ఆరోగ్య చిట్కాలు
బరువు తగ్గాలా? ఐతే ఈ జ్యూస్‌లు తాగండి!
బరువు తగ్గాలనుకుంటున్నారా? జ్యూస్‌లను తీసుకోండి. జ్యూస్‌లను తీసుకోవడం ద్వారా ఆకలి ఉండదని.. తద్వారా ఆహారం మితంగా తీసుకునేందుకు వీలుంటుందని.. దీంతో ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
లెమన్ జ్యూస్:
లెమన్ జ్యూస్‌లో చిటికెడు ఉప్పు, తేనె చేర్చి రోజూ ఉదయం పరగడుపున తీసుకున్నట్లైతే... చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చు.
టమోటో జ్యూస్:
ఏడు రోజుల్లో బరువు తగ్గాలనుకుంటే 3 టమోటోలను బాగా ఉడికించి.. మిక్సీలో గ్రైండ్ చేసి బెల్లం చేర్చి మూడు పూటలా తీసుకుంటే బరువు తగ్గుతారు.
అవకోడా జ్యూస్:
అవకోడాను గ్రైండ్ చేసి.. తేనె కలుపుకుని తాగితే పొట్టను తగ్గించుకోవచ్చు. ఇందులోని గుడ్ కొలెస్ట్రాల్.. శరీరంలోకి కెలోరీల శాతాన్ని బర్న్ చేస్తుంది.
గ్రేప్ జ్యూస్:
గ్రేప్ జ్యూస్‌లోని ప్రోటీన్లు, గుడ్ కొలెస్ట్రాల్ ఉండటంతో ఈ జ్యూస్ ద్వారా బరువు తగ్గుతారు.
జామ జ్యూస్:
జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం ద్వారా వారానికి రెండు సార్లు జామపండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆరెంజ్ జ్యూస్:
ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారు. గోరు వెచ్చని నీటిలో ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అనాసపండు జ్యూస్:
అనాస జ్యూస్‌తో ఆకలి తగ్గిపోతుందని.. అందుచేత సులభంగా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆధమరు: తెలుగు.వెబ్ దునియా.కం
మజ్జిగ - సున్నపుతేట నీటితో నడుము నొప్పికి చెక్!
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ముఖ్యంగా.. పొద్దస్తమానం కుర్చీల్లో కూర్చొనే వారు, మహిళలు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుంటారు. దీనికి కారణం తీరికలేని జీవితాన్ని గడపడమే.
అలామీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే.. ఒక గ్లాసు మజ్జిగతో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ఇంకా ఈ కింది సూచనలు పాటిస్తే నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందట. మేడికొమ్మపాలు పట్టువేస్తే నడుము నొప్పి ఉండదు.
నల్లమందు రసకర్పూరం కొబ్బరినూనెలో కలిపి రాసినట్లైతే నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శొంఠి గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
పోషకాహారం తీసుకోకపోతే... అజీర్తి.. రక్తహీనత తప్పదు!
బిజీ లైఫ్‌స్టైల్‌లో మనం తీసుకునే ఆహారంపై కూడా దృష్టిసారించలేక పోతున్నాం. ముఖ్యంగా.. ఎపుడు తింటున్నామో కూడా పట్టించుకోం. తినే ఆహారం పట్ల అశ్రద్ధగా ఉన్నా... వేళాపాళా లేకుండా ఏది పడితే అది తినడం అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇందుకోసం కొన్ని సూచనలు పాటిస్తే చాలు. మీరు ప్రతి రోజూ ఏదో ఒక పండును తింటున్నారా. అల్పాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే, పని ఒత్తిడిని తట్టుకునేందుకు కాస్త రిలీఫ్ అయ్యేందుకు ఇష్టానుసారంగా కాఫీ టీలను తీసుకోరాదు. వేళాపాలా లేకుండా చిరుతిండ్లు తినకూడదు. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి. మీరు ప్రతి రోజూ తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. ఉప్పు, కారం, నూనె వంటివి మీకు సరిపడా అంటే తక్కువ మోతాదులోనే తీసుకుంటున్నారా లేదా అన్నది తెలుసుకోవాలి. నీరసం, అజీర్తి, రక్తహీనత వంటి సమస్యలను ఎపుడూ ఎదుర్కొంటున్నట్టు గ్రహించారా.
ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా పాటించినట్టయితే మీరు పోషకాహారాన్ని తీసుకుంటున్నట్టు నిర్ధారించుకోవచ్చు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
ఊబకాయంతో అనారోగ్యం సరే.. ఎలా తగ్గించుకోవచ్చు?
ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని పీడిస్తున్న సమస్య ఊబకాయం. ఇది చాలా మందిలో వారసత్వం కారణంగా వస్తుంది. దీనిబారిన పడితే అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదు. ప్రధానంగా హృద్రోగం, టైప్-2, మధుమేహం, కీళ్ళనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. కేలరీలు అధికమోతాదులో ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరకశ్రమ చేయక పోవడంతో బరువు పెరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాలైన మందుల వాడకం వల్ల హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.
