సంతానలేని సమస్యలు
పురుషుల్లో సంతానలేమికి కారణాలేమిటి?
ఈ మధ్య సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. ఆధునికీకరణ, పట్టణీకరణ పెరుగుదలతోపాటు వాతావరణ కాలుష్యం పెరగడం కూడా మానవుల్లో సంతానలేమి సమస్యకు కారణం అవుతున్నాయి. ఇవేగాక వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడికి గురిచేసే సమస్యలవల్ల, పౌష్టికాహారంలోపంవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తోంది.
సంతానలేమి సమస్యకు కారణమేమిటి? అంటే భార్యా భర్తల్లో ఎవరిలోనైనా లోపం ఉండవచ్చు.ప్రస్తుతం సంతానలేమి సమస్య కేవలం 30 శాతం మంది మహిళల్లో లోపాలవల్ల అయితే, మరో 30 శాతం వరకు పురుషుల్లో లోపాలవల్ల ఏర్పడుతోంది. 40 శాతం వరకూ స్త్రీ, పురుషులిద్దరిలోనూ కొద్దిపాటి లోపాలవల్ల సంతానలేమి సమస్య ఏర్పడుతోంది. పూర్వకాలంలో సంతానం కలుగకపోతే కేవలం భార్యదే తప్పు అనే అపోహ ఉండేది. కానీ ఆధునిక వైద్య విధానంలో అలాంటి అపోహలకు తావులేకుండా ఎవరిలో లోపం ఉందనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. చాలా వరకు 70 శాతం మందిలో భార్యల్లో ఎలాంటి లోపమూ ఉండకపోవచ్చు. లేకపోతే కొద్దిపాటి సమస్య ఉండవచ్చు. సరైన వైద్య చికిత్సలతో ఆ లోపాన్ని సరిచేసే అవకాశం ఉంది.
పురుషుల్లో సంతానలేమికి కారణాలేమిటి? ఎవరికి ఈ సమస్య తలెత్తుతుంది? అనేది గమనిస్తే ఒకటి వయసు మీరిన తర్వాత అంటే 40 ఏళ్లు పైబడిన తర్వాత సమస్య ఏర్పడవచ్చు. రెండోది పుట్టుకతోనే అవయవాలలోపంవల్ల, జననేంద్రియాల్లోగానీ, పిట్యూటరీ గ్రంథిలో సమస్యవల్లగానీ, అవయవాల పెరుగుదల సరిగ్గా లేకపోవడంవల్లగానీ సంతానలేమి సమస్యకు దారితీస్తుంది. కొందరిలో క్షయవ్యాధి (ట్యుబర్ క్లోసిస్) రావడం, ముఖ్యంగా జననేంద్రియాల్లో క్షయ వ్యాధి రావడం వల్ల వీర్యం ఇన్‌ఫెక్షన్ అయ్యి, అది సరఫరా అయ్యే నాళాలు దెబ్బతినిగానీ, మూసుకుపోయిగానీ సమస్య ఏర్పడవచ్చు. ఇదీగాక అధిక మానసిక ఒత్తిడివల్ల, దీర్ఘకాలిక వ్యాధులవల్ల, పొల్యూషన్‌వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గి సంతానలేమికి కారణం అవుతాయి.
సంతానలేమి అని ఎప్పుడు అంటాం?
దంపతులిద్దరూ ఒక సంవత్సరంపాటు సహజ లైంగిక చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ సంతానం కలుగకపోతే దానిని సంతానలేమి సమస్య అంటారు. కొన్నిసార్లు భార్యా భర్త కలిసున్నప్పటికీ సంతానాన్ని నిరోధించడానికి కండోమ్స్, కాపర్ టీ, నిరోధ్, మందులు వాడితే దానిని సంతానలేమిగా పరిగణించ కూడదు. ఉద్యోగ రీత్యానో, మరే కారణంగానో భార్య భర్త దూరంగా ఉన్నప్పుడు సంతానం కలుగకపోతే దానిని సంతానలేమి సమస్య అనలేం.
భార్యా భర్తల మధ్య రెగ్యులర్‌గా లైంగిక చర్య జరుగుతున్నప్పటికీ సంవత్సరం అయినా పిల్లలు కలుగనప్పుడే సంతానలేమి సమస్యగా అనుమానించాలి. అప్పుడు చికిత్స కోసం గైనకాలజిస్టునుగానీ, ఆండ్రాలజిస్టునుగానీ సంప్రదించాలి. ముఖ్యంగా పురుషుల్లో సంతానలేమి సమస్యను గుర్తించి, చికిత్స చేసే డాక్టర్‌ను ఆండ్రాలజిస్టు అంటారు. యూరాలజిస్టుల్లోనే కొందరు ఆండ్రాలజిస్టులుగా కూడా ఉంటారు. వీరిని సంప్రదిస్తే సంతానలేమి సమస్యకు కారణాలేమిటో, ఎలాంటి చికిత్స అవసరమో అన్నీ తెలుస్తాయి.
