Namaskar_Welcome Uravakonda
ఉరగాద్రి @ ಉರವಕೊಂಡ, ఉరవకొండ, Uravakonda

కోళ్ళ పెంపకం

కోళ్ళ జాతులు

సెంట్రల్ ఏవియన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, ఇజత్ నగర్ నుండి రూపొందించబడిన జాతులు:

దేశవాళీ రకాలు పెరటి పెంపకానికి

కారీ నిర్ బీక్ ( అసీల్ క్రాస్)

  • అసీల్ అంటే ‘స్వచ్ఛత’ అని అర్థం. ఈ జాతి కోళ్ళు బాగా బలంగా,ఠీవితో తట్టుకునే శక్తి ఎక్కువగా, దెబ్బలాడే గుణం కలిగి ఉంటాయి.
  • ఈ జాతి కోళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లు.
  • ఈ కోళ్ళ చాలా పెద్దవిగా, అందంగా ఉంటాయి.
  • పుంజులు 3-4 కిలోల వరకు బరువు ఉండి, పెట్టలు 2-3 కిలోల ఉంటాయి.
  • గ్రుడ్లు పెట్టే వయస్సు 196 రోజులు
  • సంవత్సరములో గ్రుడ్లు ఉత్పత్తి -92
  • 7. 40 వారాల వయస్సులో గ్రుడ్ల బరువు 50గ్రా.







కారీ శ్వామా (కడకనాథ్ క్రాస్)

  • ప్రాంతీయంగా ‘కలమాశి’ అంటారు, అంటే దీని అర్ధం నల్లని మాంసం కలది – మధ్యప్రదేశ్ లోని జాబ్యూ మరియు ధర్ జిల్లాలు, రాజస్ధాన్ మరియు గుజరాతీ సరిహద్దు ప్రాంతాలలో సుమారు 800 చ. మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి వుంటాయి.
  • వీటిని ఎక్కువగా కొండ జాతులు, ఆదివాసి ప్రజలు,గ్రామీణ ప్రాంతాలలో పెంచుతారు. దీనిని పవిత్ర మైన జాతిగా గుర్తించి, దీపావళి పండుగలో దేవునికి నైవేధ్యంగా పెడతారు.
  • రోజుల కోడి పిల్ల నీలం రంగు నుంచి నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. ఈ జాతి మాంసం నల్లగా ఉన్నా, దీనికి చాలా ఔషధ విలువలతోపాటు.సెక్సు సామర్ధ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు
  • ఆదివాసీ దీని రక్తాన్ని చాలా దీర్ఘ కాల జబ్బులకు ఉపయోగిస్తారు.
  • గ్రుడ్లు, మాంసం లో ప్రొటీన్లు (25.47%) మరియు ఇనుము ఎక్కువగా ఉంటుంది.
  • 20 వారాల వయస్సులో 920గ్రాముల బరువు ఉంటుంది.
  • గ్రుడ్లు పెట్టే వయస్సు – 180 రోజులు.
  • సంవత్సరనికి  గ్రుడ్ల ఉత్పత్తి – 105
  • 40 వారాల వయస్సుకి గ్రుడ్ల బరువు 49 గ్రా
  • గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం - 55%.







హితకారీ (నేకడ్ నెక్ క్రాస్)

  • ఈ జాతి  పెద్దగా  ఉండి పొడవైన ఈకలు లేని మెడ ఉంటుంది.
  • మగ కోడిలో పరిపక్వ దశకు వచ్చే సరికి మెడ భాగం ఎర్రగా మారుతుంది.
  • కేరళ లోని త్రివేండ్రం దీనికి పుట్టినిల్లు.
  • 20 వారాలు వయస్సులో దాని బరువు 1005 గ్రా
  • గ్రుడ్లు పెట్టే వయస్సు 201 రోజులు.
  • గ్రుడ్ల ఉత్పత్తి సంఖ్య 99 సంవత్సరానికి
  • 40 వారాలు వయస్సులో గ్రుడ్లు బరువు 54 గ్రా
  • గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం - 66%

ఉపకారి (ఫ్రిజెల్ క్రాస్)

