About Us Telugu Version
మొదట ఈ ఊరి పేరు ఉరగకొండ (ఉరగాద్రి) . ఉరగము అంటే పాము. ఈ ఊరిలో వున్న కొండ పాము పడగలా వుంటుంది. అందువలన ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఈ ఊరిలో ప్రసిద్ధి చెందిన కరిబసవ స్వామి మఠం మరియు పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉన్నాయి.ఉరవకొండలోని కరిబసవ మఠం రథోత్సవము తరువాతి రోజున లంక జరుగుతుంది. ఈ మఠం చాలా పురాతనమైనది , శైవ మత సాంప్రదాయాలను పాటిస్తు ఇక్కడి కారక్ర్యమాలు జరుగుతాయి.ఈ పట్టణం అనంతపురం - బళ్ళారి రహదారి లో కలదు. గుంతకల్లు ఇక్కడికి దగ్గర లొని రైల్వే జంక్సన్. ఇక్కడి నుండి బళ్ళారి, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, కణేకల్లు మరియు రాయదుర్గం ప్రాంతాలకు రవాణా సదుపాయము కలదు.
ఇక్కడ వున్న శ్రీ కరిబసవ స్వామి ప్రభుత్వ వున్నత పాఠశాల కూడా చాలా పురాతనమైనది , ఎందరో మేథావులు విద్యను అభ్యసించిన విద్యాలయం.సత్యసాయిబాబా మొదటసారిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఊరు ఇది. సత్యనారయణ రాజు అనె నామము తో బాబా సైతం ఈ పాఠశాల నందు విద్యను అభ్యసించారు. ఈపాఠశాల త్వరలొ 100 సంవత్సరాల మైలు రాయిని చేరుకుంటుంది.
మండల కేంద్రం అయిన ఈ వూరు వజ్రకరూరు, విడపనకల్లు మరియు కళ్యాణదుర్గం మార్గం లోని పల్లె ప్రాంత ప్రజలకు ఒక కూడలి లాగ వ్యవహరిస్తుంది.
ఈ మండలంలోని చిన్నముస్టూరు గ్రామం దగ్గరిలో వున్న శివాలయం ప్రాచీన కాలంలో జరిగిన శివ భక్తుల మరియు విష్ణు భక్తుల విబేధాలకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. గుడి మెట్లమీద శంఖు చక్రాలు చెక్కబడి వున్నాయి. వాటిని తొక్కుతూ భక్తులు గుడి లోపలికి వెళాల్సి వుంటుంది.ఈ ఊరిలో వున్న సుబ్రమణ్య స్వామి ఆలయం కొక్కిలో వున్న ఆలయంను పోలి వుంటుంది. ఈ ఆలయం లోని స్వామి విగ్రహం పాము రూపంలో వుంటుంది.
ఇక్కడికి 15 మైళ్ల దూరం లో పెన్న అహోబిలం దేవస్థానం కలదు, పెన్నా నది పరివాహక ప్రాంతం అయిన ఇక్కడ లక్ష్మినరసింహ స్వామి దేవాలయం కలదు. ఇక్కడి దేవాలయం , అహూబిలం లోని దేవాలయానికి మధ్య చారిత్రిక సంబంధం వున్నట్టు చెబుతారు.