నిర్ధారణ పరీక్ష
పురుషుల్లో సంతానలేమికి ఆండ్రాలజిస్టు వివిధ నిర్ధారణ పరీక్షలు సూచిస్తారు. వ్యక్తిలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ (రీ ప్రొడక్టివ్ సిస్టమ్) ఎలా పనిచేస్తుంది. వృషణాల సైజు సరిగ్గానే ఉందా? నాళాలేమైనా మూసుకుపోయాయా? అనేది పరీక్షల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ లోపాలేమైనా ఉంటే అవి పుట్టుకతో ఉన్నాయా? మధ్యలో వచ్చాయా? చికిత్స ద్వారా నయం చేసే అవకాశాలున్నాయా? అనేది పరిశీలిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత పురుష పునరుత్పత్తిలో అత్యంత కీలకమైన ‘కంప్లీట్ సెమెన్ ఎనాలసిస్’ (పూర్తిస్థాయి వీర్య కణాల సామర్థ్య పరీక్ష) చేస్తారు. ఇందులో చాలా రకాల రిపోర్ట్స్, స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే ఇవి ప్రతిఏడాదీ మారుతూ ఉండవచ్చు. 40 ఏళ్లక్రితం వీర్య కణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) అనేది ఒక మి.లీ.కు 50 మిలియన్లు ఉంటే నార్మల్‌గా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నిర్వచనం ప్రకారం అది మారింది. ఒక మి.లీ. వీర్యంలో 20 మిలియన్ల వీర్య కణాలు ఉంటే దానిని నార్మల్‌గా గుర్తించింది. అంటే ఒక పురుషుడిలో వీర్య కణాల సంఖ్య 20 మిలియన్లుంటే సంతాన సామర్థ్యం కలిగి ఉన్నట్లు లెక్క. అంతకంటే తక్కువుంటే వైద్యుని సలహా ప్రకారం చికిత్స తీసుకోవాలి.
ఇతర కారణాలు-చికిత్స
వృషణాల నుండి వచ్చే రక్త సిర ఏదైతే రక్తాన్ని గుండెకు తీసుకెళ్తుందో ఆ సిరలో వాపు రావడంవల్ల వెరికోసిల్ అనే సమస్య ప్రారంభమవుతుంది. టెస్టిస్‌లో సాధారణంగా శరీరంలోకంటే వేడి తక్కువగా ఉండాలి. వెరికోసిల్ సమస్యవల్ల ఆ వేడి పెరిగి, వీర్యోత్పత్తిని నిరోధిస్తుంది. దీనివల్ల కూడా సంతానలేమి ఏర్పడుతుంది. వెరికోసిల్ ఉందా? లేదా? అనేది డాక్టర్ పరీక్షించడం ద్వారా గానీ, డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారాగానీ తెలుసుకోవచ్చు.
ఇవేగాక పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు వాడటం, మద్యం సేవించడం, వేడి ఎక్కువగా ఉండే చోట పనిచేసేవాళ్లల్లో, ఇంజిన్ల దగ్గర, రైల్వే ఇంజిన్లో పనిచేసే వారు వేడికి ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారిలో వీర్యోత్పత్తి తగ్గితే వృత్తిని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. వీటితోపాటు దీర్ఘ కాలిక వ్యాధులున్నా సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా టిబి, ఇతర వ్యాధులేమైనా ఉంటే వాటికి చికిత్స ఇస్తూనే సంతానలేమి సమస్యకు కూడా చికిత్స అందించవచ్చు. అందుకోసం ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
వీర్య కణాల సంఖ్య, ఉత్పత్తి పెంచడానికి మందులు వాడాల్సి ఉంటుంది. వాడినా ఫలితం లేదన్నప్పుడు ఇతర చికిత్సలు ప్రారంభించాల్సి ఉంటుంది. అసలు వీర్య కణాలు ఉన్నాయా లేవా? అనేది టెస్టికల్ బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మత్తు ఇంజెక్షన్ ఇచ్చి టెస్టిస్‌లో వీర్యం నమూనా తీసి పరిశీలించి, చికిత్స అందించాల్సి ఉంటుంది.
వెరికోసిల్ సమస్యవల్ల సంతానం కలగకపోతే మైక్రోస్కోపిక్ వెరికోసిలెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా చికిత్స చేసి, సంతానలేమిని నివారించవచ్చు. ఈ చికిత్స చేశాక కూడా కొందరిలో వీర్యోత్పత్తి జరగక, సంతానం కలుగకపోతే ఐయుఐ పద్ధతిద్వారా వీర్యాన్ని టెస్టిస్ నుంచి ఇంజెక్షన్ ద్వారా తీసి, మైక్రోస్కోప్‌లో చూసి, వాటిని భార్య యొక్క యుట్రెస్‌లో ఇంజెక్ట్ చేస్తారు. నిపుణులైన వైద్యులే దీనిని నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా సంతాన సాఫల్యం పొందవచ్చు. ఇది కూడా సక్సెస్ కానప్పుడు చివరగా ఐవిఎఫ్ చికిత్స (‘టెస్ట్ ట్యూబ్ బేబి’)తో బిడ్డలను పొందవచ్చు.
ఏ చికిత్సవల్లా సంతానం కలగనప్పుడు చివరగా 4, 5 వీర్య కణాలను తీసుకొని, భార్య అండాశయం నుంచి అండాలను తీసుకొని మైక్రోస్కోప్‌లో చూస్తూ వీర్య కణాలను అండంలోకి ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అన్ని సౌకర్యాలు ఉన్న ల్యాబ్‌లో, నిపుణులైన డాక్టర్లు చేయాల్సి ఉంటుంది.
అసలు భర్తలో వీర్యం, వీర్య కణాలే లేనప్పుడు, మందులు, చికిత్స ద్వారా కూడా ఫలితం లేనప్పుడు’ స్పెర్మ్ డోనార్స్’ ద్వారా ల్యాబ్‌లో సేకరించిన వీర్యాన్ని భార్య గర్భంలోకి ప్రవేశపెట్టి సంతాన సాఫల్యం చేకూర్చవచ్చు. ఇక్కడ వీర్యం ఎవరి ద్వారా స్వీకరించింది కూడా తెలియదు. దాదాపుగా వీర్యాన్ని ప్రవేశపెట్టినప్పుడు కలిగిన సంతానంలో 50 శాతం వారి వారి ఫ్యామిలీ జీన్స్ మాత్రమే వస్తాయి.
- డాక్టర్ వంశీకృష్ణ
యూరాలజిస్టు అండ్ ఆండ్రాలజిస్టు,
డా|| రామయ్య ప్రమీల యూరాలజీ సెంటర్, హైదరాబాద్.