ఈ ఊబకాయం వల్ల అనేక దుష్ఫలితాలు వస్తుంటాయి. ఊబకాయంతో బాధపడే వ్యక్తి జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అంటే చిన్న వయస్సులోనే దీని బారిన పడితే తక్కువకాలం జీవిస్తారని వైద్యులు చెపుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారిలో సాధారణ పౌరుల ఆరోగ్యం కంటే ఆరింతలు అధికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా, హృద్రోగం, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, మధుమేహం, నడుంనొప్పి, కీళ్ళలో రక్తప్రసరణ సరిగా లేకపోవడం, రక్తం గడ్డకట్టడం, నిద్రలేమి లేదా అధికనిద్ర, పిత్తాశయ వ్యాధులు సోకుతాయి.
దీన్ని నివారించేందుకు కొన్ని చిన్నపాటి నియమాలు, వ్యాయామాలు, ఆహారంలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా కొంతమేరకు తగ్గించుకోవచ్చు. తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు, చక్కెర, ఉప్పు, కూల్‌డ్రింక్స్, జంక్‌ఫుడ్స్, తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు, ఎత్తుకు తగిన బరువు ఉండేలా క్రమం తప్పకుండా చూసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
హాట్ వాటర్ రెగ్యులర్‌గా తీసుకుంటే ప్రయోజనం ఏమిటి?
హాట్ వాటర్ రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హాట్ వాటర్ వల్ల మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం, ఇది బ్లడ్ సర్కులేషన్‌ను పెంచుతుంది. ముఖ్యంగా బాడీఫ్యాట్‌ను కరిగిస్తుంది. అదే సమయంలో నాడీవ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
అలాగే క్రమం తప్పకుండా వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా శరీరాన్ని తేమగా, వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇది డ్రై, ఫ్లాకీ స్కిన్‌కు చాలా గొప్పగా సహాయపడుతుంది. శరీరం మొత్తంలో బ్లడ్ సర్కులేషన్ పెంచి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ముఖంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది. హాట్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోపలి నుండి శుభ్రం చేస్తుంది.
దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలున్నప్పుడు వేడినీళ్ళు త్రాగడం ఒక గొప్ప నేచురల్ హోం రెమడీ. ఇది నిరంతరం వేధించే పొడి దగ్గును తగ్గించి.. శ్వాసనాళాన్ని తేలికచేసి, సరైన శ్వాస పీల్చుకొనేందుకు సహాయపడుతుంది. అలాగే గొంతునిప్పిని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం
పసుపు, అల్లం, ధనియాలు, మెంతులు... ఆరోగ్యానికి ఎలా ఉపయోగమంటే...?
నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
పసుపు
పసుపు శరీరానికి కావలసిన వేడి, రక్తశుద్ధి, కఫం, వాత, పిత్త రోగాలను నయం చేసే గుణం కలిగివుంది. అలాగే స్త్రీలు ఫేస్ ప్యాక్‌లా ఉపయోగిస్తారు. ఇందులో బేసిన్ పొడి కలుపుకుని ముఖానికి దట్టిస్తే ముఖారవిందం మరింతగా ఇనుమడింపజేస్తుంది. జలుబు, పొడి దగ్గు సమస్యలు తలెత్తినప్పుడు పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. దీంతో గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
అల్లం:
అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తు ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఉబ్బసపు వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది.
మెంతులు:
మధుమేహ రోగులకు మెంతులు దివ్యౌషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరకడపున మెంతుల చూర్ణం లేదా మెంతులు నీళ్ళతో కలిపి తీసుకుంటే మొకాళ్ళ నొప్పులతోపాటు మధుమేహ వ్యాధి అదుపులోవుంటుంది. వీటితోపాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది.
జీలకర్ర:
జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆహారం తినేందుకు మనస్కరించకపోవడం. అజీర్తి లాంటి వాటితో సతమతమౌతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
సోంపు:
సోంపు శరీరానికి చలవ చేస్తుంది. ప్రతిరోజు భోజనానంతరం చాలామంది సోంపును వాడుతుంటారు. ఇది నోరు శుభ్రంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
ఉసిరికాయ:
ఉసిరికాయలో విటమిన్ సి అధిక మోతాదులోవుంటుంది. ఎండిపోయిన కాయలోను విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్ళ కాంతిని పెంపొందించే గుణం ఇందులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉసిరికాయను ప్రతి రోజు తీసుకోవడం వలన వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతాయి. వీలైతే ప్రతి రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
తులసి:
తులసిలో శరీరాన్ని చల్లబరిచే గుణంవుంది. వాయు సంబంధిత జబ్బుతో బాధపడేవారు దీనిని తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది.
ధనియాలు:
ధనియాలు కళ్ళ కాంతిని పెంచుతుంది.
ఆధారము: తెలుగు.వెబ్ దునియా.కం