వ్యవసాయ పరికరాలు
ధనియాలు చీల్చే యంత్రం
మొక్కలు సరిగా రావడానికి ధనియాల విత్తనాలను విత్తే ముందు రెండుగా చీల్చ వలసి ఉంటుంది. నోటిని తాజాగా (మౌత్ ఫ్రెష్నర్ గా) వుంచడానికి ఉపయోగించడానికి కూడా ప్రాసెసింగ్ అవసరమౌతుంది. సాంప్రదాయ పద్ధతిలో ధనియాలను చేత్తోనే చీలుస్తారు. అయితే ఈ పద్ధతి చాలా సమయం మరియు శ్రమ తో కూడుకున్నదే కాకుండా విత్తనాలు పాడై పంట కోత అనంతరం నష్టాలకు దారి తీస్తుంది. కాబట్టి యాంత్రిక పద్ధతి తప్పనిసరి. ఇందు కొరకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (CIPHET), పంజాబ్ వారు ధనియాలు చీల్చే యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రం 1 హెచ్.పి.మోటరు సహాయంతో నడిచి గంటకు 60-80 కిలోల ధనియాలను చీలుస్తుంది. ఈ యంత్రంలో 6.5 సెం.మీ. వ్యాసం, 10 సెం.మీ. పొడవు కలిగిన రెండు రోలర్లు ఉంటాయి. ఇవి రెండూ వేర్వేరు వేగాలతో తిరుగుతూ ఉండడం వలన ధనియపు గింజలు రెండుగా చీలతాయి. ఈ యంత్రంలో ఒక గేర్ వంటి కొలమానం కూడా అమర్చబడింది. ఈ యంత్రం గింజలలోని తేమ 14.2% ఉన్నప్పుడు ధనియాలను చీలుస్తుంది.
మరింత సమాచారం కొరకు సంప్రదించండి
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (CIPHET)
లుధియానా, 141004 (పంజాబ్.)
ఫోన్: 91-161-2308669 (O); 91-161-2305674 (సంచాలకులు)
ఫాక్స్: 91-161-2308670
ఈ – మెయిల్ : ciphet@sify.com
వెబ్ పేజీ : http://www.ciphet.in
బిందు సేద్య విధానం
ప్రధాన వాహకాలు, ఉప వాహకాలు, మరియు పక్క వాహకాలతో విడుదల చేసే స్థానాలకు వాటి దైర్ఘ్యాలను బట్టి దూరాన్ని కల్పించి పంటకు విస్తృత పరిధిలో నుంచి నీటిని బిందు సేద్యం ద్వారా అందించాలి. ప్రతి ఉత్సర్గ నాళం నుండి బిందువుగా పడే సూక్ష్మ రంధ్రం నుంచి సరఫరా అయ్యే పరిమాణాన్ని ఖచ్చితంగా నియంత్రించి ఒకే రీతిగా నీరు, పోషకాలు, మరియు పెరుగుదలకు కావలసిన ఇతర పదార్ధాలు నేరుగా వేరు ప్రాంతానికి అందేటట్లుచేస్తుంది.
ఉత్సర్గ నాళం నుంచి వెలువడిన నీరు, పోషకాలు నేలలోకి చేరి గురుత్వాకర్షణ శక్తి, కేశనాళికీయతలతో కదిలి నీరు మొక్క యొక్క వేరు ప్రాంతానికి చేరుతుంది. భర్తీ అయిన తేమను, పోషకాలను మొక్కలు వినియోగించుకుంటూ నీటి కొరతకు లోనుగాకుండా పొందుతూ కావలసిన నాణ్యతను, పెరుగుదలను, ఎక్కువ దిగుబడిని అందిస్తుంది.
నమూన బిందు సేద్య విధాన రూప కల్పన
మానవ జాతికి నీరు ప్రకృతి ఇచ్చిన వరం. ఇది ఎప్పటికీ అమూల్యం, అపరిమితం. నేడు బిందు సేద్యం అవసరం. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు తరిగి పోతున్నాయి.