ఫోన్: 9490190102
మహిళల్లో సంతానలేమికి చికిత్సలు
మహిళల్లో సంతానలేమి ఉందని నిర్ధారణ అయినప్పుడు అందుకు చేసే చికిత్స వివిధ రకాలుగా ఉంటుంది.
- మొదట ఆ జంటకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఆ తరువాత జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులను గురించి వివరిస్తారు.
- పోషకాహారం ఆవశ్యకతను వివరించడంతో పాటు అధికంగా బరువు ఉంటే బరువు తగ్గాల్సిందిగా సూచిస్తారు.
- ఆ తరువాత సైకోసెక్సువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
- అవసరాన్ని బట్టి ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ (గర్భాశయ కంతులు) లాంటి పరీక్షలు చేస్తారు.
- థైరాయిడ్ సమస్యలు, హైపర్‌ప్రొలాక్టినేమియా, పీసీఓఎస్ లాంటి ఎండోక్రినికల్ సమస్యలకు చికిత్స చేస్తారు.
- ఒవులేషన్ ఇండక్షన్ (ఒక రుతుచక్రంలో పలు అండాలు విడుదల అయ్యేందుకు దోహదం చేసే ఔషధాల వినియోగం), సరైన సమయంలో దంపతులు కలుసుకోవడంపై సూచనలు
- ఒవులేషన్ ఇండక్షన్ అనంతరం ఐయూఐ (కృత్రిమంగా వీర్య కణాలను రిప్రొడక్టివ్ ట్రాక్ట్‌లోకి ప్రవేశపెట్టడం) ప్రక్రియ చేపట్టడం
- కంట్రోల్డ్ ఓవరియన్ హైపర్‌స్టిమ్యులేషన్, అనంతరం ఐవీఎఫ్
- కంట్రోల్డ్ ఓవరియన్ హైపర్‌స్టిమ్యులేషన్, అనంతరం ఐవీఎఫ్ – ఐసీఎస్‌ఐ
- ఇన్విట్రో మెచ్యురేషన్ (ఐవీఎం)- డ్రగ్ ఫ్రీ ఐవీఎం
- లేజర్ అసిస్టెడ్ హేచింగ్
- ఊసైట్ విట్రిఫికేషన్
- ఎంబ్రోయొ విట్రిఫికేషన్
జీవన శైలిలో మార్పులు
రిక్రియేషనల్ డ్రగ్స్, మానసిక ఒత్తిళ్ళు, స్థూలకాయం, ధూమపానం, ఆల్కహాల్, కెఫైన్, ఆహారం, వ్యాయామం, విటమిన్లు, వృత్తి ఉద్యో గాలు లాంటి పలు అంశాలు జీవనశైలి పరిధిలోకి వస్తాయి. ఇందుకు సంబంధించి దంపతులు చేసుకోవాల్సిన మార్పులను వైద్యులు సూచి స్తారు. గర్భధారణ సంబంధిత అంశాలపై వారిలో గల అపోహలను తొలగిస్తారు. సహజ, కృత్రిమ గర్భధారణ రెండింటిలోనూ జీవనశైలి ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. వైద్యులు సూచించిన విధంగా దంపతులు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సంతానం పొందే అవకాశాలను వృద్ధి చేసుకోగలుగుతారు.
ఒవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్‌కోర్స్
సంతానలేమికి చికిత్స అందించడంలో చేపట్టే తొలి ప్రక్రియ ఇది. ఇందులో మహిళలకు మొదట అండాల వృద్ధికి గాను కొన్ని మదు లతో చికిత్స చేస్తారు. అవసరాన్ని బట్టి వరుసగా అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేస్తారు. అండం వృద్ధిని గమనిస్తారు. అండం పరిపక్వ దశకు చేరుకున్న తరువాత దంపతులను కలుసుకోవాల్సిందిగా సూచిస్తారు. ఫెర్టయిల్ పీరియడ్‌లో మార్పులు ఉన్న వారికి, ఒవు లేషన్ సమస్యలు ఉన్న వారికి ఈ చికిత్స ఉపయోగపడుతుంది.
ఒవులేషన్ ఇండక్షన్ అనంతరం ఐయూఐ
ఐయూఐ (ఇంట్రా యుటెరిన్ ఇన్‌సెమినేషన్) లేదా ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్‌లో భర్త వీర్యకణాలను ప్లాస్టిక్ కెథటెర్‌ను ఉపయోగించి నేరుగా గర్భాశయం లేదా సెర్విక్స్‌లోకి ప్రవేశపెడుతారు. పాటెంట్ ఫా లోపియన్ ట్యూబ్స్ సమస్యతో బాధపడే మహిళలకు సంతానాన్ని కలి గించడంతో తక్కువ వ్యయంతో పూర్తయ్యే చికిత్స ఇది.
ఈ విధమైన చికిత్స చేసేందుకు ఈ చికిత్స ఆ దంపతులకు పనికొ స్తుందో లేదో నిర్ధారించుకునేందుకు కొన్ని పరీక్షలు చేస్తారు. మహిళ లకు ఎఫ్‌ఎస్‌హెచ్ (ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), ఎల్ హెచ్ (ల్యుటినైజింగ్ హార్మోన్), ఈస్ట్రాడియెల్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వంటి హార్మోనల్ బ్లడ్‌టెస్ట్‌లు, పీరియడ్స్ రెండో రోజున ప్రొలాక్టిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫాలోపియన్ ట్యూబ్‌లు తెరుచుకుని ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు హిస్టెరొసాల్పిం గోగ్రామ్ లేదా లాప్రోస్కోపిక్ ట్యూబల్ డై స్టడీ చేస్తారు. భర్తకు బేసిక్ సెమన్ అనా లిసిస్ (వీర్యకణాల విశ్లేషణ) పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష ఫలితం ఆధారంగా అవసరమైతే సెమెన్ ఫంక్షనల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు.