  • దేశవాళీ కోడిలాగా ఉండి, ఉష్ణ ప్రాంతాలకు, బాగా అలవాటు పడి, రోగనిరోధక శక్తి బాగా ఉండి, మంచి పెరుగుదల, ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటుంది.
  • పెరటిలో పెంచేందుకు బాగా అనువైనది.
  • ఉపకారి కోళ్ళ వివిధ వాతావరణ పరిస్ధితులకు అనువైన రకాలు
  • కడకనాధ్ x డెహలామ్ రెడ్
  • అసిల్ x డెహలామ్ రెడ్
  • నేకడ్ నెక్ x డెహలామ్ రెడ్
  • ఫ్రిజిల్ x డెహలామ్ రెడ్
  • గ్రుడ్లు పెట్టేందుకు వయస్సు – 170-180 రోజులు.
  • వార్షిక గ్రుడ్ల ఉత్పత్తి – 165-180 గ్రుడ్లు
  • గ్రుడ్ల బరువు – 52-55గ్రా
  • బ్రౌను రంగు గ్రుడ్లు
  • గ్రుడ్లు నాణ్యత బాగుంటుంది.
  • బతకగల సామర్ధ్యం 95%

మన భారత దేశంలో బర్డ్‌ఫ్లూ

బర్డ్ ఫ్లూ గురించి

మనుష్యుల్లాగే పక్షులకూ  ఫ్లూ వస్తుంది. దీన్నే ఏవియన్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనీ అంటారు.  ఐ5కే1అనే వైరస్ పక్షులకు, కోళ్లకూ బాతులకూ కూడా సోకుతుంది. పక్షులకు సోకే సాధారణ వైరస్లు కేవలం ఇతర పక్షులకు మాత్రమే సోకుతాయి. ఐతే, ఈ బర్డ్ఫ్లూ మాత్రం పక్షులనుంచి మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. అలాటి ఒక మనిషికిఐ5కే1వైరస్ సోకిన కేసు 1997లో తొలిసారిగా హాంగ్కాంగ్లో బైట పడింది. ఆ తర్వాత ఈ వైరస్ ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలలోని పక్షులకి నెమ్మదిగా వ్యాపించింది. ఆసియాలో 2003లో ఐ5కే1 వైరస్ సోకినప్పటినుంచి, దీని వల్ల ఇప్పటిదాకా 234 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్రాణాంతకమైన ఈ వైరస్ ఇండియాలో మొన్న జనవరి 2008 ప్రాంతంలో సోకింది. ఫలితంగా, మనుష్యులకు సోకుతుందన్న భయంతో దాదాపు 3.9 మిలియన్ల కోళ్లనూ, బాతులనూ అంతం చేయాల్సి వచ్చిందని ఆహార వ్యవసాయ సంస్థ  ఒక ప్రకటనలో వెల్లడి చేసింది. దానివల్ల ఫిబ్రవరి 2, 2008 తర్వాత ఎలాటి సంఘటన జరగలేదని అన్నారు.

ఈ బర్డ్ఫ్లూ తీవ్రంగా ఉన్నపుడు ఆ పక్షులతో బాగా దగ్గరగా సంచరించడంవల్ల మనుష్యులూ అనారోగ్యం పాలౌతారు. ఆ వ్యాధి సోకిన కోళ్లనూ, బాతులనూ సరైన రీతిలో ఉడికించకుండా తినడంవల్ల కూడా ఆ వ్యాధి మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైంది. దీనికి ఇప్పటిదాకా ఎలాటి వ్యాక్సినూ లేదు.

బర్డ్ ప్లూ గురించి తెలుసుకోవలసిన వాస్తవాలు

బర్డ్ ప్లూ (ఎవియన్ ఇన్ ప్లూయింజా) గురించి తెలుసుకోవలసిన వాస్తవాలు 1

బర్డ్ ప్లూ (ఎవియన్ ఇన్ ప్లూయింజా) గురించి తెలుసుకోవలసిన వాస్తవాలు – 2

బ్రాయిలర్ కోళ్ళ పెంపకం

కోడి మాంసం పరిశ్రమలో బ్రాయిలర్ కోళ్ళ్కు ప్ర్త్యేకమైన స్ధానముంది. బ్రాయిలర్లను వుత్పత్తి చేసే రైతులు పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టు పద్ధతి మీద సరఫరా చేస్తూ ఉంటారు. అందుచేత కోళ్ళ రైతులకు మార్కెటింగ్ సమస్య కాబోదు. బ్రాయిలర్ అంటే ఎనిమిది వారాల చిన్న కోడిపిల్ల/అరకోడి. లేత మాంసం మెత్తగా ఉండి ఒకటిన్నర-రెండు కి.గ్రా. బరువు ఉంటుంది.

