భేటి బచావో భేటి పడావో పథకం
నేపథ్యం
శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) అనగా 0-6 సంవత్సరాల వయస్సు మధ్య 1000 మంది బాలురకు గల బాలికల సంఖ్య క్షీణిస్తూ ఉంది. 1961 నుంచి ఈ ధోరణి బాగా తీవ్రరూపం దాల్చింది. ఈ సంఖ్య క్షీణత క్రమంగా 1991 లో 945 నుండి 2001 లో 927, 2011 లో 918కు తగ్గటం మరింత ఆందోళనకరమైన విషయం. శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) లో క్షీణత మహిళల అనధికారతకు ప్రధాన సూచిక. శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) రెండింటినీ సూచిస్తుంది. పుట్టక ముందు లింగ పక్షపాతం వల్ల లింగ ఎంపిక ద్వారా వివక్ష వ్యక్తం అవుతుంది మరియు అమ్మాయిలు పుట్టిన తరువాత వారికీ వ్యతిరేకంగా వివక్ష. ఒకవైపు సమాజంలో అమ్మాయిలపై గల వివక్ష మరియు సులభంగా లభ్యమవుతూ, అందరికీ అందుబాటులో ఉంటున్నలింగ నిర్ధారణలను దుర్వినియోగం చేసి అమ్మాయిలను లింగ ఎంపిక నిర్మూలన మరోవైపు తక్కువ శిశు లింగ నిష్పత్తికి దారితీసింది.
ఆడపిల్లల మనుగడ, రక్షణ మరియు సాధికారత నిర్ధారించడానికి సమన్వయం మరియు అభిసరణ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో (బాలికను రక్షించు – చదివించు, బి బి.బి.పి.) పథకం ప్రకటించింది. బేటీ బచావో బేటీ పడావో పథకం శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) తగ్గుముఖం సమస్య పరిష్కరించేందుకు అక్టోబర్, 2014లో పరిచయం చేయబడింది. ఇది అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) తక్కువగా గల 100 ఎంపిక చేసిన జిల్లాల్లో జాతీయ ప్రచారం మరియు కేంద్రీకరించబడిన బహుళ రంగాల చర్యల ద్వారా అమలు అవుతోంది. ఇది మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖల ఒక ఉమ్మడి చొరవ.
పూర్తి లక్ష్యం
ఆడపిల్లలు వేడుక చేసుకొని మరియు తన విద్యాభ్యాసం మొదలు పెట్టడం.
ఎంపిక చేయబడిన జిల్లాలు
జనాభా లెక్కల 2011 ప్రకారం తక్కువ శిశు లింగ నిష్పత్తి ప్రాతిపదికగా 100 జిల్లాలు గుర్తించబడ్డాయి, ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక జిల్లా పరిఘనలోకి వచ్చేలా అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత నుండి ఎంపిక చేయబడ్డాయి.
జిల్లాల ఎంపిక కోసం మూడు ప్రమాణాలు :-
- జాతీయ సగటుకు దిగువన గల జిల్లాలు (87 జిల్లాలు / 23 రాష్ట్రాలు)
- జాతీయ సగటుకు ఎగువన ఉండి కానీ తగ్గుముఖం చూపిన జిల్లాలు (8 జిల్లాలు / 8 రాష్ట్రాల్లో)
- జాతీయ సగటుకు ఎగువన ఉండి మరియు పెరుగుతున్న ధోరణి చూపిన జిల్లాలు (ఈ 5 జిల్లాల శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) స్థాయిలు నడిపించవచ్చు మరియు ఇతర జిల్లాలు వీరి అనుభవాల అనుసరించి తెలుసుకోవడానికి వీలుగా ఎంపిక చేయబడ్డాయి.)
ఉద్థేశ్యాలు
- లింగ పక్షపాతం వల్ల లింగ ఎంపికచేసుకోనబడే వ్యవస్థ నిర్మూలన
- ఆడపిల్లల మనుగడ మరియు రక్షణ కల్పించడం.
- బాలికలకు చదువు అందేలాగా చూడడం.
వ్యూహాలు
- ఆడపిల్లకు సమాన విలువ సృష్టించడానికి మరియు వారి విద్యను ప్రోత్సహించేందుకు ఒక నిరంతర సామాజిక చైతన్యం మరియు సమాచార ప్రచారం అమలుచేయుట.
- శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) CSR / SRB క్షీణత సమస్య ప్రజా సంభాషణ లో ఉంచడం, వీటిలో మెరుగుదల మంచి పాలన కోసం ఒక సూచిక అవుతుంది.
- సమీకృత మరియు సత్వర చర్య కోసం శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) తక్కువ గల లింగ వివక్ష జిల్లాలు మరియు పట్టణాలపై దృష్టి సారించడం.
- సామాజిక మార్పుకు ఉత్ప్రేరకంగా ఉండే పంచాయతీ రాజ్ సంస్థలు / పట్టణ స్థానిక సంస్థలు / గ్రాస్రూట్ కార్మికులకు స్థానిక కమ్యూనిటీ / మహిళల / యువత గ్రూపుల భాగస్వామ్యంతో సమాయుత్తపరిచి శిక్షణ ఇవ్వటం.
- లింగ వివక్ష సమస్యలు మరియు బాలల హక్కుల సమస్యలకు అనుగుణంగా సేవలు / పథకాలు & కార్యక్రమాలు అందేలాగా చూడడం.
- అంతర విభాగ మరియు అంతర్గత సంస్థలను జిల్లా / బ్లాకు / గ్రాస్రూట్ స్థాయిలలో ఏకీకరించటం.
భాగాలు
బేటీ బచావో-బేటీ పడావో పై సామూహిక సమాచార మార్పిడి ప్రచారం
ఈ కార్యక్రమం "బేటీ బచావో బేటీ పడావో" పథక ఆరంభంతో అమలు చేయబడుతుంది.
ఆడపిల్లలు సంబరాలు చేస్కోవటం మరియు చదువుకునేలా అవగాహన పెంచడానికి జాతీయవ్యాప్తంగా ప్రచారం. బాలికలు ఈ దేశం యొక్క సాధికారిక పౌరులుగా మారడానికి వివక్ష లేకుండా బాలికల జననం, ఎదగడం మరియు చదువుకోవటం సమాన హక్కులతో జరిగే లక్ష్యంగా ప్రచారం చేయబడుతుంది.
ఈ ప్రచారం 100 జిల్లాల్లో శీఘ్ర ప్రభావం కొరకు వివిధ మధ్యవర్తులను జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి మధ్యవర్తిత్వాలను సమాజ స్థాయిలో సమీకృత పరుస్తుంది.
రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపిక చేసిన శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) తక్కువగా గల 100 జిల్లాలలో బహుళ విభాగ మధ్యవర్తిత్వాలు
బహుళ రంగ చర్యలు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖలను సంప్రదించి రూపుదిద్దుకున్నాయి. పరిగణించదగిన ఫలితాలు మరియు సూచికలను శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) మెరుగుపరచడానికి తక్షణం యోచించిన బహుళ విభాగ చర్యలు చేయుటకు సంబంధిత రంగాలు, రాష్ట్రాలు మరియు జిల్లాలను కలుపుతాయి.
రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు బహుళ విభాగ చర్య కోసం రాష్ట్ర టాస్క్ ఫోర్సెస్ ద్వారా అభివృద్ధి, అమలు మరియు పర్యవేక్షణ కోసం రాష్ట్ర / జిల్లా ప్రణాళికలు లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రం / జిల్లా నిర్దిష్ట పర్యవేక్షణ కోసం ఒక సౌకర్యవంతమైన ముసాయిదాను స్వీకరిస్తాయి.
ప్రాజెక్ట్ అమలు
మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం నుండి పథక నిధుల నియంత్రణ మరియు పరిపాలన బాధ్యత కలిగి ఉంటుంది.