వీటితో పాటుగా దంపతులిద్దరికీ బ్లడ్‌గ్రూపింగ్, హెపటైటిస్ బి, సి, ఎస్టీడీ సంబంధిత రక్తపరీక్షలు నిర్వహిస్తారు.
ఐయూఐ చేసేందుకు పలు రకాల కారణాలుంటాయి. భర్త స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ లేదా ఆకారం తగు విధంగా లేనప్పుడు ఈ విధానం ఉపయోగపడుతుంది. అండంతో వీర్యకణాలు కలిసేందుకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుంది.
కంట్రోల్డ్ హైపర్ స్టిమ్యులేషన్ తదనంతర ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్): ఇందులో ఒకే రుతుచక్రంలో సాధారణం కంటే అధిక సంఖ్యలో అండాలు విడుదలయ్యేలా చేస్తారు. విట్రో ఫెర్టిలైజేషన్‌లో భాగంగా కూ డా ఇలా చేస్తారు. రుతుస్రావం ఆరంభమైన మూడో రోజు నుంచి చికి త్స ఆరంభమవుతుంది. అవసరమైన సందర్భాల్లో టూ డైమెన్షనల్ అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు. వివిధ దశల్లో వైద్యుల నియంత్రణ ఉంటుంది.
ఐవీఎఫ్: శరీరం వెలుపల అండాలు వీర్యకణాలతో ఫలదీకరణం చెందడాన్ని ఐవీఎఫ్ గా వ్యవహరిస్తారు. సంతాన లేమి చికిత్సలో దీన్ని మేజర్ ట్రీట్‌మెంట్‌గా పేర్కొంటారు.
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ విధానాలు విఫలమైన సందర్భాల్లో ఈ ప్రక్రియను అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో ఒవులేషన్ ప్రక్రియను హార్మోన్ల ద్వారా నియంత్రించడం, అండాశయాల నుంచి అండాలు తీసి ఫ్లూయిడ్ మీడియంలో వీర్యకణాలచే ఫలదీకరింపజేయడం ఉంటాయి. ఫలదీకరణం చెందిన అండాన్ని (సంయుక్త బీజం) మహిళ గర్భంలో ప్రవేశపెడుతారు. విట్రో అంటే లాటిన్ భాషలో గాజు అని అర్థం. ఈ ప్రక్రియను చేపట్టిన తొలిదశలో ఈ ప్రయో గాలు గాజు బీకర్లు, టెస్ట్‌ట్యూబ్‌లలో జరిగేవి. నేడు విట్రో అనే పదాన్ని శరీర కణజాలం వెలుపల జరిగే అన్ని ప్రక్రియలకు ఉపయోగిస్తున్నారు. నేడు విట్రో ఫెర్టిలైజేషన్‌ను శాలోవర్ కంటె యినర్‌లలో చేస్తున్నారు. ఆటోలొగొస్ ఎండోమెటీరియల్ కోకల్చర్ అనే ప్రక్రియను ఆర్గానిక్ మెటీరియల్‌తో చేసినప్పటికీ దాన్ని కూడా విట్రోగానే పరిగణిస్తున్నారు.
డాక్టర్ దుర్గ రావు
మెడికల్ డైరెక్టర్
ఒయాసిస్ సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్
రోడ్ నెం. 2, బంజారాహిల్స్ , హైదరాబాద్
ఫోన్ నెం. 040-2355 1119,
040-4241 777
మహిళల్లో సంతాన లేమి.. కారణాలు
సంతానలేమితో బాధపడే 45శాతం జంటల్లో లోపం ప్రధానంగా మహిళ ల్లో కానవస్తుంది.వారిలో సంతానలేమికి గల కారణాల్లో ప్రధ నమైనవి:ఖీ బీజవాహికలు దెబ్బతినడం ఖీ రుతుచక్ర సమస్యలు.ఎండోమెట్రియాసిస్: గర్భాశయ కణాల్లాంటివి గర్భాశయంలో గాకుండా దాని వెలుపల అసాధారణ రీతిలో వృద్ధి చెందే పరిస్థితిని ఎండోమెట్రియాసిస్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా గర్భాశయం లోపలి కణాలు ప్రతీనెల రుతుస్రావంలో బయటపడుతాయి.వెలుపల ఉండే కణాలు మాత్రం కణజాలా నికి అతుక్కొని ఉంటాయి. అండాశయం పైన, బీజవాహికల వద్ద, గర్భాశయం లేదా పేగు వెలుపలి భాగాల వద్ద ఇవి ఉంటాయి.
సమీపంలోని పలు ఇతర భా గాల వద్ద కూడా ఇవి ఉండే అవకాశం ఉంది. వజీనా, సెర్విక్స్, బ్లాడర్ పైభాగా ల్లో కూడా ఉండే వీలుంది. ఇవి క్యాన్సర్ కారకాలు కానప్పటికీ ఇతరత్రా సమ స్యలను కలిగిస్తాయి. ఈ సమస్య ఉన్న వారు ప్రత్యేకంగా ఎలాంటి లక్షణాలను బయటకు ప్రదర్శించరు. అమెరికన్ మహిళల్లో 3-18 శాతం మంది ఈ సమ స్యతో బాధపడుతున్నట్లు అంచనా. సంతానలేమికి చికిత్స పొందేవారిలో 20- 50 శాతం దాకా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. సాధారణంగా 25 -35 ఏళ్ళ వయస్సులో మహిళలు ఈ సమస్యను నిర్ధారించుకోగలుగుతున్నా రు. 11 ఏళ్ళ వయస్సులోనే బాలికల్లో ఈ సమస్యను గుర్తించిన దాఖలాలూ ఉన్నాయి.