బిందు సేద్య విధానంయొక్క ప్రయోజనాలు
- 150 శాతం వరకు దిగుబడి పెరుగుతుంది.
- ధారాళంగా నీటిని అందించే విధానంతో పోలిస్తే బిందు సేద్యం ద్వారా 70 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. ఎక్కువ నేలకు ఈ సే ద్యం ద్వారా నీటిని ఆదా చేస్తూ చేయవచ్చు.
- అరటి పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉండి త్వరగా పక్వానికి వస్తుంది.
- ఫలసాయం త్వరితంగా ఏర్పడి, ఫలితం అధికంగా ఉండడం వల్ల వెను వెంటనే పెట్టి న పెట్టుబడి వచ్చేస్తుంది.
- ఎరువుల వాడకం వలన ఫల సామర్ధ్యం 30 శాతం పెరుగుతుంది.
- అంతర్ కృషి, శ్రమ వలన ఎరువుల ఖర్చు తగ్గుతుంది.
- సూక్ష్మ నీటి పారుదల ద్వారా ఎరువులు, రసాయనాలను ఇవ్వడం జరుగుతుంది.
- అలలలాగా ఉండే కొండ చరియలు, ఉప్పు నీటి ప్రాంతాలు, నీరు నిల్వ ప్రాంతాలు, ఇసుక, కొండ ప్రాంతాలను కూడా ఉత్పాదక సాగుకి వినియోగించవచ్చు.
నీటిని వెదజల్లు సేద్య విధానం
ఈ విధానంలో నీరు వర్షపాతం నీరులాగా గొట్టాల నిర్మాణము నుండి చిమ్ముతూ సాగు మొత్తానికి పంపిణి అవుతుంది. నీటి సరఫరా ప్రత్యేక గొట్టముల ద్వారా తోడబడుతుంది.తర్వాత గాలిలోకి నీటిని వెదజల్లేటట్లు వివిధ రకాల నాళికల ద్వార నేల మొత్తానికి సన్నని నీటి బిందువులు పడే విధంగా చేయవచ్చు.
వెదజల్లే విధానం పని చేయడం
వెదజల్లే నాళిక
చిన్న, పెద్ద ప్రాంతాలనంతటిని సమర్ధవంతంగా సాగు చేయడానికి అనువుగా అన్ని రకాల వెదజల్లే నాళికలు కల్గి ఉంటాయి. నీటిని వెదజల్లే నాళికలతో అన్ని సాగు నేలలను సేద్యం చేయవచ్చు.
ఈ విధానం అన్ని పంటలకు అంటే గోధుమ, అపరాలు అలాగే కాయగూరలు, ప్రత్తి, సోయాబీన్స్, తేయాకు, కాఫీ, పశువుల ఆహార పంటలకు వినియోగపడుతుంది
ఆధారము: జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, జాల్ గాన్
వ్యవసాయ యాంత్రీకరణ అప్లికేషన్ ఫారం
వ్యవసాయ శాఖ, తెలంగాణ వారిచే వ్యవసాయ పరికరాలను రాయితీ ద్వారా పొందటానికి వ్యవసాయ యాంత్రీకరణ అప్లికేషన్ ఫారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆధారము: అగ్రిస్ నెట్
వ్యవసాయ యంత్ర పరికరాలపై రైతు మార్గదర్శి
వ్యవసాయ యంత్ర పరికరాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం తెలుగులో వ్యవసాయ యంత్ర పరికరాలపై రైతు మార్గదర్శి అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం లో వివిధ నూతన వ్యవసాయ పరికరాలు (బొమ్మలతో) పరిచయం చేస్తూ, వాటి ఉపయోగాలు, మార్కెట్ లో వాటి సుమారు ధరలు మొదలగునవి ప్రచురించారు.
మరిన్ని వివరాలకు మరియు పుస్తకాన్ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆధారము: అగ్రిస్ నెట్