శ్రేష్టమైన పెంపక విధానం:

కోళ్ళఫారం ఉష్ణోగ్రత: మొదటి వారంలో 95 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటే బాగుంటుంది.తరువాత వారానికి 5 డిగ్రీ ఫా. చొప్పున తగ్గుతూ, ఆరు వారాల వయస్సు వచ్చేసరికి 70 డిగ్రీల ఫా.దగ్గర ఉంచాలి.

గాలి: మంచి గాలి తగిలేటట్టు చూడాలి. ఎప్పటికప్పుడు కోడి రెట్టల్ని(అమ్మోనియా) తొలగిస్తూ ఉండాలి. లేకపోతే కోళ్ళు ఉక్కిరిబిక్కిరికి లోనవుతూ ఉంటాయి.
వెలుతురు: ప్రతి 200 చ. అ నేలకు ఒక 60 వాట్ల బల్బు అమర్చాలి.
ముక్కు కత్తిరించడం: కోడికి ఒకరోజప్పుడే ముక్కును కత్తిరించాలి.

కోడికి కావలసిన ప్రదేశం : ఒక కోడికి ఒక చ. అడుగు

బ్రాయిలర్ ఆరోగ్య రక్షణ:

  • రోగాలు లేని కోడిపిల్లలతోనే ప్రారంభించాలి.
  • మారెక్ వ్యాధి సోకకుండా హేచరీలోనే టీకా వేయించాలి.
  • 4 నుంచి 5 రోజులప్పుడు ఆర్.డి.వి.ఎఫ్.ఐ మందు వేయాలి.
  • కోక్సిడి యూసిస్ రాకుండ మేతలోనే మందులు కలపాలి.
  • అప్లోటాక్సిన్ బారినపడకుండా మేతను కాపాడాలి.
  • కోళ్ళ పెంటను తీసి వేసి నేలను 3 అంగుళాల లోతు ఉండేలాగ నీటితో కప్పాలి.

మార్కెటింగ్:

  • కోడిపిల్లను 6-8 వారాల వయస్సులో అమ్మవచ్చు.
  • కోడిపిల్లలను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దె బ్బలు తగలకుండా మేత, నీరు తొలగించాలి.
  • వాతావరణం బాగాలేనప్పుడు, కోడిపిల్లల్ని రవాణా చేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

ప్రవేటు కంపెనీలు

  • సుగుణ(కోయంబత్తూరు),
  • వెంకటేశ్వర హేచరీస్ లిమిటెడ్ (వి.హెచ్.ఎల్-పూణె),
  • పయనీర్,
  • బ్రోమార్క్
  • మెదలగు ప్రవేటు కంపెనీలు కోళ్ళ రైతులతో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాయి.

ఈ క్రింది వివరాల కోసం దగ్గరలోని వెటర్నరీ క్లీనిక్స్ లేదా అగ్రికల్చర్/వెటర్నరీ సైన్స్ వారిని సంప్రదించండి.

  • మంచి జాతి కోళ్ళ రకాలు
  • కోళ్ళ షెడ్ ల తయారి
  • కోళ్ళ మేత
  • ఆరోగ్యమైన కోళ్ళ ఉత్పత్తి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

  • అగ్రిస్ నెట్ వారు ప్రతీ సంవత్సరం విడుదల చేసే వ్యవసాయ పంచాంగంను అనుసరించి కోళ్ళ పెంపకం మరియు యాజమాన్యం పద్ధతుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మాంసపు జాతి కోళ్ళ పెంపకం పద్ధతుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కొల్ల పెంపకం - పౌల్ట్రీ పై మరింత అవగాహన మరియు వివరాల కొరకు జీవనోపాధులు శీర్షిక నుండి పౌల్ట్రీ సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అగ్రిస్ నెట్

 
Copyright © 2015 All Rights Reserved NamaskarUravakonda.page.tl. Designed & Developed by Venkatamanjunath Maraputi for Digital Marketing enquirers contact: 91 9490450008, 91 94940 58385. This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free