ఆఫ్రికా, ఆసియా మహిళతో పోలిస్తే శ్వేతజాతీయుల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. పొడవుగా, సన్నగా, పొడవుకు తగ్గ బ రువు ఉండని వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని కూడా అధ్యయనా ల్లో వెల్లడైంది. ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుందో ఇప్పటి వరకూ స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. ఫిజికల్ ఎగ్జామినేషన్, కొన్ని భాగాల్లో ఏర్పడే నొప్పి లాంటి వాటితో ఈ సమస్యను గుర్తించవచ్చు. లాప్రోస్కో పీతో దీన్ని నిర్ధారించు కోవచ్చు.
గర్భాశయాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు:
ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలోపల, వెలుపల పెరిగే, క్యాన్సర్ కారకం కాని ఒక విధమైన కంతుల్లాంటివి) లాంటివి.
ఇతరత్రా రకరకాల కారణాల సమ్మేళనం వల్ల.
స్పష్టమైన కారణం లేకుండా..
రుతుచక్ర సంబంధిత సమస్యలు: మహిళల సంతానలేమికి సంబంధించిన సమస్యల్లో 20 శాతం దాకా పైన పేర్కొన్న కార ణాల వల్ల కలిగేవే. రుతుచక్రం కానరాకపోవడానికి పలు కార ణాలుంటాయి. అనేక క్షణాలు ఈ సందర్భంగా బయటపడు తుంటాయి. ఈ కారణాల్లో కొన్నింటిని మందులతో, మరికొ న్నింటిని జీవనశైలిలో మార్పులతో చక్కబర్చుకోవచ్చు. మరికొ న్ని సమస్యలను మాత్రం సరిదిద్దుకోలేం. ఇలాంటి సందర్భాల్లో ఎగ్ డోనార్ సాయంతో గర్భధారణకు ప్రయత్నించవచ్చు.
నయం చేయదగ్గ సమస్యలు:
హైపొథాల్మిక్ అన్‌ఒవ్యులేషన్: వ్యాయామం, ఒత్తిళ్ళు, బరువు తగ్గడంలాంటి వాటి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
హైపర్‌ప్రొల్టానేమియా: పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే ప్రొలాక్టిన్ స్థాయి అధికం కావడం
పోలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్): మహిళ రుతుచక్రాన్ని, పిల్లలనుకనే శక్తిని, హార్మోన్లను, గుండెను, రక్త నాళాలను ప్రభావితం చేసే సమస్య ఇది.ఈ సమస్య ఉన్న వారి లో ఆండ్రోజెన్ (మేల్ హార్మోన్స్ అని కూడా అంటారు) స్థాయి లు అధికంగా ఉంటాయి. ఇవి అధికంగా ఉండడం అండాల అభివృద్ధిని, విడుదలను దెబ్బ తీస్తుంది. రుతుచక్రం క్రమబద్ధం గా ఉండదు.అండాశయాల్లో ద్రవంతో నిండిన కంతుల్లాంటివి ఉంటాయి. ప్రతీ పదిమంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. ఈ సమస్యకు ప్రధాన కారణమేం టో నేటికి అంతుచిక్కలేదు. జన్యువులే కారణమని కొందరి భా వన. ఓ మహిళ ఈ సమస్యతో బాధ పడుతుంటే, ఆమె తల్లి లే దా సోదరికి కూడా ఈ సమస్య ఉండి ఉంటుందని మరికొందరు నిపుణుల భావన. ఈ సమస్యకు ప్రధాన కారణం హార్మోన్ల అస మతుల్యతగా గుర్తించారు.
హార్మోన్ సంబంధిత సమస్యలు: పిట్యూటరీ గ్లాండ్ లేదా హైపొథాలమస్ (మెదడులోని ఓ భాగం) పనితీరు సరిగా లేక పరిపక్వ అండాల ఉత్పత్తిలో వైఫల్యం.
స్కార్డ్ ఓవరీస్: సర్జరీలు లేదా రేడియేషన్ చికిత్స సందర్భాల్లో అండాశ యానికి వాటిల్లే నష్టం
ప్రిమెచ్యూర్ మోనోపాజ్: 40ఏళ్ళ కంటే ముందుగానే రుతుచక్రం ఆగి పోవడం
ఫోలిసియెల్ సమస్యలు: అండం ఉత్పత్తి అయ్యే చిన్న కుహరంలో అండం ఉత్పత్తి అయినప్పటికీ బయటకు రాకపోవడం లాంటి సమస్యలు.
బీజవాహికలు సరిగా పని చేయకపోవడం: మహిళల సంతానలేమి సమస్యల్లో 20 శాతం దాకా దీని పరిధిలోకే వస్తాయి.
1. క్షయ వంటి ఇన్‌ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టిడి) లాంటి హైడ్రోసాల్పిన్‌ఎక్స్ (బీజవాహిక మూసుకుపోవడం, లోపల ద్రవం నిండిపోవడం), ట్యూబో-ఓవేరియన్ మాసెస్‌కు కారణమవుతాయి.
2. పొత్తి కడుపు వ్యాధులు: అపెండిసైటిస్, కొలిటిస్ (పేగువాపు లాంటిది) లాంటివి పొత్తికడుపు కేవిటీని ఉబ్బిపోయేలా చేస్తాయి. ఇది బీజవాహికలపై ప్ర భావాన్ని కనబరుస్తుంది. అవి మూసుకుపోయే అవకాశం ఉంటుంది.
3. గతంలో జరిగిన సర్జరీలు: తొడ, పొత్తి కడుపు భాగంలో గతంలో ఎ ప్పుడైనా, ఏవైనా సర్జరీలు జరిగి బీజవాహికలు మూసుకుపోయి, అండాలు వా టి గుండా ప్రయాణించలేక పోవడం.
4. ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ: పిండం గర్భాశయంలో గాకుండా గర్భాశయం వెలు పల బీజవాహికలోనే పెరగడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నన్సీగా వ్యవహరిస్తారు. దీని వల్ల బీజవాహికలు దెబ్బ తినడమే గాకుండా తల్లికి ప్రాణాపాయం కూడా.
5. కాంజెనిటల్ లోపాలు: కొన్ని సందర్భాల్లో పుట్టుకతోనే కొందరికి బీజవాహిక సంబంధిత లోపాలు ఉంటాయి.
సాల్‌పింగింటిస్: బీజవాహికలు వాయడం అనేది లోపలి నుంచి (గర్భాశ యం వైపు నుంచి) కూడా జరగవచ్చు. గనేరియా, క్లామైడియా లాంటి లైంగిక సంక్రమణ వ్యాధుల (ఎస్‌టీడీ) సందర్భాల్లో ఇలాగే జరుగుతుంది. బీజవాహిక వెలుపలి వైపు నుంచి అపెండిక్స్ లాంటి వాటి ద్వారా కూడా బీజవాహిక వాయ డానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీజవాహికలు దెబ్బ తిం టాయి. వాహికపై దెబ్బతిన్న రెండు ఉపరితలాలు కలసిపోవడం వల్ల బీజ వాిహ క దెబ్బ తింటుంది. ఈ విధంగా అంటుకుపోవడం అనేది పెల్విక్ సర్జరీ అనం తరం లేదా ఎండోమెట్రియాసిస్‌ల కారణంగా కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి అతుకులు రకరకాలుగా నష్టం కలిగిస్తాయి.నూతన కణ జా లం ద్వారా అండాశయాన్ని బీజవాహిక నుంచి వేరు చేస్తాయి లేదా వాహిక మ రోవైపు కొనను మూసివేస్తాయి. ఈ విధమైన అడ్డంకిని తొలగించేందుకు చాలా సందర్భాల్లో మైక్రోసర్జరీ తోడ్పడుతుంది.
హైడ్రోసాల్పిన్‌ఎక్స్, ప్యోసాల్పిన్‌ఎక్స్: హైడ్రోసాల్పిన్‌ఎక్స్ అనేది ఓ నిర్దిష్ట రకానికి చెందిన ట్యూబల్ బ్లాకేజ్ (బీజ వాహిక మూసుకు పోవడం) లాంటిది. అప్పుడిిది నీరులాంటి ద్రవంతో నిండి పోతుంది. కొన్ని సందర్భాల్లో ఐవిఎఫ్ చేసిన తరువాత, ప్రొజెెస్టెరాతన్ స్థాయి పెరగడం వల్ల ఈ ద్రవం గర్భాశయంలోకి ప్రవహిస్తుంది. అప్పుడది పిండాన్ని కూడా తుడిచి పెట్టేస్తుంది.కొన్ని సందర్భాల్లో ఐవీఎఫ్ విఫలమయ్యేందుకు ఇదీ ఓ కారణమే.ప్యోసాల్పిన్‌ఎక్స్ అనేది బీజ వాహిక చీములాంటి పదార్థంతో నిండిపోవడం. యాంటీబయాటిక్స్ వాడడంద్వారా దీన్ని హైడ్రోసాల్పిన్ ఎక్స్ స్థాయికి చేర్చ వచ్చు. లేని పక్షంలో అపెం డిసైటిస్ తరహాలో ఇది లోప లే బద్దలైపోవచ్చు. అలాంటి సందర్భాల్లో దాన్ని తొలగిం చేందుకు ఆపరేషన్ అవస రం అవుతుంది.
గర్భాశయ, సెర్వికల్ సంబంధిత కారణాలు: మహిళల్లో సంతానలేమి సమస్యల్లో 5 శాతం ఈ కో వకు చెందినవే. గర్భాశ యంలో ఏర్పడే అడ్డుగోడ లులాంటివాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. పాథోలజీ – ఫైబ్రాయిడ్స్ (గర్భాశయ కంతులు), పోలిప్స్ (వెలుపలి మార్గాల వద్ద కణజాల అసాధారణవృద్ధి), అడెనొమయోసిస్ (గర్భాశయ వెలుపలి భాగంలో ఓ రకమైన కణజాల అసాధారణ వృద్ధి), అషెర్‌మాన్స్ సిండ్రోమ్ (కోత తదితరాల వల్ల గర్భాశయ కంఠమార్గం వద్ద ఏర్పడే అతుకులు, కంతులు మొదలైనవి) లాంటివి ఇందులోకి వస్తాయి.
సెర్వికల్ కారణాలు:
హార్మోన్ల అసమతుల్యత కారణంగా సెర్వికల్ స్రావాలు చిక్కగామారి వీర్యకణాలు ఈదుతూ బీజవాహికల్లోకి ప్రవేశించడాన్ని అడ్డుకుంటాయి.
పాథాలజీ – సెర్వికల్ ఫైబ్రాయిడ్స్ (కంతులు లాంటివి)
ఎండోమెట్రియాసిస్-సంతానలేమి: గర్భాశయంలో ఉండే కణాల్లాంటివి గర్భాశయం వెలుపల ప్రధానంగా అండాశయాన్ని, బీజవాహికలను అంటు కొ ని వృద్ధి చెందడాన్ని ఎండోమెట్రియాసిస్‌గా వ్యవహరిస్తుంటారు. ఇది తక్కువ స్థాయిలో ఉన్న వారిలో క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేటు ఎక్కువగానే ఉంటుంది. ఈ విధమైన కణాల వృద్ధి ఎక్కువగా ఉంటే మాత్రం ఐయూఐ (ఇంట్రా యుటెరి న్ ఇన్‌సెమినేషన్ – ఇతర స్రావాల నుంచి వేరు చేసిన వీర్యకణాలను నేరుగా గర్భాశయంలోకి చొప్పించడం) లేదా ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ – మహి ళ శరీరం వెలుపల అండాన్ని, వీర్యకణాలను ఫలదీకరించడం) అవసరమ వుతుంది.
