బాల్య వివాహాలు, స్త్రీ భ్రూణ హత్య
బాల్య వివాహాలు
భారతదేశంలోని కొన్ని సామాజిక వర్గాలలో బాల్య వివాహాలు సాంఘిక విషయంగా గోచరమౌతోంది. ఇందులో మనకు రెండు ఆచారాలు కనిపిస్తాయి. మొదటిది చిన్న వయస్సు బాలిక ( ఎక్కువగా పదిహేనేండ్ల లోపు వయస్సుగల బాలిక) కు పెద్ద వయసుగల వ్యక్తితో వివాహం చేస్తున్నారు. రెండవ ఆచారంలో అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులు (పిల్లల) భవిష్యత్తులో వారిద్దరికి పెండ్లిచేయడానికి ఏర్పరిచిన ఆచారంలో వారిద్దరిని పెండ్లి వయస్సు వచ్చేవరకు కలవనివ్వకుండా చూస్తూ, తగిన వయస్సులో వివాహం జరిపించడం జరిగేది.
చట్ట ప్రకారం పెళ్ళి / వివాహానికి సరైన వయసు - పురుషులకు 21, స్త్రీలకు 18సంవత్సరాలుగా చెప్పబడింది. ఇందులో భాగస్వాములైన తల్లిదండ్రులెవరైనా గాని వారి పిల్లలకు చిన్న వయస్సులో గనక పెండ్లి జరిపితే ఆ వివాహాలను చెల్లనట్లు/ రద్దయినట్లుగా ప్రకటించవచ్చు.
బాల్య వివాహాల గురించి వాస్తవాలు మరియు గణాంకాలు
వివిధ రాష్ట్రాలలో పద్దెనిమిదేండ్లలోపు బాలికల వివాహాల శాతాలు ఆందోళన కల్గిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ - 73శాతం
రాజస్థాన్ - 68 శాతం
ఉత్తరప్రదేశ్ - 64 శాతం
ఆంధ్రప్రదేశ్ - 71 శాతం
బీహార్ - 67 శాతం
ప్రపంచ బాలలు - స్థితి - 2009 యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద జరిగే బాల్య వివాహాలలో 40 శాతం వివాహాలు భారతదేశంలోనే జరుగుతున్నాయని తెలుస్తోంది.
బాల్య వివాహాల ప్రభావం
- చిన్న వయస్సులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే లైంగిక సంపర్కంతో బాటు, గర్భవతులు కావడం, దీనితోబాటు హెచ్.ఐ.వి, రక్త హీనత సోకడానికీ, భగంధరమనే వ్యాధిరావడానికి ( సన్నని నాళంలా వ్యాపించే కురుపు) అవకాశం ఎక్కువ ఉంది.
- ఈ బాలికలకు హోదా , శక్తి, పరిణతి లేకపోవడం వలన గృహ హింసకు, లైంగిక వేధింపులకు , సామాజికంగా విడిగా ఉండడం వంటి పరిస్థితులకు గురౌతారు.
- బాల్య వివాహాల వలన చాలా మటుకు వారి చదువు ఆగిపోవడం, లేదా అర్ధవంతమైన పనిలేకపోవడం వలన పేదరికాన్ని అనుభవిం చవలసి వస్తుంది. బాల్య వివాహం లింగ వివక్ష, జబ్బులు, బీదరికమనే క్లిష్టమైన విష వలయం గా నిర్లక్ష్యానికి లోనౌతారు.
- లేత వయస్సులో వివాహాలు జరగడం వల్ల కాన్పు కష్టం కావటం వల్ల ప్రసూతి మరణాలు , శిశు మరణాలు అధిక శాతంలో సంభవిస్తాయి
బాల్య వివాహలు జరగడానికి గల కారణాలు- చేపట్టవలసిన చర్యలు
- పేదరికం
- చదువులో బాలికలు తక్కువ స్థాయిలో ఉండడం
- ఆడ పిల్లలకు తక్కువహోదాను కల్పించడం, ఆర్ధిక భారంగా భావించడం.
- సాంఘికాచారాలు , సాంప్రదాయాలు
ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు చొరవచూపిన ప్రయత్నాలతో మార్గదర్శకత్వం
- బాల్య వివాహాలను ఎదుర్కొనే చట్టాలు
- బాలికా విద్యను అభివృద్ధిపరచడం
- హాని కరమైన సాంస్కృతిక నిబంధనలను మార్చడం
- సామూహిక (కమ్యూనిటి) కార్యక్రమాలకు మద్దతును పొందడం
- విదేశీ తోడ్పాటును గరిష్టంగా పొందడం
- బాలికలకు/ యువతులకు ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు కల్పించడం
- బాలికా వధువులప్రత్యేకమైన అవసరాలను గుర్తించి, ఆ అవసరాలకు తగిన పరిష్కారాలు కల్పించడం .
- ఈ కార్యక్రమాల నుండి ఎంతవరకు ఫలితం సాధించినదీ మూల్యాంకనం చేసుకోవడం
ఆధారము: బాల్యవివాహాల అంతం ఎలా- ఐసిఆర్ డబ్ల్యు ప్రచురణ
స్త్రీ భ్రూణ హత్య
ఆడ శిశువుల హత్య అనేది ఆడ సంతానంకన్నా మగ సంతానానికి విలువనెక్కువ ఇవ్వడమనే కారణంగా, కావాలనే పుట్టబోయే ఆడ గర్భస్థపిండాన్ని చంపివేయడం. సాంస్కృతిక కట్టుబాట్లు గల ప్రాంతాలలో మగ పిల్లలకిచ్చే విలువ వల్ల ఇలాం టి దురాచారాలు జరుగుతున్నాయి.
