్ధించి 66 ఏళ్లు పూర్తయినా దేశంలో దారిద్ర్యం తాండవిస్తూనే ఉంది.

మహిళా స్వయం సహాయక సంఘాలు

మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో గ్రామలు అభివృద్ధి పథంలో మరియు ఆర్థిక పరంగా పటిష్టంగా ఉండేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. మహిళా చైతన్యంతోనే గ్రామల్లోని పేదలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు.

తరతరాలుగా సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించేందుకు భారత రాజ్యాంగంలో నిర్దేశించిన మేరకు దేశంలోని షెడ్యూల్ట్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనకబడిన తరగతులకు హాస్టళ్ళ వసతి సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. భారత రాజ్యాంగం తనకు తానే సంక్షేమ రాజ్యంగా ప్రకటించుకుంటున్నది. 16వ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం, 39వ అధికరణ (సి) ప్రకారం సంపద ఒక్క దగ్గరే కేంద్రీకరించకుండా చూడాలి. 46వ అధికరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, తదితర బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నది. సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం . రాజ్యాంగ పీఠిక మరియు ఆదేశిక సూత్రాలలో సంక్షేమ రాజ్యం యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా పొందుపరిచారు. భారత ప్రజలకు న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ భద్రత కల్పిస్తుందని రాజ్యాంగ పీఠిక హామీ ఇస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 47 ప్రకారం "Duty of the state to raise the level of nutrition and the standard of living and to improve public health" అనగా (ఈ రాజ్యం యొక్క కర్తవ్యం ప్రజలకందరికీ పౌష్టికాహార విలువలనూ, ప్రజా ఆరోగ్యాన్ని పెంచడమూ మరియు జీవన పురోగతిని పెంపొందించడం).

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free