సంతానలేమితో బాధపడే జంటల్లో సుమారు 10 శాతం ఇలాంటి సమస్యలతో ఉంటారు. ఈ సమస్యతో బాధపడే మహిళల్లో గర్భధారణ అవకాశం 12-36 శాతం దాకా తగ్గుతుంది. రుతుస్రావం అధికంగా, బాధాకరంగా, దీర్ఘకాలం ఉండడాన్ని, అత్యవసరంగా మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి రావడాన్ని, మద్వారం నుంచి రక్తస్రావం కావడాన్ని, బహిష్టు కావడానికి ముందే ఆ లక్షణాలు కనబడ డాన్ని ఈ సమస్య లక్షణాలుగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలేవీ బయటపడకపోవచ్చు. మెడికల్-హార్మోనల్ ట్రీట్‌మెంట్ లేదా సర్జికల్ – అబ్లేషన్ ద్వారా ఈ సమస్యను నయం చేయవచ్చు.
కారణాలు వివరించలేని సంతానలేమి – 25 శాతం
కొన్ని సందర్భాల్లో ఎన్ని రకాల వైద్యపరీక్షలు చేసినా ఆ జంటలో సంతానలేమికి సరైన కారణమేదో అంతుపట్టకపోవచ్చు. ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు చిత్స అందుబాటులో ఉంది.
ఇతరత్రా ముఖ్యకారణాలు:
వయస్సు – 35 ఏళ్ళు దాటిన తరువాత మహిళ గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి.
పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ – పీసీఓఎస్
గైనకాలాజికల్ సమస్యలు – గతంలో గర్భాశయం వెలుపల పిండం వృద్ధి చెందడం లేదా ఒకటికి మించిన అబార్షన్లు కావడం, లైంగిక సాంక్రమిక వ్యాధులు లాంటివి.
ఆరోగ్యస్థితిగతులు – మధుమేహం, మూర్ఛ, థైరాయిడ్, మలాశయ సంబంధ వ్యాధులు
జీవనశైలి- వివిధ రకాల ఒత్తిళ్ళు, స్థూలకాయం లేదా తక్కువ బరువు, ధూమపానం
గర్భాశయంలో కంతులు లాంటివి.
డాక్టర్ దుర్గ రావు
మెడికల్ డైరెక్టర్
ఒయాసిస్ సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్
రోడ్ నెం. 2, బంజారాహిల్స్ , హైదరాబాద్
ఫోన్ నెం. 040-2355 1119,
040-4241 777
మగవారిలో సంతానలేమికి ఎన్నెన్నో కారణాలు
మగవారిలో సంతానలేమి చోటు చేసుకునేందుకు పలు రకాల కారణాలు ఉండే అవకాశం ఉంది. వీర్యం ఉత్పత్తిలో లోపం, వీర్యం పని చేయకపోవడం, వీర్యం సరిగా రవాణా కాకపోవడం లాంటివి ఈ లోపాల్లో ముఖ్యమైనవని చెప్పవచ్చు. పుట్టుకతో చోటు చేసుకునే కాంజెన్షియల్ బైలేటరల్ ఆబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫెరెన్స్ (సీబీఏవీడీ), క్రిప్టోర్చిడిస్, జెనిటర్-యూరినరీ ట్రాక్ట్‌కు సంబంధించి వృద్ధిపరమైన లోపాలు మగవారిలో సంతానలేమికి దారితీస్తాయి. ఇవే గాకుండా వరికొసెల్, జెనిటల్ ట్రాక్ట్ ట్యూబర్‌కొలోసిస్, మంప్స్ లాంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు, కొన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్యాలు, వృషణాల క్యాన్సర్, హార్మోన్ సంబంధిత లోపాలు కూడా మగవారిలో సంతాన సాఫల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
మానవ పునరుత్పత్తి ప్రక్రియ ఎంతో సంక్లిష్టమైంది. సంతానం కలగకపోయేందుకు మగవారిలోని లోపాలూ కారణం కావచ్చు. 20శాతానికి పైగా కేసుల్లో కేవలం మగవారిలోని లోపాల కారణంగానే సంతానలేమి సమస్యలు ఏర్పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మరో 30-40 శాతం కేసుల్లో స్త్రీ, పురుషులిద్దరిలోనూ లోపాలు ఉండడం కారణంగా వెల్లడైంది. మరో 40-50 శాతం కేసుల్లో మహిళల్లో లోపాలు సంతానలేమికి కారణంగా తేలింది. దీన్ని బట్టి చూస్తే సంతానలేమికి మగవారిలోని లోపాలు కూడా సుమారుగా 50 శాతం దాకా కారణమని తేలుతోంది.
మగవారిలో సంతానలేమికి కారణాలు…
మగవారిలో సంతాన సాఫల్యత కలగకపోయేందుకు పలు రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండేందుకు, వాటి మొబిలిటీ (చలనం) తక్కువగా ఉండేందుకు లేదా అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు, సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు, కొన్ని రకాల పరిస్థితులకు ఎక్కువగా లోను కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చాలా వరకు సమస్యలు వీర్యానికి సంబంధించినవే అయి ఉంటాయి.
వీర్యకణాల ఆకారం, కదలిక…
వీర్యకణాల ఆకారం, కదలిక సరిగా లేకపోవడం ఈ తరహా సమస్యల్లో ఒకటి. ఫలదీకరణ చోటు చేసుకోవాలంటే, వీర్యకణాలు సరైన ఆకారంలో ఉండి, వేగంగా, కచ్చితత్వంతో అండంగా దిశగా పయనించాలి. ఆకారం, నిర్మాణం అసాధారణ రీతిలో ఉంటే లేదా కదలిక సరిగా లేకుంటే వీర్యం అండాన్ని చేరుకునే, ఫలదీకరణ చేయించే సామర్థ్యం తగ్గిపోతుంది.