రాష్ట్ర స్థాయిలో కార్యదర్శి, మహిళా మరియు బహుళ రంగ చర్యల విభాగం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖలతో సంప్రదింపుల ద్వారా సంతరించుకున్నది. పరిగణించదగిన ఫలితాలు మరియు సూచికలను శిశు లింగ నిష్పత్తి (సిఎస్ఆర్) మెరుగుపరచడానికి తక్షణం యోచించిన బహుళ విభాగ చర్యలు చేయుటకు సంబంధిత రంగాలు, రాష్ట్రాలు మరియు జిల్లాలను కలుపుతాయి. రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు బహుళ విభాగ చర్య కోసం రాష్ట్ర టాస్క్ ఫోర్సెస్ ద్వారా అభివృద్ధి, అమలు మరియు పర్యవేక్షణ కోసం రాష్ట్ర / జిల్లా ప్రణాళికలు లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రం / జిల్లా నిర్దిష్ట పర్యవేక్షణ కోసం ఒక సౌకర్యవంతమైన ముసాయిదాను స్వీకరిస్తాయి.
శిశు అభివృద్ధి శాఖ దిశా నిర్దేశం మరియు పథకం అమలు పూర్తి బాధ్యత కలిగి ఉంటుంది.
పథకం యొక్క ప్రతిపాదిత నిర్మాణం ఈ క్రింద చూడవచ్చు:
జాతీయస్థాయిలో
ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అంగవైకల్య వ్యవహారాల శాఖ, జెండర్ నిపుణులు, పౌర సమాజం ప్రతినిధులు, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క సంబంధిత మంత్రిత్వశాఖలతో నుండి ప్రాతినిధ్యంతో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని బేటీ బచావో బేటీ పడావో కొరకు ఒక జాతీయ కార్యాదళం ఏర్పాటు చేయబడడం. ఈ కార్యా దళం మార్గదర్శకత్వం మరియు మద్దతు అందజేయటం; శిక్షణ విషయాన్ని(మెటీరియల్) ఖరారుచేయటం; రాష్ట్ర ప్రణాళికలు సమీక్షించి సమర్థవంతంగా అమలు జరిగేలా చూస్తుంది.
రాష్ట్ర స్థాయిలో
రాష్ట్రాలు ఒక రాష్ట్ర కార్య ఫోర్స్ (ఎస్టీఎఫ్) సంబంధిత విభాగాల (ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, విద్య, పంచాయతీ రాజ్ శాఖ / గ్రామీణ అభివృద్ధి శాఖ) మరియు రాష్ట్ర స్థాయి సర్వీసెస్ అథారిటీ మరియు వికలాంగ వ్యవహారాల శాఖ యొక్క ప్రాతినిధ్యంతో బేటీ బచావో బేటీ పడావో పథకం అమలు మరియు సమన్వయం కొరకు ఏర్పాటు చేయాలి. దీని అమలుకు వివిధ శాఖల మధ్య కలయిక & సమన్వయము కావలసి ఉంది కనుక కార్య వర్గం (టాస్క్ ఫోర్సు) చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో పని చేస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ కార్యవర్గం యు.టి. అడ్మినిస్ట్రేటర్ పరిపాలన నేతృత్వంలో పని చేస్తుంది. కొన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్ర స్థాయిలో మహిళల సాధికారత, జెండర్ మరియు శిశు సంబంధించిన సమస్యల కోసం వాటి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నాయి వీటిని కూడా రాష్ట్ర / కేంద్ర పాలిత కార్యదళంగా పరిగణించబడుతుంది. డబ్ల్యూ.సి.డి. (WCD) / సామాజిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దీనికి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఐ.సి.డి.ఎస్. డైరెక్టరేట్ ద్వారా రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రణాళిక మరియు పథక అమలుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను సమన్వయపరచు బాధ్యత కలిగి ఉంటుంది.
జిల్లా స్థాయిలో
జిల్లా న్యాయ సేవల అధికారి(DLSA)తో సహా సంబంధిత విభాగాల (PC & PNDT నుండి తగిన అధికారులు; విద్య; ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ / గ్రామీణాభివృద్ధి, పోలీస్) యొక్క ప్రాతినిధ్యంతో జిల్లా కలెక్టర్ / డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఒక జిల్లా టాస్క్ ఫోర్స్ (DTF) ఏర్పాటు చేయబడుతుంది. ఈ జిల్లా టాస్క్ ఫోర్సు జిల్లా కార్యాచరణ సమర్థవంతంగా అమలు మరియు పర్యవేక్షణలో బాధ్యత కలిగి ఉంటుంది. జిల్లాలో కార్యాచరణ అమలు కోసం సాంకేతిక మద్దతు మరియు మార్గదర్శకత్వం బ్లాక్ స్థాయి ప్రణాళికలు ఉపయోగించి జిల్లా కార్యాచరణ రూపొందించడం జిల్లా ఐ.సీ.డీ.ఎస్. కార్యాలయంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ (DPO) ద్వారా అందించబడతాయి. ఒక జెండర్ నిపుణుడు / సి.యస్.ఓ. (CSO) సభ్యుడు కూడా టాస్క్ ఫోర్స్ లో ప్రాతినిధ్యం వహించవచ్చు.