స్త్రీ భ్రూణ హత్యలోగల వాస్తవాలు
- ఐక్య రాజ్య సమితి పిల్లల నిధి(యుని సెఫ్) యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, భారతదేశంలో గల లింగ వివక్ష ఫలితంగా 50, 00000 మంది( 50 మిలియన్ల) బాలికలు , స్త్రీలు భారత జనాభా నుండి తప్పిపోతున్నారని తెలుస్తోంది.
- ప్రపంచంలో గల చాలా దేశాలలో ప్రతి వంద మగ శిశువులకు దాదాపుగా 105 మంది స్త్రీ శిశువులు జన్మిస్తు న్నారు.
- భారత దేశంలో ,ప్రతీ వంద మంది మగ వారికి 93 మంది కన్నా తక్కువ స్త్రీలు జనాభాలో ఉన్నారు.
- భారత దేశంలో ప్రతీ రోజూ చట్ట విరుద్ధంగా 2,000 స్త్రీ శిశు గర్భ స్రావాలు జరుగుతున్నట్లు అంచనాగా
- ఐక్య రాజ్య సమితి దేశాలు తెల్పుతున్నాయి.
పొంచి ఉన్న ప్రమాదం
భారత దేశంలో స్త్రీ భ్రూణ హత్యలు పెరగడంతో జనాభా సంక్షోభంలో పడుతుం ది. సమాజంలో స్త్రీలు తగ్గిపోవడం ఫలితంగా లైంగిక హింసలు, పిల్లలపై అప ప్రయోగాలు అంతేగాక భార్యలను పంచుకోవడాలు ఎక్కువ అవుతాయని ఐక్యరాజ్యాలు హెచ్చరిస్తున్నాయి . దీని వలన సాంఘిక విలువల వ్యవస్థ క్షీణించి సామాజిక పరిస్థితులు సంక్షోభానికి లోనౌతాయి.
కారణాలు
సాంస్కృతిక విశ్వాసాలు, సామాజిక కట్టుబాట్లతో లింగ వివక్ష ఏర్పడింది. పేద కుటుంబాలలో కూడ స్త్రీ వ్యతిరేక, మగ పిల్లలు కావాలనే పక్షపాతంతో ఉండడమనేదానికి హద్దు లేకుండ పోయింది. ఆ కట్టుబాట్లనే సవాళ్ళను ఎదుర్కొని, ఈ ఆచారాలను తప్పని సరిగా రూపుమాపాలి. ఆడశిశువులను వద్దనుకోవడం అనే అభ్యాసాలు భారతదేశంలో గల సామాజిక ,ఆర్ధికపరమైనవిగా ఆపాదించడం జరుగుతోంది. భారత దేశంలో జరిగిన అధ్యయనాలు ఆడ శిశువులను వద్దనుకోవడానికి మూడు కారణాలను సూచిస్తున్నాయి.
అవి, ఆర్ధిక వినియోగం, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనం, మతపరమైన కార్యక్రమాలు.
- కుటుంబ భారాన్ని మోయడంలోను, లేదా కుటుంబ పరంగా వచ్చే వ్యాపారంలోను, వేతనాన్ని సంపాదించడంలోను, మరియు తల్లిదండ్రులను ముసలి తనంలో ఆదుకోవడంలోనూ అబ్బాయిలు , అమ్మాయిలకన్నా ఎక్కువ గా చేయగలరనే విషయం ఆర్ధిక ప్రయోజనమనే కారణంగా అధ్యయనం చేసినపుడు సూచింపబడింది.
- వివాహానంతరం, కొడుకు కోడలితో బాటు ఇంటిపనిలో చేదోడు వాదోడుగా ఉండడంతోబాటు వరకట్నంవలన ఆర్ధికలాభం ఉంటుందని, కూతుళ్లపెళ్ళికి, వరకట్నం ఇచ్చుకోవడమనేది ఆర్ధిక జరిమానాగా ఉండడం.
- చైనాలోను, భారత దేశంలో పితృ వంశానుక్రమం, పితృ స్వామికకుటుంబ విధానమనేది ఉండడం వలన కనీసం ఒక మగసంతానమైనా కుటుంబ పరంపరకు తప్పని సరిగాను, ఎక్కువ మంది కొడుకులున్నట్లయితే కుటుంబాలకు హోదాగాను స్త్రీ శిశువు వద్దు అనేది కారణంగా సామాజిక ప్రయోజన పరంగా తెలుస్తోంది.
ప్రభుత్వం చేపట్టిన చర్యలు
సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి సమాజంలో గల ప్రజల వైఖరులలో మార్పు తేవడం కోసం చాలా చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఈ దిశలో చాలా శాసనాలను , చట్టాలను , పథకాలను ప్రవేశ పెట్టింది. అవి ఏమిటంటే -
- వరకట్న వ్యతిరేక శాసనాలు-వరకట్న నిషేధ చట్టం 1961
- లింగ నిర్ధారణ వ్యతిరేక శాసనాలు- పి సి పి ఎన్ డి టి చట్టం
- బాలికా విద్య పరంగా శాసనాలు
- మహిళా హక్కుల పరంగా శాసనాలు
- ఆడపిల్లకు అనుకూలంగా ఆస్తిపంపకాలలో సమాన హక్కుల శాసనాలు
ఆధారము: ఇండియన్ చైల్డ్, వికిపీడియా