స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్ (వీర్యం సాంద్రత)…
స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్ (వీర్యం సాంద్రత) తక్కువగా ఉండడం కూడా ఓ ముఖ్యమైన సమస్యనే. సాధారణంగా వీర్యసాంద్రత మిల్లీలీటర్ సెమెన్‌కు 20 మిలియన్ల స్పెర్మ్‌గా లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. 10 మిలియన్ల కౌంట్ లేదా అంతకన్నా తక్కువ కౌంట్‌ను స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్ తక్కువగా ఉండడం (సబ్‌ఫెర్టిలిటీ)గా వ్యవహరిస్తారు. ఈ కౌంట్ 40 మిలియన్లకు మించడాన్ని అధిక సంతానసాఫల్యతగా గుర్తిస్తారు. వృషణాలు వీర్యాన్ని అసలుకే ఉత్పత్తి చేయకపోవడం అనేది అత్యంత అరుదు. వెరికోసెల్: వృషణాల తిత్తిలో ఉండే వెరికోస్ నరం (అసాధారణ రీతిలో పెద్దదయ్యేది) వృషణాలు చల్లగా ఉండడాన్ని నిరోధిస్తుంది. ఇది స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయేందుకు, వీర్యకణాల చలనశక్తి తగ్గిపోయేందుకు దారి తీస్తుంది.
అన్‌డిసెండెడ్ టెస్టికల్…
పిండస్థ దశలో వృషణాలు వృషణాల తిత్తిలోకి రాకుండా పొత్తికడుపు భాగంలోనే ఉండిపోవడాన్ని అన్‌డిసెండెడ్ టెస్టికల్‌గా వ్యవహరిస్తారు. ఒకటి లేదా రెండు వృషణాలు కూడా పొత్తికడుపులోనే ఉండిపోయే అవకాశం ఉంది. వృషణాల తిత్తితో పోలిస్తే, శరీరంలోపలి ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో, వీర్యం ఉత్పాదన దెబ్బతినే అవకాశం ఉంది.
టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ (మేల్ హైపోగొనాడిజమ్)…
సాధారణంగా టెస్టోస్టెరోన్ ఉత్పత్తి వయస్సు పెరగడంతో తగ్గిపోతుంటుంది. కొన్ని రకాల వ్యాధులు, హైపోతలమస్‌కు లేదా పిట్యుటరీ గ్రంథికి లేదా వృషణాలకు హాని కలగడం చోటు చేసుకున్నప్పుడు టెస్టోస్టెరోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీన్నే మేల్ హైపోగొనాడిజమ్‌గా కూడా వ్యవహరిస్తుంటారు. వృషణాలను నియంత్రించే హైపోతలమస్, పిట్యుటరీ గ్రంథులు మెదడులో ఉంటాయి.
జన్యుపరమైన లోపాలు…
కొంతమంది మగవారిలో ఉండే ప్రధానమైన జన్యులోపాన్ని క్లైన్‌ఫెల్టర్స్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు. ఈ లోపం ఉన్న పురుషుల్లో, ఒక ఎక్స్ , ఒక వై క్రోమోజోమ్‌లకు బదులుగా రెండు ఎక్స్ క్రోమోజోమ్‌లు, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. ఇది వృషణాల అసాధారణ వృద్ధికి దారి తీస్తుంది. ఫలితంగా వీర్యం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. లేదా అసలే మాత్రం ఉండకపోవచ్చు. టెస్టోస్టెరోన్ ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది.
ఇన్‌ఫెక్షన్లు… : వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు తాత్కాలికంగా వీర్యకణాల కదలికను ప్రభావితం చేస్తాయి. తరచూ క్లమైడియా, గనేరియా లాంటి లైంగిక వ్యాధులకు (ఎస్‌టీడీ) గురి కావడం కూడా మగవారిలో సంతానసాఫల్యతను ప్రభావితం చేస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్లు వీర్యకణాల ప్రయాణ మార్గాన్ని నిరోధిస్తాయి. బాల్య, యుక్త వయస్సుల్లో వచ్చే మంప్స్ వైర్ ఇన్‌ఫెక్షన్ వృషణాలను వాచేలా చేసి వీర్యం ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉంది. ప్రొస్టేట్, యురెత్రా (మూత్రాశయం నుంచి బయటకు వచ్చే నాళం) లేదా ఎపిడిడైమిస్ నాళం (వృషణాల వెనుకభాగం లో ఉండే నాళం) వాపు కూడా వీర్యకణాల కదలికలను తగ్గించి మగవారి సంతాన సాఫల్యతను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో వీర్యం ఉత్పత్తి తగ్గేందుకు కారణం ఏమిటో వెంటనే తెలియకపోవచ్చు. స్పెర్మ్ కౌంట్ మి.లీ. సెమన్‌కు 5 మిలియన్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు అందుకు జన్యుపరమైన కారణాలు కూడా తోడు కావచ్చు. జెనిటిక్ టెస్టింగ్ ద్వారా వై క్రోమోజోమ్‌లో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయేమో తెలుసుకోవచ్చు. స్పెర్మ్ విడుదల బలహీనంగా ఉండడం: అంగం నుంచి స్ర్తీ జననేంద్రియం లోకి స్పెర్మ్ విడుదల కావడం బలహీనంగా ఉండడం కూడా సంతానలేమికి దారి తీసే అవకాశం ఉంది.
- డాక్టర్ దుర్గ
ఒయాసిస్ సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్
రోడ్ నెం. 2, బంజారాహిల్స్
హైదరాబాద్ ఫోన్ నెం. 040- 23551119, 42417771
ఆధారము: వైద్యం.ఇన్ఫో