బ్లాక్ స్థాయిలో
సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ / సబ్ డివిజనల్ ఆఫీసర్ / బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (సదరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకొన్న విధంగా) అధ్యక్షతన ఒక బ్లాక్ స్థాయి కమిటీ ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ బ్లాక్ స్థాయి కమిటీ బ్లాక్ కార్యాచరణ పర్యవేక్షణ, సమర్థవంతంగా అమలుపరుచుటలో మద్దతును అందించడానికి ఏర్పాటు చేయబడును.
గ్రామ పంచాయతీ / వార్డ్ స్థాయిలో
సంబంధిత పంచాయితీ సమితి / వార్డ్ సమితి (సదరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకొన్న విధంగా) తన అధికార పరిధిలో గల సంబంధిత గ్రామ పంచాయతీ / వార్డుల ప్రణాళిక, కార్యకలాపాలు సమర్థవంతంగా నడిపేందుకు పూర్తి సమన్వయ మరియు పర్యవేక్షణ బాధ్యతలను కలిగిఉంటుంది.
గ్రామ స్థాయిలో
గ్రామ స్థాయిలో గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య మరియు పోషకాహార కమిటీలు (పంచాయతీల ఉప కమిటీలుగా గుర్తించబడినవి) మార్గనిర్దేశం మరియు ప్రణాళిక మద్దతు అమలు మరియు పర్యవేక్షణ బాధ్యతలను కలిగిఉంటాయి. ఫ్రంట్ లైన్ కార్మికులు (AWWs, ఆశ వర్కర్లు - ASHAs & ఏ.ఎన్.ఎం.లు - ANMs) మొదలైనవారు ఆడపిల్లలు మరియు వారి కుటుంబాలకు సంబంధించిన పథకాలు / ప్రోగ్రాముల గురించి సమాచారం యొక్క ప్రచారం చేస్తూ శిశు లింగ నిష్పత్తి సమస్యపై అవగాహన సృష్టించడం, సమాచారం (డేటా) సేకరించడం ద్వారా చర్యను ఉత్ప్రేరితం చేస్తారు.
గుర్తించిన నగరాలు / పట్టణ ప్రాంతాల్లో
ఈ ప్రణాళిక మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క మొత్తం మార్గదర్శకత్వం మరియు నాయకత్వంలో అమలు జరుగుతుంది.
సామాజిక మాధ్యమం – సోషల్ మీడియా
క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి సమస్యపై సంబంధిత వీడియోలను అందరికీ అందుబాటు కోసం బి.బి.బి.పి.(BBBP) ఒక యూట్యూబ్ (YouTube) ఛానల్ ప్రారంభించింది. వీడియోలు నిరంతరం ఎక్కించబడుతున్నాయి మరియు ఈ వేదిక ద్వారా అవగాహనను పెంపొందించడానికి మరియు తేలికగా సమాచార వ్యాప్తి చెయ్యబడుతున్నాయి. వీడియోలు చూడటానికి ఈ చిత్రం క్లిక్ చేయండి.
ఇంకా, దేశంతో మమేకం అవడానికి సహృదయయైన మద్దతు కోరుతూ చురుకైన పాత్ర పోషించడం, కార్యనిమగ్నతను మరియు ప్రభుత్వం యొక్క ఈ ప్రయత్నం ఒక గొప్ప విజయాన్ని సాధించుటకు ఈ క్రమంలో మై గావ్ (MyGov) వేదిక మీద బేటీ బచావో బేటీ పడావో గ్రూప్ ను ప్రారంభించడం జరిగింది. మీరు ఈ గ్రూపులో చేరి మీ విలువైన సలహాలను, సూచనలను మరియు వ్యాఖ్యలను అందించి సుసంపన్నం చేయాలని కోరుతున్నాము.
మై గావ్ (MyGov) పోర్టల్ లో బి.బి.బి.పి. (BBBP) గ్రూప్ సభ్యత్వం పొందడానికి దయచేసి ఈ ఇమేజ్ పై క్లిక్ చేయండి.
బడ్జెట్
బేటీ బచావో బేటీ పడావో పథకం కింద 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు ప్రకటించడం జరిగింది మరియు ఇంకో 100 కోట్లు 12వ పంచవర్ష ప్రణాళికలో అనుకున్న పథకం “బాలికా శిశు రక్షణ ప్రణాళిక - ఒక బహుళ విభాగ కార్యాచరణ ప్రణాళిక” నుంచి పోగు చేయబడుతుంది. అదనపు వనరులను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలలో గల కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా సేకరించబడుతుంది. పథకం అంచనా వ్యయం 200 కోట్లుగా ఉంది. ఈ 200 కోట్లలో 115 కోట్లు 2014-15 అంటే ప్రస్తుత ఏడాది విడుదల చేయాలని ప్రతిపాదించింది (ఆరు నెలకు). 45 కోట్లు 2015-16 సంవత్సరంలో మరియు మిగిలిన 40 కోట్లు 2016-17 సంవత్సరకాలంలో విడుదల చేయబడతాయి.
నిధుల ప్రవాహం
మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎం.డబ్ల్యూ.సి.డి.) కేంద్ర స్థాయిలో నిధుల నియంత్రణ మరియు పథకం అమలు చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎం.డబ్ల్యూ.సి.డి.) రాష్ట్ర ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ను ఆమోదించిన తర్వాత నిధులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏకీకృత నిధికి బదిలీ చేస్తుంది.
పర్యవేక్షణ యంత్రాంగము
ఒక పర్యవేక్షణ వ్యవస్థను జాతీయ స్థాయి నుండి రాష్ట్ర, జిల్లా, బ్లాక్, గ్రామీణ స్థాయిల వరకు ఏర్పాటు చేయబడుతుంది. ఇది పర్యవేక్షణా లక్ష్యాలు, ఫలితాలు మరియు ప్రక్రియ సూచికల పురోగతిని పర్యవేక్షిస్తూ ఉంటుంది.
- జాతీయ స్థాయిలో, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎం.డబ్ల్యూ.సి.డి.) కార్యదర్శి నేతృత్వంలోని నేషనల్ టాస్క్ ఫోర్స్ ఒక క్రమ ఆధారంగా త్రైమాసిక పురోగతిని పర్యవేక్షణ చేస్తుంది.
- రాష్ట్ర స్థాయిలో, ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ పురోగతిని పర్యవేక్షణ చేస్తుంది.
- జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి అధికారులు ద్వారా జిల్లా కలెక్టర్లు అన్ని శాఖల చర్యలు సమన్వయం చేస్తారు. వీరు జిల్లా స్థాయిలో వివిధ శాఖల ప్రణాళికా జాబితాలో గల కార్యకలాపాల పురోగతిని నెలవారీ సమీక్ష చేపడతారు. జిల్లా కలెక్టర్ శిశు లింగ నిష్పత్తి క్షీణతకు సంబంధించి సూచికలో పరిగణించదగిన మార్పులను నిర్ధారించడంలో మొత్తం బాధ్యత కలిగి ఉంటారు.
మూల్యాంకనం
12వ పంచవర్ష ప్రణాళికా కాలం చివరలో పథకం, దాని ప్రభావం అంచనా మరియు దిద్దుబాటు చర్యలు మదింపు చేస్తారు. అల్ట్రా సోనోగ్రఫి యంత్రాలు, మగ మరియు ఆడ శిశు జనన వయస్సు యొక్క శాతాల సమకాలీన అంచనా సర్వే ఆధార మ్యాపింగ్, పి.సి. (PC) మరియు పి.యన్.డి.టి. (PNDT) చట్టం కింద ఫిర్యాదులను నివేదించడం కూడా ప్రభావం లేదా ఫలితం అంచనా వేయటానికి సహాయం చేస్తుంది.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు